నవ్యాంధ్రను దేశంలోనే నెంబర్ 1 చెయ్యాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి ఫలిస్తుంది... ఒక పక్క నవ్యాంధ్ర ఇప్పటికే సెల్ ఫోన్ తయారీ హబ్ గా పేరు తెచ్చుకుంది... మరో పక్క ఆటోమొబైల్‌ రంగంలో ఇప్పటికే ఇసుజు, కియా, హీరో కంపెనీలు వచ్చాయి... ఇప్పుడు తాజాగా మరో ప్రతిష్టాత్మక సంస్థ రాబోతోంది. అది కూడా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ ప్లాంట్‌... దీనికి గుజరాత్‌, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు పోటీ పడినా, ఆంధ్రప్రదేశ్ వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం... దీనికి ఊతం ఇచ్చేలా, రెండు హైబ్రిడ్‌ మోడళ్ల కార్లను మొదటి సారిగా భారత్‌లో తొలిసారిగా అమరావతిలో లాంచ్‌ చేయనుంది.

toyota 13112017 2

ఈ మేరకు ఈ నెల 16వ తేదీన రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి 10 ఎలక్ట్రిక్‌ వాహనాలను ఉచితంగా అందించనుంది. చాలా హై లెవెల్ లో, గుజరాత్‌ లో పెట్టుబడి పెట్టాలి అని, గుజరాత్‌ ఎన్నికల నేపథ్యంలో తమ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అని, పైస్థాయి నుంచి టయోటాతో సంప్రదింపులు జరిగినా, చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్ట్ గా రంగంలోకి దిగటం, అలాగే అమరావతిలో ఎలక్ట్రిక్‌ వాహనాల ప్రయోగ, ప్రచార కేంద్రంగా ఉపయోగించుకోవాలంటూ చేసిన సూచన, వారితో చేసిన చర్చలు టయోటాను ఏపీవైపు మొగ్గు చూపేలా చేశాయి.

toyota 13112017 3

టయోటా కార్ల తయారీ ప్లాంట్‌ ప్రస్తుతం బెంగళూరు సమీపంలో ఉంది. భారత్‌కు అవసరమైన వాహనాలను ఇక్కడినుంచే ఉత్పత్తి చేస్తుంది. అయితే ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ ప్లాంట్‌ భారత్‌లో లేదు. జపాన్‌లోని తమ ప్లాంట్‌లో తయారైన ఇ-కార్లను నేరుగా అమరావతికి పంపిస్తుంది. కొద్దిరోజుల క్రితం ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ బెంగళూరు వెళ్లినప్పుడు టయోటా ప్రతినిధులను కలిశారు. ఎలక్ట్రిక్‌ కార్లలో రెండు మోడల్స్‌ ఉన్నాయి. ఇందులో ఒకటి పీహెచ్‌వీ మోడల్‌. సుమారు రూ.40 లక్షల వరకు ఉంటుంది. ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 68.5 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇది హైబ్రిడ్‌ కారు. ఈ మోడల్‌కు చెందిన నాలుగు కార్లను టయోటా కంపెనీ ప్రభుత్వానికి అందిస్తుంది. రెండోది కామ్‌ ఎస్‌ మోడల్‌. సుమారు రూ. 9 లక్షల వరకు ఉంటుంది. ఈ మోడల్‌కు చెందిన ఆరు వాహనాలను టయోటా ఏపీకి ఇస్తోంది.

కృష్ణా నదిలో నిన్న జరిగిన ఘోర ప్రమాదానికి కారణమైన బోటు గురించి షాకింగ్ వీడియో బయటకు వచ్చింది... ఆదివారం కృష్ణా నదిలో ప్రమాదానికి గురైన బోటు ‘రివర్‌ బోటింగ్‌ అడ్వెంచర్స్‌’ సంస్థది... ఆ సంస్థ గత ఆరు నెలలు నుంచి 2 సీటర్, 4 సీటర్ పర్యాటక బొట్లు నడుపుతున్నాయి... వారికి పెద్ద బోటు నడిపే అనుమతి లేదు... అయితే ఆదివారం కొత్తగా ఒక బోటు తీసుకువచ్చి దుర్గా ఘాట్ దగ్గర పెట్టారు... అక్కడ పర్యాటక శాఖకు చెందిన అధికారాలు ఆ బోటు చూసి, ఈ బోటుకు అనుమతి లేదు అని, ఇక్కడ నుంచి వెంటనే తీసివెయ్యాలి అని హెచ్చరించారు.. అయితే ఆ బోటు డ్రైవర్ వాగ్వాదానికి దిగాడు... పర్యాటక శాఖకు చెందిన అధికారాలు మాత్రం, ససే మీరా అన్నారు... పర్మిషన్ ఉంటేనే మిమ్మల్ని అనుమతిస్తాను అన్నారు... ఈ వాదనకు సంబధించి వీడియో బయటకు వచ్చింది... క్రింద చూడవచ్చు...

