జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో, జగన్ బెయిల్ రద్దు చేయాలి అంటూ రఘురామరాజు సిబిఐ కోర్టులో వేసిన పిటిషన్‌ను, సీబీఐ కోర్టు కొట్టేసింది అంటూ సాక్షి మీడియా ట్వీట్ చేస్తూ, చేసిన హడావిడి పై, అదే సిబిఐ కోర్టులో మరో పిటిషన్ వేసి సాక్షి అంతు చూడాలి అంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు నిర్ణయం తీసుకున్నారు. కోర్టు చెప్పకుండానే, ఆ తీర్పులు ముందుగానే సాక్షి మీడియాకు ఎలా తెలుస్తున్నాయి అంటూ, రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. సాక్షి ముందుగానే వేసిన తీర్పు ట్వీట్ వెనుక పెద్ద కుట్ర ఉందని, దీని పై తక్షణమే విచారణ జరిపించాలని, తను సిబిఐ కోర్టులో పిటిషన్ వేయాలని నిర్ణయిం తీసుకున్నట్టు రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఈ మేరకు రఘురామకృష్ణం రాజు, మీడియా సమావేశంలో మీడియాకు ఈ విషయాలు తెలిపారు. ఇప్పటికే సాక్షి తీర్పు వేసిన ట్వీట్ గురించి, న్యాయమూర్తి వద్దకు తీసుకుని వెళ్లామని, ఈ అంశం కోర్టు దృష్టిలో ఉందని, దీని పై ప్రత్యేకంగా ఒక పిటీషన్ కూడా వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అయితే రఘురామకృష్ణం రాజు కనుక ఈ పిటీషన్ వేస్తే, ఇది మరో రకమైన చిరాకు అనే చెప్పాలి. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఇటు సాక్షి మీడియాకే మరో ఇబ్బంది తప్పదు అంటూ, విశ్లేషకులు భావిస్తున్నారు.

rrr 28082021 2

ఇప్పటికే రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన పిటీషన్ల పై వైసీపీ నేతలు తెగ టెన్షన్ పడుతున్నారు. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి లేకున్నా, ఈ పిటీషన్లు మాత్రం, వైసీపీ పార్టీకి, జగన్, విజయసాయి రెడ్డి పరువుకి సంబంధించి ఇబ్బంది పెట్టే అంశాలు అనే చెప్పాలి. ఇక విజయసాయి రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్ళటం వెనుక కూడా రఘురామకృష్ణం రాజు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విజయాసాయి రెడ్డి విదేశాలకు వెళ్తే మళ్ళీ తిరిగి వేస్తారా అనే అనుమానం వ్యక్తం చేసారు. గతంలో తనను హేళన చేసారని, ఇప్పుడు వీళ్ళు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. తీర ప్రాంత అభివృద్ధి కోసం అంటూ బాలీ, మాల్దీవులకు విజయసాయి వెళ్ళటం పై, అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఈ పర్యటనకు సిబిఐ పర్మిషన్ ఇవ్వటం సమంజసంగా లేదని అన్నారు. దీని పై కూడా ఆయన ఏమైనా కోర్టుకు వెళ్తారో లేదో తేలియదు కానీ, జగన్, విజయసాయి రెడ్డి, వైసీపీ పార్టీని, రఘురామకృష్ణం రాజు తనదైన శైలిలో ఇబ్బందులు పెడుతూ, చుక్కలు చూపిస్తున్నారు అనటంలో సందేహమే లేదు

మంత్రి కొడాలి నాని కనుసన్నల్లోనే రూ.4 వేల కోట్ల బియ్యం కుంభకోణం జరిగితే దర్యాప్తు ఏదని టీడీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ రాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మట్లాడారు. ఆయన మాటల్లో... జగన్ ప్రజలకు నాణ్యమైన బియ్యం ఇస్తానని చెప్పి నాసిరకం బియ్యమిస్తూ మోసం చేస్తున్నారు. పేద ప్రజలకిచ్చే బియ్యం విషయంలో కూడా జగన్ ప్రభుత్వం కక్కూర్తికి పాల్పపడుతోంది. రబీ సీజన్‌లో రైతులనుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లకిచ్చి తద్వారా వచ్చే నాణ్యమైన బియ్యాన్ని పేదలకివ్వాల్సివుండగా మంత్రులు కొడాలి నాని, శ్రీరంగనాధరాజు, కార్పొరేషన్ ఛైర్మన్ ద్వారంపూడి భాస్కర్ రెడ్డిలు ఆ బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లో అమ్ముకొని రూ. 4 వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు. మళ్లీ అదే బియ్యాన్ని నాసిరకం బియ్యంగా రీసైక్లింగ్ చేసి పేద ప్రజలకు పంపిణీ చేయడం అన్యాయం. కొడాలి నాని ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలోని మైలవరంలో ఈ సంఘటన బయటపడింది. ఇందులో జగన్ వాటా ఎంతో తెలపాలి. ప్రజలకందించాల్సిన బియ్యాన్ని పందికొక్కుల్లా మెక్కడం సిగ్గుగా లేదా?. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి 60 శాతం ధాన్యాన్ని కొనుగోలు చేసి ఈ అవినీతికి పాల్పడుతున్నారు. ధరల స్థిరీకరణ నిధి నుంచి 3 వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి రైతులను ఆదుకుంటామని గొప్పలు చెప్పుకునే ఈ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా సేకరించిన నాణ్యమైన ధాన్యాన్ని కేజీ 40 రూపాయలకు బహిరంగ మార్కెట్ లో అమ్ముకుంటున్నారు. ఈ అవినీతికి పాల్పడుతున్న మంత్రులను, కార్పొరేషన్ ఛైర్మన్ని బర్తరఫ్ చేయాలని టీడీపీ తరపున డిమాండ్ చేస్తున్నాం. లోకల్ బ్రాండ్లతో తన సొంత ధనాగారాన్ని నింపుకుంటున్న జగన్ ఎక్సైజ్ శాఖ గురించి ఏరోజూ సమీక్ష జరపలేదు.

