తెలుగుజాతి ఆత్మగౌరవ పతాకం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా అరుదైన గౌరవం దక్కింది. రూ. 100 రూ. నాణెంపై ఎన్టీఆర్ చిత్రపటం ముద్రణ పై కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా రూ.100 వెండి నాణెం ముద్రణకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ నాణెం తయారీలో 50 శాతం వెండి,40 శాతం రాగి,5 శాతం నిఖిల్,5 శాతం జింకుతో కూడిన మెటీరియల్ ఉండాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. త్వరలో మార్కెట్ లోకి వంద నాణెం విడుదల చేయనున్నారు. కథానాయకుడిగా, మహానాయకుడిగా, తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా తెలుగుజాతి కీర్తి కిరీటమైన నందమూరి తారకరామారావు శతజయంతి సందర్భంగా వంద నాణెం విడుదల చేయడం ఆయనకి దక్కిన అరుదైన గౌరవంగా తెలుగు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
news
2024 సన్ `రైజ్` ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశమే.. సంచలనం సృష్టిస్తోన్న సర్వే
తెలుగుదేశం పార్టీ మూడు పట్టభద్రుల స్థానాల్లో విజయం సాధించిన ఆనంద క్షణాల్లో మరో సర్వే టిడిపి విజయభేరీని కన్ ఫామ్ చేసింది. షెడ్యూల్ ప్రకారం 2024లో ఎన్నికలు జరిగితే టిడిపినే అధికారంలోకి వస్తుందని తేటతెల్లం చేసింది. టిడిపికి 95 సీట్లు వస్తాయని సర్వే ఫలితాలలో వెల్లడించింది. ఢిల్లీలో ఉన్న రైజ్ అనే సర్వే సంస్థకీ తెలుగు రాష్ట్రాలలో ప్రవీణ్ పుల్లట సీఈవోగా వ్యవహరిస్తున్నారు. జర్నలిస్టుగా ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా సంస్థలలో 20 ఏళ్లుగా పనిచేశానని, తన అనుభవం రంగరించి రైజ్ సంస్థ సహకారంతో ఈ సర్వే చేపట్టానని ఆయన వెల్లడించారు. ఫీల్డ్ సర్వే, శాస్త్రీయబద్ధంగా శాంపిళ్ల సర్వేని తన టీము చేయగా.. రైజ్ సాఫ్ట్‌వేర్‌తో అందించిందని తెలిపారు. అదాన్ టివి తెలుగు ద్వారా ఈ సర్వే వివరాలు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు మాసాలు, వందలాది మంది అనుభవజ్ఞులు చేసిన సర్వే ఇదని తెలిపారు. సెలెక్టివ్-ర్యాండమ్ మోడ్ అనుసరిస్తూ ఒక్కో నియోజకవర్గంలో 900 శాంపిళ్లు తీసుకున్నారు. జర్నలిస్టులు, పింఛనర్లు, మహిళలు, ఉద్యోగులు, రైతులు, విద్యార్థులు, యువత, వ్యాపారుల నుంచి కూడా శాంపిళ్లు తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులలో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని, షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగడానికి ఏడాది పైగానే ఉండడంతో ఈ వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉందని..టిడిపి సింగిల్‌గా పోటీచేసినా 85-95 సీట్లు గెలుచుకోవచ్చని సర్వే తేల్చింది. వైసీపీ 60-70 సీట్లు తెచ్చుకునే అవకాశాలున్నాయని, అధికారానికి దూరంలో ఆగిపోతుందని సర్వేలో గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఢిల్లీ సంస్థ తాజా సర్వే... వైసీపీ మంత్రులు, మాజీ మంత్రులు ఓటమి బాటే
మరో కొత్త సర్వే వచ్చింది. వైసీపీ గుండెల్లో గుభేల్మమనే గణాంకాలు మోసుకొచ్చింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ మూడు స్థానాల్లో ఎదురైన పరాభవం మరిచిపోక ముందే మరో పరాజయం తప్పదనే సర్వే వైసీపీలో ప్రకంపనలు రేపుతోంది. రైజ్ అనే ఢిల్లీ బేస్డ్ సంస్థ చేసిన సర్వేలో మంత్రులు చాలా మంది ఓడిపోతారని తేల్చేసింది. మాజీ మంత్రులు కూడా ఓటమి తప్పదని వెల్లడించింది. రైజ్ సర్వే వెల్లడించిన దాని ప్రకారం మంత్రులు గుడివాడ అమర్ నాథ్, పినిపే విశ్వరూప్, కొట్టు సత్యనారాయణ, జోగి రమేష్, అంబటి రాంబాబు, రోజాలు ఏం చేసినా గెలిచే పరిస్థితి లేదట. మాజీ మంత్రులు పేర్నినాని, మేకతోటి సుచరిత, అనిల్ కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబు,చెరుకువాడ శ్రీరంగనాథ రాజులు దారుణ పరాజయం పాలు కాక తప్పదని సర్వే సంస్థ రైజ్ గణాంకాలు ముందు పెట్టి మరీ ప్రకటించింది.
