ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గత కొద్ది రోజులుగా సిబిఐ కోర్టు చుట్టూ తిరుగుతున్నాయి. జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో, బెయిల్ పై బయట ఉన్న జగన్, విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అంటూ, రఘురామరాజు పిటీషన్ వేయటం, దాని పై విచారణ జరగటం, నిన్న మొత్తం, దీని మీద టెన్షన్ వాతావరణం ఉండటం, చివరకు సిబిఐ కోర్టు, ఈ కేసు తీర్పుని వచ్చే నెల 15కు వాయిదా వేసింది. ఇది ఇలా ఉంటే, విజయసాయి రెడ్డికి, ఈ రోజు సిబిఐ కోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. సిబిఐ కోర్టులో నెల రోజులు క్రితం, విజయసాయి రెడ్డి ఒక పిటీషన్ వేసారు. తనకు విదేశాలు వెళ్లేందుకు పర్మిషన్ కావాలని కోరారు. విజయసాయి రెడ్డి బెయిల్ పై ఉండటం, బెయిల్ కండీషన్లో విదేశాలకు వెళ్ళకూడదు అని ఉండటంతో, కోర్టు పర్మిషన్ తీసుకునే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ నేపధ్యంలోనే విజయసాయి రెడ్డి కోర్టులో ఒక పిటీషన్ వేసారు. తనకు విదేశాలకు వెళ్ళటానికి కోర్టు అనుమతి కోరారు. అయితే గత నెల రోజులుగా ఈ విషయం నానుతూ ఉండటంతో, ఈ విషయంలో విజయసాయి రెడ్డికి రిలీఫ్ వస్తుందో లేదో అని అందరూ అనుకున్నారు. ఈ నేపధ్యంలోనే, ఈ రోజు ఈ పిటీషన్ పై తీర్పు వచ్చింది. ఈ రోజు తీర్పు ఇచ్చిన సిబిఐ కోర్టు, విజయసాయి రెడ్డికి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇస్తూ, కండీషన్స్ కూడా పెట్టింది.

vsreddy 296082021 2

విజయసాయి రెడ్డికి రెండు వారాల పాటు విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. అక్టోబర్ నెలలో రెండు వారాల పాటు విజయసాయి రెడ్డి విదేశీ పర్యటన చేయనున్నారు. దీనికి కోర్టు అనుమతి ఇచ్చింది. ముఖ్యంగా విజయసాయి రెడ్డి దుబాయ్, బాలి, మాల్దీవులకు వెళ్తానని సిబిఐ కోర్టుని కోరారు. తీరప్రాంతాల అభివృద్ధిపై, అక్కడ స్థితిగతుల పై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి, కోర్టు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనికి అనుమత ఇచ్చిన సిబిఐ కోర్టు, రూ.5 లక్షల పూచీకత్తుతో పాటుగా, మరో ఇద్దరి పూచీకత్తులు కూడా సమర్పించాలి అంటూ, కండీషన్స్ పెట్టి, విజయసాయి రెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది. మొత్తం మీద నిన్న మొత్తం టెన్షన్ పడిన వైసీపీ, ఈ రోజు ఈ ఆదేశాలతో బిగ్ రిలీఫ్ పొందారు. ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ రోజు నుంచి అయుదు రోజుల పాటు, హోలిడిలో ఉన్నారు. విదేశాలకు వెళ్తారని అనుకున్నా, ఆయన భారత దేసంలోనే వివిధ రాష్ట్రాల్లో హాలిడే ఎంజోయ్ చేస్తారని తెలిసింది. మొత్తానికి వైసీపీ టాప్ బాసులు హోలిడి మూడ్ లో ఉన్నారు.

