పాలనలో టెక్నాలజీ అమల్లో, మరో ముందడుగు వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ ప్రగతితో అనుసంధానంతో, అన్ని ప్రభుత్వ ఆన్ లైన్ సేవలు, ఒకే ప్లాట్ ఫార్మ్ పైకి రానున్నాయి.

ఈ-ప్రగతి కోర్ ప్లాట్ ఫార్మ్ నిర్వహాణ ఈవై సంస్థకు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. బిడ్డింగులో ఈ-ప్రగతి కోర్ ప్లాట్ ఫార్మ్ దక్కించుకుంది ఈవై సంస్ధ. డేటా ఎనలిటిక్స్ ద్వారా సీఎం కోర్ డ్యాష్ బోర్డునూ అప్డేట్ చేయనుంది, ఈవై సంస్ధ.

సీఎం కోర్ డ్యాష్ బోర్డు తరహాలో, ఈ-ప్రగతి కోర్ ప్లాట్ ఫార్మ్ ఏర్పాటు కానుంది. ప్రజలకు ఉపయోగపడేలా, తేలికగా అర్ధమయ్యేలా, ఈ-ప్రగతి కోర్ ప్లాట్ ఫార్మ్ ఏర్పాటు కానుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం, ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఒక బహిరంగ లేఖ రాశారు... దాదాపు 40 రోజుల తరువాత, మన రాష్ట్ర సమస్యల పై మన ప్రతిపక్ష నాయకుడు స్పందించారు.. అయితే, ఆ ఉత్తరం గురించి మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు కొన్ని విషయాలు చెప్పారు..

నిజానికి రాష్ట్రంలో వర్షాలు బాగా పడి, అన్నీ నదులు, వాగులు, వంకలు, రిజర్వాయర్ లు నిండాయి... అయితే, జగన్ తన లేఖలో, 10 లక్ష ఎకరాలు రాష్ట్రంలో బీడు పోయాయి అని రాసి, అందరినీ ఆశ్చర్యపరిచారు... అయితే, మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ, అది పక్క రాష్ట్రం వాళ్ళు రాసుకున్న లేఖ అని, దానికి కొన్ని మార్పులు చేసి, సంతకం చేసి, దాన్ని చంద్రాబాబుకి పంపించారని అంటున్నారు.. ఆ ఉత్తరంలో ఏమి ఉందో కూడా, చూడకుండా, జగన్ సంతకం చేసాడని అంటున్నారు.

జగన్ పాదయాత్ర పై స్పందిస్తూ, అన్న వస్తున్నాడని వైసిపి శ్రేణులు ప్రచారం చేస్తున్నారని, కానీ వచ్చేది మాత్రం అవినీతి అనకొండ అని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. ఓ విదేశీ యాత్ర చెయ్యటం , ఓ భేరీ పెట్టటం, ఓ ఉత్తరం రాయడం, ఇదే జగన్ చేసే పని అని ఎద్దేవా చేశారు. వర్షాలు పడకూడదని హైదరాబాద్‌లో కూర్చుని ఎహోమాలు చేసినా ఫలితం దక్కడం లేదన్నారు.

జగన్ పొరుగు రాష్ట్రాల్లో ఉంటూ, హైదరాబాద్, బెంగుళూరు తిరుగుతూ, అక్కడ పత్రికలు చూస్తూ ఏపీ ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని దేవినేని మండిపడ్డారు. హైదరాబాదులో ఉండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరమన్నారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత, అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం, కార్పొరేషన్ లు ఏర్పాటు చేసి, వారిని ఆదుకుంటున్నారు... అయితే ఈ కార్పొరేషన్ చైర్మన్ లు, ఎండిలు వారి సొంత ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తున్నారు...

బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, ఐవైఆర్ కృష్ణా రావు ఉదంతం అందిరికీ తెలిసిందే... ఇప్పుడు తాజాగా, కాపు కార్పోరేషన్ ఎండీ అమరేంద్ర పై అవినీతి ఆరోపణలు రావటంతో, చంద్రబాబు వెంటనే ఆయన్ను తప్పించి, మాతృశాఖ పశుసంవర్థకశాఖకు బదిలీ చేస్తూ బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బి.ఉదయలక్ష్మి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

అవినీతి ఆరోపణల కారణంగా ఆయన్ను మాతృశాఖకు పంపుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. ఎంతటి అవినీతి ఆరోపణలున్నా సాధారణంగా బదిలీ ఉత్తర్వుల్లో అవినీతి ఆరోపణలను కారణంగా చూపరు. కానీ అసాధారణంగా అమరేంద్ర బదిలీ ఉత్తర్వుల్లో అవినీతి ఆరోపణలను కారణంగా చూపడం ఆయన అవినీతి తీవ్రతను చాటుతోంది.

