భారత దేశ అత్యున్నత న్యాయ స్థానం, సుప్రీం కోర్టుకు, కాబోయే చీఫ్ జస్టిస్ పై, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఫిర్యాదు చేయటం, ఈ దేశంలోనే సంచలనం. అది మన రాష్ట్రంలో జరగటం, కాబోయే చీఫ్ జస్టిస్ మన రాష్ట్రం వారు కావటం, అలాగే కంప్లైంట్ ఇచ్చింది, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కావటం, మన తెలుగు వారు చేసుకున్న దౌర్భాగ్యం అనుకోవాలి. గతంలో పీవీ నరసింహారావు గెలిస్తే ప్రధాని అవుతారని, తెలుగుదేశం పార్టీ పోటీ కూడా పెట్టకుండా, తెలుగు వాడికి ఇచ్చిన గౌరవం చూసిన వారు, ఈ ఘటన చూసి ఆవేదన చెందారు. ఇది పక్కన పెడితే, జస్టిస్ ఎన్వీ రమణ పై, జగన్ మోహన్ రెడ్డి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టులో ఉన్న ఏడుగురు జడ్జిల పై జగన్ ఫిర్యాదు చేసారు. చంద్రబాబుకి అనుకూలంగా వీళ్ళు తీర్పులు ఇస్తున్నారు అంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా కు చేసారు. ఫిర్యాదులో చంద్రబాబు, జస్టిస్ ఎన్వీ రమణకు లింక్ ఉంది అంటూ, తీవ్ర ఆరోపణలు చేసారు. ఫిర్యాదు పరిశీలించి తగిన విచారణ చేసి, ఆక్షన్ తీసుకోవాలని కోరారు. అయితే జగన్ మోహన్ రెడ్డి ఇలా చేయటం వలన, జస్టిస్ ఎన్వీ రమణ చీఫ్ జస్టిస్ కాకుండా కుట్ర పన్నుతున్నారు అంటూ, పలువురు విశ్లేషించారు. ఇదే విషయం హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పులో కూడా వచ్చింది.

sc 24032021 2

రాజకీయ నాయకుల పై కేసులు ఏడాదిలో పూర్తి చేయాలని ఎన్వీ రమణ తీర్పు ఇవ్వగానే, ఆయన్ను టార్గెట్ చేసారు అంటూ, ఆ తీర్పులో కూడా పేర్కొన్నారు. అయితే ఏది ఏమైనా ఒక ముఖ్యమంత్రి ఫిర్యాదు చేయటంతో, ఏమి జరుగుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో, ఈ రోజు జస్టిస్ ఎన్వీ రమణను తదుపరి చీఫ్ జస్టిస్ గా ప్రతిపాదిస్తూ, ప్రస్తుత చీఫ్ జస్టిస్ కేంద్రానికి లేఖ రాసారు. అయితే కొద్ది సేపటి క్రితమే, సుప్రీం కోర్టు నుంచి ఒక ప్రకటన వెలువడింది. జస్టిస్ ఎన్వీ రమణ పై, అక్టోబర్ 2020లో జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు పై, ఇన్ హౌస్ ఎంక్వయిరీ జరిగిందని, విచారణ జరిగిన అంతరం, ఆ పిటీషన్ ను డిస్మిస్ చేస్తున్నట్టు సుప్రీం కోర్టు తెలిపింది. విచారణలో ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో, జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు తప్పు అని తేలటంతో, సుప్రీం కోర్టు, ఆ ఫిర్యాదుని డిస్మిస్ చేసింది. దీంతో జగన్ చేసిన ఆరోపణలు అన్నీ తప్పు అని, ఏకంగా సుప్రీం కోర్టు ఇన్ హౌస్ ఎంక్వయిరీ తేల్చింది. ఇప్పటికైనా ఇలా తమకు నచ్చని వాళ్ళ పై బురద చల్లటం ఆపుతారో లేదో.

పరిహారం చెల్లించకుండా పోలవరం ప్రాజెక్ట్ పరిధిలోని గిరిజన గ్రామాలను తరలిస్తున్నారని, హైకోర్టులో పిటీషన దాఖలు అయ్యింది. పిటీషన్ పైన, హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. కొన్ని ఫోటోలతో కూడిన అడిషనల్ వివరాలు కూడా, పిటీషనర్ తరుపు న్యాయవాది, ఈ సందర్భంగా కోర్టుకు ఇచ్చారు. అదే విధంగా నిబంధనలకు విరుద్ధంగా ఎవరినీ ఖాళీ చేపించటం లేదని కూడా ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే ఈ అడిషినల్ గా వివరాలు ఏవి అయితే ఇచ్చారో, ఆ మెటీరియల్ ఇంకా కోర్టు ముందుకు రాలేదని, అదే విధంగా ప్రభుత్వం వేసిన అఫిడవిట్ కూడా న్యాయస్థానం ముందుకు రాలేదని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం కౌంటర్ తమ ముందుకు రాలేదని, పిటీషనర్ వేసిన అడిషనల్ వివరాలు కూడా అందుబాటులోకి రాలేదని హైకోర్టు పేర్కొంది. మరోసారి ఇవి కోర్టు ముందు ఫైల్ చేయాలని, న్యాయస్థానం, ప్రభుత్వాన్ని అదే విధంగా పిటీషనర్ ను ఆదేశించింది. దీంతో తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసారు. మొత్తం మీద నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా, వారిని అక్కడ నుంచి ఖాళీ చేపించటం పై, వేసిన పిటీషన్ పై మరింత జాప్యం జరిగే అవకాసం కల్పిస్తుంది.

