ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు వేరు, ఇప్పటి చంద్రబాబు వేరు... అప్పుడు ఎలాంటి ఎమోషన్స్ కు అస్సలు లోనయ్యేవారు కాదు... కాని ఇప్పుడు పూర్తిగా భిన్నం... వయసుతో పాటు వచ్చిన సున్నితత్వమో, లేక చంద్రబాబు చెప్ప్తున్నట్టు 2012లో చేసిన పాదయత్ర అనుభవమో కాని, ప్రజలకు కష్టం ఉంది అని తెలిస్తే చాలు, వారికి సహాయం చేస్తున్నారు... ప్రజలు ఏ సమస్య ఉంది అన్నా, సియం రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బులు ఇచ్చి ఆదుకుంటున్నారు.

cbn baby health 18102017 2

తాజాగా చంద్రబాబుకి ఒక వింత అనుభవం ఎదురైంది... సహాయం పొందిన వాళ్ళు, చాలా మంది తరువాత మర్చిపోతారు... చాలా కొంత మందే కృతజ్ఞత చూపిస్తారు... నిన్న విశాఖ పర్యటనలో ఉన్న చంద్రబాబుని, శ్రీకాకుళం జిల్లా రాజాం సమీపంలోని వావిలవలసకి చెందిన పాలూరి సిద్ధార్థ దంపతులు కలిసారు. తన భార్య సుధారాణికి జబ్బు చేసినప్పుడు, చంద్రబాబు చేసిన సాహయం గుర్తు చేసి, తన భార్య కోలుకునేందుకు ఆర్థికంగా చేయూతనందించిన చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతగా, చంద్రబాబు తండ్రి ఖర్జూరనాయుడి పేరుని తన బిడ్డకు పెట్టుకున్నాని, ముఖ్యమంత్రికి చెప్పాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏంతో సంతోషంతో ఆ బిడ్డను దగ్గరకు తీసుకుని ఆశీర్వదించారు..

cbn baby health 18102017 3

పాలూరి సిద్ధార్థ భార్య, సుధారాణి జన్మనిచ్చిన తొలిబిడ్డ పురిట్లోనే చనిపోయింది. ఆ సమయంలో గర్భసంచి జారి చిల్లుపడిందని. అది సరిచెయ్యాలి అంటే, ఖరీదైన వైద్యం చెయ్యాలి అని వైద్యులు చెప్పారు. అంత స్తోమత లేని సిద్ధార్థ, ముఖ్యమంత్రిని కలిసి గోడు వెళ్లబోసుకున్నాడు. చంద్రబాబు వెంటంటే, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆరు లక్షలు విడుదల చేసి, సిద్ధార్థ భార్యకి వైద్యం చేయించారు. ఈ క్రమంలో ఆమె 40 రోజుల క్రితం మగబిడ్డకి జన్మనిచ్చింది. తమకు ఇంత ఆనందాన్ని అందించిన తమ నాయకుడుకి కృతజ్ఞతగా.. చంద్రబాబు తండ్రి పేరు బిడ్డకు పెట్టుకున్నారు.

ఇక్కడ మనందరం, దీపావళి పండుగ హడావిడిలో ఉన్నాం... మన కుటుంబ సభ్యులతో కలిసి, షాపింగ్ చేస్తున్నాం, స్వీట్లు కొంటున్నాం, టపాసులు కొంటున్నాం... పూర్తి పండుగ వాతావరణంలో ఉన్నాం... కాని, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, మన రాష్ట్రంలో పెట్టుబడులు కోసం చికాగో పర్యటనకు బయలుదేరి వెళ్లారు... వెళ్ళగానే ఫ్రెష్ అయ్యి, జెట్ లాగ్ కూడా లేకుండా పనిలోకి దిగిపోయారు... నిన్న అమరావతి, వైజాగ్, నాగపూర్, ఢిల్లీ, నుంచి చికాగో చేరుకున్నారు... ఇంత బిజీ షడ్యుల్ లోనూ, ఆయన విశ్రాంతి తీసుకోకుండా, వెంటనే పని మొదలు పెట్టారు..

cbn 18102017 2

చికాగో చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు బృందానికి అక్కడి, తెలుగు వారు ఘన స్వాగతం పలికారు. ఈ రాత్రి 8:30 గంటలకు (IST) G-TEN సభ్యులతో జరిపే సమావేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈ రాత్రి 9 గంటలకు (IST) ఐటీ సంస్థలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. గ్లోబల్ తెలుగు ఎంటర్ ప్రెన్యూర్స్ నెట్వర్క్ (జీ టెన్) పేరుతో విదేశాల్లోని తెలుగువారి ఉన్నతికి క్రుషి చేస్తుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాత్రి 10 గంటలకు (IST) ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం డెమోయిన్స్ పయనం అవుతుంది.

cbn 18102017 3

ఈ రాత్రి ఒంటిగంటకు (IST) ఐయోవా స్టేట్ యూనివర్సిటీ సందర్శన. రాత్రి 1:30కు (IST) వర్చువల్ రియాల్టీ అప్లికేషన్ సెంటర్ సందర్శన. రాత్రి 2:30కు (IST) ISU రీసెర్చ్ పార్కులో రౌండ్ టేబుల్ సమావేశం. స్టేటస్ రిపోర్ట్, నాలెడ్జ్ కన్సార్టియం. తెల్లవారుజాము 5:20కు (IST) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఐయోవా గవర్నర్ విందు. ఆ తరువాత.. కర్నూలు జిల్లాలో నిర్మిస్తున్న మెగా సీడ్ పార్కు ప్రాజెక్టుపై 350 మందితో స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ వర్క్‌షాప్, టాప్ సైంటిస్టులు, సీడ్ కంపెనీలు, అగ్రీ కంపెనీల ప్రతినిధులతో కర్నూలు సీడ్‌పార్కుపై ప్రెసెంటేషన్ ఇస్తారు. ఇలా మొదటి రోజు పర్యటన ముగియనుంది.

ఎప్పుడైనా అక్రమాలు చేసినావారు దొరక్క మానరు... కొంచెం లేట్ అవుతుంది అంతే... ఎంత మందిని మ్యానేజ్ చేసినా, నిజం ఎదో ఒక రోజు బయటపడుతుంది... వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసు విషయంలో అదే జరిగింది...

నాలుగేళ్ల కిందట జగన్ కి బెయిల్ ఇచ్చే విషయంలో, చేసిన ఒక తప్పును సీబీఐ ఇప్పుడు సరిదిద్దుకుంది. జగన్ అప్పటికే జైలులో 16 నెలలు ఉన్నారు... అయితే జగన్ బెయిల్ పిటీషన్ పై, ఆ రోజు, అంటే 2013 సెప్టెంబరు 23న సీబీఐ కోర్టులో వేసిన ఒక పిటీషన్ వేసింది. కేసు దర్యాప్తు పూర్తయిందని, సండూర్‌ పవర్‌ లిమిటెడ్‌, కార్మెల్‌ ఏషియా హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తదితర ఎనిమిది కంపెనీలకు క్విడ్‌ప్రోకో ఏమి లేదు అని ఆ మెమోలో పేర్కొంది.

అప్పట్లో ఇది ఒక సంచలనం అయింది... ఎవరి ప్రయోజనాల కోసం ఆ రోజు సిబిఐ ఇలా వ్యవహిరించిందో కాని, అప్పుడు జగన్ బెయిల్ కోసం, కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీతో లాలూచి పడ్డాడు అనే ఆరోపణలు వచ్చాయి.. కాని, జగన్ ప్రధన కంపనీలలో, సండూర్‌ పవర్‌ లిమిటెడ్‌, కార్మెల్‌ ఏషియా హోల్డింగ్స్‌ ప్రధాన కంపనీలు...ఇలాంటి కంపనీలలో ఆ రోజు, ఏమి అక్రమం లేదు అని సిబిఐ మేమో దాఖలు చేసి, జగన్ కు బెయిల్ ఇప్పించింది..

అయితే ఎవారు ఊహించని విధంగా, సీబీఐ ఈ ఏడాది ఆగస్టులో సీబీఐ కోర్టులో మరో మెమో దాఖలు చేసినట్లు తాజాగా బయటకు వచ్చింది. సండూర్‌ పవర్‌, కార్మెల్‌ ఏషియాతో కలసి ఆదాయపు పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, కంపెనీల రిజిస్ట్రార్‌ల పరిధులకు సంబంధించిన వివిధ ఉల్లంఘలకు పాల్పడిందని సిబిఐ కోర్ట్ కి తెలిపింది.

రాష్ట్రపతి ఎన్నికలు ముగిసిన వెంటనే, సిబిఐ ఇలా చెయ్యటం, ఇప్పుడు వెలుగులోకి వచ్చింది... అందుకే గత రెండు నెలలు నుంచి, జగన్ మోహన్ రెడ్డి టెన్షన్ తో ఉన్నారని, సిబిఐ తీసేసిన అభియోగాలు, మళ్ళీ ఆధారాలుతో సహా కోర్ట్ కి ఇవ్వటంతో, జగన్ లో వణుకు మొదలై, కేంద్రాన్ని ప్రసన్నం చేసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.

ఇవన్నీ చూసుకుంటే, జగన్ కేసు తీవ్రత రోజు రోజుకీ ఎక్కవు అవుతుంది.. పాదయాత్రకు శుక్రువారం మినహియింపు ఇచ్చే అవకాశం కూడా లేదు అని స్పష్టం అవుతుంది... కేసులు కూడా స్పీడ్ అందుకునే అవకాశం ఉండటంతో, జగన్ లో ఆందోళన మొదలైంది అని లోటస్ పాండ్ వర్గాలు అంటున్నాయి..

ఇది చూసి ఎదో ఊహించుకునేరు... కాదండి... మన ప్రతిపక్ష నాయకుడు ఆకాంక్ష మరో సారి బయటపెట్టాడు... నేనే సియం, నేనే సియం అనే ఊపులో ఉన్నాడు కదా... ఇప్పుడు కొంచెం ట్రెండ్ మార్చి, నేను ముఖ్యమంత్రి అవ్వాలి అని ప్రార్ధించండి అని ప్రజలకు పిలుపు ఇచ్చాడు.. సారీ,, మాములుగా ప్రార్ధించటం కాదు, గెట్టిగా ప్రార్ధించాలి అంట... అసలు ఎందుకు ప్రార్ధించాలో కూడా చెప్పాడు... మీకు 45 ఏళ్ళు వస్తే చాలు, మీరు ఏ పనీ చేయనక్కర్లేదు... ఇంట్లోనే కూర్చోండి, నేను పెన్షన్ ఇస్తా.. మీ ఇంటికి తీసుకువచ్చి ఇస్తా... దానికి మీరు చెయ్యల్సిందిల్లా నేను సిఎం కావాలని గట్టిగా దేవుడ్ని ప్రార్ధించండి చాలు" అంటూ మన ప్రతి పక్ష నాయకుడు నిన్న అనంతపురంలో పిలుపిచ్చారు.

jagan 18 10 2017 2

అంతే కాదు, తనని తాను ఒక మంచి అన్నయ్యగా చెప్పుకుంటూ, ఏడాదిలో మన ప్రభుత్వం వస్తుంది , ఓ మంచి అన్నయ్య మీ ముందు ముఖ్యమంత్రిగా ఉంటాడని ప్రకటించేసాడు. ఒక పక్క రైతు రుణ మాఫీ, ప్రతి ప్రాజెక్ట్ లో నీళ్ళు, పచ్చని పైరులతో రాష్ట్రం కళకళలాడుతుంటే, చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు దాటినా ఒక్క రైతుకు, నేతన్నకు మేలు జరగలేదంటున్నాడు.

jagan 18 10 2017 3

ప్రపంచంలో ఏ దేశంలో అయినా 60 ఏళ్ళు దాటితే వృద్ధులు అని లెక్క గట్టి, వారికి పెన్షన్ ఇస్తూ ఉంటారు... మన ప్రతిపక్ష నాయకుడు మాత్రం, తాను ముఖ్యమంత్రి అవ్వటానికి, ఒక అద్భుతమైన హామీ ఇచ్చి, ప్రజల చెవిలో పువ్వు పెట్టారు... బడుగు బలహీన వర్గాల ప్రజలకు 45 ఏళ్ళు వస్తే చాలు అంట, పెన్షన్ ఇస్తారంట.. ప్రజలు తమ కాళ్ళ మీద తాము నిలబడడానికి, గర్వంగా బ్రతకడానికి తీసుకోవలసిన చర్యలేమిటో, ముఖ్యావసరలైన విద్య, వైద్యం, ఉపాధి కల్పించడానికి చేయాల్సిన వ్యవస్థల నిర్మాణం ఏమిటో ఇప్పటి వరకు ఈయన ఎక్కడా చెప్పలేదు.. మన రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం గురించి ఎక్కడా చెప్పలేదు.. ఎంత సేపు, ఉచిత హామీలతో, ప్రజలను మభ్యపెట్టి, ఓట్లు కోసం, కుర్చీ కోసం ఆరాటమే..

Advertisements

Latest Articles

Most Read