kodalinani 27082021 2

దళితుల తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడిన సందర్భాలు అసలే లేవు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యే పార్థసారధికి చంద్రబాబును విమర్శించే అర్హత లేదు. అనవసర విమర్శలు మానుకోవాలి. ముదిగొండలో పేద రైతులపై కా-ల్పు-లు జరిపి 7 మందిని చంపించింది వైసీపీ కాదా?. జగన్ రైతు వ్యతిరేకి. జగన్మోహన్ రెడ్డికి బెంగుళూరులో, హైదరాబాద్ లో, పులివెందులలో, ఇడుపులపాయిలో, తాడేపల్లిలో ఇళ్లు ఉన్నాయి గానీ పేద రైతుకు నిలువ నీడ లేకుండా పోయింది. చంద్రబాబు నాయుడుకు ప్రజలు ప్రతిపక్ష హోదా కల్పించారు కాబట్టి ఆయనకు ప్రభుత్వ అవినీతిని, వైసీపీ నాయకులు చేసే తప్పుల్ని ప్రశ్నించే హక్కుంది. వైసీపీ నాయకులు తప్పుడు ప్రకటనలు మానుకోవాలి. వారు మూడు రాజధానుల కోసం పూటకో మాట మాట్లాడటం మానుకోవాలి. అమరావతి నిర్మాణం చారిత్రాత్మక అవసరం, తెలుగు ప్రజలు ఆత్మగౌరవం కాపాడగలిగేది అమరావతి ఒక్కటే. టీడీపీ ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయిలో రైతుల తరపున పోరాటం చేస్తూనే ఉంటాం.

ప్రజాప్రతినిధుల పై నమోదు అయిన కేసుల దర్యాప్తు నత్త నడకగా సాగుతూ ఉండటం పై, సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ అంశం పై సుప్రీం కోర్టులో వాడీ వేడిగా చర్చ జరిగింది. దాదాపుగా రెండు గంటల పాటు వాదోపవాదనలు కొనసాగాయి. ప్రధానంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రజాప్రతినిధుల కేసులు విషయం పై, జరుగుతున్న జాప్యం విషయంలో, ఎందుకు జాప్యం జరుగుతుంది అంటూ చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. వివిధ కేసుల్లో శిక్షలు పడి ప్రజా ప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేయకుండా, జీవితకాలం నిషేధం విధించటం పై , పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఇలా కేసులు ఉన్న ప్రజాప్రతినిధుల పై జీవిత కాల నిషేధం పై, తాను గతంలోనే ప్రతిపాదించినట్టు చెప్పారు. కేసులు విషయంలో జాప్యం పై సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వ్యవహరిస్తున్న తీర్పు పై, ఆయన పూర్తిగా తప్పుబట్టారు. దర్యాప్తు సంస్థలు అయిన సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీరు పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. కేసులు విచారణ జాప్యం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసారు. కొందరి నేతల పైన కేసులు విచారణ పది నుంచి, 15 ఏళ్ళ వరకు పెండింగ్ లో ఉంటున్నాయని వ్యాఖ్యానించారు. సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెండిటి పైన, అసహనం వ్యక్తం చేసారు.

