ఇటీవల మాన్సాస్ ట్రస్ట్ కు సంబంధించి, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపధ్యంలో, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు, మాన్సాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉన్న అన్ని దేవాలయాలను దర్శించుకుంటున్నారు. అయితే ఈ నేపధ్యంలో, వైసీపీ నేత విజయసాయి రెడ్డి, హైకోర్టులో కేసు ఓడిపోయామనే ఉక్రోషంతో, అశోక్ గజపతి రాజు పై అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆరోపణలు కూడా శ్రుతిమించి చేస్తూ ఉండటంతో, ఎబ్బెట్టుగా మారాయి. మరీ ముఖ్యంగా కండీషనల్ బెయిల్ పై ఉన్న వ్యక్తి అయిన విజయసాయి రెడ్డి, వేల ఎకరాలు దానం చేసిన అశోక్ గజపతి రాజుని దొంగ అని సంబోధించటం, నిన్ను జైలుకి పంపుతా అని చెప్పటం, ఇవన్నీ విద్దురంగా ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే, విజయసాయి రెడ్డి వైఖరి పై, ఎంపీ రఘురామరాజు లేఖ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాసారు. ఈ లేఖలో విజయసాయి రెడ్డిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని, విజయసాయి రెడ్డి భాషను కట్టడి చేయక పొతే, పార్టీకి తీరని నష్టం జరుగుతుంది అంటూ, విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. అంతే కాకుండా, మంత్రులను కూడా నియంత్రించాలని, లేకపోతే ఉత్తరాంధ్రలో ఉన్న మూడు నాలుగు జిల్లాల ప్రజలు భావోద్వేగంతో ఉన్నారని, మన నేతలు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది అంటూ, జగన్ మోహన్ రెడ్డికి రాసిన లేఖలో తెలిపారు.

rrr 19062021 2

2014లో అక్కడ ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోయారని, ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని, మళ్ళీ అవి పునరావృతం కాకుండా ఉండాలి అంటే, ముఖ్యంగా అశోక్ గజపతి రాజు, రాజ వంశం పై, వ్యక్తిగత దూషణలకు దిగటం ఏ విధంగానూ మంచిది కాదని, ఏదైనా ఉంటే న్యాయ పరంగా చట్ట పరంగా తేల్చుకోవాలని, వ్యక్తిగతంగా ఆయన దొంగ, ఆయనను జైలుకు పంపిస్తాం అని, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు అంటుంటే, అది పార్టీ పైన ప్రభావం పడుతుందని తెలిపారు. అశోక్ గజపతి రాజు పై ఎటువంటి ఆరోపణలు చేయటానికి, స్థానిక నేతలు కూడా భయపడతారని, అలాంటిది, ఆధారాలు ఏమి లేకుండా, ఇలాంటివి చేయటం మంచిది కాదని, ఉత్తరాంధ్ర ప్రజలు మళ్ళీ భావోద్వేగంలోకి వెళ్తే, మళ్ళీ 2014 రిపీట్ అవుతుందని జాగ్రత్త అంటూ, జగన్ మోహన్ రెడ్డిన హెచ్చరిస్తూ, వారిని కంట్రోల్ లో పెట్టుకోవాలని కోరారు. ముఖ్యంగా మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారాలు, హైకోర్టు ఇచ్చిన తీర్పుని కూడా ఈ లేఖలో తెలిపారు. కోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కూడా, ఇలాంటి పనులు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం అప్రతిష్టపాలు అవుతుందని, విజయసాయి రెడ్డిని కట్టడి చేయాలని, రఘురామరాజు లేఖలో తెలిపారు.

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటుగా, మాజీ మంత్రి కొల్లు రవీంద్రతో పాటుగా, మరి కొందరు పార్టీ నేతల పై విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. 2020 జూన్ నెల 12వ తేదీన అచ్చేన్నాయుడు అరెస్ట్ సందర్భంగా, పరామర్శ కోసం సూర్యారావు పేట కోర్టు సెంటర్ కు వెళ్ళిన నారా లోకేష్, కొల్లు రవీంద్ర సహా ఇతర పార్టీ నేతల పై ప్రశాంతి అనే పోలీస్ అధికారి ఫిర్యాదు మేరకు, విజయవాడ సూర్యారావు పేట పోలీసులు, ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. అచ్చేన్నాయుడుని శ్రీకాకుళం నుంచి విజయవాడ తీసుకుని వచ్చిన నేపధ్యంలో, ఆయన క్షేమ సమాచారం తెలుసుకోవటానికి, అక్కడకు వెళ్ళటం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఏడాది తరువాత , ఇప్పుడు ఎఫ్ఐఆర్ కు సంబంధించి ఏదైతే కేసు నమోదు అయ్యిందో, వివరణ ఇవ్వాలి అంటూ, నారా లోకేష్, కొల్లు రవీంద్ర, మిగతా వారికి ఇప్పుడు నోటీసులు సర్వ్ చేయటం జరిగింది. అయితే దాదాపు ఏడాది తరువాత ఇప్పుడు నోటీసులు పంపించటం ఆశ్చర్యాన్ని కలిగించింది.