కేసీఆర్ అంటేనే తీయని మాటలు చెప్పటం, చివరకు చేతులు ఎత్తేయటం, ఆయన మార్క్ రాజకీయం అలాగే ఉంటుంది. తన అనుకూలత కోసం వాడుకుంటారు, సేఫ్ జోన్ లో ఉన్నాం అనుకున్న సమయంలో, మధ్య దారిలో వదిలేస్తారు. కేసీఆర్ ను నమ్మిన ఎవరికైనా ఎదురయ్యే అనుభవమే ఇది. చంద్రబాబుని అలాగే చేసారు. సోనియా గాంధీ తెలంగాణా ఇస్తే పార్టీని విలీనం చేస్తాం అన్నారు, చివరకు అదే కాంగ్రెస్ పార్టీని తెలంగాణాలో లేకుండా చేయటానికి, బీజేపీతో కలిసి ప్రయత్నాలు చేస్తున్నారు. దళితుడిని తెలంగాణా మొదటి ముఖ్యమంత్రి చేస్తానన్నారు. ఇక హామీలు అయితే, ప్రతిదీ తల న-రు-క్కుం-టా అంటూ హామీలు ఇచ్చి, చివరకు అది చేసే వారు కాదు. ఇక ఆలె నరేంద్ర, విజయశాంతి, నిన్నటి ఈటేలె వరకు అందరూ కేసీఆర్ ని నమ్మి, బొక్క బోర్లా పడిన వాళ్ళే. ఇదే కోవలో ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కూడా చేరిపోయారు. కేసీఆర్ తనకు ఎన్నికల్లో సహకరించి, చంద్రబాబుని ఓడించారనే ఉత్సాహంలో, కేసీఆర్ తో విందులు, కౌగలింతలు, విజయసాయి కాళ్ళ మీద పడటాలు, ఇలా అనేక సీన్లు చూసాం. ఇవి ఇక్కడ వరకు అయితే పరవాలేదు కానీ, గోదావరి నీటిని వాడుకే విషయంలో, కేసిఆర్ ఈజ్ మ్యగ్నానిమస్, నీకు ఏమి తెలియదు కూర్చో అంటూ చంద్రబాబుని హేళన చేసిన జగన్ కు, ఇప్పుడు కేసీఆర్ మార్క్ షాక్ తగిలింది.

jagankcr 26082021 2

జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే స్టీఫన్ రవీంద్రను, ఏపి ఇంటలిజెన్స్ చీఫ్ ని చేయాలని అనుకున్నారు. ఆయన తెలంగాణా క్యాడర్ లో ఉండటంతో, ముందు కేసీఆర్ సమ్మతి అడిగి, కేసీఆర్ ఒప్పుకోగానే, కేంద్రంలో లాబీ మొదలు పెట్టారు. శ్రీలక్ష్మిని పంపించే సమయంలో, కేంద్రం కూడా ఒప్పుకుందనే వార్తలు వచ్చాయి. కేసీఆర్ కూడా ఈ రెండేళ్ళ నుంచి, స్టీఫెన్ రవీంద్రకు పెద్ద పదవి ఇవ్వలేదు. ఒకానొక సమయంలో, స్టీఫన్ రవీంద్ర సెలవు పై ఉన్నారని, ఆయన అనధికారికంగా ఏపి విషయాలు చూస్తున్నారనే వార్తలు వచ్చాయి. వైసీపీ వర్గాలు కూడా ఢిల్లీ నుంచి అనుమతి ఉందని, మేము అడిగితే ఢిల్లీ వాళ్ళు కాదనరు అనే విధంగా డబ్బా కొట్టారు. అయితే ఇప్పుడు కేసీఆర్, జగన్ కు తన మార్క్ షాక్ ఇచ్చారు. స్టీఫన్ రవీంద్రను హైదరబాద్ సిపీగా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఇన్నాళ్ళు ఆశలు పెట్టుకున్న జగన్ కు షాక్ తగిలినంత పని అయ్యింది. కేసీఆర్ ని ఎక్కువగా నమ్మితే ఏమి అవుతుందో,ఇప్పుడు జగన్ బ్యాచ్ కు ప్రత్యక్షంగా తెలిసి వచ్చింది.

జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో, ఆయన 16 నెలలు జైలు శిక్ష తరువాత, 2013లో బెయిల్ పై బయటకు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి జగన్ మోహన్ రెడ్డి, కండీషనల్ బెయిల్ పై బయట ఉన్నారు. ఇది ఇలా ఉంటే, జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి కావటం, ఆయన వ్యవహార శైలి కక్షసాధింపు ధోరణిలో ఉండటంతో, ఆయన సాక్షులను బెదిరిస్తున్నారు అంటూ, ఆయన బెయిల్ రద్దు చేయాలి అంటూ, రఘురామరాజు సిబిఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. అయితే వాదనలు ముగియటంతో, ఈ కేసు పై నిన్న తీర్పు రావాల్సి ఉంది. దీంతో మొత్తం టెన్షన్ వాతావరణం నెలకొంది. లాయర్లు, మీడియా, జగన్ మనుషులు, పోలీసులు, ఇలా నాంపల్లి కోర్టు ప్రాంగణం మొత్తం హడావిడిగా అయిపొయింది. మొదటి గంటలోనే తీర్పు వస్తుందని అందరూ భావించారు. మూడు నాలుగు గంటలు అయినా, ఎక్కడా తీర్పు రాకపోవటంతో, టెన్షన్ ఇంకా పెరిగిపోయింది. అందరూ టీవీలకు అతుక్కు పోయారు. అయితే, ముందుగా విజయసాయి రెడ్డి బెయిల్ పిటీషన్ పై, వాదనలు జరిగాయి. చాలా సేపు దీని పైనే వాదనలు జరిగాయి. విజయసాయి రెడ్డి కేంద్ర మంత్రులను, ఇతర అధికారులను పదే పదే కలుస్తూ, తాను ఎంతో బలమైన వాడినని పరోక్షంగా సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారని అన్నారు.

