జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర కార్యకర్తలతో విశాఖలో పవన్ సమావేశమయ్యారు... ఈ సమావేశంలో, లోకేష్ దగ్గర నుంచి మోడీ దాకా అందరి మీద అభిప్రాయాలు చెప్పారు... జగన్ మోహన్ రెడ్డిని మాత్రం స్పెషల్ గా ట్రీట్ చేశారు... జగన్ లాంటి అవినీతి పరుడుకు సపోర్ట్ ఇస్తే, ప్రజల పై ప్రభావం ఉంటుందని అందుకే వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు గత ఎన్నికల్లో జగన్‌కు మద్దతు ఇవ్వలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. జగన్ లాంటి వ్యక్తిని సమర్థిస్తే తాను కూడా అలా అవుతానేమోనని భయం వేసిందని అన్నారు. తండ్రి సీఎం అయితే తాను కూడా ముఖ్యమంత్రి కావాలని అనుకోవడం అవివేకమని, ఇది ప్రజాస్వామ్యమా?.. రాచరికమా? అని ప్రశ్నించారు.

pawan 06122017 2

రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి దోచుకున్న, లంచాలు తీసుకున్న వ్యక్తి అయితే మొత్తం సమాజం అలా తయారయ్యే అవకాశం ఉందని, అందుకే అన్ని వేల కోట్ల అవినీతి చేసిన జగన్ ని సమర్ధించాలనిపించలేదని, తనకు భయం వేసి... వైసీపీకి మద్దతు ఇవ్వలేదని పవన్ మరోసారి స్పష్టం చేశారు. అంతే తప్ప జగన్‌పై తనకు ఎలాంటి ద్వేషం, వైరం లేదని అన్నారు. తనకు ముఖ్యమంత్రి అవ్వాలని కోరిక లేదని, ప్రజా సేవ చేస్తానని, అవసరమైతే పాదయాత్ర చేస్తానని అన్నారు. పాదయాత్ర చేస్తే సీఎం అవుతారా..? అని పవన్‌ సూటిగా ప్రశ్నించారు.

pawan 06122017 3

అలాగే లోకేష్ పై కూడా స్పందించారు... లోకేష్ తండ్రి ముఖ్యమంత్రి అందుకే మంత్రి అయ్యారేమో, పార్టీ పదవి వచ్చింది ఏమో... నాకు మా తండ్రి ముఖ్యమంత్రి కాదుగా... మా తండ్రి ఉంటే నాకు తెలేసేదేమో అన్నారు... రాజకీయ నేతల పిల్లలు పొలిటిక్స్‌లోకి రాకూడదని చెప్పలేదని, నిజాయితీని నిరూపించుకుని రావాలని పవన్ అన్నారు... అవినీతి పరులుకి మాత్రం నేను ఎప్పుడూ మద్దతు ఇవ్వను అన్నారు పవన్...

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్ర‌భుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయా.. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అంటూ ఎదురుచూసిన అభ్య‌ర్థుల‌కు ఎట్టకేలకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం శుభవార్త చెప్పింది. ఎంతో కాలంగా డీఎస్సీ కోసం వేచి చూస్తున్న అభ్యర్థుల కల సాకారం చేసుకునే సమయం రానే వచ్చింది. ఎన్నికల ప్రచారంలో టీచర్ పోస్టుల భర్తీ చేపడతామని ప్రకటించిన ప్రభుత్వం ఆదిశగా కార్యాచరణ ప్రకటించింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి గంటా శ్రీనివాస రావు ఈ రోజు డీఎస్సీ ప్ర‌క‌ట‌న‌ చేశారు. ఈ నెల 15న సిలబస్‌, నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని చెప్పారు. మొత్తం 12,370 పోస్టులకు డిసెంబర్‌ 26 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.

dsc 06122017 2

గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తెలిపారు. మార్చి 23,24,26 తేదీల్లో జరిగే ఈ పరీక్షలకు అభ్యర్థులు సిద్ధం కావాలని ఆయన సూచించారు. హాల్‌ టిక్కెట్లును వచ్చే ఏడాది మార్చి 9 వరకు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌, ఎస్జీటీ, లాంగ్వేజ్‌ పండింట్‌ ఉద్యోగాలు 10,313తో పాటు తొలి దశలో మోడల్‌ పాఠశాలల్లో 1197 ఉద్యోగాలు, ప్రత్యేక అవసరాలు కల్గిన విద్యార్థుల కోసం మరో 860 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు

dsc 06122017 3

ముఖ్యమైన తేదీలివే.. * డీఎస్సీ నోటిఫికేషన్‌ - డిసెంబర్‌ 15న * దరఖాస్తుల స్వీకరణ: డిసెంబర్‌ 26 నుంచి ఫిబ్రవరి 2 వరకు (ఆన్‌లైన్‌లో) * హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు చివరి తేదీ: మార్చి 9 * రాత పరీక్షలు : మార్చి 23,24,26 * రాత పరీక్ష కీ విడుదల : ఏప్రిల్‌ 9న * కీపై అభ్యంతరాల స్వీకరణ: ఏప్రిల్‌ 10 నుంచి 16 వరకు * తుది కీ విడుదల తేదీ: ఏప్రిల్‌ 30 * మెరిట్‌ లిస్ట్‌ ప్రకటన : మే 5 * ప్రొవిజనల్‌ సెలక్షన్‌ విడుదల చేసి అభ్యర్థులకు సమాచారం: మే 11న * ఎంపికైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన: మే 14 నుంచి 19 వరకు

