గత 20 రోజులుగా రాష్ట్రంలో కరోనా భయం కంటే ఎక్కువగా, పదవ తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణ పై, టెన్షన్ నెలకొంది. ఈ సమయంలో పరీక్షలు పెడితే, ఏమి అవుతుందో అని అందరూ కంగారు పడుతున్నారు. మరో పక్క లోకేష్ ఈ విషయం పై పోరాడుతున్నారు. పిల్లలతో, తల్లిదండ్రులతో సెషన్స్ పెట్టి, ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చారు. చివరకు న్యాయ పోరాటం కూడా చేసారు. హైకోర్టులో మొన్న గట్టి వాదనలు వినిపించారు. దీంతో హైకోర్టు ప్రభుత్వాని, మరోసారి తమ నిర్ణయం సరి చూసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే కోర్టు ఒక అంచనాకు వచ్చింది, మనకు ఇబ్బందులు వస్తాయని అనుకున్నారో ఏమో కానీ, ఈ రోజు ప్రభుత్వం ఇంటర్ పరీక్షలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యార్ధులు ఊపిరి పీల్చుకున్నారు. నారా లోకేష్ గట్టిగా పోరాటం చేయకపోతే, కోర్టులో కేసు వేయకపోతే, ప్రభుత్వం దిగి వచ్చేది కాదని, లోకేష్ కు ధన్యవాదాలు చెప్తున్నారు. అలాగే ఈ పోరాటంలో సహకారం అందించిన రఘురామకృష్ణం రాజు గారికి, కేఏ పాల్ గారికి కూడా ధన్యవాదాలు చెప్పారు. మొత్తంగా ఏది అయితే ఏమి, ప్రజల పోరాటానికి, ప్రభుత్వం దిగి వచ్చింది. ఇంకా పట్టుదలకు పోకుండా, కనీసం ఒక రోజు ముందు అయినా వాయిదా వేయటం శుభ పరిణామం.
news
ఐప్యాక్, రాజకీయ సలహాదారు పదవి నుంచి తప్పుకున్న ప్రశాంత్ కిషోర్...
ప్రస్తుతం రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిషోర్ పేరు మారు మొగి పోతుంది. ఈ రోజు ప్రకటించిన అయుదు రాష్ట్రాల ఎన్నికల్లో, రెండు రాష్ట్రాలలో ఆయన రాజకీయ సలహదారుగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ లో మమత పార్టీకి, తమిళనాడులో స్టాలిన్ పార్టీకి ఆయన రాజకీయ సలహదారుగా ఉన్నారు. రెండు చోట్లా ఆయన భారీ విజయం అందించారు. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ మూడు అంకెల స్కోర్ దాటదు అని చెప్పి ముందే చాలెంజ్ చేసారు. దాటితో, నేను సలహదారు పదవి నుంచి వెళ్ళిపోతా అని చెప్పారు. అయితే ఇప్పుడు బీజేపీ రెండు అంకెల స్కోర్ దాటక పోయినా, ప్రశాంత్ కిషోర్ రాజకీయ సలహాదారు పదవి నుంచి తప్పుకుంటున్నారు. ఇక ఏ రాజకీయ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా ఉండను అని, ఐప్యాక్ నుంచి బయటకు వచ్చేస్తాన్నా అని చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఇప్యాక్ ని ఇక నుంచి తన సహ ఉద్యోగులు నడుపుతారని చెప్పారు. తాను మాత్రం రాజకీయ వ్యూహకర్తగా ఉండను అని, వేరే ఇంకా ఏదో తాను జీవితంలో చేయాలనీ అనుకుంటున్నా అని అన్నారు. ఏమి చేయాలని ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. అయితే ఈ రోజు దేశం మొత్తం ప్రశాంత్ కిషోర్ పేరు కలవరిస్తున్న సమయంలో, ఆయన తాను తప్పుకుంటున్నా అని చెప్పటం, అందరినీ ఆశ్చర్య పరుస్తుంది.