cbi 26082021 2

ఈ సందర్భంలో నిన్న సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని ప్రస్తావించారు. న్యాయస్థానాల పై వీరికి గౌరవం లేదని, అనేక సంఘటనలు ఉదాహరించారు. అయితే ఈ కేసుకి దీనికి సంబంధం లేదని, విజయసాయి న్యాయవాదులు వాదించగా, నిన్న సుప్రీం ఇచ్చిన తీర్పులో, వ్యక్తి స్వభావం చూసి కూడా బెయిల్ రద్దు చేయవచ్చు అనే లైన్ ఇందుకు సరిపోతుందని అన్నారు. ఇదే సందర్భంగా కోర్టుల పై ఏ మాత్రం గౌరవం లేకుండా, జగన్ మోహన్ రెడ్డికి చెందిన సాక్షిలో, జగన్ బెయిల్ రద్దుకు సంబంధించి తీర్పు రాక ముందే, జగన్ బెయిల్ రద్దు అయిపొయింది అంటూ, ట్వీట్ చేసారని, ఆ ట్వీట్ చదివి వినిపించారు. ఇది చూసి కోర్టు ఆశ్చర్య పోయింది. మీ వాదనల్లోని అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుని సరైన నిర్ణయం ప్రకటిస్తామని, జగన్ బెయిల్ రద్దు తీర్పు పై ఆర్ధర్ కాపీ ఇంకా రెడీ కాలేదు కాబట్టి, విజయసాయి, జగన్ ఇద్దరి పిటీషన్ల పై తీర్పుని, వచ్చే నెల 15న ప్రకటిస్తామని, మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే చెప్పాలని, న్యాయవాదులను అడగగా, ఇరు పక్షాలు అంగీకరించటంతో, తీర్పుని 15వ తేదీకి వాయిదా వేసింది.

సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, ఈ రోజు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఛత్తీస్గఢ్ కు చెందిన ఒక కేసు విచారణలో భాగంగా చీఫ్ జస్టిస్ ఈ వ్యాఖ్యలు చేసారు. ఛత్తీస్గఢ్ లో గతంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు, అప్పుడు ఐపిఎస్ గా ఉన్న గుర్జీందర్ సింగ్ అనేక అవకతవకలకు పాల్పాడ్డారు అంటూ, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, ఆయన పైన అనేక ఏసిబి కేసులు దాఖలు చేయటం జరిగింది. అయితే ఈ కేసు ఈ రోజు సుప్రీం కోర్టు ముందు విచారణకు వచ్చింది. ఈ కేసుకి సంబంధించిన విచారణలో, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేసారు. పోలీసులు తీరు పై ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. కొందరు పోలీసులు అధికార పార్టీలకు కొమ్ము కాస్తున్నారని, ఆయా పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారంలో లేనప్పుడు ఒక విధంగా వ్యవహరిస్తున్నారని, ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బాగానే ఉన్న అధికారాలు, మరో పార్టీ అధికారంలోకి వస్తే, గత ప్రభుత్వంలో ఉన్న అధికారుల పై కేసులు నమోదు చేయటం, దేశంలో ఒక ఆనవాయితీగా తయారు అయ్యిందని మండి పడ్డారు. అలాగే అధికారుల పై దేశద్రోహం కేసులు పెట్టటం పై కూడా, ఈ సందర్భంగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ప్రస్తావిస్తూ, కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు.

