పోలవరంలోని కాపర్ డ్యామ్ నుంచి లక్షా20వేల క్యూసెక్కు ప్రవాహం సముద్రంలోకి వెళుతోందని, దేవీపట్నం, పోలవరం మండలాల్లోని 50 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు లేకుండా పోయాయని, చాల మంది గిరిజనులు కొండలు, గుట్టలపైనే బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని, ప్రభుత్వ ప్యాకేజీ అందకపోవడంతో గిరిజనులకు కొండలే నివాసాలయ్యాయని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... "గోదావరి ప్రవాహా ఉధృతి పెద్దగా లేని ఈ రోజుల్లోనే 50 గ్రామాలకు పూర్తిగా సంబంధాలు లేకపోతే, గతంలో అనుకున్న 20వేల కుటుంబాల నిర్వాసితులు పరిస్థితి భవిష్యత్ లో ఎలా ఉంటుందోనని తలుచుకుంటేనే భయమేస్తోంది. నిర్వాసితులకు నిర్మించాల్సిన కాలనీలు ఇప్పటికీ పూర్తి కాలేదు. పశుసంపద, మహిళలు, చిన్నారులను ఎలా తరలించాలనేదానిపై ప్రభుత్వానికి సరైన ఆలోచన విధానం లేదు. కాలనీలు నివాసానికి అనుకూలంగా లేక, ఇప్పుడుంటున్న ప్రదేశంలో ఉండలేక, ఎటువెళ్లాలో తెలియక నిర్వాసి తులుంతా దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పోలవరం పునాదులే లేవలేదని పాదయాత్రలో చెప్పారు. పునాదులే లేని పోలవరంలోఇప్పుడు 27మీటర్ల వరకు నీళ్లుఎలా నిలబడ్డాయో ముఖ్యమంత్రి రేపు రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. పునాదులు లేవ లేదు కాబట్టి, నిర్వాసితులకు రూ.10లక్షలిస్తాను, గతంలో ఖాళీ చేసిన వారికి రూ.5 లక్షలిస్తాను... నిర్వాసితులందరికీ అన్ని వసతులతో కాలనీలు నిర్మిస్తానని పాదయాత్రలో జగన్ రెడ్డి చెప్పాడు. ఆయన పలికిన పలుకులు ఉత్తరకుమార ప్రగల్భాలని నేడు అర్థమైంది. పునాదులు లేవని పోలవరంలో దగ్గరదగ్గర 100 టీఎంసీల గోదావరి జలాలు ఎలా నిలబడ్డాయో ముఖ్యమంత్రి చెప్పాలి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటింది... ఇప్పటికీ నిర్వాసితుల కాలనీల నిర్మాణాన్ని ఎందుకు పూర్తిచేయలేకపోయారో కూడాచెప్పాలి. గతంలో ముగ్గురు ముఖ్యమంత్రులు ఐదేళ్లలో పోలవరం నిర్మాణానికి ఖర్చుపెట్టింది కేవలం రూ.5,135కోట్లు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రయ్యాక రూ.11,537 కోట్లు ఖర్చుపెట్టి, ఐదేళ్ల లోనే 72శాతం వరకు ప్రాజెక్ట్ పనులు పూర్తి చేశారు. జూన్ తొలి వారంలో సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిసింది ఏమిటంటే, ఈప్రభుత్వం వచ్చిన రెండేళ్ల లోరూ.845 కోట్లు మాత్రమే ప్రాజెక్ట్ నిర్మాణాని కిఖర్చుపెట్టింది. రేపు ఏండబ్బాలు కొట్టుకోవడానికి పోలవరం పర్యటనకు వెళుతున్నారో పాలకులు చెప్పాలి. టీడీపీ హాయాంలో పోలవరం నిర్మాణానికి సంబంధించి జరిగే ప్రతిపని, దానికి సంబంధించిన సమాచారం ఆన్ లైన్లో అందుబాటులో ఉండేది.
