ఆస్తి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను లిఖితపూర్వకమైన కారణాలు చూపకుండా తిరస్కరించరాదని హైకోర్టు తీర్పుని చ్చింది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని లిఖితపూర్వకంగా తెలియజేయా లని స్పష్టం చేసింది. అలా కాకుండా మొత్తంగా డాక్యుమెంట్లను తిరస్కరించడం చట్ట విరుద్ధమని తేల్చి చెప్పింది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు సంబంధించి రాష్ట్రం లో పలు ప్రాంతాల నుంచి కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు అందుతున్నాయని నిబంధనల ప్రకారం వ్యవహరించేలా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయా లసు హైకోర్టు ఉత్తర్వులు అందేలాసంబంధిత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల విభాగం ఐజీకి పంపాలని హైకోర్టు ధర్మాసనం రిజిస్ట్రీని ఆదేశించింది. నెల్లూరు జిల్లా కావలి మునిసిపల్ పరిధిలో ఇల్లు రిజిస్ట్రేషన్ నిమిత్తం సమర్పించిన డాక్యుమెం ట్లను కావలి సబ్ రిజిస్ట్రార్ తిరస్కరించటాన్ని సవాల్ చేస్తూ నాగసూరి మహేశ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గా ప్రసాదరావు విచారణ అనంతరం తీర్పును వెలువరించారు. పిటిషన్ తరుపున న్యాయవాది టీసీ కృషన్ వాదనలు వినిపిస్తూ డాక్యుమెంట్ సమర్పించినప్పుడు అధికారులు పరిశీలన జరిపి అభ్యంతరాలు ఉంటే స్టాంప్ ఫీజు వసూలు చేయాలని ఆపై రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందన్నారు.
డాక్యుమెంట్ లోని ఆస్తి రిజిస్ట్రేషన్ ట్టంలోని సెక్షన్ 22 ఏ పరిధిలోకి వస్తే ఆ విషయాన్ని లిఖితపూర్వకంగా వివరిస్తూ తిరస్కరించే వీలుందన్నారు. ఈ కేసులో సబ్ రిజిస్ట్రార్ కారణాలు లేకుండా తిరస్కరించారని కోర్టు దృష్టికి తెచ్చారు. న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు స్పందిస్తూ సబ్ రిజిస్టార్లు కారణాలు లేకుండా తమ రిజిస్టేషన్ డాక్యుమెంట్లను తిరస్కరిస్తున్నారంటూ పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖల వుతున్నాయని నిర్దిష్టమైన కారణాలతో తిరస్కరిస్తే వాటిని లిఖితపూర్వకంగా తెలియజేయటంతో పాటు రిజిస్ట్రేషన్ తిరస్కరణ పేరుతో బుక్-2లో నమోదు చేయాలని చట్టంలో స్పష్టంగా ఉందన్నారు. ఈ కేసులో కావలి సబ్ రిజిస్ట్రార్ నిబంధనలు పాటించటంలో విఫలమయ్యారని పిటిషనర్ సమర్పించే డాక్యు మెంటు చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ చేయాలని తీర్పుని చ్చారు. డాక్యుమెంట్లను కారణాలు లేకుండా తిరస్కరించటం నిబంధనలను అతిక్రమించడంతో పాటు విధి నిర్వహణలో దుష్ప్రవర్తన కిందకు వస్తుందని వ్యాఖ్యానించారు. ఈ ఆదేశాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలన్నింటిలో అమలు చేయాలని ఆదేశించారు. డాక్యుమెంట్ల స్వీకరణ, తిరస్కరణ విషయంలో ఇకపై హైకోర్టులో ఇదే తరహా వ్యాజ్యాలు దాఖలైతే, సబ్ రిజిస్ట్రార్లను బాధ్యులుగా చేస్తూ కోర్టు ముందుకు హాజరు పరచాల్సి ఉంటుందని న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు హెచ్చరించారు.