cs 26082021 2

ఛత్తీస్గఢ్ లో ఉన్న ఐపిఎస్ అధికారి పై కేసులు పెట్టిన వ్యవహారంలో, పోలీసులు తీరు పై చీఫ్ జస్టిస్ అభ్యంతరం వ్యక్తం చేసారు. కేసులు నమోదులో పోలీస్ శాఖ బాధ్యత వహించాల్సి ఉందని అన్నారు. పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాయటం, కలవర పెట్టే అంశం అని అన్నారు. ఇలాంటి సంప్రదాయానికి తెర పడాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశంలో రోజు రోజుకీ ఈ తరహా ఘటనలు ఎక్కువ అవుతున్నాయని అసహనం వ్యక్తం చేసారు. అయితే ఈ ఆదేశాలు, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా వర్తించే అవకాసం ఉందని, విశ్లేషకులు అంటున్నారు. ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏబి వెంకటేశ్వర రావు పైన కానీ, జాస్తి కృష్ణ కిషోర్ పైన కానీ, ఇలా అనేక మంది అధికారుల పై చర్యలు తీసుకోవటం, ఏబి వెంకటేశ్వర రావుని సస్పెండ్ చేయటం, డిస్మిస్ చేయాలని చెప్పటం, అలాగే ఇప్పుడు కొంత మంది అధికారులు వ్యవహరిస్తున్న తీరు, ఇలా అనేక అంశాలు పరిగణలోకి తీసుకుంటే, ఈ ఆదేశాలు మన రాష్ట్రానికి కూడా వర్తించే అవకాసం ఉంది.

జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఏ1 గా ఉన్న జగన్, ఏ2గా ఉన్న విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అంటూ, రఘురామకృష్ణం రాజు వేసిన పిటీషన్ల పై, ఈ రోజు అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిజానికి ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ పై తీర్పు వస్తుందని అందరూ భావించారు. ఎందుకంటే, ఇప్పటికే వాదనలు అన్నీ ముగిసాయి. కోర్టు కూడా 20 రోజులకు పైగా టైం తీసుకుంది, దీంతో ఇక తీర్పు వచ్చేస్తుందని అందరూ అనుకున్నారు. దానికి తగ్గట్టే, బెయిల్ పిటీషన్ ఏమి అవుతుందో అని, రాష్ట్రం మొత్తంతో పాటు, వైసీపీ పార్టీ కూడా ఉత్సుకతతో ఎదురు చూసింది. అయితే ఉదయం 11 గంటల ప్రాంతంలో, జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అంటూ, రఘురామరాజు వేసిన పిటీషన్ ని కొట్టేసినట్టు, సాక్షి టీవీలో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. దీంతో అందరూ, ఇదే తీర్పు ఏమో అని అనుకున్నారు. అయితే మిగతా టీవీ చానల్స్ ఏమి వేయకపోవటంతో, అసలు విషయం తెలుసుకున్నారు. అయితే సాక్షి వేసిన ట్వీట్ కొద్ది సేపటికి డిలీట్ అయిపొయింది. ఇక్కడ వరకు బాగానే ఉన్నా, అసలు తీర్పు ఎప్పుడు వస్తుందో అని అందరూ ఎదురు చూసారు. అయితే సిబిఐ కోర్టులో మాత్రం, జగన్ పిటీషన్ పైన కాకుండా, విజయసాయి పిటీషన్ పై నే వాదనలు కొనసాగాయి.

vsreddy 25082021 2

విజయసాయి రెడ్డి వేసిన కౌంటర్ పై, రఘురామ తరుపు న్యాయవాదులు కౌంటర్ ఇచ్చారు. విజయసాయి రెడ్డి సాక్ష్యులను బెదిరించినట్టు ఆధారాలు లేవని, వారు ఎవరూ కోర్టుకు రాలేదు కదా అని అన్నారు. అంతే కాదు, సిబిఐ ఏమి అభ్యంతరం చెప్పకపోతే, రఘురామరాజుకు ఎందుకు అని వాదించారు. దీని పై రఘురామ లయార్లు అదే మా పాయింట్ కూడా అన్నారు. సాక్ష్యులను బెదిరిస్తే ఎవరు ముందుకు వస్తారని, అలాగే సిబిఐ వైఖరి పై కూడా తమకు అనుమానాలు ఉన్నాయి కాబట్టే, కోర్టుకు వచ్చామని అన్నారు. ఈ సమయంలో సిబిఐ కోర్టు వాదనలు ముగిసినట్టు ప్రకటిస్తూ, విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు తీర్పుతో పాటుగా, జగన్ బెయిల్ రద్దు తీర్పు కూడా ప్రకటిస్తామని, రెండూ ఒకేసారి ప్రకటిస్తే మీకు ఏమైనా ఇబ్బందా అని న్యాయవాదులను అడగగా, తమకు ఏమి అభ్యంతరం లేదని చెప్పటంతో, రెండు కేసు తీర్పులను, వచ్చే నెల 15కు వాయిదా వేస్తూ, ఆ రోజు రెండు కేసులకు సంబంధించి తీర్పు ఇస్తామని ప్రకటించారు. దీంతో అనేక ట్విస్ట్ లు మధ్య, చివరకు ఏమి జరగకుండానే వాయిదా పడింది.

More Articles ...

Advertisements

Latest Articles

Most Read