ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ఎంపీకి ఐటి అధికారులు షాక్ ఇచ్చారు. వైసీపీ ఎంపీ, రాంకీ అధినేత అయోధ్య రామిరెడ్డి ఇల్లు, ఆఫీస్ ల పై, ఏక కాలంలో ఐటి అధికారులు దాడులు చేయటం పై, సర్వత్రా చర్చ జరుగుతుంది. కేంద్రంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకునే వైసీపీకి, తమ కోటరీలో అతి ముఖ్యమైన వ్యక్తి పై ఐటి దాడులు చేయటం విస్మయానికి గురి చేస్తుంది. అయోధ్య రామి రెడ్డి, దేశంలోనే సంపన్నుల ఎంపీల్లో టాప్ లో ఉండి, ఇప్పటికే దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. రాంకీ కార్యాలయంలో, ఐటి అధికారులు ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. గచ్చిబౌలిలోని తన సంస్థతో పాటుగా, అనుబంధ సంస్థల పై కూడా సోదాలు జరుగుతున్నాయి. గత ఎనిమిదేళ్లుగా వీళ్ళు చేసిన ప్రాజెక్ట్ ల పై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు, గతంలో వీళ్ళు చేసిన నిర్మాణ ప్రాజెక్ట్ లు, లావాదేవీల పై ఐటి అధికారులు కూపీ లాగుతున్నారు. తిరుపతి, వైజాగ్, హైదరాబాద్ లో ఉన్న అన్ని కంపెనీల లావాదేవీల పై కూపీ లాగుతున్నారు. ఇప్పటికే ఈ సంస్థ ఐటి సంస్థకు అడ్వాన్స్ గానే టాక్స్ కూడా చెల్లించింది. ఆ అడ్వాన్స్ కు సంబంధించిన ఐటి రిటర్న్స్ పైన కూడా ఆరా తీస్తున్నట్టు మీడియాకు సమాచారం ఉంది.

itraids 06072021 2

రెండేళ్ళ క్రితం కూడా రాంకీలో ఐటి సోదాలు జరిగాయి.అప్పట్లో 250 కోట్ల ఆస్తులు కూడా అటాచ్ చేసారు. ఇప్పుడు జరుగుతున్న ఐటి సోదాల్లో, ఏమి బహిరంగ పరుస్తారో చూడాలి. అయితే ఇది ఇలా ఉంటే, సెబి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే, రాంకీలో ఐటి దాడులు చేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా షేర్ ధర అసహజంగా పెరగటంతో, సెబి అంతర్గంగా విచారణ చేసింది. ఇక్కడ నుంచి మలేషియాలో ఉన్న కంపెనీకు నిధులు మళ్ళించినట్టు గుర్తించింది. దీని పై ఐటికి సెబి ఫిర్యాదు చేసిన తరువాతే, ఐటి రంగంలోకి దిగినట్టు సమాచారం. అయతే ఈ సోదాలు ఎప్పటి వరకు జరుగుతాయి అనేది చూడాలి. ఈ సోదాల్లో ఏమి దొరికాయి, ఎంత నిధులు గోల్ మాల్ జరిగింది అనేది, ఐటి అధికారులు చెప్పే దాకా తెలిసే అవకాసం లేదు. అయితే అయోధ్య రామిరెడ్డి, జగన్ కేసుల్లో కూడా ఒక నిందితుడుగా ఉన్నారు. ఆయన పై సిబిఐ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఇంకా సిబిఐ కోర్టులోనే విచారణా లో ఉంది.

జూన్ 28వ తేదీన, తెలంగాణా ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 34ను రద్దు చేయాలి అంటూ, కృష్ణా జిల్లాకు చెందిన కొంత మంది రైతులు, తెలంగాణా హైకోర్టులో వేసిన పిటీషన్ పై ఈ రోజు విచారణ జరిగంది. నిన్న కూడా దీని పైన వాదనలు జరిగాయి. అయితే నిన్నే, దీని పై తెలంగాణా ఏజీ వాదిస్తూ, అసలు జల వివాదాలు కోర్టుల పరిధిలోకి రావు అని వాదించారు. దీని పై నిన్న కోర్టుకు, ఏజీ మధ్య కొంత వాదనలు జరిగాయి. ట్రిబ్యునల్ కు మాత్రమే దీని పై అధికారాలు ఉన్నాయని అన్నారు. గతంలో 2008లో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు ఏమి చెప్తున్నాయో చూడాలి అంటూ, నిన్న కొంత వాదన జరిగిన తరువాత, ఈ రోజుకి కేసు వాయిదా పడింది. అయితే ఈ రోజు తెలంగాణా ఏజీ వాదన పూర్తిగా మారిపోయింది. దీంతో ఒక్కసారిగా అనూహ్య పరిణామాలు చోట చేసుకున్నాయి. అసలు ఈ పిటీషన్ విచారణ చెయ్యల్సింది ఎవరు అనే దాని పైన, ఈ రోజు ప్రధానంగా వాదనలు జరిగాయి. జస్టిస్ రామచంద్రరావు ధర్మాసనానికి సంబంధించిన బెంచ్ ముందుకు ఈ పిటీషన్ విచారణకు రావటంతో, తెలంగాణా ఏజీ అభ్యంతరం చెప్పారు. ఈ పిటీషన్ రోస్టర్ ప్రకారం, చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందుకు వెళ్తుందని, వారు మాత్రమే విచారణ చేయాలని, మీరు ఎలా విచారణ చేస్తారు అంటూ అభ్యంతరం తెలిపారు.