అదేవిధంగా నేడు ఈ ముఖ్యమంత్రి పనుల పురోగతిని, డ్యామ్ సైట్లో జరుగతున్నపనులను ఎప్పటికప్పుడు ప్రజలకు ఎందుకు తెలియచేయడంలేదు? ఎందుకంటే అక్కడే పనులు జరగడంలేదు కాబట్టి. ప్రభుత్వం ఇప్పటివరకు ఖర్చుపెట్టిన రూ.845కోట్లలో ల్యాండ్ అక్విజే షన్ కే రూ.145 కోట్లు ఖర్చు చేశారు. అవి కూడా నిర్వాసితులు కాని వారి ఖాతాల్లోకి మళ్లించి, అధికారపార్టీ ఎమ్మెల్యే, ఇతరవై సీపీనేతలు ఎలా కాజేశారో ఇదివరకే టీడీపీ ఆధారాలతోసహా బయటపెట్టింది. నిర్వాసితుల సొమ్ముని దిగమింగిన వైనంపై ఇంతవరకు ఇరిగేషన్ మంత్రి గానీ, ముఖ్యమంత్రి గానీ ఇంత వరకు స్పందించ లేదు. ముఖ్యమంత్రేమో పెద్దపెద్ద ఎస్టేట్లు, ప్యాలెస్ లలో ఉంటాడు. జూన్ 2020 నాటికే 18వేల నిర్వాసితులను ఇళ్లలోకి పంపిస్తామని, మిగిలినవారిని 2021 మే నాటికి పంపిస్తామని ఇరిగేషన్ మంత్రి డబ్బాలు కొట్టాడు. ఏమయ్యాయి ఆయన చెప్పిన మాటలు? ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి దమ్ము, ధైర్యముంటే నిర్వాసితుల వద్దకెళ్లి వారితో మాట్లాడాలి. గతంలో చంద్రబాబునాయుడు కట్టిన ప్రాజెక్ట్ వద్దకెళ్లి ఫొటోలు దిగి, అంతా తామేచేశామని చెప్పుకోవడం కాదు? చేతనైతే గిరిజనుల ముందుకెళ్లి నిలబడండి. తుంగభద్ర హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ కాలువలు సహా, ఆఖరికి ధవళేశ్వరం బ్యారేజీని కూడా బోర్డు పరంచేశారు. ఇంకా సిగ్గులేకుండా సమర్థించుకుంటూ, స్పెల్లింగ్ మిస్టేక్ లని సమర్థించుకుంటున్నారు. అసలు ఈ సలహాదారులకు సిగ్గుందా? ఏం మాట్లాడుతున్నారో వారికై నా తెలుస్తుందా? కేంద్రం నోటిఫై చేసిన గెజిట్ లో వెలిగొండ ప్రాజెక్ట్ ను లేకుండా చేశారు. గాలేరు నగరి హంద్రీనీవాకు, మచ్చుమర్రికి ఎప్పుడు నీళ్లొస్తాయో చెప్పండి? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా కేంద్ర గెజిట్ లో లేదు. వీటన్నింటికీ ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? తాడేపల్లిలో కూర్చొని సమీక్షలుచేస్తే సరిపోతుందా? ముఖ్యమంత్రి, వైసీ పీఎంపీలు ఎక్కడ గడ్డిపీకుతున్నారు? సాక్షి మేనేజర్ కేంద్ర గెజిట్ ను గుడ్డిగా ఎలా సమర్థిస్తాడు? రాయలసీమ రైతాంగం గొంతుకోస్తున్న గెజిట్ ను ముఖ్యమంత్రి ఎలా సమర్థిస్తాడు? ఒక్కసారి ఒక్కసారి అని పదవిలోకొచ్చి రాయలసీమ , పులిచింతల రైతులు గొంతుకోసే అధికారం ఈ ముఖ్యమంత్రి కి ఎవరిచ్చారు? ఇంత జరిగినా ముఖ్యమంత్రి నోటినుంచి ఒక్కమాట కూడా రాలేదు. ఇరిగేషన్ మంత్రైతే కంటికే కనిపించలేదు.