బీజేపీ - జనసేన మధ్య పొత్తు అంటీముట్టనట్టుగానే ముందుకు సాగుతుంది. ఏదో చెప్పాలని, మీడియా ముందు నాయకులు, ఏమి లేదు అని చెప్తున్నారు కానీ, గ్రౌండ్ లో అసలు కార్యకర్తలు కలిసి పని చేసింది లేదు. ఇదే విషయం జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ కూడా తేల్చి చెప్పారు. వాళ్లతో పొత్తులో ఉంటే నష్టం తప్ప లాభం లేదని అన్నారు. ఇక తెలంగాణాలో అయితే, ఆల్మోస్ట్ ఇద్దరికీ చెడింది అనే చెప్పాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకంగా పవన్ కళ్యాణ్, టీఆర్ఎస్ అభ్యర్ధికి ఓటు వేయమని చెప్పారంటే, పరిస్థితి ఎక్కడ దాకా వెళ్లిందో అర్ధమవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం, పై పైకి అంతా బాగుందని చెప్తున్నారు. తిరుపతి ఎంపీ సీటు విషయంలో, పవన్ కళ్యాణ్ పట్టుబట్టినా, చివరకు ఆ స్థానం బీజేపీ తీసుకుంది. మిత్ర ధర్మం కోసం, భవిష్యత్తు అవసరాల కోసం, పవన్ కూడా సరే అన్నారు. అయితే ఆయన మొదట నుంచి ఒకటి చెప్తూ వస్తున్నారు. తిరుపతి ఎంపీ స్థానం విషయంలో బీజేపీ సీరియస్ గా తీసుకోవాలని, ఏదో చేసాం అంటే చేసాం అన్నట్టు అయితే తాను ప్రచారానికి రాలేనని చెప్పారు. అయితే నోటిఫికేషన్ వచ్చినా, ఇప్పటికీ ఎక్కడా జనసేన అడ్డ్రెస్ లేదు. మొత్తం బీజేపీ చేసుకుంటూ వెళ్తుంది. ఇంత అసంతృప్తిలో ఉన్న జనసేనకు, ఇప్పుడు మరో షాక్ ఇచ్చింది బీజేపీ. నిన్న బీజేపీ, తమ అభ్యర్ధిని ప్రకటించింది.

veerraju 26032021 2

ఆమె మాజీ ఐఏఎస్ రత్నప్రభ. ఆమె కూడా జగన్ కేసుల్లో ఇరుక్కున్నారు. అయితే తరువాత కోర్టు కేసులు కొట్టేసినా, ఆమె వైఖరి మాత్రం ఎప్పుడూ జగన్ ని, రాజశేఖర్ రెడ్డిని పొగుడుతూనే ఉంటారు. పార్టీలో కార్యకర్త లాగా వారికి ఎలివేషన్ ఇస్తూ ట్వీట్లు కూడా చేసారు. జగన్ మీద ఇంత అభిమానం ఉన్నవిడకు బీజేపీ టికెట్ ఇవ్వటం పై, జనసేన శ్రేణులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ ప్రకటన బీజేపీ - జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా కాకుండా, బీజేపీ - వైసీపీ ఉమ్మడి అభ్యర్ధిగా అనిపిస్తుందని, దీని వెనుక చాలా పెద్ద శక్తులు ఉన్నాయని అనిపిస్తుందని జనసేన శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే విషయం పై ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు వేస్తున్నారు. పవన్ ప్రచారానికి వెళ్ళాక పోవటమే మంచిదని వాపోతున్నారు. అయితే నిన్న రాత్రి బీజేపీ అభ్యర్ధిని ప్రకటించగా, ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కాని, జనసేన కాని, ఆమెకు మద్దతుగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మిత్రపక్షంగా ఉన్న జసేనన, బీజేపీ వైఖరి పై అసంతృప్తిగా ఉందా అనే అనుమానం కలగక మానదు. జనసేన అధికారికంగా ప్రకటించే వరకు, వారి వైఖరి ఏమిటో తెలియదు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విజయసాయి రెడ్డి, ట్విట్టర్ ద్వారా అందరినీ కవ్విస్తూ ఉంటారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమేరకు ఉపయోగపడుతుందో తెలియదు కాని, ఆయన వేసే కొన్ని కొన్ని ట్వీట్స్ తో వైసీపీ ఇరుకున పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. విజయసాయి రెడ్డి వేసే ట్వీట్స్, ఆలోచన రేకెత్తించే విధంగా ఉండకపోయినా, అవతల వారిని కవ్విస్తూ, వెకిలిగా ఉంటాయి. ఇప్పుడు తాజాగా విజయసాయి రెడ్డి, టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ను కవ్విస్తూ వస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి అంటూ, ఉద్యమం ఉదృతంగా జరుగుతుంది. అయితే ఇందులో ప్రధానంగా కేంద్రం తరువాత, వైసీపీ వైపే, అందరూ చేతులెత్తి చూపిస్తున్నారు. తమ పై వస్తున్న వ్యతిరేకత తగ్గించుకోవటానికి, వైసీపీ అనేక డ్రామాలు ఆడుతున్నా ప్రజలు నమ్మటం లేదు. ఒక పక్క కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు కలిసి పోరాటం చేస్తున్నాయి. వీరికి పార్టీలు కూడా సహకారం అందిస్తున్నాయి. రాజకీయంగా ఈ ఉద్యోమం ముందుకు తీసుకుని వెళ్లేందుకు, టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్, మొదటిగా తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఆయన రాజీనామా చేసిన ఫార్మాట్ సరిగ్గా లేకపోవటంతో, అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన మళ్ళీ స్పీకర్ ఫార్మటులో, రాజీనామా లేఖను పంపించారు.