hc 24032021 2

ఎందుకంటే పిటీషనర్ తరుపు నుంచి వేసిన ఆధారాలు కానీ, ప్రభుత్వం వైపు నుంచి వేసిన అఫిడవిట్ కానీ, రెండు కూడా న్యాయస్థానం ముందుకు రాకపోవటంతో, ఈ కేసు వాయిదా పడింది. ఈ సారైనా సరే, అన్ని ఆధారాలు సమయానికి సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. మరో పక్క ప్రభుత్వం పోలవరం విషయంలో కుప్పి గంతులు వేస్తూనే ఉంది. అసలు పోలవరం పూర్తి స్థాయి నిర్మాణం జరగకుండా, కేవలం ఒక స్థాయి వరుకే నీళ్ళు నింపుతారనే ప్రచారం రోజు రోజుకీ ఎక్కువ అవుతుంది. కేంద్రం కూడా 55 వేల కోట్లు ఇవ్వలేం అని, 20 వేల కోట్లు మాత్రమే ఇస్తాం అంటుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఏదో కంటితుడుపు చర్యలుగా లేఖలు రాస్తున్నారు కానీ, కేంద్రం పై ఒత్తిడి అయితే తేవటం లేదు. భూసేకరణ మొత్తం చేసి, నిర్వాసితులను పంపించాలి అంటే, రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరి వల్ల కాని పని. మరి పోలవరం ప్రాజెక్ట్ భవిష్యత్తు ఏమి అవుతుంది ? కేంద్రం ఏమి చేస్తుంది, అసలు రాష్ట్ర ప్రభుత్వం మదిలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, పోలవరం అనుకున్నట్టే రాష్ట్రానికి జీవనాడి అవుతుందా, లేక ఒక పెద్ద రిజర్వాయార్ గా మార్చేస్తారా అనేది కాలమే నిర్ణయిస్తుంది.

ఇది ప్రతి తెలుగు వారు గర్వ పడే సంఘటన. ఒకప్పుడు మన తెలుగు వారు పీవీ నరసింహారావు, ఈ దేశ ప్రధాని అయ్యి తెలుగు వారి సత్తా ఏమిటో చూపించారు. అలాగే, ఎన్టీఆర్, చంద్రబాబు, ఈ దేశ రాజకీయాల్లో తెలుగు వారి సత్తా చాటారు. కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. అలాగే వివిధ రంగాల్లో మన తెలుగు వారు దేశంలోనే టాప్ స్థానంలో నిలిచారు. ఇప్పుడు మరో అత్యున్నత పదవిలో మన తెలుగు వారు కూర్చుంటున్నారు. ఈ దేశ అత్యున్నత న్యాయ స్థానంలో, 48వ చీఫ్ జస్టిస్ గా, మన తెలుగు వారు, అదీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తెలుగు వారు అయిన, జస్టిస్ ఎన్వీ రమణ, పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. జస్టిస్ కోకా సుబ్బారావు గారి తరువాత, మరో తెలుగు వాడు, చీఫ్ జస్టిస్ అయ్యారు. ఏప్రిల్ 24 న ఆయన, చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాగా, ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ రోజు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ బాబ్డే, తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ పేరును ప్రతిపాదిస్తూ, కొద్ది సేపటి క్రితం కేంద్ర ప్రభుత్వానికి, లేఖ రాసారు. దీంతో ఈ దేశ చీఫ్ జస్టిస్ గా, ఒక తెలుగు వాడు, ఆ స్థానంలో కూర్చోబోతున్నారు. దీనికి సంబంధించి, ఈ రోజు జస్టిస్ ఎన్వీ రమణ పేరు ప్రతిపాదించటంతో, దీనికి సంబందించిన తదుపరి ప్రక్రియ, ఇక ప్రారంభం కానుంది.