tg 06072021 2

చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు ఈ కేసు విచారణ చేయాలి అంటూ, పట్టుబట్టారు. అంతే కాకుండా, ఈ విషయం చీఫ్ జస్టిస్ కు కూడా చెప్పారు. అయితే ఇదే విషయం పిటీషన్ ను విచారణకు తీసుకున్న, జస్టిస్ రామచంద్రరావు బెంచ్ ముందే చెప్పాలని చీఫ్ జస్టిస్ ఆదేశించారు. దీంతో ఇదే విషయం, జస్టిస్ రామచంద్రరావు బెంచ్ ముందు, తెలంగాణా ఏజీ ప్రస్తావించారు. రోస్టర్ పై ఉన్న అభ్యంతరాలు మీకు చెప్పాలని చీఫ్ జస్టిస్ చెప్పారు అంటూ తెలంగాణా ఏజీ చెప్పారు. అయితే దీని పై పిటీషనర్లు స్పందిస్తూ, న్యాయమూర్తి ఏపి వ్యక్తి కాబట్టే అభ్యంతరం చెప్తున్నారని వాదించారు. అయితే జస్టిస్ రామచంద్రరావు బెంచ్ మాత్రం, నిన్న విచారణ చేపట్టిన తరువాత, ఇప్పుడు అభ్యంతరం చెప్పటం ఏమిటి అంటూ ప్రశ్నించారు. ఏజీ తీరు అభ్యంతరకరంగా ఉందని అన్నారు. అయితే దీని పై చీఫ్ జస్టిస్ స్పందిస్తూ, న్యాయమూర్తి పై అభ్యంతరాలు ఉంటే, మధ్యంతర పిటిషన్ వెనక్కి తీసుకోవాలని కోరటంతో, తెలంగాణా ఏజీ అంగీకరించారు. పలానా బెంచ్ కావాలని కోరటం ఏమిటి అని, అసలు నిన్న ఎందుకు అభ్యంతరం తెలపలేదని, ఈ పిటీషన్ ఏ బెంచ్ ముందుకు వెళ్ళాలో త్వరలోనే తాము నిర్ణయం తీసుకుంటామని చీఫ్ జస్టిస్ అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడి లేని వింతలూ చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇక్కడ ఏకంగా తీర్పులు చెప్పే జడ్జిలనే బూతులు తిట్టే వీరులు, ప్రజా ప్రతినిధులు ఉంటారు. మళ్ళీ ఆ ప్రజా ప్రతినిధుల పై డజను డజను కేసులు కూడా ఉంటాయి. ఇలా ఏకంగా జడ్జిల పైనే దూషణలు దిగిన కేసులో, దాదాపుగా వంద మందికి పైగా వైసిపీకి చెందిన పేటీయం బ్యాచ్ తో పాటుగా, కొంత మంది ప్రజా ప్రతినిధులు కూడా ఉన్నారు. పోయిన ఏడాది, డాక్టర్ సుధాకర్ ను రోడ్డున పడేసి, పిచ్చోడిగా చిత్రీకరించిన కేసులో, హైకోర్టు తీర్పు ఇస్తూ, ఈ కేసుని సిబిఐకి అప్ప చెప్పింది. పోలీసుల పైనే ఆరోపణలు ఉంటే, ఎవరైనా చేసే పని సిబిఐకి ఇవ్వటం. హైకోర్టు కూడా అదే పని చేసింది. అయితే హైకోర్టు, ఈ కేసుని సిబిఐకి ఇవ్వటం పై, వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. అసలు ఇలాంటి కేసుని సిబిఐకి ఇవ్వాల్సిన అవసరం ఏమిటి అంటూ సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. జడ్జిల పైన, వారి తీర్పుల పైన ఇష్టం వచ్చినట్టు దూషణలకు దిగారు. చివరకు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు కూడా ఇదే బాట పట్టారు. దీంతో వీరి వికృత చేష్టల పై, అనేక ఫిర్యాదులు చీఫ్ జస్టిస్ కు వెళ్ళాయి. ఆధారాలు, వీడియోలతో సహా అన్నీ చీఫ్ జస్టిస్ కు వెళ్ళాయి. ఇవి అన్నీ చూసిన అప్పటి చీఫ్ జస్టిస్, ఇదేమి వికృతం అంటూ ఆశ్చర్య పోయారు.