vsreddy 2532021 2

అయితే దీని పై కూడా వైసీపీ హేళన చేస్తూ మాట్లడుతుంది. ముఖ్యంగా విజయసాయి రెడ్డి, ఇదంతా డ్రామా అంటూ , గంటాను టార్గెట్ చేసారు. దీంతో గంటా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఈ రోజు ఏకంగా స్పీకర్ తమ్మినేని వద్దకు వెళ్లారు. తన రాజీనామా ఆమోదించాలని స్వయంగా కోరారు. దీంతో గంటా, దూకుడును విజయసాయి రెడ్డి అంచనా వేయలేక పోయారు. ఇదే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారింది. గంటా రాజీనామా ఆమోదిస్తే, ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి హీరో అవుతారు. అలా అని ఆమోదించకుండా ఉంటే, మీరు రాజీనామా చేయరు, చేసే వారిని కూడా, చేయనివ్వరు అంటూ, ఎదురు వైసీపీ మీదే విమర్శలు వస్తాయి. దీంతో, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, ఎటూ తేల్చుకోలేక పోతుంది. గంటా ఏదో రాజకీయం గేమ్ ఆడుతున్నాడని, విజయసాయి రెడ్డి భావించి, అతన్ని కవ్వించటంతోనే, ఇక్కడ దాకా వచ్చిందని, అందరి సంగతి మనకెందుకు, మన సంగతి మనం చూసుకుంటే సరిపోతుంది కదా అని, సొంత పార్టీలోనే విజయసాయి రెడ్డి వైఖరి పై అసంతృప్తి వ్యక్తం అవుతుంది.

విశాఖ ఉక్కును ప్రయివేటీకరిస్తూ కేంద్రప్ర భుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు పేరిట ఎన్నో త్యాగాలు చేసి, ఏకంగా 32 మంది ప్రాణాలు పోగొట్టుకున్న తరువాత సాధించిన ఉక్కు పరిశ్రమను ఇప్పుడు నష్టాల పేరిట కేంద్రం ప్రయివేటీకరించడం సరికాదని పలువురు మేధావులు, రాజకీయ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యం లోనే కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల జాతీయ స్థాయిలో ఉద్యమం చేపడుతు న్నారు. గత 41 రోజులుగా కార్మిక వర్గాలు రిలేనిరాహార దీక్షలు కొనసాగిస్తున్నాయి. అయితే ఉద్యమం తీవ్రతరం చేసినప్పటికి ఉత్పత్తికి మాత్రం ఎటువంటి లోటు లేకుండా కార్మిక వర్గాలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటు న్నాయి. ఇప్పుడు 40 ఏళ్లు తరువాత అరుదైన రికార్డును స్టీల్ ప్లాంట్ వర్గాలు సాధించాయి. 2019 మార్చి 30న నమోదైన 20,018 టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తిని ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం రోజున బ్రేక్ చేస్తూ అదే రోజు 20,150 టన్నుల ఉత్పత్తితో బ్లాస్ట్ ఫర్నేష్ కార్మికులు సరికొత్త రికార్డు నమోదు చేశారు. ఇక మార్చి 6న రికార్డు స్థాయిలో 20,350 మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని సాధించిన కార్మికులు ఈ నెల 23న ఏకంగా 20,400 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి దిశగా పురోగతి సాధించారు. ఈ తరహా ఉత్పత్తిని కొనసాగించినట్లు అయితే ఈ ఏడాది చివరి నాటికి విశాఖ స్టీల్ ప్లాంట్ రూ.300 కోట్లు లాభాలు ఆర్జించే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు.