boat 13112017 1

అయితే, పర్యాటక శాఖకు చెందిన అధికారాలు ఎంతకీ వినకపోవటంతో ఆ బోటు డ్రైవర్ బోటుని తీసుకుని వెళ్ళిపోయాడు... అయితే, మళ్ళీ ఈసారి సాయంత్రం వచ్చాడు... దుర్గా ఘాట్ కి కాకుండా, పున్నమి ఘాట్ కు వెళ్ళాడు.... అక్కడ అధికారులు ఎవరూ లేకపోవటంతో, రెచ్చిపోయాడు.... అప్పటికే ఈ ఒంగోలు బృందం, ప్రభుత్వ టూరిజం బోటు వద్దకు రాగా, ఇప్పుడు సమయం దాటి పోయింది అని, వెళ్ళే సరికి చీకటి పడుతుంది అని, ఇప్పుడు బోటు వెళ్ళటం కుదరదు అని, వారికి చెప్పారు... ఈ బృందం పక్కనే ఉన్న ఈ ‘రివర్‌ బోటింగ్‌ అడ్వెంచర్స్‌’బోటు దగ్గరకు వెళ్లి అడగ్గా, ఒక్కొక్కరికీ ౩౦౦ ఇస్తాను అంటే తీసుకువెళ్తాను అని చెప్పటంతో, లోడ్ కి మించి, వారిని ఎక్కించుకున్నాడు...

boat 13112017 1

‘పవిత్ర సంగమం వద్దకూ తీసుకెళ్లాలి’ అని పర్యాటకులు అనగానే... బోటు సిబ్బంది ‘సై’ అన్నారు. నిజానికి... వారికి ఆ మార్గంలో బోటు తిప్పేందుకు అనుమతి లేదు. అన్నింటికంటే దారుణమేమిటంటే... ఇప్పటిదాకా ఆ బోటు ఆ మార్గంలో ఒక్కసారి కూడా ప్రయాణించలేదు. కనీసం... డ్రైవరుకైనా ఆ దారిలో ఇతర బోట్లను నడిపిన అనుభవముందా అంటే అదీ లేదు. ప్రమాదకరమని తెలిసినా... కాసుల కోసం కక్కుర్తి పడ్డారు. అయితే వీడికి మొదటి సారి ఆ రూట్ కావటంతో, డ్రైవర్ సరైన రూట్ లో వెళ్ళాక బాలన్స్ చెయ్యలేకపోయాడు... అడ్డంగా తోసుకు వచ్చే ప్రవాహాన్ని కూడా అంచనా వేయలేకపోయాడు. కుదుపుల దాటికి... వారు కూర్చున్న కుర్చీలన్నీ కదిలిపోయాయి. దాదాపు అందరూ బోటులో ఒకేవైపునకు పడిపోయారు. అడ్డంగా తోసుకొస్తున్న గోదావరి నీరు బోటును తలకిందులు చేసేసింది. అధికారులు పొద్దున్న ఈ బోటుని అడ్డుకున్నా, సాయంత్రానికి ఎవరూ లేని చోటుకి మళ్ళీ వచ్చి ఈ ఘోరానికి కారణం అయ్యాడు...

ఇబ్రహీంపట్నంలో ఫెర్రీ పాయింట్ దగ్గర విషాదకర సంఘటన చోటు చేసుకుంది. కృష్ణా నదిలో దాదాపు 50 మందితో ప్రయాణిస్తున్న ఓ బోటు ప్రమాదవశాత్తు తిరగబడింది. సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉండటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 12మందికి పైగా మృతి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు జరుగ్తున్నాయి...