మూడు పట్టభద్రుల సీట్ల గెలుపు వెనుక చంద్రబాబు వ్యూహం ఇదే..
పట్టభద్రుల ఎన్నికలు తెలుగుదేశం పార్టీలో జోష్ నింపాయి. ఉమ్మడి జిల్లాలు 13లో 9 జిల్లాల పరిధిలో 108 నియోజకవర్గాలలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మూడుకి మూడు సీట్లూ గెలిచేయడంతో కేడర్‌లో నవ్యోత్సాహం, లీడర్లలో ఊపు వచ్చింది. అయితే ఇది తెలుగుదేశం గొప్పతనం కాదని, ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత అనే విశ్లేషణలు ఓ పక్క ఉన్నాయి. ఉద్యోగులు, యువత వైసీపీ పాలనలో ఉన్న ఆగ్రహమే తెలుగుదేశం అభ్యర్థుల విజయం అంటున్నారు కొందరు. కానీ అసలు విషయం వేరే ఉంది. చంద్రబాబు వ్యూహాలు పార్టీ నేతలకే అంతుబట్టవు. అవి విజయాన్ని సాధించి పెట్టాయి. పరాజయం ముంగిట నిలిపాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకి వచ్చేసరికి మూడు ప్రాంతాల్లోనూ అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు చాణక్యం పనిచేసింది. ఉత్తరాంధ్రలో ముందుగా బీసీ వర్గానికి చెందిన ఓ మహిళా అభ్యర్థి గాడు చిన్ని లక్ష్మకుమారి పేరు ప్రకటించారు. ఎన్నికలకు సరిగ్గా నెల ముందు వేపాడ చిరంజీవిని రంగంలోకి దింపారు. ఉత్తరాంధ్రలో అతి ఎక్కువ సామాజికవర్గం వారికి దగ్గరైన కులం కావడం, పట్టభద్రులకు, ఉద్యోగులకు ఎకానమీ చిరంజీవిగా సుపరిచితులు కావడం, ఆర్థికంగా బలమైన నేపథ్యం కలిసి వచ్చాయి. ఉత్తరాంధ్ర టిడిపి అభ్యర్థి మార్పు తిరుగులేని విజయానికి మలుపుగా మారింది. తూర్పు రాయలసీమ నుంచి కంచర్ల శ్రీకాంత్ ని ప్రకటించినప్పుడు పార్టీలో కొందరు నేతలు పెదవి విరిచారు. విద్యావంతుడు, సామాజికమాధ్యమాల పట్టు తెలిసిన వాడైన శ్రీకాంత్ పార్టీ లీడర్లతో సమన్వయం సాధించుకుంటూ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక పశ్చిమ రాయలసీమ నుంచి టిడిపి దింపిన భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని వైసీపీ తక్కువ అంచనా వేసి బొక్కబోర్లా పడింది. జగన్ రెడ్డి నక్కజిత్తుల వ్యూహాలు, బలాలు-బలహీనతలు అన్నీ తెలిసిన పులివెందుల వాసి కావడంతో పోరాడి గెలిచాడు. టిడిపి మద్దతుతో గెలిచిన ముగ్గురు కూడా రాజకీయ వారసులు కారు. పెద్ద పదవులకి ముందుగా పోటీ చేసిన వారు కాదు. ముగ్గురూ మూడు సామాజికవర్గాలు. ముగ్గురూ ఉన్నత విద్యావంతులే. సమాజంతోని-యువతతోని సంబంధాలున్న వారే కావడంతో గెలుపు పలకరించింది. చంద్రబాబు చాణక్యం అంటే ఇదే అని నిరూపించింది.