ఏడాది క్రితం రైతులు అక్కడ భూమి ఇచ్చారు... ఏడాది తిరగకుండానే కళ్ల ముందు బహుళ అంతస్థుల నిర్మాణంతో నిర్మాణం సిద్ధమైంది... అమరావతి మీద నిత్యం విషం చిమ్మే వారికి, ఇలాంటివి కనపడవ్.. కనీసం ఒక వార్త కూడా రాయరు... సాంకేతిక విద్యారంగంలో33 సంవత్సరాలుగా అగ్రగామిగా ఉన్న విద్యా సంస్థ వెల్లూరు ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇప్పుడు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పూర్తిస్థాయిలో తమ క్యాంపస్ అందుబాటులోకి తీసుకొచ్చింది. మంగళవారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విట్ ఆంధ్రప్రదేశ్ అకాడమిక్ బ్లాక్ ను ప్రారంభించనున్నారు. ప్రజా రాజధాని అమరావతిని నాలెడ్స్ హబ్‌గా చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచనలు మేరకు అమరావతిలో అడుగుపెట్టిన మొట్టమొదటి ప్రైవేట్ యూనివర్శిటీ విట్. ఒక సంవత్సర కాలంలోనే తమ విద్యార్ధులకు సాంత భవనాలు అందుబాటులోకి తీసుకురావడం విశేషం. దాదాపు 2.11 లక్షల చదరపఅడుగుల విస్తీర్ణంలో ఐదు అంతస్తుల మొదటి అకాడమిక్ బ్లాక్‌ను నిర్మించారు.
అదే విధంగా క్యాంపస్ లోనే విద్యార్ధులు ఉండేందుక అనువుగా 1.10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో తొమ్మిది అంతస్తుల బ్లాక్ ను నిర్మించారు. ఈ రెండు బ్లాక్ లను మంగళవారం ప్రారంభించనున్నారు. అకడమిక్ బ్లాక్‌కు పూర్వ రాష్ట్రపతి , విద్యావేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్, హాస్టల్ భవనానికి నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజినీ నాయుడు పేరు పెట్టడం విశేషం. జూలై 2016లో ఏపీ ప్రభుత్వం విట్ కి రెండు దశల్లో నిర్మించే విధంగా ఐనవోలులో రెండు వందల ఎకరాలు కేటాయిస్తూ జీవో ఇవ్వటం జరిగింది. 2016 ఆగస్టులో హయ్యర్ ఎడ్యుకేషన్ విట్ కి అనుమతిని ఇస్తూ ఎల్ఓఐ ఇవ్వగా 2016 అక్టోబర్‌లో సిఆర్డిఏ మొదటి విడతలో 100 ఎకరాలు కేటాయించడం జరిగింది. నవంబర్ 3, 2016లో అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మకమైన విట్ ఏపీకి శంకుస్థాపన చేశారు. జనవరి 7, 2017లో పూర్తి స్థాయి నిర్మాణ కార్యక్రమాలు మొదలు పెట్టి కేవలం పది నెలల కాలంలోనే విద్యార్ధులకు అన్ని హంగులతో భావనలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.
ముఖ్యమంత్రి స్పీడ్ ను అర్ధం చేసుకున్నవిట్ ఏపీ వైస్ ప్రెసిడెంట్ శేఖర్ విశ్వనాధన్ నిత్యం పనులను పర్యవేక్షి అనతికాలంలోనే విద్యార్ధులకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. జూలై 26, 2017న విద్యా సంవత్సరం ప్రారంభంలోనే 650 మంది విద్యార్ధులు విట్ ఏపీ క్యాంపస్‌లో అడ్మిషన్లు తీసుకున్నారు అంటే వీట్ విద్యా సంస్థ పట్ల తలిద్రండ్రులకు విద్యార్ధులకు ఎంత నమ్మకం ఉందో అర్ధంచేసుకోవచ్చు. 24 రాష్ట్రాల విద్యార్ధులు మొదటి సంవత్సరంలో చేరగా, విట్ ఏపీ తమ విద్యార్ధులు చదువు పూర్తి అయిన వెంటనే కొలువుల్లో చేరే విధంగా అంతర్జాతీయ స్థాయిలో తమ కరిక్యులం తయారు చేసి, ఆ విధంగా విద్యార్ధులకు తర్పీదు ఇస్తున్నట్లు విట్ ఏపీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ డాక్టర్. సంధ్యా రెడ్డి చెప్పారు. నిన్నటి వరకు పంట పొలాలుగా ఉన్న తమ ప్రాంతంలో పేరొందిన సంస్థలు రావడం పట్ల రాజధాని ప్రాంత రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఇంత వేగంగా రాజధానిలో విద్యా సంస్థల ప్రాంగణాలు నిర్మితమౌ తాయని తాము ఊహించలేదని చెబుతోన్నారు. తమ పిల్లలు ఉన్నత చదువుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పని లేదని, ఇక్కడే చదువుకొని స్థానికంగానే ఉద్యోగాలు పొందవచ్చని పేర్కొంటోన్నారు.