జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించిన విషయం తెలిసిందే... విశాఖలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ, రాజమండ్రిలో పోలవరం, విజయవాడలో ఫాతిమా కాలేజీ విద్యార్ధులు, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు, చివరగా ఒంగోల్ లో పడవ ప్రమాద బాధితులని పరామర్శించారు... ఈ సందర్భంలో, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, ఒంగోల్ లో అక్కడ ఉన్న జనసేన అభిమానులతో మీటింగ్ పెట్టి, అన్ని విషయాలు చెప్పారు... మోడీ దగ్గర నుంచి, క్రింద స్థాయి నాయకుడి దాకా, ప్రజారాజ్యం నుంచి, జనసేన భవిష్యత్తు దాకా అన్ని విషయాలు చెప్పారు... చివరకి పరిటాల రవి గుండు అపోహల విషయం పై కూడా స్పందించారు...

pawan 10122017 2

వివిధ సందర్భాల్లో తనని ఇబ్బంది పెట్టిన కొంత మంది పేర్లు చెప్పి మరీ ఎటాక్ చేసారు... కాని, ఒక్క విషయం మాత్రం క్లారిటీ చెయ్యలేదు... ఆ రోజు నేను మోడీ, చంద్రబాబుకి చాలా ఇబ్బందులు దాటుకుని, వారికి 2014 ఎన్నికల్లో మద్దతు ఇచ్చాను అని, వారి గెలుపులో నాకు ఎంతో కొంత భాగస్వామ్యం ఉంది అని, ఆ రోజు కనుక సెంటర్ లో మోడీ, ఇక్కడ చంద్రబాబు రాకపోతే నాకు చాలా ఇబ్బంది అయ్యేది అని, చివరకి నన్ను చంపటానికి కూడా వెనుకాడేవారు కాదని పవన్ కళ్యాణ్ అన్నారు...

pawan 10122017 3

ఇవే మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.... పవన్ వెళ్ళిపోయి మూడు రోజులు అయినా, ఇప్పటికే పొలిటికల్ సర్కిల్స్ తో పాటు, పవన్ అభిమానుల్లో కూడా ఇదే చర్చ జరుగుతుంది... పవన్ నన్ను చంపేసేవారు అని ఎదో పాసింగ్ కామెంట్ చేసారా ? లేక నిజంగానే పవన్ కు ఆ అనుభవం ఎదురైందా అని చర్చించుకుంటున్నారు... నిజానికి పవన్ మీద రాజకీయంగా తనని చంపేసే అంత కక్ష, పగ ఉన్నవారు ఎవరూ లేరు అనే చెప్పాలి... మరి పవన్ అలా ఎందుకు మాట్లాడారు.. పవన్ అన్నారు అంటే, అది నిజమేనా ? పవన్ ని చంపటానికి ఎవరు కుట్ర పన్నారు ? ఒక మనిషిని చంపివేసి రాజకీయాలు చేసే కుట్ర మన రాష్ట్రంలో ఒకే ఒక్క రాజకీయ పార్టీకి ఉంది అంటూ, ఆ ఒక్క పార్టీ పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు... ఎందుకంటే అప్పుడు వారు ఓడిపోయినా, రేపు ఓడిపోయినా అది పవన్ వల్లే అని ఆ పార్టీ ఇప్పటికీ నమ్ముతుంది... వారికి అలా చంపే చరిత్ర ఉంది కాబట్టి, అనుమానాలు అన్నీ ఆ పార్టీ పైనే ఉన్నాయి...

చిరంజీవి ఏంటి, చంద్రబాబుని కలవటం ఏంటి అనుకుంటున్నారా ? అవును ఇది నిజం... చిరంజీవి చంద్రబాబుని కలిసి కృతజ్ఞత చెప్తానికి అమరావతికి వస్తాను అంటే, ఆయనను కొన్ని శక్తులు కలవనివ్వకుండా ఆపుతున్నాయి అని అంటున్నారు చిరంజీవి సన్నిహితులు... దీని అంతటకీ కారణం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కాపులకి 5 శాతం రిజర్వేషన్ లు కల్పించటం... చంద్రబాబు ప్రభుత్వం కాపులకి రిజర్వేషన్ లు ఇస్తారు అని చిరంజీవి భావించలేదు అని, అందుకే కాపు రిజర్వేషన్ ల అంశం పై ముద్రగడతో కూడా చిరంజీవి పదే పదే కలుస్తూ ఉండేవారు అని ఆయన సన్నిహితులు అంటున్నారు...

