బుల్లెట్టు దిగిందా లేదా అని అసెంబ్లీలో రౌడీ భాష మాట్లాడిన మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్‌కి కోటంరెడ్డి బుల్లెట్టు బాగానే దిగిన‌ట్టుంది. క‌టౌట్ చూసి కొన్ని కొన్ని న‌మ్మేయాలి డ్యూడ్ అంటాడు ప్ర‌భాస్‌. త‌న కటౌట్ చుట్టూ 15 మంది పోలీసుల్ని కాప‌లా పెట్టుకున్న‌ప్పుడే అనిల్ కుమార్ యాద‌వ్ ఎంత భ‌య‌ప‌డుతున్నాడో అర్థం అయిపోతోంది. నెల్లూరులో కోటంరెడ్డి పేరు వింటేనే అనిల్ కుమార్ యాద‌వ్ ఉలిక్కి ప‌డుతున్నారు. గ‌తంలో వీళ్లిద్ద‌రూ మంచి దోస్తులు. ఎప్పుడైతే కోటంరెడ్డి వైసీపీతో విభేధించారో అప్పుడే శ‌త్రువులు అయ్యారు. వైసీపీకి చెందిన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ జ‌న్మ‌దినం నర్తకీ కూడలిలో భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఈ క‌టౌట్‌కి 15 మంది పోలీసుల్ని కాప‌లాగా పెట్టుకున్నార‌నే వార్త‌లు గుప్పుమ‌న్నాయి. ఇటీవల టీడీపీలో చేరిన కోటంరెడ్డి గిరిధర్‌ రెడ్డి.. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించేందుకు ఆదివారం నర్తకీ కూడలికి వచ్చారు. అక్కడే ఏర్పాటు చేసిన అనిల్ కుమార్ యాదవ్ కటౌట్ ని కోటంరెడ్డి అనుచ‌రులు ఏమైనా చేస్తారేమోన‌నే అనుమానంతో క‌టౌట్‌కి పోలీసుల్ని కాపలాగా పెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. మ‌నుషుల్ని న‌డిరోడ్ల‌పై ప‌ట్ట‌ప‌గలు చంపేస్తుంటే ప‌ట్టించుకోని ఏపీ రాష్ట్రంలో ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే క‌టౌట్ ర‌క్ష‌ణ‌కి ఓ సీఐ, 15మంది కానిస్టేబుల్స్ ని కాప‌లాగా పెట్ట‌డం చూసి జ‌నం విస్తుపోతున్నారు. జ‌నం ప్రాణాల కంటే క‌టౌట్ల ర‌క్ష‌ణ‌కే విలువ‌నిచ్చే పాల‌కులు ఉండ‌టం మ‌న దుర‌దృష్టం అని త‌మ‌ని తామే నిందించుకుంటున్నారు.

ప్ర‌భుత్వ స‌ల‌హాదారుడు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి నుంచి త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని తాడికొండ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఎమ్మెల్సీ ఓటింగ్ అనంత‌రం తాను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాన‌ని ఆరోపిస్తున్నార‌ని, అయితే వైసీపీ మూక‌ల చేతిలో డాక్ట‌ర్ సుధాకర్, డాక్ట‌ర్ అచ్చెన్న మాదిరిగా చ‌నిపోకూడ‌ద‌నే జాగ్ర‌త్త‌తో దూరంగా ఉన్నాన‌ని చెప్పారు. త‌న కార్యాలయంపై వైసీపీ గూండాలు దాడులు చేశార‌ని, సోష‌ల్మీడియాలోనూ అస‌భ్యంగా దూషిస్తూ పోస్టులు పెడుతున్నార‌ని, తాను చేసిన తప్పేంటో చెప్పకుండా  వేధింపులకు గురిచేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జగనన్న ఇళ్ల పథకం అనేది పెద్ద కుంభకోణం అని, జగనన్న ఇళ్ల పథకంలో రూ.వేల కోట్లు దోచుకున్నార‌ని ఆరోపించారు. ఎస్సీలను అణగదొక్కేందుకు దాడులు చేస్తున్నార‌ని, చంపుతున్నారు, సామాన్యులు రాష్ట్రంలో తిరిగే పరిస్థితి లేద‌న్నారు. ర‌హ‌స్య బ్యాలెట్లో ఎన్నిక‌లు జ‌రిగితే తానే క్రాస్  ఓటింగ్‌కి పాల్ప‌డ్డాన‌ని ఆరోపిస్తూ వైసీపీ గూండాలు వేధిస్తున్నార‌న్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి త‌న‌కు ప్రాణహాని ఉంద‌ని, త‌న‌కు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల‌ని డిమాండ్ చేశారు. జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేసే ఏపీలో అడగుపెడతాన‌ని, త‌న‌కు పోలీసు రక్షణ కల్పించాల‌ని కోరారు.