పేద కాపుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తే, కాపు కార్పొరేషన్‌కు దిశానిర్దేశం చేస్తూ నిధులు సద్వినియోగమయ్యేలా చూడాల్సిన వ్యక్తే అవినీతి అక్రమార్కుడిగా మారటంతో అందరూ అవాక్కయ్యారు...

పట్టించిన బయోమెట్రిక్‌ :
రెండేళ్ళ నుంచి అవినీతి చేస్తున్నా, పక్కగా దొరక్క పోవటంతో, ప్రభుత్వం చర్యలు తీసుకోవటానికి ఆలోచిస్తూ వస్తుంది.. ఈయన ప్రభుత్వ అధికారి కావటంతో, అన్నీ పక్కాగా ఉంటేనే చర్యలుకు వీలు ఉంటుంది... అయితే, విద్యోన్నతి పథకం కింద పేద కాపు విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా పలు ఇన్‌స్టిట్యూట్లను ఎంపిక చేశారు. గ్రూప్స్‌, సివిల్స్‌, బ్యాంకింగ్‌, ఇతర పోటీ పరీక్షలకు వాటి ద్వారా కోచింగ్‌ ఇప్పిస్తున్నారు. అసలు అభ్యర్థులు లేకపోయినా బయోమెట్రిక్‌ హాజరులో అక్రమాలకు పాల్పడి నిధులు స్వాహా చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. అసలు కోచింగ్‌ కోసం దరఖాస్తు చేసుకోనివారి పేర్లను కూడా కోచింగ్‌ తీసుకుంటున్న వారి జాబితాలో చేర్చారు.

ఇటీవల బీసీ సంక్షేమశాఖ కార్యదర్శిగా ఉదయలక్ష్మి బాధ్యతలు చేపట్టిన అనంతరం కాపు కార్పొరేషన్‌ ద్వారా కోచింగ్‌ తీసుకుంటున్న అభ్యర్థుల జాబితాలోని కొందరికి ఫోన్‌ చేసి మాట్లాడారు. కోచింగ్‌ ఎలా ఉందని వారిని ఆరా తీయగా... తాము ఎలాంటి కోచింగ్‌ తీసుకోవడం లేదని సమాధానం రావడంతో ఆమె కంగుతిన్నారు.

దీంతో, ప్రభుత్వం, కాపు కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌.అమరేంద్ర కుమార్‌ పై వేటు వేసి, ఎంక్వయిరీకి ఆదేశించింది...

జగన్ మోహన్ రెడ్డి కనుసన్నల్లో, లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ, రాంగోపాల్ వర్మ, సినిమా తీస్తున్న విషయం తెలిసిందే... దీనికి సంబంధించి, జగన్ బావ బ్రదర్ అనిల్ తో, రాంగోపాల్ వర్మ, పార్క్ హయత్ హోటల్ లో చర్చలు జరిపిన విషయం కూడా తెలిసిందే...

దీనికి సంబంధించి, తెలుగుదేశం పార్టీ నాయకులు ముందు లైట్ తీసుకున్నా, ఈ సినిమా వెనుక జగన్ ఉన్నాడు అనే విషయం అర్ధం చేసుకుని, విమర్సల దాడి మొదలు పెట్టారు...

మంత్రి జవహర్ ఆదివారం వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. షర్మిలను పెట్టి జగన్ 420 పేరుతో సినిమా తీయాలని, అలా చేస్తే డబ్బులు కూడా మేమే ఇస్తామని వ్యాఖ్యలు చేశారు.

ఎప్పుడూ మాట తప్పను, మడమ తిప్పను అంటూ జగన్ చెబుతుంటారని, అదంతా ఓ మాయ అని జవహర్ విమర్శించారు. పాదయాత్రను ఎందుకు చేయబోతున్నారో జగన్ కే స్పష్టతలేదని మంత్రి జవహర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన చేయబోయేది పాదయాత్ర కాదని... పాపపరిహార యాత్ర అని తెలిపారు. ఎప్పుడూ ఏదో ఒక అలజడి సృష్టించే జగన్... పాదయాత్ర సందర్భంగా ఎలాంటి అల్లర్లను ప్రేరేపిస్తారో అని అనుమానం వ్యక్తం చేశారు.

రాజశేఖర్ రెడ్డి, జగన్ కలిసి రాష్ట్రాన్ని ఎలా దోచుకుంది, సినిమా తీస్తే సూపర్ హిట్ అవుతుంది అని, తెలుగుదేశం నాయకులు అంటున్నారు...

Advertisements

Latest Articles

Most Read