పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ కక్కుతున్న విషం పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై సటైర్ లు చేశారు. డయాఫ్రమ్ వాల్ కనిపించటం లేదు అంటూ వైకాపా నేతలు చేస్తున్న వ్యాఖ్యల పై, ముఖ్యమంత్రి స్పందిస్తూ, పోలవరం ప్రాజెక్టుకు 100 మీటర్ల లోతులో ఉండే డయాఫ్రమ్‌వాల్ కనిపించడం లేదంటూ ఇటీవల ఒక పెద్ద మనిషి ప్రకటన చేశాడని సీఎం వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్‌వాల్ 100 మీటర్లలోతున కడుతున్నారని, ఈ వాల్ ఎలా ఉంటుందో చూపించాలంటే ఆయనను 100 మీటర్ల లోతుకు పంపితే సరిపోతుందని చంద్రబాబు అన్నారు.
100 మీటర్ల లోతుకు పంపిస్తే, అన్నీ కనిపిస్తాయి అని సీఎం వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అలా పంపితే, చూసొచ్చిన తర్వాతైనా వాల్ ఉందని నమ్ముతాడని చంద్రబాబు జగన్‌కు చురకలు వేశారు. డయాఫ్రమ్‌వాల్ అంటే ఏమిటో? పిల్లర్ అంటే ఏమిటో.. స్పిల్ వే, స్పిల్ చానల్ అంటే ఏమిటో జగన్‌కు తెలుసా? అని చంద్రబాబు ప్రశ్నించారు.. ఇలాంటి నాయకులు రాజకీయాల్లోకి వచ్చారని ఆయన మండిపడ్డారు.
ఇలాంటి నేతలు రాజకీయాల్లోకి వచ్చారంటూ సీఎం నవ్వుతూ చురకలు వేశారు. పోలవరం ప్రాజెక్టు వ్యయాలపై శ్వేత పత్రం విడుదల చేయాలన్న జగన్ డిమాండ్‌నూ సీఎం ఎద్దేవా చేశారు. అసెంబ్లీలోనూ..సమీక్ష సమావేశాలు జరిగిన ప్రతిసారీ ప్రాజెక్టు వ్యయాలపై వాస్తవ పత్రాలను విడుదల చేస్తున్నామని, ఇంతకంటే.. ఇంకేం వివరాలు కావాలని ప్రశ్నించారు. అవన్నీ శ్వేతపత్రాలు కావా.. శ్వేతపత్రం అంటే దానికేమైనా బంగారు పూత ఉంటుందా అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.