టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) కల్యాణ మండపాలను ప్రైవేట్ పరం చేయడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ తెలిపారు. సోమవారం ఆయ విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! సామాన్యులు శుభకార్యాలు, ఇతరత్రా పవిత్రమైన క్రతువులు నిర్వహించుకోవడానికి వారికి రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్నది టీటీడీ కల్యాణ మండపాలే. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 177వరకు ఉన్న కల్యాణ మండపాలను ప్రైవేట్ పరం చేస్తే, వాటి అద్దెలు, ఇతరత్రా నిర్వహణ ఛార్జీలు పేదలు, సామాన్యులు భరించగలరా? లక్షలాది రూపాయలను చెల్లించగలరా? టీటీడీ కల్యాణ మండపాలు శిథిలావస్థకు చేరడానికి కారుకులెవరో , కారణాలేమిటో తిరుమల తిరుపతి దేవస్థానం వారికి తెలియదా? కల్యాణ మండపాలను ప్రైవేట్ పరం చేస్తే, వాటిని దక్కించుకున్నవారు వాటిని సరిగా నిర్వహిస్తారా అనే ప్రశ్నకు టీటీడీఏం సమాధానం చెబుతుంది. మద్యం, మాంసాలకు తావులేకుండా కల్యాణ మండపాలను ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తారనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. డబ్బుల కోసం విచ్చలవిడిగా కల్యాణ మండపాలను నిర్వహిస్తే, తిరుమలేశుడి పవిత్రత దెబ్బతినదా అని ప్రశ్నిస్తున్నాం. కల్యాణ మండపాలను బాగు చేయడానికి, వాటిని సమర్థంగా నిర్వహించడానికి టీటీడీ వద్ద డబ్బులులేవా..లేక నిర్వహణకు అవసరమైన సిబ్బందిలేరా అని ప్రశ్నిస్తున్నాం. వై.వీ.సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ అయినప్పటినుంచీ ఇటువంటి ఆలోచనలే చేస్తున్నారు. గతంలోనేమో తమిళనాడులోని స్వామి వారి భూములను తెగనమ్మడానికి ప్రయత్నించారు. హిందూ ధార్మిక సంస్థలు, భక్తులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో సదరు నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఇప్పుడే మో కల్యాణ మండపాల ప్రైవేటీకరణ అంటున్నారు. స్వామివారి ఆస్తులు, టీటీడీ ఆస్తులను కాపాడలేని వారికి పదవులెందుకని ప్రశ్నిస్తున్నాం. ఆ పనిచేయడం చేతగానివారు తక్షణమే తమ పదవుల నుంచి దిగిపోతే, కాపాడగలిగేవారే పదవిలోకి వస్తారు. కోట్లాదిమంది హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సుబ్బారెడ్డి నిర్ణయాలున్నాయి. టోల్ గేట్ ధరలు పెంచారు... భక్తుల గదుల అద్డెలు పెంచారు... లడ్డూప్రసాదం ధరలు పెంచారు. ఇవేనా నిర్ణయాలు. భక్తులు స్వామివారికి విరివిగా సమర్పించిన కోట్లాది రూపాయల సొమ్ము, బ్యాంకుల్లోఉంది.
దానిపై వచ్చే వడ్డీతో స్వామి వారి ఆస్తులను కాపాడవచ్చు.. నిర్వహించవచ్చు. ఆపని కూడా చేయడం ఇప్పుడున్న పాలకమండలికి చేతగావడం లేదు. ఆఖరి కి వై.వీ.సుబ్బారెడ్డి తిరుమల దర్శనానికి వచ్చే భక్తులకు ఉచితంగా అందించే అన్నప్రసాదానికి కూడా ఖరీదు కట్టాలని చూశారు. ఉచితంగా భక్తుల కడుపు నింపితే తమకేం వస్తుందని భావించారేమో గానీ, దానికి కూడా నిర్ణీత రుసుముని నిర్ణయించాలని చూశారు. దానిపై పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో అబ్బెబ్బే అలాంటిదేమీ లేదని సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. భక్తుల కడుపు నింపే అన్న ప్రసాదానికి కూడా మంగళం పాడాల ని చూస్తారా? సేంద్రీయ పదార్థాలతో వండిన ఆహారాన్నే తాము భక్తులకు అందిస్తామని, దానికే ఖరీదు కడతామని చెప్పుకోవడం సిగ్గుచేటు. స్వామి వారి సన్నిధికి వచ్చే వారి కడుపు నింపడం కోసం స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు ఉచిత అన్నప్రసాద పంపిణీకి శ్రీకారం చుట్టారు. తిరుమల తిరుపతి కేంద్రాన్ని వ్యాపార కేంద్రంగా మార్చడమే సుబ్బారెడ్డి అంతిమలక్ష్యమా? తిరుమల కొండపైన దాదాపు 36 వరకు మఠాలున్నా యి. ఆయా మఠాలపై పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు చేసుకునే వెసులుబా టు భక్తులకుంది. అలాంటి మఠాలను, టీటీడీకల్యాణ మండపాలను ప్రైవే ట్ పరం చేస్తే, ప్రైవేట్ వ్యక్తులు అన్ని పనులకు గంపగుత్తగా భక్తుల నుంచి డబ్బులు వసూలు చేయరా? టీటీడీ కల్యాణమండపాలు మ్యారేజ్ కాంట్రాక్టర్ల పరమైతే, స్వామివారి పవిత్రత మంటగలవదా? పాలక మండలి లేని సమయంలో వై.వీ.సుబ్బారెడ్డి ఇలాంటి పనికిమాలిన నిర్ణయాలు తీసుకో వాలని చూడటం దుర్మార్గం.