కో-వి-డ్ రెండోదశ వ్యాప్తి తీవ్రంగా ఉందని, దానితో పాటు దురదృష్టవశాత్తూ కొన్ని దారుణాలు జరుగుతున్నాయని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వాపోయారు. కొద్దిరోజుల క్రితం విజయనగరంలో ఆక్సిజన్ అందక కొందరు కోవిడ్ బాధితులు చనిపోతే, ఈరోజు కర్నూల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అదేవిధంగా చనిపోయారని, ఆ ఘటన అత్యంత బాధాకరమని, మృతుల కుటుంబసభ్యులకు టీడీపీ తరుపున ప్రగాఢసానుభూతి తెలియచేస్తున్నామని పట్టాభిరామ్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే "రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ లభించదు, వ్యాక్సిన్లు అందుబాటులో ఉండటం లేదు. రెమ్ డెసివర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్లో రూ. లక్ష, రూ.లక్షన్నరకు అమ్ముకుంటున్నారు. కో-వి-డ్ బారిన పడితే బతకగలమా అన్న భయంతో చాలామంది చనిపోతున్నారు. కో-వి-డ్ వైరస్ వ్యాప్తిచెందడం ప్రారంభమై సంవత్సరం దాటిపోయినా, ముఖ్యమంత్రి పూర్తి అశ్రద్ధతో వ్యవహరిస్తు న్నాడు. ఎంతసేపూ ప్రతిపక్షనాయకులపై కక్షసాధింపులతో మూర్ఖత్వంతో వ్యవహరిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా కో-వి-డ్ బారినుంచి ప్రాణాలు కాపాడాలంటే, అందరూ చెబుతున్నది వ్యాక్సినేషన్ వేయించుకోవాలని. అటువంటి వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి ప్రపంచవ్యాప్తంగా, దేశంలో ఉన్న వైద్యనిపు ణులు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. రాష్ట్రంలో రోజూ 17 నుంచి 18వేలకేసులు నమోదవుతున్నా యి. మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మే 1నుంచి 18 నుంచి45 ఏళ్ల వారికి వ్యాక్సిన్లు ఇస్తామని చెప్పి, ఇప్పుడు సెప్టెంబర్ వరకు తమ వల్ల కాదని ముఖ్యమంత్రి అంటున్నాడు. సీరమ్ సంస్థగానీ, భారత్ బయోటెక్ గానీ మనదేశంలో వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తున్నాయి. ఆ రెండు కంపెనీలకు తమ రాష్ట్రానికి ఇన్ని వ్యాక్సిన్లు కావాలని ముఖ్యమంత్రి ఏనాడైనా కోరారా? కేంద్రప్రభుత్వం అనుమతిచ్చింది.. రాష్ట్రాలు నేరుగా వ్యాక్సిన్లు కొనుగోలుచేయవచ్చని చెప్పింది. అయినాకూడా ఈ ముఖ్యమంత్రి రాష్ట్రం తరుపున వ్యాక్సిన్లుకావాలని ఆరెండు సంస్థలను ఎందుకు కోరలేదు.