nvramana 24032021 2

అయితే ఇక్కడ ఒక అంశం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. జగన్ మోహన్ రెడ్డి, జస్టిస్ ఎన్వీ రమణ పై చేసిన ఆరోపణలు, అప్పట్లో సంచలనంగా మారాయి. చీఫ్ జస్టిస్ కు జగన్ మోహన్ రెడ్డి కంప్లైంట్ చేయటం, కొంత మందితో రచ్చ రచ్చ చేయటం, ఇలా అనేక అంశాలు జరిగాయి. ఇవన్నీ జస్టిస్ ఎన్వీ రమణ చీఫ్ జస్టిస్ అవ్వకుండా అడ్డుపడతాయని, వైసీపీకి అనుకూల మీడియా ప్రచారం చేసింది. అయితే వీటి అన్నిటి పై, అంతర్గత విచారణ జరిగిందని, అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణని తదుపరి చీఫ్ జస్టిస్ గా ప్రతిపాదించటంతో, జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు అన్నీ పరిగణలోకి తీసుకోలేదని అర్ధం అవుతుంది. ఆ ఆరోపణలు అన్నీ డిస్మిస్ చేసినట్టు తెలుస్తుంది. వచ్చే నెల 23వ తేదీతో, ప్రస్తుత చీఫ్ జస్టిస్ బాబ్డే పదవీ కాలం ముగుస్తుంది. తదుపరి చీఫ్ జస్టిస్ గా, జస్టిస్ ఎన్వీ రమణ, 24వ తేదీన ప్రమాణస్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఈ వివాదాలు అన్నీ పక్కన పెడితే, ఇది ప్రతి తెలుగు వారికి గర్వ కారణం. ఇలాగే తెలుగు వారు, అన్ని రంగాల్లో ముందుండాలని ఆశిద్దాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ పై ఏర్పడిన సందిగ్ధం వీగిపోయింది. దీని పై ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక ప్రకటన చేసారు. తాను ఈ నెల 30వ తేదీతో, రిటైర్డ్ అవుతున్నానని, ఈ ఎన్నికలు నిర్వహించే సమయం లేదని, నిబంధనలు ప్రకారం, ఎన్నికల్ రీ నోటిఫికేషన్ ఇవ్వటానికి, నాలుగు వారల సమయం ఉండాల్సి ఉండటంతో, ఈ నేపధ్యంలో, తాను ఈ నోటిఫికేషన్ ఇవ్వలేనని, నిమ్మగడ్డ పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల కమీషనర్, ఈ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని, వివరించారు. దీంతో పాటుగా, గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సింగల్ నామినేషన్ దాఖలు అయిన చోట, ఏకాగ్రీవాలు అయిన చోట, రాష్ట్ర హైకోర్టు తీసుకున్న నిర్ణయంతో, అది చెల్లదు అని చెప్పి పేర్కుంటూనే, ఎక్కడైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రలోభాలు, బలవంతపు ఉపసంహరణలు జరిగాయో, వారు రిటర్నింగ్ అధికారికి కాని, జిల్లా ఎన్నికల అధికారికి కాని ఫిర్యాదు చేసుకోవచ్చని, ఆ విధంగా వచ్చిన ఫిర్యాదు పై, విచారణ చేసి, ఎక్కడైనా అవకతవకలు జరిగాయని నిరూపీతం అయితే, దాని పై అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. ఈ మేరకు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు, రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే, తాను ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు వివరించారు.

nimmagadda 24032021 2

అయితే గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం, పంచాయతీ ఎన్నికలతో పాటుగా, మునిసిపల్ ఎన్నికలు కూడా తాను నిర్వహించానని చెప్పి, సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం, అటు పోలీసులు, ఇటు రెవిన్యూ యంత్రాంగం శక్తివంతన లేకుండా పని చేసిందని ఆయన వారిని అభినందించారు. ఇక దీంతో పాటు, ఇప్పుడు దేశంలో సెకండ్ వేవ్ వస్తూ ఉండటంతో, అలాగే వ్యాక్సిన్ ప్రక్రియ వేగంగా జరుగుతూ ఉండటంతో, కేంద్ర ఎన్నికల సంఘం అయుదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా, పోలింగ్ లో పాల్గునే సిబ్బంది అందరికీ కూడా వ్యాక్సిన్ వేయాలని, ఆదేశాలు ఇవ్వటంతో, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా, కేంద్ర ఎన్నికల సంఘం అవలంభిస్తున్న విధానాన్ని, పరిగణలోకి తీసుకుని, రాష్ట్రంలో భవిషత్తులో జరిగే ఎన్నికలకు వెళ్ళే సమయంలో, సిబ్బందికి వ్యాక్సిన్ వేయాలని ఆయన సూచించారు. ప్రస్తుత పరిస్థితిలో మాత్రం, తనకు సరి పడా సమయం లేదని, తాను ఈ అతి తక్కువ సమయంలో, ఎన్నికలు నిర్వహించటం కుదరదు కాబట్టి, తదుపరి ఎన్నికల కమీషనర్ ఈ ఎన్నికలు జరిపిస్తారని తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read