chiru 101222017 2

అనూహ్యంగా చంద్రబాబు కాపులకి రిజర్వేషన్ ప్రకటించటంతో, చిరంజీవి చాలా సంతోషించారు అని, 5 శాతం అయినా పెద్దగా ఇబ్బంది లేదు అని, అవసరమైతే పెంచమని తరువాత అడగవచ్చు అని, ఇప్పటికైతే ఈ నిర్ణయంతో ఎంతో మంది కాపుల్లో ఉన్న పేదలు లభ్ది పొందుతారని, అందుకే ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞత తెలిపి, ఢిల్లీలో కూడా ఆమోదం పొందేలా కృషి చెయ్యాలి అని ముఖ్యమంత్రిని అడగటానికి, అమరావతి బయలుదేరదాము అనుకున్నా, ఆయన వ్యవహారాలు చూసే అత్యంత సన్నిహితుడు అడ్డు పడ్డారని చెప్తున్నారు... ఒక పక్క పవన్ కళ్యాణ్ 15 శాతం రిజర్వేషన్ ఇచ్చి ఉంటే బాగుంటుంది అని అంటుంటే, చిరంజీవి మాత్రం, ఈ విషయంలో సంతోషంగానే ఉన్నారు...

chiru 101222017 3

ఇదే విషయంలో చిరంజీవి, దాసరి నారాయణరావు చెప్పిన మాటలు కూడా గుర్తు తెచ్చుకున్నారు అంట.. అప్పుడు దాసరి చెప్పిన మాటలు ప్రకారం ‘చంద్రబాబు మనస్తత్వం నాకు తెలుసు. అతను ఎవరితోనూ శత్రుత్వం కోరుకోడు. చెబితే వింటాడు. ఫ్లెక్సిబిలిటీతో వెళతాడు. తన పార్టీకి లాభం వస్తుందంటే ఏం కావాలన్నా చేస్తాడు. మనకిది కావాలని ఒత్తిడి చేస్తే వినే నైజం, వెసులుబాటు, స్వేచ్ఛ బాబు వద్ద ఉంది. మనకు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడుతో వ్యక్తిగత కొట్లాటలేవీ లేవు. ఆయన ఇస్తానన్న రిజర్వేషన్ల కోసమే పోరాడుతున్నాం. మంచిచేస్తే మెచ్చుకోవాలి. చెడు చేస్తే అడ్డుకోవాలి. ఇదే మన విధానంగా ఉండాలి. చంద్రబాబు గతంలో తన పార్టీకి మద్దతునిచ్చామన్న గౌరవంతోనో, భయంతోనో, భక్తితోనో కాపుల కోసం చేస్తున్న మంచి పనులు వాడుకోవాలి (కాపు కార్పొరేషన్ ఉద్దేశించి). అలా వాడుకోకపోవడం మన తప్పే. టిడిపిని, చంద్రబాబును కేవలం రిజర్వేషన్ల విషయంలో మాత్రమే వ్యతిరేకించాలి తప్ప, పథకాలను వాడుకోకపోవడం సరైంది కాదు. లేకపోతే నిధులు మురిగిపోయి మనవాళ్లే నష్టపోతారు’ అని దాసరి అన్న మాటలు చిరంజీవి గుర్తు చేసుకున్నారు అని ఆయన సన్నిహితులు అంటున్నారు... ఏదేమైనా చిరంజీవి అమరావతి రాకుండా అడ్డుకున్న ఆయన వ్యవహారాలు చూసే అత్యంత సన్నిహితుడి వ్యవహార శైలి ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది...

రాజకీయ ప్రయోజనాల కోసం ప్రధాన ప్రతిపక్షం పోలవరంపై అవాస్తవాలు, అబద్ధాలు, అభూతకల్పనలు ప్రచారం చేస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రాజెక్టుపై అభూతకల్పనలు ప్రచారం చేస్తే సహేతుకంగా, నిజాయితీగా సమాధానం చెప్పాలని పోలవరం ప్రాజెక్టు పై నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో మంత్రులు, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి సూచించారు. పట్టిసీమను అడ్డుకోవడానికి ప్రతిపక్ష పార్టీ చేయని ప్రయత్నం లేదు. అయినా అన్ని సమస్యలు అధిగమించి రైతుల మన్ననలు, ఆశీర్వాదాలు పొందగలిగాం. పోలవరం పూర్తయితే ప్రతిపక్ష వైసీపీ పార్టీ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. అందుకే అవాస్తవాలు, అబద్ధాలను ఆ పార్టీ ప్రచారం చేస్తుంది. .. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి విరాళాలు ఇస్తామని, తాము కూడా వచ్చి కూలీ పని చేస్తామని 1100కి సందేశాలు పంపుతున్న రైతన్నలకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే సోషల్ మీడియాలో కూడా ఎంతో మంది విరాళాలు ఇస్తాం అంటున్నారు అని, వారి స్పూర్తి, రైతన్నల స్పూర్తి, ప్రోత్సాహమే మా ప్రభుత్వ బలం. పోలవరం పూర్తి చేయడంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదు.. అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు.