అయితే ఆయన రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. బీహార్ నుంచి గట్టిగా ఏదో ప్లాన్ చేస్తున్నారని వినికిడి. అదే విధంగా మమత కూడా, రాజ్యసభ టికెట్ ఇస్తారు అనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. మొత్తానికి ప్రశాంత్ కిషోర్ నిర్ణయం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఒక వైపు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు, సమాజాన్ని విడదీసి, చిచ్చు పెట్టి, ఓట్లు వేసుకుంటారు అనే అభియోగాలు ఉన్నా, రాజకీయం అనే వార్ లో, ఏది తప్పు కాదు అని సమర్ధించే వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో జరిగిన పరిణామాలు ప్రశాంత్ కిషోర్ పట్ల తీవ్ర వ్యతిరేకత తీసుకుని వచ్చాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, కుల పరంగా చిచ్చు పెట్టి, ఒక కులం పై ద్వేషం పెంచేలా చేసి, సక్సెస్ అయ్యారు. అయితే తరువాత వచ్చిన జగన్ మోహన్ రెడ్డి, అభివృద్ధి అనే మాట మర్చిపోయి, అప్పులు చేసి సంక్షేమం చేస్తూ, రాష్ట్రాన్ని వెనక్కు తీసుకుని వేల్లిపోయారని, ఇందులో ప్రశాంత్ కిషోర్ పాత్రఅధికం అని చెప్పే వారు ఉన్నారు. ఇది పక్కన పెడితే, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఏమి చేస్తారో చూడాలి.
ధూళిపాళ్ల ఏసిబి కస్టడీ పై అర్ధరాత్రి ట్విస్ట్...
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధూళిపాళ్ల నరేంద్రపై, అలాగే సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్, మరో మాజీ అధికారి గురునాథంల పై ఏసిబి కేసు పెట్టి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం జరిగిన భూబదలాయింపుకు, అప్పుడు సంగం డైరీ చైర్మెన్ గా కూడా లేని ధూళిపాళ్ల నరేంద్రపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు. అయితే ఏసిబి కోర్టులో, ఏసిబి వేసిన కస్టడీ పిటీషన్ పై, ఏసిబి కోర్టు స్పందిస్తూ, నాలుగు రోజులు కస్టడీకి ఇచ్చింది. అయితే ధూళిపాళ్ల నరేంద్ర, అసలు ఈ కేసునే క్వాష్ చేయాలి అంటూ, హైకోర్టులో కేసు వేసారు. ఈ కేసు విచారణ హైకోర్టులో ఉండగానే, ఏసిబి ధూళిపాళ్ల నరేంద్రను కస్టడీలోకి తీసుకుంది. నిన్న మొదటి రోజు విచారణ కూడా జరిగింది. అయితే ఈ కస్టడీ పై, ధూళిపాళ్ల నరేంద్ర న్యాయవాదులు హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు. దీని పై నిన్న హైకోర్టులో వాదనలు జరిగాయి. హైకోర్టు స్పందిస్తూ, వెంటనే ధూళిపాళ్ల నరేంద్రను కస్టడీకి ఇస్తూ, ఏసిబి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపి వేసింది. ధూళిపాళ్ల నరేంద్రతో పాటుగా , సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్, మరో మాజీ అధికారి గురునాథంల కస్టడీ ఉత్తర్వులు కూడా హైకోర్టు నిలిపి వేసింది. వారిని విజయవాడ సబ్ జైలు నుంచి, రాజమండ్రి కేంద్ర కార్యాలయానికి తరలించాలని ఆదేశాలు ఇచ్చింది.
ఈ కేసు తదుపరి విచారణను , సోమవారానికి వాయిదా వేస్తూ, హైకోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు జస్టిస్ ఆర్.రఘునందన్‌రావు బెంచ్, ఈ కేసు విచారణ చేసి, ఏసిబి ఉత్తర్వులు నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో హైకోర్టు ఆదేశాలు ప్రకారం, ఈ రోజు వారిని రాజామండ్రి తరలించే అవకాసం ఉంది. మరో పక్క నిన్న ఏసిబి అధికారులు మొదటి రోజు విచారణ చేసారు. ఈ సందర్భంగా, ఆయనను రాజమండ్రి నుంచి విజయవాడ గొల్లపూడిలో ఉన్న ఏసిబి కార్యాలయానికి తీసుకుని వచ్చారు. రాజమండ్రి జైలు వద్ద, ఏసిబి కార్యాలయం వద్ద, ఆయన కుటుంబ సభ్యులు ఆయన్ను కలవటానికి ప్రయత్నం చేసారు. నరేంద్ర తల్లి ప్రమీలాదేవి, భార్య జ్యోతిర్మయి, కుమార్తె, నరేంద్రను చూసేందుకు వచ్చారు. అయితే వారిని పోలీసులు మాత్రం అనుమతించలేదు. ముఖ్యంగా ఆయన కుమార్తె, కారు వద్దకు వచ్చి, ఒక్కసారి గ్లాసెస్ దించండి, ఆయనతో మాట్లాడాలి అని వేడుకున్నా, పోలీసులు మాత్రం కుదరదు అని చెప్పారు. ఈ సంఘటన అక్కడ ఉన్న వారిని బాధ కలిగించింది.
దొంగ ఓట్ల తమాషా చూద్దామని, ఇక్కడే కూర్చున్నా... పనబాక లక్ష్మి ఫస్ట్ రియాక్షన్...
ఈ రోజు అయుదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పాటు, తిరుపతి ఉప ఎన్నికల ఫలితం కూడా వస్తుంది. అయితే తిరుపతి ఉప ఎన్నికలో హోరా హోరీ నడుస్తుందని, ఎన్నిక జరిగే ముందు వరకు అందరూ భావించారు. అయితే ఎన్నిక జరిగిన తీరు, ఒక ఉత్సవంలా, ఒక మేళా లాగా ఉప ఎన్నిక జరిగిన తీరు చూసి, అన్ని వేల దొంగ ఓట్లు పడ్డ తరువాత వైసీపీ గెలుస్తుందని అందరూ ఒక అంచనాకు వచ్చారు. అయితే ఇన్ని దొంగ ఓట్లు వేసి, వాలంటీర్లతో పధకాలు పీకుతాం అని బెదిరించి, పోలీసులను ఉపయోగించి, ఇవన్నీ చేసిన తీరు చూసి, 5 లక్షల మెజారిటీ దాటి పోతుందని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు వస్తున్న ట్రెండ్స్ చూస్తుంటే, 2, 2.5 లక్షల వరుకే మెజారిటీ వచ్చే అవకాసం కనిపిస్తుంది. అంటే పోయిన సారి వచ్చిన మెజారిటీ కానీ, అంత కంటే తక్కువ కానీ మెజారిటీ వచ్చే అవకాసం కనిపిస్తుంది. అంటే, దొంగ ఓట్లు లెక్క తీసేస్తే, హోరా హోరీ పోరు జరిగిందనే అర్ధం అవుతుంది. ఇప్పటి వరకు, వైసీపీ కి 2,29,424(55.9 శాతం) ఓట్లు, టీడీపీకి 1,33,613(32.5 శాతం) ఓట్లు, బీజేపీ పార్టీకి 23,223(5.7 శాతం) ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 94 వేల మెజారిటీతో వైసీపీ ఉంది. ఇంకా సగం లెక్కింపు మిగిలి ఉంది. ఇక పొతే, ఉదయం మొదటి రౌండ్ ఫలితం చూసి, పనబాక లక్ష్మి కౌంటింగ్ కేంద్రం ఉంచి వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి.
ఆ వార్తలను పనబాక లక్ష్మి ఖండించారు. తానూ కౌంటింగ్ కేంద్రంలోనే ఉన్నాయని అన్నారు. ఆ వార్తలను కొట్టి పారేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరగలేదని తెలిసినా, తన వంతు బాధ్యతగా కౌంటింగ్ కేంద్రం వద్దే ఉన్నానని అన్నారు. దొంగ ఓట్ల తమాషా చూడటానికి ఇక్కడే కూర్చున్నా అంటూ, వ్యంగ్యంగా స్పందించారు. జరగాల్సింది అంతా ముందే ప్లాన్ ప్రకారం జరిగిపోయిన విషయం అందరికీ తెలుసు అని, వీళ్ళ తమాషా ఏంటో చూద్దామని కౌంటింగ్ కేంద్రం వద్దే ఉన్నానని, ఇక్కడ నుంచి వెళ్ళిపోయానని వస్తున్న వార్తలు అన్నీ అబద్ధం అని అన్నారు. ఇక మరో పక్క 5 లక్షల మెజారిటీ అని, 5 లక్షల మెజారిటీ రాకపోతే రాజీనామా చేస్తానని, ఇలా అనేకం చెప్పిన వైసీపీ మంత్రులు ఇప్పటి వరకు స్పందించ లేదు. గెలుస్తున్నాం కదా, ఇది మా ప్రజా విజయం ఇది అదీ అంటూ రొటీన్ గా వాడే డైలాగ్స్ చెప్తున్నారు. ఇప్పటి వరకు సగం ఓటింగ్ కౌంటింగ్ పూర్తి అవ్వగా, ఇంకా సగం మిగిలి ఉంది. గతంలో వచ్చిన మెజారిటీ వస్తుందా, అంత కంటే ఎక్కువ ఎంత వస్తుంది అనే దాని పై ఇప్పుడు చర్చ నడుస్తుంది.