ఇదేనా ప్రజల ప్రాణాల పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధి. పొరుగు రాష్ట్రాలను గమనిస్తే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే 12కోట్ల వ్యాక్సిన్లు కావాలని, అందుకు అవసరమైన సొమ్ముని సింగిల్ చెక్ లో అందిస్తానని చెప్పడం జరిగింది. మహారాష్ట్రతో పాటు, అనేక రాష్ట్రాలు లక్షలకొద్దీ వ్యాక్సిన్లు కొంటుంటే, ఈముఖ్యమంత్రి ఉన్న సొమ్ముని ఎలాదిగమిం గుదామా... సొంత ఖజానా ఎలా నింపుకుందామా అనే ఆలోచనలతో ఉన్నాడు. ప్రజలకోసం పైసా కూడా ఎందుకు ఖర్చు చేయడం లేదని నేడు ప్రశ్నిస్తున్నాం. మహారాష్ట్రతో పాటు, రాజస్థాన్ 3.75 కోట్ల వ్యాక్సిన్లు, తమిళనాడు కోటిన్నర వ్యాక్సిన్లకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఒడిశా కోట్లాది వ్యాక్సిన్ల కొనుగోలు ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. మే 1 నాటికి సీరమ్ నుంచి 40లక్షల వ్యాక్సిన్లు, జూన్ లో మరో 80లక్షలు, జూలై లో మరో 80లక్షలు, ఆగస్ట్ లో 80లక్షల వ్యాక్సిన్ల కొనుగోలు కు ఆరాష్ట్రం ఇప్పటికే సిద్ధమైంది. దాదాపు 3కోట్ల వ్యాక్సిన్లను సీరమ్ ఇన్ స్టిట్యూట్, భారత్ బయోటెక్ నుంచి కొనుగోలు చేయడానికి ఒడిశా ప్రభుత్వం అంతా సిద్ధం చేసుకుంది. ఢిల్లీ ఇప్పటికే 70 లక్షల వ్యాక్సిన్ల కొనుగోలుకు పేమెంట్ చేసింది. పంజాబ్ 30లక్షల వ్యాక్సిన్లు కొనడానికి సీరమ్ సంస్థతో సంప్రదింపులు జరుపుతోంది. మరి జగన్ రెడ్డి ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క వ్యాక్సిన్ కొనుగోలుకు కూడా ఎందుకు ముందుకురాలేదు? భారత్ బయోటెక్ సంస్థతో మాట్లాడటానికి ఈ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి?
18 నుంచి 45ఏళ్ల వయస్సువారికి రెండు డోసుల చొప్పున ఇవ్వాలంటే మొత్తం 4కోట్ల వ్యాక్సిన్లు కావాలి. సీరమ్ ఇన్ స్టిట్యూట్ వారి కోవిషీల్డ్ గానీ, భారత్ బయోటెక్ కోవాగ్జిన్ గానీ ఒక్కో వ్యాక్సిన్ రూ.400లకు దొరుకుతోంది. 4కోట్ల వ్యాక్సిన్లు ఒక్కోటి రూ.400లు వేసుకున్నా, రూ.1600కోట్లు అవుతుంది. జగన్ రెడ్డి సర్కారు రూ.1600 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా లేదా? ప్రజల ప్రాణాలు కాపాడటానికి ఈ ప్రభుత్వం అంతమాత్రం కూడా ఖర్చు చేయలేదా? కేంద్రప్రభుత్వం రూ.8,873కోట్ల ఎస్ డీ ఆర్ఎఫ్ నిధులను వివిధ రాష్ట్రాలకు ప్రజారోగ్యం దృష్ట్యా చెల్లించాలని నిర్ణయించింది. అందులో భాగంగా కొన్ని నిధులు రాష్ట్రానికి వస్తాయి. మూలధనవ్యయం కింద కేంద్ర ప్రభుత్వం దేశంలోని వివిధ రాష్ట్రాలకు రూ.15వేల కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. దానిలోభాగంగా రూ.299కోట్లను ఏపీకి విడుదలచేయడం కూడా జరిగింది. ఎస్డీఆర్ఎఫ్ ఫండ్ కింద కేంద్రం వివిధరాష్ట్రాలకు రూ.8,873కోట్లు ఇవ్వనుంది. కేంద్రం ఇచ్చే నిధులతో వ్యాక్సిన్లు కొనుగోలు చేయడానికి ఏపీ ప్రభుత్వం ఎందుకు ముందుకురావడం లేదు? ఏ కాంట్రాక్టర్ కు ఎంత చెల్లింపులుచేద్దాం.. ఎవరికి దోచిపెడదామనే దుర్భుద్ధి తప్ప, ప్రజల ప్రాణాలుపట్టవా? పిచ్చిపిచ్చి ప్రకటనలకు ప్రభుత్వసొమ్ము తగలేయకుండా, తక్షణమే రూ.1600కోట్లతో వ్యాక్సిన్లు కొనుగోలుచేయాలని జగన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాము.