వర్చ్యువల్ రియాలిటీ, ఇంటర్నెట్ అఫ్ థింగ్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ... ఇవన్నీ మాట్లాడుతుంది, ఈ టెక్నాలజీలు వాడుతుంది, ఏ మైక్రోసాఫ్ట్, గూగులో అనుకునేరు... ఇవన్నీ మాట్లాడుతుంది, ఇంప్లిమెంట్ చేస్తుంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి... మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు... టెక్నాలజీ పట్ల, ఆయనకు ఉన్న అవగాహన, టెక్నాలజీ ఉపయోగించుకుని సమర్ధవంతమైన పరిపాలన చెయ్యటం, టెక్నాలజీతో ఉద్యోగాల కల్పన ఇవన్నీ చూశాం... ఇప్పుడు మరో సరి కొత్త టెక్నాలజీ కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు... అమెరికా పర్యటనలో దాని మీద అవగాహన చేసుకుంటున్నారు..

cbn vr 19102017 2

VR , అంటే Virtual Reality ఈ మధ్య కాలం లో చాలా పేరు పొందింది. మొట్టమొదట, గూగుల్, “cardboard” అనే పరికరం తో ముందుకు వచ్చింది. ఇది ఒక అట్టపెట్టితో చెయ్యబడిన ఒక చిన్న పరికరం, ఇందులో మీరు మీ ఫోన్ ను ఇన్సర్ట్ చేసి, configure చేసుకుంటే చాలు, 360 డిగ్రీల కోణంలో ఈ ప్రపంచాన్ని నిజమైన అనుభూతి పొందవచ్చు. దీనినే VR headset అంటారు. ప్రపంచ నలు మూలలా ఆధునికమైన కెమెరాలతో చిత్రీకరింపబడిన వీడియోస్ VR లో చూస్తే ఆ లోకమే వేరు అనిపిస్తుంది. అనుకున్న దానికన్నా ఈ VR తక్కువగా పరచారం లోకి వచ్చినా, భవిష్యత్తు మొత్తం VR ఆధారంగా టెక్నాలజీ ఉంటుందనటం లో ఏ మాత్రం సందేహం లేదు.

cbn vr 19102017 3

ఇంకా క్లియర్ గా అర్ధం అయ్యేలా చెప్పాలి అంటే, బాహుబలి సినిమా గురించి చెప్పుకోవాలి... VR సినిమా లెవల్ లో వెళ్ళటం ఎక్కడ లేదు, హాలీవుడ్ కూడా ఇంకా మొదలుపెట్టలేదు. అలాంటింది, బాహుబలి సినిమా ద్వారా ప్రపంచానికి VR ను ప్రవేశపెట్టాడు మన “జక్కన్న”. బాహుబలి VR ను ముంబై లో జరిగిన “MAMI” ఫిలిం ఫెస్టివల్ లో ప్రవేశపెట్టారు . బాహుబలి VR ఎక్స్పీరియన్స్ కోసం బాహుబలి కోసం తయారు చేసిన ప్రత్యేకమైన VR headset ను జక్కన్న అండ్ టీమ్ రీలీజ్ చేశారు. అయితే ఈ "వర్చ్యువల్ రియాలిటీ", ఎంటర్టైన్మెంట్ విషయంలోనే కాదు, హెల్త్, ఎడ్యుకేషన్, ఫార్మింగ్, వాటర్ రిసోర్సెస్ ఇలా ఇన్నిట్లో ఇప్పుడిప్పుడే ఈ టెక్నాలజీ వాడుతున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఈ "వర్చ్యువల్ రియాలిటీ" టెక్నాలజీ మీద జరిగిన వర్క్ షాప్ లో పాల్గున్నారు... ఈ VR అనేక విధాలుగా రూపాంతరాలు చెందుతూనే ఉంది, ఇది ఖచ్చితంగా ఫ్యూచర్ లో మారబోయే రియాలిటీ అనే అనాలి.

ఒక చిన్న ఉదాహరణతో మొదలు పెడదాం... పొద్దున్న అమరావతిలో ఉన్నారు, అనేక రివ్యూలు జరిపారు... మధ్యనానికి వైజాగ్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు... సాయంత్రం అందప్రదేశ్ ప్రజల జీవనాడి కోసం నాగపూర్ వెళ్లారు... రాత్రికి విదేశీ పర్యటన నిమిత్తం ఢిల్లీ చేరుకున్నారు... మరుసటి రోజు సాయంత్రానికి అమెరికా చేరుకున్నారు... ఇలాంటి షడ్యుల్ ఒక 68 ఏళ్ళ మనిషి, మన రాష్ట్రం కోసం కష్టపడుతున్నాడు అంటే నమ్మగలరా... మన ఇంట్లో ఆ వయసు వారు, ఎంత రిలాక్స్డ్ గా రిటైర్డ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారో చూస్తున్నాంగా... మన ఇంట్లో పెద్ద వాళ్ళు దాకా ఎందుకు, మనం అంత ఫిట్నెస్ గా ఉండగలమా ?

cbn lunch usa 2

ముఖ్యమంత్రి చంద్రబాబు అంతలా ఈ వయసులో కష్టపడ్తున్నారు అంటే, అది ఆయన క్రమశిక్షణతో వచ్చిన ఫిట్నెస్... పొద్దున్నే యోగా, వ్యాయామం కాని, ఆయన తినే డైట్ కాని, అంతా బ్యాలన్సుడ్ గా ఉంటుంది... ఎక్కడా టెంప్ట్ అవ్వరు... ఆయన పట్టుమని తినేది ఒక ముద్ద, కానీ కండిషనల్ గా ఉంటుంది. ఏదైనా ఎక్కువేమీ తినరు ఒకటీ అరా అంతే.. ఆయన భోజనం, మామూలుగా మనం తినే స్నాక్స్ తో సమానం అన్నట్టుఉంటుంది. చంద్రబాబు కొద్ది రోజుల క్రిందట, తాను ఎంత బ్యాలన్సుడ్ డైట్ తీసుకునేది మీడియాతో పంచుకున్నారు... ఉదయం టిఫిన్ జొన్న ఇడ్లీ లేక ఉప్మా లేక రెండు దోసెలు తీసుకుంటారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌కు,మధ్యాహ్నంలంచ్ కు మధ్యలో పలురకాల ఫ్రూట్ లు తీసుకుంటారు. మధ్యాహ్నం లంచ్‌కి ... రాగులు, జొన్నలు, సజ్జలు, కూరగాయలు కొద్దిగా పెరుగన్నం తీసుకుంటున్నట్లు చెప్పారు.

cbn lunch usa 3

అయితే విదేశీ టూర్లలో కూడా చంద్రబాబు మెనూ మారదు... చైనా, రష్యా, లండన్, అమెరికా ఎక్కడకి వెళ్ళినా అదే క్రమశిక్షణ.. తాజగా అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబు, చికాగోలో పర్యటిస్తున్నారు... ఆయన లంచ్ చేస్తూ, చర్చలు జరుపుతున్న ఫోటోలు బయటకి వచ్చాయి... కొన్ని ఫ్రూట్స్, ఉప్మా, రాగి ముద్ద... అంతే ఇదే ఆయన మెనూ... ఎన్నో మీటింగ్స్ ఉన్నాయి, అందునా మొదటి రోజు పర్యటన, వాతవరణం అలవాటు పడాలి.. సో, ఆయన ఎక్కడా టెంప్ట్ అవ్వకుండా, ఫిట్ గా ఉండి, పెట్టుబడిదారుల దగ్గర, కాన్ఫిడెంట్ గా ప్రెసెంట్ చేస్తున్నారు... చంద్రబాబు ఎంత క్రమశిక్షణగా ఉంటారో అందరికీ తెలిసినా, మొదటిసారి ఆయన్ను దగ్గర నుంచి చూసినవారు, ఆయన కమిట్మెంట్, క్రమశిక్షణ చూసి, అభినందిస్తున్నారు..

రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ఢిల్లీ నుంచి అమెరికా బయలుదేరి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బృందం బుధవారం సాయంత్రం భారత కాలమానం ప్రకారం గం.6.25 ని.లకు షికాగో చేరుకున్నప్పుడు తెలుగు సంఘాల నుంచి ఘనస్వాగతం లభించింది. ముందుగా అమెరికాకు చెందిన జిటన్ సహా 80 ఐటీ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. తరువాత చికాగో స్టేట్ యూనివర్శిటీ ప్రతినిధులతో సమావేశం అయ్యారు.

cbn usa 19102017 2

ముఖ్యమంత్రి చంద్రబాబుతో చికాగో స్టేట్ యూనివర్శిటీ చైర్మన్, డిపార్టుమెంట్ ఆఫ్ మేథమెటిక్స్ అండ్ కాంప్యూటర్ సైన్సస్ ప్రొఫెసర్ రోహన్ అత్తెలె సమావేశమయ్యారు. యూనివర్శిటీ 150వ వార్షికోత్సవం సందర్భంగా వచ్చే ఏడాది మే నెలలో జరగనున్న గ్రాడ్యుయేషన్ సెర్మనీ (స్నాతకోత్సవం) లో పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించారు. డైనమిక్ సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్‌లో తమకున్న అనుభవం, ప్రావీణ్యాన్ని ఏపీలోని విశ్వవిద్యాలయాలకు అందిస్తామని ప్రొఫెసర్ రోహన్ ప్రతిపాదించారు.

cbn usa 19102017  3

చంద్రబాబును కలసిన తానా ప్రతినిధులు: అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును తానా ప్రతినిధులు కలుసుకున్నారు . అమెరికాలో 20 నగరాలలో 5కె రన్ నిర్వహిస్తున్నట్లు తానా ప్రతినిధులు తెలిపారు. 5కె రన్ కార్యక్రమాల ద్వారా వచ్చిన ఆదాయంతో ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రికి వివరించారు. 2 మిలియన్ డాలర్లతో అమరావతిలో తానా భవన్ నిర్మించేందుకు తానా ఆసక్తి. అందుకు అవసరమైన స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును తానా ప్రతినిధులు అభ్యర్ధించారు. ప్రతిపాదనలు పంపితే పరిశీలిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీఇచ్చారు.

అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, అలాగే మన రాష్ట్రానికి చికాగో ఎన్నారైలు దీపావళి గిఫ్ట్ ఇచ్చారు. ఐటీ పరిశ్రమలు ఆంధ్రావనికి వెల్లువెత్తనున్నాయి. అమెరికా నుంచి రానున్న ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్ కు 500 సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. చంద్రబాబు పర్యటనలో భాగంగా, ముందుగా అమెరికాకు చెందిన జిటన్ సహా 80 ఐటీ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. వీరిలో అత్యధికులు తెలుగువారు. ఐటి సిటీ పై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఐటీ టాస్కుఫోర్స్ చైర్మన్ గారపాటి ప్రసాద్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.

chicagao it 19102017 2

విశాఖ నగరాన్ని మెగా ఐటీ సిటీగా, అమరావతి నగరాన్ని మేజర్ ఐటీ హబ్‌గా మార్చేందుకు ప్రతిపాదించారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఐటి పరిశ్రమల స్థాపనకు 450 నుంచి 500 మంది ప్రవాస భారతీయులు ఆసక్తిచూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలితో (ఇడిబి) తో 100 అవగాహన ఒప్పందాలకు సంసిద్ధత తెలిపారు. రాష్ట్రంలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో తమ సంస్థలను నెలకొల్పడానికి 60 కంపెనీలు వెనువెంటనే విశాఖలో కార్యాలయాలు తెరిచేందుకు ముందుకొచ్చాయి. ఈ ఐటి కంపెనీల ద్వారా 8వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, 20 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

chicagao it 19102017 3

వచ్చే 12 మాసాలలో విజయవాడ, విశాఖపట్నం నగరాలలో ఐటీ సంస్థలు కొలువు తీరనున్నాయి. ఏడాదిలోగా ఈ ఐటీ సంస్థలకు అవసరమైన కార్యాలయ వసతిని ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నద్ధత వ్యక్తం చేసింది. ఒకనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలకోసం న్యూయార్కులో ఫైలు పట్టుకుని సీఈఓలా తిరిగిన రోజులు అక్కడి తెలుగువారి స్మృతి పథంలో మెదిలాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బృందంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు డా. పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి సాయి ప్రసాద్, ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణ కిషోర్, ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శ తదితరులున్నారు.

Advertisements

Latest Articles

Most Read