కర్నూల్ లో ఘోరం జరిగింది. కేఎస్ కేర్ హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక 5గురు చనిపోయారు. అయితే ఈ ఘటనలో ప్రధాన బాధ్యులు కేఎస్ కేర్ హాస్పిటల్ సిబ్బంది అనే తెలుస్తుంది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పోలీసులు వచ్చి, హాస్పిటల్ లోని అన్ని విభాగాలను పరిశీలించారు. అన్నీ పరిశీలించిన తరువాత, హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న క-రో-నా బాధితులతో పాటు, ఇతర రోగులు కూడా చికిత్స తీసుకుంటున్నట్టు గుర్తించారు. మూడు ఫ్లోర్లు ఉన్న హాస్పిటల్ లో, దాదాపుగా 50 మంది వరకు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు గుర్తించారు. అక్కడ ఉన్న డాక్టర్లు, సిబ్బందితో పాటు, అక్కడ రోగులు, వారి బంధువులతో కూడా అధికారులు మాట్లాడారు. అయితే ఇక్కడ అన్ని రకాల అనుమతులు ఉన్నాయని, హాస్పిటల్ యాజమాన్యం చెప్పిందని తెలిపారు. అయితే ఇక్కడ ఆక్సిజన్ అందక 5 గురు చనిపోవటంతో, ఈ హాస్పిటల్ కు ఎలాంటి అనుమతులు లేవని తెలిసిందని, క-రో-నా వైద్యం కోసం అనుమతి ఇవ్వలేదని తెలిసిందని, లబోదిబోమన్నారు. అయితే పోలీసులు రాగానే, హాస్పిటల్ యాజమాన్యం తప్పించుకున్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. డిజాస్టర్ మ్యానెజ్మెంట్ ఆక్ట్ పై, హాస్పిటల్ పై కేసు నమోదు చేసారు.
news
మరోసారి అమరావతి రైతుల ఉద్యమాన్ని కించపరిచిన బొత్సా...
అమరావతి కోసం రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమాన్ని, పలు రకాలుగా వైసీపీ నేతలు హేళన చేస్తున్న సంగతి తెలిసిందే. రైతులు ఆవేదన, మహిళల బాధ కంటే, వీరి వెటకారం ఎక్కువ అయ్యింది. పలు సందర్భాల్లో వైసీపీ నేతలు హేళన చేసారు. ఇప్పుడు అమరావతి ఉద్యమం 500 రోజులు అయిన సందర్భంగా, ఉద్యమం చేస్తుంటే, మంత్రి బొత్సా మళ్ళీ హేళన చేసారు. 500 రోజుల ఉత్సవాలు కాకాపోతే, 1000 రోజులు ఉత్సవాలు చేసుకోండి అంటూ హేళన చేసారు. అమరావతి ఉద్యమాలు అన్నీ బోగస్ అని అన్నారు. ఉద్యమాన్ని పండుగలా జరుపుకుంటూ, మరోపక్క రైతులు బాధపడుతున్నారని చెప్పటం ఏమిటి అంటూ ద్దేవ చేశారు. అమరావతిలో పెట్టిన పరిరక్షణ సమితిని చంద్రబాబు తన బినామీల ఆస్తులను పరిరక్షించుకునేందుకు ఏర్పాటు చేసారని అన్నారు. మూడు రాజధానుల విధానానికి ప్రజల నుంచి కూడా ఆమోదం లభించిందన్నారు. తన బినామీలకు ఎటు వంటి నష్టం రాకూ డదనే ధ్యేయంతో చంద్రబాబు పని చేస్తున్నాడన్నది అర్ధమవుతోందన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల గురించి ప్రభుత్వం ఎంతో బాధ్యతతో వుందన్నారు.
చంద్ర బాబు సీఎంగా వున్నప్పుడు ప్రకటించిన దానికన్నా ఎక్కువ కాలపరిమితికి కౌలు, పెన్షన్లు, పంటపరిహారం కూడా పెంచి ఇస్తున్నామని చెప్పుకొచ్చా రు. ఇచ్చిన మాట ప్రకారం భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటే.. కోర్టులలో సాంకేతికపరమైన అంశాలతో స్టేలు తీసుకు వచ్చి చంద్రబాబు, ఆయన అనుయాయులు అడ్డుకుంటు న్నారని ఆరోపించారు. లేకపోతే ఈ పాటికే రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇచ్చి ఉండే వాళ్లమని స్పష్టంచేశారు. హైదరాబాదు పరిమితమైన చంద్రబాబు ఈ రోజు జూమ్ కాన్ఫెరెన్స్ లో చెప్పినవన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు. ఈ సమయంలోనూ రాజకీయాలకు అతీతంగా చిత్తశుద్ధితో అన్ని వర్గాల వారికీ, రైతులు, రైతుకూలీలు, సామాన్యులు, ఉద్యోగులకు అందరికీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రతి క్షణం పని చేస్తున్నామని వెల్లడించారు. అయితే మంత్రి బొత్సా వ్యాఖ్యల పై అమరావతి మహిళలు , రైతులు మండి పడ్డారు. మొదటి నుంచి మమ్మల్ని ఇలా వేధిస్తూనే ఉన్నారని అన్నారు.