boat 12112017 2

కాగా మృతులు ఒంగోలుకు చెందిన వారిగా గుర్తించారు. ఇప్పటికే ఎన్‌డిఆర్ఎఫ్ బృందం ఘటనాస్థలికి చేరుకుంది. ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు, స్థానికులు మృతదేహాలను వెలికితీసే ప్రయత్నాలు చేస్తున్నారు. నదిలో పడిన 15 మందిని రెస్క్యూ టీం రక్షించింది... చీకటి పడటంతో గాలింపు చర్యలకు ఆటంకం కలిగింది... అసలు బోటు లో ఎంత మంది ఉన్నారు, ఎవరు ఉన్నారు, అసలు ఏమిటి అనే విషయం స్పష్టత లేదు...

boat 12112017 3

ఆదివారం, కార్తిక మాసం చివరి ఆదివారం కావటంతో, ఎక్కువ మంది పవిత్ర సంగమం దగ్గర హారతి చూడటానికి వచ్చారు... అయితే, అనుకోని సంఘటన జరగటంతో, పవిత్ర సంగమం ఘాట్ దగ్గర విషాద చాయలు అలుముకున్నాయి... పున్నమి ఘాట్ నుంచి పవిత్రసంగమం బయలుదేరినట్టు సమాచారం...

ఒక పక్క 40 మంది గల్లంతు అయ్యారు అనే వార్తా... 12 మంది ప్రాణాలు కోల్పోయారు... ఇంకా ఎంత మంది గల్లంతు అయ్యారో తెలీదు... 15 మందిని రెస్క్యూ టీం రక్షించింది... సహాయ కార్యక్రమాల్లో రెస్క్యూ టీం , ఎన్‌డిఆర్ఎఫ్, పోలీసు, ఫైర్ బృందాలు పాల్గుంటున్నాయి... ఇంత గందరగోళంలో ఎవడన్నా రాజకీయాలు చేస్తారా ? సహాయ కార్యక్రమాలకి అడ్డుపడతారా ? వైసీపీ నాయకులు, పార్ధసారధి, జోగి రమేష్, ఉదయభాను చేసింది ఏంటి ? చేతనైతే సహాయం చెయ్యాలి.. ఆ బృందాలతో కలిసి, సహాయ కార్యక్రమాల్లో పాల్గునాలి... అంతే కాని, సియం డౌన్ డౌన్ అనే నినాదాలు చేసే టైమా అది ? 

boat ysrcp 12112017 2

ఆ బోటు ఎవరిది ? పర్మిషన్ చూపించండి... టిడిపి నాయకుల బినామీలు ఈ బోటు నడుపుతున్నారు అంటూ పోలీసులు మీద ఎగబడి, దౌర్జన్యం చేస్తే ఎలా ? మీరు రెస్క్యూ ఆపరేషన్ ఆపేసి, మాకు సమాధనం చెప్పండి, మేము మా జగన్ కు బ్రీఫ్ చెయ్యాలి అనే రాజకీయం ఆ టైం లో అవసరమా ? అక్కడ అంబులెన్స్ కంటే ముందే మేము వచ్చాము అంటున్నారు, మరి మీరు మీ కార్లలో ఎందుకు హాస్పిటల్ కు తీసుకువెళ్ల లేదు ? మీకు బాధ్యత లేదా ? పోలీస్ కమీషనర్ కూడా మిమ్మల్ని బయటకు వెళ్లి రాజకీయాలు చేసుకోమన్నారు అంటే, మీరు అలాంటి చోట, ఎలాంటి పని చేసారో ఒక్కసారి ఆలోచించుకోండి...

boat ysrcp 12112017 3

నూటికి నూరు శాతం ప్రభుత్వాన్ని నిందించాలి... ఇక్కడే కాదు, సహజ మరణం కాకుండా, ఎలా మరణించినా దానికి ప్రభుత్వానిదే బాధ్యత... కాని మన విమర్శకు సందర్భం లేదా ? వీలైతే మీకు తోచిన సాయం చేయాలి... అంతే కాని, మీ సాక్షి టీవీ న్యూస్ కోసం, అక్కడకు వచ్చి ఆందోళన చేసే సమయమా అది ? ఒక పక్క టీవీల్లో చూసే వారు, గల్లంతైన వారు బ్రతికితే బాగుండు అంటూ దండాలు పెట్టుకునుంటే, మీ దరిద్రపు రాజకీయం చూసి, మీ మీద ఊస్తున్నారు... కొంచెం రెస్క్యు ఆపరేషన్ ఆపరేషన్ అయ్యేదాకా మీ రాజకీయం ఆపండి... రేపు కచ్చితంగా అందరం ప్రభుత్వాన్ని నింద్దిదాం... ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా, మన సలహాలు ఇద్దాం....

Advertisements

Latest Articles

Most Read