నిన్న ఒక్క రోజే ఆంధ్రప్రదేశ్ లో 24 వేల వరకు పాజిటివ్ కేసులు నమోదు కావటం, రోజు రోజుకీ రెండు వేల కేసులు అదనంగా నమోదు కావటం, గతంతో పోల్చితే వైరస్ విస్తృతంగా వ్యాపిస్తు ఉండటంతో, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పంతం వీడింది. నిన్నటి వరకు లాక్ డౌన్ లు పెట్టం అంటూ చెప్తూ వస్తున్న ప్రభుత్వం, రోజు రోజుకీ వైరస్ విలయతాండవం చేస్తూ ఉండటంతో,చర్యలకు పూనుకుంది. ఈ నేపధ్యంలోనే, ఈ రోజు జరిగిన సమీక్షలో, అధికారులు, జగన్ మోహన్ రెడ్డికి ఒక సూచన చేసారు. ఉదయం ఆరు గంటల నుంచి, 12 గంటల వరకు మాత్రమే కార్యకలాపాలు నిర్వహించే విధంగా చేసి, మధ్యానం 12 గంటల నుంచి, తరువాత రోజు ఉదయం ఆరు గంటల వరకు, కర్ఫ్యూ విధించేలాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉదయం ఆరు నుంచి 12 మధ్య కూడా 144 సెక్షన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక రకంగా ఇది పాక్షిక లాక్ డౌన్ గా భావించాల్సి ఉంటుంది. గతంలో ఆరు నుంచి పది గంటల వరకు నిత్యావసరాలకు పెట్టి, లాక్ డౌన్ విధిస్తే, ఇప్పుడు మరో రెండు గంటల సమయం పెంచారు. అయితే ఈ ఆంక్షలు ఎల్లుండి, అంటే బుధవారం నుంచి ఈ ఆంక్షలు అమలులోకి వస్తాయని చెప్పి, ప్రభుత్వం చెప్పింది. దీంతో ఏపి వ్యాప్తంగా ఎల్లుండి నుంచి కర్ఫ్యూ అమలులోకి రానుంది.
ఇప్పటికే రాత్రి కర్య్ఫ్యు అమలులో ఉంది. రాత్రి పది గంటల నుంచి, ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ నడుస్తుంది. దీనికి అదనంగా, మధ్యానం 12 గంటల నుంచి, ఉదయం ఆరు గంటల వరకు కూడా, కర్ఫ్యూ అమలులోకి రాబోతుంది. ఇప్పటికే సుప్రీం కోర్టు కూడా, లాక్ డౌన్ అంశం పై, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. లాక్ డౌన్ పెట్టే విషయం పై ఆలోచన చేయలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో, సుప్రీం కోర్టు ఆదేశాలు బట్టి, కేంద్ర ప్రభుత్వం కూడా లాక్ డౌన్ పై ఆలోచిస్తుంది. ఈ నెల ఆరు , ఏడు తరువాత కీలల ప్రకటన ఉంటుందని చెప్తున్నారు. ఈ నేపధ్యంలోనే, ఏపిలో కేసులు సంఖ్య పరుగుతూ ఉండటం, ఏపిలో ఒక కొత్త స్ట్రైన్ విపరీతంగా స్ప్రెడ్ అవుతూ ఉండటంతో, మిగతా వైరస్ తో పోలిస్తే ఈ వ్యాప్తి పది రెట్లు ఎక్కవగా ఉండటంతో, ఈ వ్యాప్తిని అరికట్టాలి అంటే, కట్టడి చర్యలు ఏర్పాటు చేసుకోవటం అసవరం అయ్యింది. అయితే నిన్నటి వరకు, ఆర్ధిక పరిస్థితి దెబ్బ తింటుంది, లాక్ డౌన్ ఉండదు అని ప్రకటించిన జగన్ మోహన్ రెడ్డి, ఎట్టకేలకు ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం తీసుకున్నారు.