హైకోర్టు ఇచ్చిన ఛాన్స్ జగన్ ఉపయోగించుకుంటారా ? డ్యామేజ్ కంట్రోల్ చేస్తారా ?
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, విద్యార్థుల ప్రాణాలకంటే పరీక్షలే ముఖ్యమయ్యాయి. కారణాలుఏమిటో తెలియదు గానీ, ప్రభుత్వం ప్రాణాలను కాదని, పరీక్షలకే ఎక్కవ విలువ ఇస్తోంది. పరీక్షల నిర్వహణలో మొండి పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి పై విద్యార్ధులు తల్లిదండ్రులు కోర్టుకు వెళ్లారు. ఈ సందర్భంగా హైకోర్టు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, మే 3 వరకు అవకాసం ఇచ్చి, పరీక్షలు నిర్వహించాలి అనే నిర్ణయం పై, మరోసారి ఆలోచించాలని ఆదేశాలు ఇచ్చింది. అసలు నిజానికి ఈ రోజు హైకోర్ట్, ప్రభుత్వానికి చీవాట్లు పెట్టుద్దని అందరూ అనుకున్నారు. అయితే హైకోర్టు మాత్రం, ప్రభుత్వానికి మరో చాన్స్ ఇచ్చింది. ఇప్పటికే ఈ పరీక్షలు విషయంలో, ప్రజల్లో పలుచున అయిన జగన్ ప్రభుత్వానికి, హైకోర్టు మంచి అవకాసం ఇచ్చిందనే చెప్పాలి. ఈ అవకాసం ఉపయోగించికుని, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పరీక్షలు పై వెనక్కు తగ్గితే, అన్ని విధాలుగా ప్రభుత్వం బయట పడుతుంది. లేదు ఇలాగే మొండి పట్టుదలతో ఉంటే, కోర్టు ఇచ్చే ఆదేశాలతో, ప్రభుత్వం పరువు పోవటం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో రోజు రోజుకీ కేసులు అధికం అవ్వటం, ఈ రోజు రికార్డు స్థాయిలో 17 వేల కేసులు రావటం, వచ్చే మే నెల మొత్తం కేసులు పెరుగుతాయని అందరూ చెప్తూ ఉండటంతో, హైకోర్టు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించికుని, జగన్ మోహన్ రెడ్డి పరీక్షల పై వెనకుడుగు వేస్తుందేమో చూడాలి. ఇలా చేస్తే ఇప్పటికే అయిన డ్యామేజ్ ని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, కొంచెమైనా నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది.
మరో పక్క ఇదే అంశం పై తెలుగుదేశం పార్టీ జగన్ పై విరుచుకు పడింది. ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ చెంగల్రాయుడు మాట్లాడుతూ, "ముఖ్యమంత్రి బుర్ర పెద్దగా పనిచేస్తున్నట్లు లేదు. పరీక్షలు రద్దుచేస్తే, నారాలోకేశ్ కు క్రెడిట్ దక్కుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లున్నాడు. ఆయన ఆలోచనలు గ్రహించాక, లోకేశ్ తనలేఖ వెనక్కు తీసుకుంటానని ప్రకటించాడు. పరీక్షలు రద్దుచేయండి లేదా వాయిదా వేయండి అంతేగానీ, నా గురించి ఆలోచించి, పిల్లలను బలిచేయవద్దని లోకేశ్ చాలా స్పష్టంగా ముఖ్యమంత్రికి చెప్పాడు. హైకోర్టులో కూడా పరీక్షల వ్యవహారంపై ప్రజాప్రయోజనవ్యాజ్యం ధాఖలైంది. మానవత్వంతో ఆలోచించాలని మాత్రమే ముఖ్యమంత్రిని కోరుతున్నాము. బంగారంతో వెళుతున్న నావకు రంధ్రం పడితే, దానిలోని వస్తువులన్నింటినీ నీటిలో పడేసి, మనుషులను కాపాడాలని ఒక కథలో చెప్పడం జరిగింది. అదే విధంగా ముఖ్యమంత్రి పరీక్షలు వాయిదా వేసి, విద్యార్థుల ప్రాణాలు కాపాడాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకటి నుంచి 9వతరగతి పిల్లలను ఇళ్లల్లో కూర్చొబెట్టిన ప్రభుత్వం, పది, ఇంటర్ విద్యార్థులను మాత్రం పరీక్షలు రాయాల్సిందేననడం ఏమిటి? అటువంటి నిర్ణయాలు తీసుకునేముందు ఆలోచించరా? జనాభిప్రాయం దృష్ట్యా ముఖ్యమంత్రి వెంటనే పరీక్షలు రద్దు చేయడమో, వాయిదా వేయడమో చేయాలని టీడీపీ తరుపున డిమాండ్ చేస్తున్నాం." అని అన్నారు.