ఏమీలేని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కోట్లాధిప‌తి ఎలా అయ్యారని, అవినీతిని ప్ర‌శ్నిస్తే జ‌గ‌న్ రెడ్డి ఫోన్ చేసి మ‌రీ బెదిరించార‌ని  వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా మంది సీఎంలని చూశాన‌ని ప్రజాస్వామ్యాన్ని ఇంతగా దిగ‌జార్చిన సీఎంని తొలిసారి చూస్తున్నాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాను క్రాస్ ఓటింగ్ చేశానని బుర‌ద చ‌ల్లుతున్నార‌ని, సజ్జల ముందురోజు ఓ మాట, తర్వాత రోజు ఓ మాట మాట్లాడార‌ని మండిప‌డ్డారు.  సీక్రెట్ బ్యాలెట్‍లో తాను ఎవరికి ఓటేశానో స‌జ్జ‌ల‌కి ఎలా తెలుసు అని ప్ర‌శ్నించారు. త‌న నియోజకవర్గంలో రాజ్యాంగేతర శక్తిని ఇంచార్జిగా నియమించిన రోజే  ఆ పార్టీకి దూరంగా ఉన్నాన‌ని చెప్పుకొచ్చారు. అంద‌రూ అమ్ముడుపోయార‌ని అంటోన్న సజ్జల కోట్లు సంపాదించే స్థాయికి ఎలా ఎదిగారో త‌న‌కి తెలుసు అని అన్నారు. ప్ర‌భుత్వంలో అవినీతిని ప్రశ్నిస్తే సీఎం జగన్ స్వయంగా ఫోన్ చేసి మంద‌లించార‌ని ఆనం వెల్ల‌డించారు. ఆత్మ ప్రబోధానుసారమే ఓటు వేశాన‌ని, ఎవరికి ఓటు వేశానో చెప్పన‌ని ఆనం రాంనారాయణరెడ్డి చెప్పుకొచ్చారు. రాజకీయ వ్యవస్థల్లో అనేక మార్పులు జరుగుతూ వస్తున్నాయ‌ని, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇలాంటి పరిస్థితి రావడం దారుణం అని వాపోయారు. జిల్లాలో జరిగే దోపిడీ వ్యవస్థల గురించి ప్రశ్నించాన‌ని, అభివృద్ధి నిలిచిపోయింది.. ప్రాజెక్టులు, నిర్మాణాలు జరగట్లేదని ప్రశ్నించినందుకే త‌న‌ గొంతుకను అణచి వేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. న‌ల‌భై ఏళ్లుగా అనేకమంది నాయకుల వద్ద పనిచేశాన‌ని, ఏనాడూ ప్రజాస్వామ్య విలువలు ఇంత దిగజారడం చూడలేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

జ‌న‌సేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప‌ద‌వికి రాజీనామా చేయ‌కుండానే వైసీపీలో చేరిన అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు  ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ నీతులు వ‌ల్లించ‌డంపై నెట్టింట జోకులు పేలుతున్నాయి. సోష‌ల్మీడియాలో ప‌తివ్ర‌త పలావ్ వండితే తెల్లారేవ‌ర‌కూ స‌ల్లార‌లేదంటూ రాపాకపై సైటైర్లు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్య‌ర్థికి ఓటేస్తే  టీడీపీ పదికోట్లు ఆఫర్ చేసింద‌ని చెప్పారు. జగన్‍ను నమ్మాను కాబట్టి టీడీపీ ఆఫర్‍ను తిరస్కరించాన‌ని చెప్పుకొచ్చారు. జ‌న‌సేన నుంచి గెలిచిన రాపాక వైసీపీకి ఎమ్మెల్సీ ఎన్నిక‌లో ఓటు వేయ‌డం నీతివంతం అట‌, టిడిపి వాళ్లు ఓటేయ‌మంటే ప‌దికోట్లు ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్ట‌ట‌. ఇదేం లాజిక్ రాపాక అంటూ సోష‌ల్మీడియాలో ప్ర‌శ్న‌లతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. సిగ్గు శరం వదిలేస్తే పదికోట్లు వచ్చి ఉండేవ‌ని,ఒకసారి పరువుపోతే సమాజంలో ఉండలేమంటూ స‌న్నీలియోన్ క‌బుర్లు  ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ నుంచి రావ‌డంతో జ‌న‌సేన‌, టిడిపి ఒక రేంజులో ఆటాడుకుంటోంది. జ‌న‌సేన అభ్య‌ర్థిగా గెలిచి,  వైసీపీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం సిగ్గు శ‌ర‌మూ వ‌దిలేసిన‌ట్టు కాదా?  అని నిల‌దీస్తున్నారు. ఎటాకింగ్ తీవ్రం కావ‌డంతో త‌న‌ను ఓటు వేయాల‌ని అడిగారని, ప‌ది కోట్లు ఇస్తామ‌న‌లేదంటూ కొత్త వివ‌ర‌ణతో మ‌ళ్లీ మ‌రో వీడియో రిలీజ్ చేశారు రాపాక‌. తాను అమ్ముడుబోయే స‌రుకేన‌ని ఎప్పుడో నిరూపించుకున్న రాపాక, ఉద‌యం ఆడిన మాట‌ని సాయంత్రానికి మార్చేయ‌డంతో ఇది ఎనీ టైమ్‌ సేల్ కేండిడేట్ అని తేలిపోయింది. టిడిపి ఆఫ‌ర్ ఇచ్చి ఉంటే, ఓటేయ‌క ముందు ఎందుకు బ‌య‌ట‌పెట్ట‌లేద‌ని చ‌ర్చ వ‌స్తుంది.

Advertisements

Latest Articles

Most Read