ln 19062021 2

అంటే, 2020 జూన్ నెల 12వ తేదీన దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు అయితే, ఇప్పుడు దానికి సంబంధించి నోటీసులు ఇవ్వటం పై, సర్వత్రా చర్చ జరుగుతుంది. క-రో-నా నిబంధనలు ఉల్లంఘించారని లోకేష్ పై కేసు నమోదు చేయటం జరిగింది. ఎఫ్ఐఆర్ లో కూడా అదే నమోదు చేసారు. ఎపిడమిక్ యాక్ట్ ప్రకారం, క-రో-నా వ్యాప్తికి లోకేష్ కారణం అయ్యారు అంటూ, అందులో పేర్కొన్నారు. పోలీస్ అధికారి ప్రశాంతి ఫిర్యాదు మేరకు, లోకేష్ తో పాటు మరో నలుగురి పై కూడా కేసు నమోదు చేయటం, ఇప్పుడు దాదాపు ఏడాది తరువాత, సమాధానం చెప్పాలి అంటూ నోటీసులు ఇవ్వటం జరిగింది. అయితే ఇది కేవలం కక్ష సాధింపు అంటూ టిడిపి నేతలు అంటున్నారు. క-రో-నా వ్యాప్తి చేసిందే వైసిపీ నేతలు అని, ఎప్పుడూ జగన్ మాస్క్ కూడా పెట్టుకోలేదని, ఒక పక్క ఇంట్లో నుంచి బయటకు రావటం లేదు అంటూ, మరో పక్క క-రో-నా వ్యాప్తి చేస్తున్నారు అంటూ చెప్పటం, ఇది కేవలం నిన్న కర్నూల్ పర్యటనలో లోకేష్ దెబ్బకు వచ్చిన రియాక్షన్ అని పేర్కోన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. మెగా సోలార్ ప్రాజెక్ట్ టెండర్లు రద్దు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలినట్టు అయ్యింది. సోలార్ టెండర్లు రద్దు చేసి, తాజాగా టెండర్లు పిలవాలని ఏపి హైకోర్టు ఆదేశించింది. 6400 మెగావాట్ల సామర్ధ్యంతో, మెగా సోలార్ ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేయాలనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఈ టెండర్లు పిలిచి మూడు నెలలు అవుతున్నా, ఇందులో టాప్ వచ్చినవి మాత్రం, ఆదానీ పవర్, శిరిడీ సాయి ఎలక్ట్రికల్స్, ఈ రెండు కంపెనీలు మాత్రమే వచ్చాయి. అయితే టెండర్లు ఖరారు చేయవద్దు అంటూ, అప్పట్లో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే హైకోర్టు ఈ రోజు ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి, ఈ టెండర్ రద్దు చేసింది. ప్రధానంగా విధ్యత్ కొనుగోలు ఒప్పందాలు సైతం కూడా, తాజాగా మళ్ళీ రూపొందించాలని హైకోర్టు తాజాగా ఆదేశించింది. దీంతో పాటుగా, ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్ టెండర్లను సవాల్ చేస్తూ, టాటా పవర్ ఎనర్జీ ఏపి హైకోర్టుని ఆశ్రయించింది. ముసుయిదా విద్యుత్ కొనుగోలు ఒప్పందం నిబంధనలను, కేంద్ర విద్యుత్ చట్టానికి, ఈ టెండర్ విరుద్ధంగా ఉంది అంటూ, టాటా పవర్ న్యాయవాదులు, హైకోర్టు ముందు తమ వాదనలు వినిపించారు.

hc 18062021 2

దీంతో పాటుగా, ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో ఎటువంటి వివాదాలు తలెత్తినా, దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత విద్యుత్ నియంత్రణ మండలికి ఉంటుంది కానీ, ఆ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవటం అనేది చట్ట విరుద్ధం అని వాదించారు. ఈ రాష్ట్రంలో కూడా ఇలాంటి నిబంధనలు లేవని న్యాయవాదులు వాదించారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించటం అనేది జరిగితే, ఒక పక్షానికి మాత్రమే లబ్ది చేకూర్చే అవకాసం ఉంటుందని తాము భావిస్తున్నామని కోర్టుకు తెలిపారు. ఇదంతా కూడా విద్యుత్ చట్టంలోని సెక్షన్ 63కి పూర్తి విరుద్ధం అని చెప్పి, అదే విధంగా కేంద్ర ఇంధన శాఖలో, 2007లో జారీ చేసిన బిడ్డింగ్ మార్గదర్శక సూత్రాలకు కూడా ఈ మెగా సోలార్ ప్రాజెక్ట్ టెండర్లు విరుద్ధంగా ఉన్నాయని కూడా వాదించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరుపున కూడా వాదనలు విన్నారు. ఈ వాదనలను, ఇరు పక్షాల నుంచి విన్న హైకోర్టు, నిన్న ఈ కేసు పై తీర్పు ఇచ్చింది. మెగా సోలార్ ప్రాజెక్ట్ టెండర్లు రద్దు చేస్తూ, కొత్తగా టెండర్లు పిలవాలని ఆదేశాలు ఇచ్చింది.

మూడు ముక్కాల రాజధాని ప్రకటన చేసి, అమరావతికి అన్యాయం చేసి, నేటికి 550వ రోజు. అటు అమరావతిని నాశనం చేసారు. ఇటు మూడు రాజధానులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది. అయితే తమకు జరిగిన అన్యాయం పై గత 550 రోజులుగా అమరావతి రైతులు ఉద్యమం చేస్తూనే ఉన్నారు. ఈ రోజుతో ఉద్యమం 550వ రోజుకి చేరుకుంది. 550వ రోజులుగా దీక్షలు, ధర్నాలు, వివిధ రూపాల్లో శాంతియుత నిరసనలు చేస్తున్నా, ఈ ప్రభుత్వం తమని పట్టించుకోవటం లేదని రైతులు, మహిళలు ఆందోళన చెందుతున్నారు. 550వ రోజు సందర్భంగా, ఉద్యమ కార్యాచరణలో భాగంగా జగన్ మోహన్ రెడ్డి నివాసానికి, మందడం నుంచి, అదే విధంగా ఇతర గ్రామాల నుంచి ప్రజలు వస్తారని సమాచారం ఉంది అంటూ, తాడేపల్లిలోని జగన్ మోహన్ రెడ్డి నివాసంలో, భారీ భద్రత ఏర్పాటు చేసారు. అటు గ్రామాల్లో కూడా భారీ ఎత్తున పోలీసులను దించారు. ముఖ్యంగా జగన్ నివాసం పరిధిలో హైఅలర్ట్ ప్రకటించారు. రైతులు చేపట్టే ఎటువంటి ర్యాలీలకు కానీ, నిరసనలకు కానీ అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. జగన్ క్యాంపు కార్యాలయం ముట్టడిస్తారనే సమాచారం ఉండటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అన్ని గ్రామాల్లో, అన్ని కీలకమైన చోట్ల బందోబస్తు పెంచేశారు.

jagan 190620121 2

క్యాంపు కార్యాలయానికి వెళ్లే మార్గాల అన్నీ తమ కంట్రోల్ లో కి తెచ్చుకుని, భారీ బందోబస్తు ఏర్పాటు చేసుకున్నారు. జగన్ ఇంటి పరిధిలో కొత్త వారికి ఆశ్రయం కల్పించవద్దని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అయితే అమరావతి రైతులు మాత్రం, ఈ ప్రచారాన్ని ఖండించారు. ఎవరో పుకార్లు పుట్టిస్తే, ఇలా తమ పై పోలీస్ జులం చూపించి, తామను నిర్బందిస్తారా, తమ గ్రామాల్లో, ఇళ్ళ మధ్య ఈ పోలీసులు ఏమిటి అంటూ ఆవేదన వ్యక్తం చేసారు. స్వేచ్చగా తిరగనివ్వకుండా ఎవరో ఏదో పుకార్లు పుట్టిస్తే, తమ పై ఈ దౌర్జన్యం ఏమిటి అని ఖండించారు. జగన్ మోహన్ రెడ్డి భయం భయంగా, ఎవరో ఏదో చేస్తారని, శత్రువులు ఉన్నారని, భయంగా ఉండటం ఎందుకని, తమకు న్యాయం చేయవచ్చు కదా, తమ మోర ఆలకించవచ్చు కదా అని ప్రశ్నించారు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ, ఇంత భద్రత ఎందుకని ప్రశ్నించారు. కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నది వారే అని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read