ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత, పెద్ద ఎత్తున మత మార్పిడులు జరుగుతున్నాయి అంటూ, కేంద్రం హోం శాఖకు అనేక మంది, అనేక సార్లు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు కూడా కేంద్ర హోం శాఖకు అనేక సార్లు ఈ విషయంలో ఫిర్యాదు చేసారు. ఇప్పుడు తాజాగా ఎస్సీ ఎస్టీ ఫోరం నేషనల్ రైట్స్ కు చెందిన, ప్రెసిడెంట్ కే నాగరాజు అనే వ్యక్తి, జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేసారు. అందులో ఏపిలో దళితులను, లక్ష్యంగా చేసుకుని, అనేక తాయలాలు అందచేస్తూ, వారిని క్రీస్టియన్ కవర్షన్స్ లోకి లాగుతున్నారని, మత మార్పిడులు దానికి సంబంధించి పెద్ద ఎత్తున చేస్తున్నారు అంటూ, దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేసారు. ఈ ఫిర్యాదు పై, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నేషనల్ కమిషన్ ఫర్ షడ్యుల్ కేస్ట్ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. దీని పైన జాతీయ ఎస్సీ కమిషన్, ఏపి చీఫ్ సెక్రటరీకి ఒక నోటీస్ ని అంద చేసింది. ఆ నోటీసులో ఈ నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి, 15 రోజుల్లోగా నివేదిక అందచేయాలని ఆదేశాలు జారీ చేసింది. నివేదిక కనుక మీరు గడువ లోగా అందచేయలేక పొతే, కచ్చితంగా ఆర్టికల్ 338 ప్రకారం, మీ మీద చర్యలు తీసుకోవటం జరుగుతుందని హెచ్చరించింది.
ఇది చాలా సీరియస్ విషయంగానే కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటువంటి మత మార్పిడులు జరుగుతున్నట్టు, గతంలో కూడా అనేక ఫిర్యాదులు వచ్చిన నేపధ్యంలో, ఇప్పుడు జాతీయ ఎస్సీ కమిషన్ కూడా స్పందించింది. చీఫ్ సెక్రటరీకి ఈ విషయంలో నోటీసు ఇవ్వటం, 15 రోజుల్లోగా నివేదిక కోరటం అనేది ప్రాధాన్యత సంతరించుకున్న అంశం అనే చెప్పవచ్చు. గతంలో కూడా చాలా మంది ఈ మత మార్పిడులు పై ఫిర్యాదులు చేసారు. కేంద్ర హోం శాఖకు, ఏకంగా సిఐడి చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ పై కూడా ఫిర్యాదులు వెళ్ళాయి. వాటి పైన కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆరా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదులు అనేక ఆధారాలు కూడా ఇవ్వటం, ఆ ఆధారాల్లో బలం ఉండటంతోనే, ఏకంగా రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి దీని పై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. జరుగుతుంది అని చెప్తుందా, జరగటం లేదు అని చెప్తుందా అనే విషయం పై, రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.