sc 27082021 2

ప్రజా ప్రతినిధుల కేసులు విషయం పై, అమికస్ క్యూరీ ఒక నివేదికను సమర్పించారు. అందులో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలో 51 మంది ఎంపీలు, మరో 71 మంది ఎమ్మెల్యేలు నిందితులుగా ఉన్నట్టు సుప్రీం కోర్టుకు తెలిపారు. ఇక సిబిఐ దగ్గర విచారణలో 181 మంది విచారణలో ఉన్నట్టు కోర్టుకు తెలిపారు. 55 మంది విషయంలో సీరియస్ కేసులు ఉన్నాయని, జీవిత ఖైదు, పదేళ్ళ పైన శిక్షలు పడే కేసులు ఉన్నాయని తెలిపారు. ఇందులో 45 కేసుల్లో ఇంకా అభియోగాలు కూడా నమోదు కాలేదని కోర్టుకు తెలిపారు. విచారణ సంస్థలు కూడా మానవ వనరులు కొరతను ఎదుర్కుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన కోర్టు, సిబిఐ కేసులు ఎక్కువ అయిపోతున్నాయని వ్యాఖ్యలు చేసారు. అయితే సుప్రీం కోర్టు చేసిన ఈ కామెంట్స్ జగన్ కేసుల్లో కూడా వర్తిస్తుందని అంటున్నారు. దాదపుగా 10 ఏళ్ళుగా జగన్ కేసులు పై ఇంకా ట్రైల్స్ కూడా మొదలు కాలేదని, ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మరి సుప్రీం చేసిన ఈ వ్యాఖ్యలు, కేసులు పై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.

కేవీపీ రామచంద్రరావు. ఇప్పటి రాజకీయాలు దగ్గరగా చూస్తున్న యువతరానికి ఈయన గురించి పెద్దగా తెలియక పోవచ్చు కానీ, రాజశేఖర్ రెడ్డి పరిపాలన సమయంలో, కేవీపీ అంటే తెలవని వారే ఉండరు. రాజశేఖర్ రెడ్డి ఆత్మగా కేవీపీకి పేరు ఉంది. అంటే రాజశేఖర్ రెడ్డి తీసుకునే ప్రతి నిర్ణయంలో, కేవీపీ బుర్ర ఉండేదని చెప్తారు. రాజశేఖర్ రెడ్డికి ఇంత దగ్గరగా ఉండే కేవీపీ, తరువాత జరిగిన పరిణామాలతో జగన్ వైపు చేరలేదు. కష్టమైనా, నష్టమైనా కాంగ్రెస్ తోనే ఉండి పోయారు. అప్పట్లో జగన్ బెయిల్ రావటానికి కారణం, కేవీపీ లాబీ అనే ప్రచారం కూడా జరిగింది. అయితే తరువాత నుంచి కేవీపీ, ఎప్పుడు జగన్ ని కలిసింది లేదు. ఇద్దరి మధ్య లోపల సంబంధాలు ఎలా ఉన్నాయో కానీ, బయటకు మాత్రం సంబంధాలు లేవు. చాలా తక్కువగా మాట్లాడే కేవీపీ, ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో, నేటి రాజకీయాల గురించి పంచుకున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి పై వస్తున్న విమర్శల పై ఆయన్ను అడగగా, తనకి జగన్ కి మధ్య పెద్దగ సంబంధాలు లేవని, నేను కూడా వార్తల్లో వస్తున్న విషయాలు, వాళ్ళు వీళ్ళు చెప్తున్న విషయాలు చూసే చెప్తున్నా అని, అందరి సలహాలు తీసుకోకుండా, ఎవరి అభిప్రాయాలు పట్టించుకోకుండా, సీనియర్ల సలహాలు తీసుకోకుండా పాలన జరుగుతున్నట్టు అనిపిస్తుందని అన్నారు.

kvp 27082021 2

గతంలో రాజశేఖర్ రెడ్డి దూకుడుగా ఎవరి మాట వినకుండా ఉండేవారని, అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం, అందరినీ కలుపుకుని వెళ్ళే వారని, అందరి అభిప్రాయాలూ తెలుసుకుని ముందుకు వెళ్ళే వారని అన్నారు. అంటే పరోక్షంగా జగన్ ఎవరినీ కలుపుకుని వెళ్ళటం లేదని, అందరినీ కలుపుకుని, అందరి సలహాలు పరిగణలోకి తీసుకోవాలని సలహా పరోక్షంగా ఇచ్చారు. ఇక జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారా అని ప్రశ్నించగా, మూడేళ్ళ ముందే చెప్తే దాన్ని విశ్లేషణ అనరు అని, జోతిష్యం అంటారని, తనకు జోతిష్యం రాదని అన్నారు. ఎన్నికల ముందు వరకు ఏమైనా జరగవచ్చు అని అన్నారు. ఇక్కడ కూడా పరోక్షంగానే సమాధానం చెప్పారు. జగన మళ్ళీ వస్తాడు అనే కాన్ఫిడెన్స్ ఆయన మాటల్లో కనిపిచలేదు కాబట్టే, ఎన్నికల ముందు వరకు ఏమి చెప్పలేం అని అన్నారు. జగన్ వైఖరి గురించి ప్రశ్నించగా, మాటలు దాట వేసారు. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పై చెప్తూ, ఏపిలో బలం పుంజుకుంటామని, తెలంగాణాలో అధికారంలోకి వస్తామని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read