తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి, ఆంధ్రప్రదేశ్ పై ఎప్పుడూ చిన్న చూపే. ఉద్యమం సమయంలో ఆయన ఆంధ్రా వారి పై చేసిన వ్యాఖ్యలు, ఆంధ్రా ప్రాంతం పై చేసిన కించ పరిచే వ్యాఖ్యలు ఎవరూ మర్చిపోరు. ఇక ముఖ్యమంత్రి అయిన తరువాత, ఈ ధోరణి కొంత తగ్గినా, అప్పుడప్పడు ఏపి దిగజారిన పరిస్థితి వివరిస్తూ, తెలంగాణా ఎంతో గొప్పగా చేసిందని చెప్పుకుంటూ ఉంటారు. రెండు మూడు నెలల క్రితం హరీష్ రావు, మాట్లాడుతూ, ఆఫ్ట్రాల్ నాలుగు వేల కోట్లు అప్పు కోసం, రైతులకు మీటర్లు పెట్టే విషయం పై, కేంద్రం ముందు జగన్ వంగి పోయాడు అంటూ హేళన చేసారు. అంతకు ముందు ఒక రియల్ ఎస్టేట్ సమ్మిట్ లో కూడా, హేళనగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందో చూసారుగా అంటూ హరేశ్ రావు చేసిన వ్యాఖ్యలు అందరికీ గుర్తున్నాయి. గతంలో చంద్రబాబు ముఖ్యంత్రిగా ఉన్న సమయంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోయింది. అమరావతి నిర్మాణంతో, ఒక ఊపు వచ్చింది. ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల నిర్మాణం, ఫ్లై ఓవర్ లు, కంపెనీల పెట్టుబడులు, రోడ్డులు నిర్మాణం, మౌళిక వసతులకు పెద్ద పీట, ఇలా అన్ని అంశాలతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దూసుకుపోయింది. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తరువాత పరిస్థితి మొత్తం రివర్స్ అయ్యింది.
అభివృద్ధి లేదు, ఆదాయం తగ్గిపోతుంది, ఖర్చులు పెరిగిపోతున్నాయి, అప్పులతో నెట్టుకుని వస్తున్నాం. రాజధాని నిర్మాణం ఆగిపోయింది, అభివృద్ధి లేదు, కంపెనీల పెట్టుబడులు లేవు. దీంతో ఏపి రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఇదే అదనుగా, తెలంగాణా ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకుంది. పెట్టుబడులు మొత్తం అక్కడకు వెళ్ళటంతో, రియల్ ఎస్టేట్ రెట్లు రివర్స్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఇదే విషయం కేసీఆర్ అసెంబ్లీ లో ఈ రోజు చెప్పారు. తెలంగాణా రాష్ట్రంలో ఎక్కడా 15 లక్షలకు తక్కువ ఎకరం లేదని అన్నారు. గతంలో మన రియల్ ఎస్టేట్ పడిపోతుందని శాపనార్ధాలు పెట్టిన వారే, ఇప్పుడు పతనం అయ్యారని, ఏపిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసారు. గతంలో ఏపిలో ఎకరం అమ్ముకుని, ఆ డబ్బులతో, తెలంగాణాలో మూడు ఎకరాలు కోనేవారని, ఇప్పుడు తెలంగాణాలో ఎకరం అమ్మి, ఏపిలో మూడు ఎకరాలు కొంటున్నారు అంటూ, కేసీఆర్ మాట్లాడారు. ఇది నిజంగా ఏపి ప్రభుత్వం, ప్రజలు కూడా ఆలోచించాల్సిన అంశం. ఇలాగే అభివృద్ధి వైపు ఆలోచన చేయకుండా ఉంటే, మన ఆస్తుల విలువ ఇంకా ఇంకా పడిపోతుంది. ఉచిత పధకాలు అవసరం మేరకు పెట్టుకుని, ఇప్పటికైనా అబివృద్ది వైపు ఆలోచించాలి జగన్ గారు.