hc 05072021 21

దీని వెనుక ఉన్న కుట్ర ఏమిటి, దీని వెనుక ఎవరు ఎవరు కుట్రలు పన్నారు, ఇలా పూర్తి వివరాలతో తమకు నివేదిక అందించాలి అంటూ, సిఐడికి ఆదేశాలు ఇచ్చారు. అయితే సిఐడి సరిగ్గా విచారణ చేయకపోవటం, ఈ కేసుని సిబిఐకి ఇచ్చారు. దీంతో సిబిఐ ఈ కేసు పై విచారణ చేసింది. దాదాపుగా 100 మందికి పైగా వైసిపీ కార్యకర్తలను విచారణ చేసింది. కొంత మందిని విశాఖ ఆఫీస్ కు పిలిచి విచారణ చేస్తే, కొంత మందిని విజయవాడలో కూడా విచారణ చేసారు. ఇప్పటికే మూడు సార్లు తమ రిపోర్ట్ ఇచ్చిన సిబిఐ, ఈ రోజు కూడా హైకోర్టుకు మరో రిపోర్ట్ ఇచ్చింది. ఇది చాలా పెద్ద కేసు అని, తమకు విచారణ పూర్తి చేయటానికి మరో మూడు నెలల సమయం కావాలని కోరింది. దీంతో హైకోర్టు కూడా అంగీకరించింది. ఈ కేసుని మూడు నెలలకు వాయిదా వేసింది. ఇప్పటికే సిబిఐ నాలుగు రిపోర్ట్ లు ఇచ్చింది. మూడు నెలలు తరువాత తుది రిపోర్ట్ ఇవ్వనుంది. జడ్జిల పై దూషణలు దిగిన వారు ఎవరు, ఎందుకు చేసారు, వీరి వెనుక ఎవరు ఉన్నారు అనేది బయట పడుతుందో లేదో చూడాలి.

ఆరేళ్ల క్రితం సుప్రీంకోర్టు రద్దు చేసిన ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66ఏ కింద ఇంకా దేశవ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదవుతుండటంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చాలా దారుణమైన పరిణామమని అభివర్ణించింది. దీనిపై సమాధానమివ్వాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అదే సోషల్ మీడియా కేసు. సెక్షన్ 66ఏ, ఈ సెక్షన్ ని సుప్రీం కోర్టు, 2015 ఫిబ్రవరిలోనే రద్దు చేసింది. ఒక కేసు విచారణ సందర్భంగా, 2015లోనే సుప్రీం కోర్టు ఈ సెక్షన్ ని రద్దు చేసింది. ఇదే విషయం పై, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశిస్తూ, ఇదే విషయం తమ పరిధిలో ఉన్న పోలీసులకు చెప్పాలి అంటూ, సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ ఆదేశాలు ఉన్నా సరే, ఇప్పటికీ ఈ సెక్షన్ 66ఏతో కేసులు నమోదు అవుతూ ఉన్నాయి. దీంతో ఈ విషయాన్ని ఒక సంస్థ అయిన పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌, సుప్రీం కోర్టు దృష్టికి తెచ్చింది. ఇదే విషయం పై సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. ఈ సెక్షన్ రద్దు చేసిన తరువాత, గత ఆరేళ్లలో, దాదాపుగా వెయ్యికి పైగానే కేసులు నమోదు అయ్యాయని, దీని పై సుప్రీం కోర్టు చర్యలు తీసుకోవాలి అంటూ, పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ అనే సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించి, తగు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.

sc 05072021 2

ఈ పిటీషన్ ను ఈ రోజు సుప్రీం కోర్టు విచారణ చేసింది. జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌ ధర్మాసనం ఈ పిటీషన్ పై విచారణ చేసింది. ఈ పిటీషన్ విచారణకు తీసుకోవటమే, సుప్రీం కోర్టు బెంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము రద్దు చేసిన చట్టంతో, వెయ్యి కేసులు నమోదు అవ్వటం పై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది చాలా దారుణమైన పరిణామం అని, ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవటం దారుణం అంటూ వ్యాఖ్యానించింది. దీని పై సమాధానం చెప్పాలి అంటూ కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ కేసు పై తదుపరి విచారణను రెండు వారాలకు సుప్రీం కోర్టు వాయిదా వేసింది. సోషల్ మీడియాలో చట్ట వ్యతిరేకమైన పోస్టులు పెడుతున్నారు అంటూ, ఈ సెక్షన్‌ 66ఏ ని ఉపయోగించి, ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ లు చేసే వారు. అయితే ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని గ్రహించిన సుప్రీం కోర్టు, దీన్ని రద్దు చేసింది. అయినా ఇంకా కేసులు పెట్టటం పై సుప్రీం కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ సెక్షన్ కాకపోయినా, సోషల్ మీడియా అరెస్ట్ లు జరిగిన విషయం తెలిసిందే.

Advertisements

Latest Articles

Most Read