cbn polavaram 09122017 2

పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి రాష్ట్ర విభజన తర్వాత అత్యంత ప్రాధాన్యతనిచ్చి కొన్ని మండలాలను రాష్ట్రంలో కలిపేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావడంలో రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించిందన్నారు. రాష్ట్రానికి జీవనాడి, ప్రాణనాడి అయిన పోలవరం పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నామన్నారు. పోలవరం పూర్తయ్యే లోగా కృష్ణా డెల్టా రైతులను ఆదుకునేందుకు పట్టిసీమను రికార్డు సమయంలో పూర్తి చేసి ప్రభుత్వం తమ నిబద్ధతను చాటుకుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రాజెక్టు ప్రాంతంలోనే అధికారులు, ఇంజనీర్లతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ నిబద్ధతతో ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చి రియల్ టైమ్ లో సమీక్షించి ఎక్కడ ఎటువంటి సమస్యలు వచ్చిన తక్షణమే పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నాం. పని చేసే సంస్థల సమస్యలు ప్రాజెక్టుకు శాపంగా మారకూడదు. ఇదే విషయాన్ని ఆయా సంస్థలకు, కేంద్రానికి తెలియపరిచామని ముఖ్యమంత్రి తెలిపారు.

cbn polavaram 09122017 3

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం అడిగిన సమాచారమంతా ఇప్పటికే అందజేశామని, మళ్లీ అడిగినా ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సభ ముందు ఉంచామన్నారు. పోలవరం ప్రాజెక్టుపై పారదర్శకత, నిబద్ధత, దార్శనికతతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టును నిర్ధిష్ట సమయానికి పూర్తి చేసి.. రాష్ట్ర అభివృద్ధి, రైతుల హితం, నీటి భద్రతను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యం. పోలవరంపై అసెంబ్లీ ముందు ఉంచిన పారదర్శకత వివరణ.. శ్వేతపత్రం కన్నా ఎక్కువని సీఎం తెలిపారు. ప్రాజెక్టు పూర్తి కావడమే మాకు ముఖ్యం. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే ప్రయత్నంలో ఎవరు సహకరించిన సంతోషంగా స్వీకరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు.

పోలవరం ప్రాజెక్టు ఖర్చుకు సంబంధించిన లెక్కలన్నీ శాసనసభలో వెల్లడించామని, అదే ఒక శ్వేతపత్రం వంటిదని జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమ చెప్పారు. పోలవరంలో అవినీతి జరిగిపోయిందని ప్రతిపక్షం గగ్గోలు పెడుతోందని, అసలు గుత్తేదారులకు ఎంత చెల్లించామో వారికి తెలుసా? అని మంత్రి ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టులో 2014 తర్వాత ప్రధాన ప్రాజెక్టులో ఎంత ఖర్చు చేసింది, గుత్తేదారులకు ఎంత ఇచ్చిందీ ఆయన వివరించారు. ఇప్పటి వరకు 7.50 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి పని, 4.38కోట్ల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పని పూర్తి చేశాం అంటున్నారు దేవినేని ఉమా.. పోలవరం ప్రాజెక్టుకు ఖర్చుపెట్టిన ప్రతీ రూపాయికి ఆన్‌లైన్‌లో వివరాలు ఉన్నాయని, ఎవరైనా చూడవచ్చని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

polavaram 10122017 2

మంత్రి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పునరావాసంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటి వరకు 680 బిల్లులకు 2380.76 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 158 బిల్లులకు 153.44 కోట్లు కలిపి మొత్తం రూ.2,544.13 కోట్లు చెల్లించామన్నారు. ప్యాకేజీ నగదు ఆయా రైతుల ఖాతాల్లోనే జమ చేశామని, ఎక్కడా అవినీతి జరిగే అవకాశం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టులో పునరావాసం, భూసేకరణకు సంబంధించి మొత్తం రూ.2,534 కోట్ల బిల్లులన్నింటినీ సమీకరించి జలవనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌, పునరావాస కమిషనర్‌ ద్వారా హైదరాబాద్‌లోని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి పంపే ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఉన్న వీటన్నింటి ప్రతులు సేకరించి 846 బిల్లులను పుస్తకాల రూపంలోకి మార్చి అథారిటీ కోరిక మేరకు పంపుతున్నారు.

polavaram 10122017 3

మొత్తం ఖర్చు: రూ.7,431 కోట్లు... కేంద్రం ఇచ్చింది: 4,324 కోట్లు... (గడ్కరీ తాజాగా రూ.318కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు)... ఇంకా కేంద్రం నుంచి రావాల్సింది: రూ.2,894 కోట్లు... గుత్తేదారులకు ఇచ్చింది: రూ.1,590 కోట్లు... ట్రాన్స్‌ట్రాయ్‌కు : రూ.654 కోట్లు... త్రివేణి (మట్టి తవ్వకాలు): రూ.656 కోట్లు... ఎల్‌అండ్‌టీ బావర్‌ (డయాఫ్రంవాల్‌): రూ.205 కోట్లు... బెకం (గేట్ల తయారీకి): రూ.69 కోట్లు... కెల్లర్‌ అడ్వాన్సు( కాఫర్‌డ్యాం జెట్‌ గ్రౌటింగ్‌ పనులకు) రూ. 5 కోట్లు... భూసేకరణ, పునరావాసం: రూ.2,534 కోట్లు ...

Advertisements

Latest Articles

Most Read