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన బుధవారం ఉదయం ప్రారంభమైంది. ఆయన ఉదయం తొమ్మిది గంటల సమయంలో విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు అభిమానులు, జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఉద్యోగులు డీసీఐ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళకు పవన్ మద్దతు ప్రకటించారు. డీసీఐ ఉద్యోగులకు నైతిక మద్దతు ఇచ్చేందుకు తాను ఇక్కడకు వచ్చానని చెప్పారు. మీ బాధలు పంచుకోవడానికే వచ్చానన్నారు. నష్టాల్లో ఉన్న కంపెనీలను ప్రయివేటీకరణ చేయడం తప్పు లేదన్నారు. కానీ లాభాల్లో ఉన్న డీసీఐని ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.

pk 06122017 2

ఈ సందర్భంలోనే జగన్ మోహన్ రెడ్డి పై డైరెక్ట్ పంచ్ వేశారు పవన్... నాకు అధికార దాహం లేదు... అధికారం విలువ, బాధ్యత తెలుసు.. ముఖ్యమంత్రి అయితేనే సమస్యలు పరిష్కరిస్తానని చెప్పను... ముఖ్యమంత్రి కావలి అంటే అనుభవం ఉండాలి... ప్రజల పక్షాన నిలబడటానికి అధికారం అవసరం లేదు అంటూ పవన్ పరోక్షంగా జగన్ పై వ్యాఖ్యలు చేసారు... జగన్ ప్రతి సందర్భంలోనూ నేనే సియం నేనే సియం అని అంటున్న విషయం తెలిసిందే... పాదయాత్రలో కూడా ఎవరు ఏ సమస్య చెప్పిన, ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ, నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే మీ సమస్య పరిష్కరిస్తాను అంటూ వస్తున్నారు... ఇప్పుడు పవన్ అంటున్న వ్యాఖ్యలు డైరెక్ట్ గా జగన్ కు తగులుతున్నాయి..

pk 06122017 3

మరో పక్క, తాను ఇంత వరకు ప్రధాని మోడీని ఏదీ అడగలేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ ఇప్పుడు డీసీఐ ప్రయివేటీకరణ ఆపాలని కోరుతానని చెప్పారు. ఆశించిన ఫలితం రాకుంటే మీతో కలిసి పని చేస్తానని డీసీఐ ఉద్యోగులకు చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబుకి కూడా, ఆత్మహత్య చేసుకుని చనిపోయిన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు పవన్... తన ప్రసంగంలో కేంద్రాన్ని డైరెక్ట్ గా టార్గెట్ చేసిన పవన్, రాష్ట్ర ప్రభుత్వం పై కూడా వ్యాఖ్యలు చేశారు...

నవ్యాంధ్రలో పెట్టుబడుల ఆకర్షణ ధ్యేయంగా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే లక్ష్యంగా ప్రారంభమైన ముఖ్యమంత్రి చంద్రబాబు కొరియా పర్యటన కొనసాగుతూ ఉంది. బూసన్‌లో ఎంబసీతో కలిసి ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన రోడ్ షో/బిజినెస్ సెమినార్‌లో చంద్రబాబు పాల్గొన్నారు. బూసన్ మెట్రోపాలిటన్ సిటీ వైస్ మేయర్ కిమ్ యంగ్‌వాన్ ప్రసంగిస్తూ ఏపీ ముఖ్యమంత్రి ‘డైనమిక్ లీడర్’ అని ప్రశంసించారు. కొరియా, ఏపీ మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయని చెప్పారు. వైద్య-ఆరోగ్య రంగం, వ్యవసాయం, పునరుత్పాదక విద్యుత్, ఓడరేవులు, నగరాల అభివృద్ధి లాంటి అనేక అంశాలలో పరస్పర సహకారం ఆవశ్యకతను వివరించారు.

korea 06122017 2

అలాగే, దక్షిణ కొరియాలో భారత రాయబారి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభినందించారు... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దక్షిణకొరియాలోని క్రియాశీల నగరమైన బూసన్‌ను సందర్శించడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. క్రియాశీలత, సాంకేతికత, బాహ్య ప్రపంచంతో సంబంధాలు, ఓడరేవుల అభివృద్ధి తదితర అంశాలలో బూసన్ సిటీకి, ఏపీకి సారూప్యత ఉన్నదని వివరించారు. భారత్‌లో వ్యాపారం చేయాలనుకుంటే ఏపీని మించిన ప్రాంతం మరొకటి లేదని కొరియన్ పారిశ్రామికవేత్తలకు దక్షిణ కొరియాలో భారత రాయబారి స్పష్టంచేశారు.

korea 06122017 3

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత బాగా పని చేస్తుందో ఒక ఉదాహరణ చెప్పారు... ‘కియా’కు ఇచ్చిన ఎగుడు దిగుడుగా ఉన్న ప్రాంతాన్ని చదును చేయడానికి కనీసం ఏడాదైనా పడుతుందని భావిస్తే, చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం కేవలం 3 నెలలలోనే ఆ పని పూర్తిచేయడ విశేషమని, ఆయన క్రియాశీలతకు, వేగవంతమైన పనివిధానానికి ఇదే నిదర్శనమని ప్రశంసించారు. ఇక్కడ నుంచి మెషినరీ తీసుకువెళ్ళినా, మనకు సంవత్సరం పడుతుంది అని కియా ఇంజనీర్లు కూడా చెప్పారు అని, కాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మూడు నెలల్లో పూర్తి చేసి ఆశ్చర్య పరిచింది అని అన్నారు... అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలను ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టమని సలహా ఇస్తున్నట్టు చెప్పారు...

Advertisements

Latest Articles

Most Read