vizag 25032021 2

ఇక మార్చిలో బ్లాస్ట్ ఫర్నేస్లో 1, 2, 3 లలో 20.400 టన్నుల రికార్డు స్థాయి ఉత్పత్తిని సాధించారు. సొంత గనులు లేకపోయినా లాబాల బాట పడుతున్న ఉక్కును నష్టాల నుంచి అధిగమించే విధంగా చేయడం పెద్ద కష్టం కాదని కార్మిక సంఘాల నేతలు అంటున్నారు. ప్రధానంగా నష్టాల బాటపట్టేందుకు మూలధనం అప్పులపై 14 శాతం వడ్డీ చెల్లింపు, ఆపై ఏ రోజూ సొంత గనులు కేటాయించకపోవడం వల్ల అధిక రేటుకు ముడిసరుకు కొనుగోలు చేయాల్సి రావడం కారణాలుగా చెబుతున్నారు. కేంద్రం సహకరిస్తే త్వరలోనే విశాఖ ఉక్కు నష్టాల నుంచి లాభాల బాట పడుతుందని కార్మికవర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. తెలుగు ప్రజల సెంటిమెంట్ తో ముడిపడి ఉన్న ఈ పరిశ్రమను పోస్కోకు విక్రయించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మహోన్నతమైన ఉద్యమం దశలోనూ ఉక్కు గత రికార్డులను బద్దలకొడుతూ ఉత్పత్తి దిశగా దూసుకుపోతుండడం విశేషం. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తం మవుతుంది.

2019లో ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన సంగతి తెలిసిందే. కేవలం 18 నెలల్లోనే, 150 కోట్లతో నిర్మాణం చేసారు. అయితే ప్రభుత్వం మారటంతో, జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావటంతో, ఆ ఎయిర్ పోర్ట్ నేనే కట్టాను అంటూ, రెండేళ్ళ తరువాత హడవిడి చేసి, ఈ రోజు ప్రారంభించారు. దీని పై ఈ రోజు టిడిపి కౌంటర్ ఇచ్చింది. టిడిపి శాసన మండలి సభ్యులు, బీటీ నాయుడు ఈ విషయం పై కౌంటర్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ, "జగన్మోహన్‌రెడ్డి ప్రచార పిచ్చి పరాకాష్టకు చేరింది. తెలుగుదేశం హయాంలో పనులు పూర్తయి కార్యకలాపాలు ప్రారంభించిన కర్నూలు (ఓర్వకల్లు) విమానాశ్రయాన్ని నేడు మళ్లీ జగన్‌రెడ్డి ప్రారంభించి తన ఘనతగా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు. ఆయన వ్యవహారం చూస్తే కొంతకాలం పోయాక కర్నూలు కొండారెడ్డి బురుజును కూడా వైసీపీ హయాంలోనే నిర్మించామంటూ మళ్లీ రిబ్బన్ కట్ చేసినా ఆశ్చర్య పడాల్సిన లేదు ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు టిడిపి హయాంలో శంకుస్థాపన చేసి కేవలం 18 నెలల్లో భూసేకరణ, ఇతర పనులను పూర్తిచేసి రికార్డు సమయంలో కర్నూలు గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టును చంద్రబాబునాయుడుగారు చేతులమీదుగా ప్రారంభించారు. విమానాల పార్కింగ్‌ కోసం 4 యాప్రాన్‌లు, భారీ కార్గో విమానాలను రాకపోకలకు అవసరమైన సదుపాయాలను కూడా తెలుగుదేశం హయాంలో ఏర్పాటు చేయడం జరిగింది. "

kurnol 25032021 2

"2 కి.మీ. మేర రన్‌వేతో సహా 1000 ఎకరాల్లో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తే... ఇప్పుడు జగన్‌రెడ్డి చెల్లి పెళ్లి మళ్ళీ...మళ్ళీ అన్నట్లుగా ప్రారంభోత్సవం చేయడం సిగ్గుచేటు. వైసిపి అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో కొత్తగా ఒక్క ప్రాజెక్టుకైనా శంకుస్థాపన చేసి పూర్తి చేశారా? కర్నూలు విమానాశ్రయం నుంచి విశాఖ, బెంగుళూరు, చెన్నై వంటి పట్టణాలతోపాటు ఇతర దేశాలకు కూడా నేరుగా విమాన సర్వీసులు ఉండేలా చంద్రబాబునాయుడుగారు ప్రణాళికలు రూపొందిస్తే వాటిని నిర్వీర్యం చేసింది జగన్‌రెడ్డి కాదా? గన్నవరం, విశాఖ పట్నం, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దింది ఎవరో రాష్ట్రప్రజలందరికీ తెలుసు. తెలుగుదేశం హయాంలో చేసిన పనులకు పేర్లు మార్చడం, రంగులు మార్చడం మాని కొత్తగా రాష్ట్ర అభివృద్ధికి జగన్ చిత్తశుద్ధితో పనిచేస్తే మంచిది. ప్రపంచంలో ఏ పనినైనా రెండుసార్లు ప్రారంభోత్సవాలు ఏ నాయకుడైనా చేశారా? ప్రారంభించిన వాటినే మళ్లీ ప్రారంభింస్తూ జగన్మోహన రెడ్డి కాలక్షేపం చేస్తున్నారు. చేసేంది శూన్యం..చెప్పేంది కొండంత.
" అంటూ కౌంటర్ ఇచ్చారు.

Advertisements

Latest Articles

Most Read