అమర్‌రాజా కంపెనీపై సంచలన ఆదేశాలు ఇచ్చిన ఏపి ప్రభుత్వం.. కంపెనీ మూసేయాలని ఆదేశం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండేళ్లుగా కొత్తగా వస్తున్న కంపెనీలు కంటే, వెళ్ళిపోతున్న కంపెనీల లిస్టు పెరిగిపోతుంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి చూసి, కొన్ని కంపెనీలు వెనక్కు వెళ్ళగా, రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో కొన్ని కంపెనీలు వెళ్ళిపోయాయి. ప్రస్తుతం ప్రపంచం ఉన్న పరిస్థితిలో, కొత్తగా పెట్టుబడులు ఆకర్షించాలి అంటే ఎంతో శ్రమించాలి. మన చిన్న రాష్ట్రం మరింతగా ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా ఉంటేనే, కొత్త కంపెనీలు వస్తాయి. అయితే ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి లేదు. బహుసా కొత్త పెట్టుబడులతో ఓట్లు రావు అనుకున్నారో ఏమో, అప్పు చేసి పధకాలు ఖర్చు పెడితే చాలు అనుకున్నారో ఏమో కానీ, కొత్త పెట్టుబడులు తీసుకు రాక పోగా, ఉన్న వాటి పై కక్ష తీర్చుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలోనే కాక, ప్రపంచ వ్యాప్తంగా బ్యాటరీల ఉత్పత్తిలో అమర్‌రాజా బాటరీస్ కంపెనీకి మంచి పేరు ఉంది. చిత్తూరు జిల్లాలో ఈ సంస్థకు మూడు ప్లాంట్ల వరకు ఉన్నాయి. దాదాపుగా ఆరు వేల మంది ఉద్యోగులు, ఈ కంపెనీలో ఉపాధి పొందుతున్నారు. ఇలాంటి కంపెనీని ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమేసే దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నిద్ర పట్టేలా లేదు. నాలుగు నెలల క్రిందట, ఆ కంపెనీకి గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూమిని వెనక్కు తీసుకోవటానికి ప్రయత్నాలు చేయగా, కోర్టు ఆదేశాలతో అది కుదరలేదు.
దీంతో ఇప్పుడు రూట్ మార్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు ఇచ్చింది అంటూ, అమర్‌రాజా బాటరీస్ కు సంబందించిన ప్లాంట్స్ అన్నీ మూసేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ కంపెనీ కాలుష్య నియంత్రణ చర్యలు పాటించటం లేదు అంటూ, కంపెనీ మూసేయాలని ఆదేశించారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల పై, అమర్‌రాజా బాటరీస్ స్పందించింది. ఆ ఉత్తర్వులు పరిశీలిస్తున్నాం అని, తగిన రీతులో దీనికి సమాధానం ఇస్తాం అని చెప్పారు. తాము అన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నామని, పర్యావరణ పరిరక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని, తెలిపారు. అయితే అమర్‌రాజా బాటరీస్, గుంటూరు టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ ది కావటంతోనే, ప్రభుత్వం ఇలా కక్ష సాధింపుకు పాల్పడుతుందని, తెలుగుదేశం ఆరోపిస్తుంది. అమర్‌రాజా బాటరీస్ కు ఇది షాక్ కాదని, అక్కడ పని చేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు షాక్ అని, అధిక పన్నులు ఈ కంపెనీ నుంచి తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ అని వాపోయారు.