నిన్న మంత్రి పెద్దిరెడ్డి, సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పై ఘాటు వ్యాఖ్యలు చేసారు. రఘురామరాజు బ్లాక్ షీప్ అని, కొమ్ములు లేని దున్నపోతు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. అంతే కాదు, రఘురామకృష్ణంరాజుకి సవాల్ చేసారు. రఘురామకృష్ణం రాజు రాజీనామా చేసి మళ్ళీ గెలవాలని సవాల్ విసిరారు. రఘురామకృష్ణం రాజు చేసిన వ్యాఖ్యల పై, పెద్దిరెడ్డి ఇంత ఘాటుగా మాట్లాడటంతో, రఘురామరాజు ఎలాంటి కౌంటర్ ఇస్తారా అని అందరూ ఎదురు చూస్తున్న సమయంలో, రఘురామకృష్ణం రాజు అంతే దీటుగా, జవాబు ఇచ్చారు. నా బొచ్చు గురించి, నా స్థాయి గురించి, నన్ను ఏకవచనంతో, అసభ్యంగా సంబోదిస్తున్న, అవినీతి మంత్రి పెద్దిరెడ్డికి, మేము మర్యాదగా మాట్లాడే భాష అర్ధం కాదు కాబట్టి, రాయలసీమ భాషలో చెప్తున్నా అని, ఘాటు వ్యాఖ్యలు చేసారు. నేనే కనుక ముఖ్యమంత్రి అయితే, నేను అలా చేస్తాను ఇలా చేస్తాను అని ఆయన అంటున్నారని, అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి చేతకాని వాడని, ఆయన ఉద్దేశమా అని, రఘురామరాజు వ్యాఖ్యానించారు. నేనే ముఖ్యమంత్రి అని ఆయన అంటున్నారు అంటే, రిపబ్లిక్ టీవీ కధనానికి, దీనికి ఏదో లింక్ ఉండే ఉంటుందని, నేను అన్నాను. ఇప్పటి వరకు నేను పెద్దిరెడ్డి గారు అని సంబోధించాను, కానీ మనిషికి ఒక మాట, గొద్దుకు ఒక దెబ్బ అని, ఈయనకు అదే భాషలో చెప్పాలి కదా అని రఘురామ రాజు అన్నారు.

rrr 12032021 2

నేనే ముఖ్యమంత్రి అయితే, అనే మాట ఎందుకు అన్నావ్ పెద్దిరెడ్డి అనేది నా ప్రశ్న. నీ మోహంలో అసహనం కనిపిస్తుంది పెద్దిరెడ్డి అని ప్రశ్నించారు. నేను ఏబీఎన్ రాధాకృష్ణ కుమ్మక్కు అంటున్నారు, మరి సాక్షి9, సాక్షి ఎన్, సాక్షి 10 లో నీ గురించి ఆ కధనాలు ఎందుకు వస్తున్నాయి అని అడిగితే, దానికి ఏమి సమాధానం చెప్తావ్ అంటూ, కౌంటర్ ఇచ్చారు. నువ్వు ఎలా పెద్దోడివి అయ్యావో నాకు తెలుసు, ఈ రోజు పెద్దోడివి అయిపోయి, నా బొచ్చు గురించి మాట్లాడుతున్నావు, దున్నపోతు అంటున్నావు, అవును పెద్దిరెడ్డి. నువ్వు దున్నపోతువు అయితే, నేను ఆవుని. ఒక అద్దం కొనుక్కొని చూస్కో. నేను బ్యాంకులకు టోకరా వేసినా ? ఇండస్ట్రీ మొత్తం దెబ్బతిన్నట్టే నేను దెబ్బ తిన్నా, నీ లాంటి అవినెతి సొమ్ము నాకు లేదని కౌంటర్ ఇచ్చారు. ఈ పెద్దిరెడ్డి నన్ను రాజీనామా చేయమంటున్నాడు, దమ్ము, సిగ్గు గురించి మాట్లాడుతున్నాడు, నేను రాజీనామా చేసి మళ్ళీ గెలిస్తే, జగన్ ప్రభుత్వం బర్తరఫ్ చేసి, మళ్ళీ మీ ఎమ్మెల్యేలను గెలిపించుకోండి, దీనికి మీరు రెడీ అయితే, నేను రాజీనామాకు రెడీ అని కౌంటర్ ఇచ్చారు. మరి దీనికి పెద్దిరెడ్డి ఏమి కౌంటర్ ఇస్తారో చూడాలి.

మున్సిపల్ ఎన్నికల్లో గెలుపకోసం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేసిన ప్రభుత్వచర్యలను సమర్థిస్తూ, ప్రభుత్వానికి, అధికారపార్టీకి లేనిపవిత్రతను ఆపాదిస్తూ వైసీపీ ఎమ్మెల్యే జోగిరమేశ్ చాటభారతం చెప్పాడని, టీడీపీ నేత, తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ఎద్దేవాచేశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారని, ప్రజలను భయ భ్రాంతులకు గురిచేశారని చెప్పి మాజీమంత్రి కొల్లురవీంద్రను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం కాదాఅని ప్రశ్నిస్తుంటే, దానికి సమాధానం చెప్పకుండా, బీసీలను చంద్రబాబు గౌర వించలేదంటూ, రమేశ్ వ్యాఖ్యానించడం అతనితెలివితక్కువ తనాన్ని సూచిస్తోందన్నారు. తెలుగుదేశంపార్టీ ఆవిర్భావమే బీసీలతో మొదలైందనే వాస్తవం రమేశ్ కు తెలియకపోవడం ఆయనకున్న అవగాహనారాహిత్యానికి నిదర్శనమని మర్రెడ్డి మండిపడ్డారు. కొల్లురవీంద్ర బూత్ లోకి ప్రవేశించాడని, పోలీ సులను అడ్డుకున్నాడని చెబుతున్నరమేశ్, వైసీపీవారు ఏం చేసినా టీడీపీవారెవరూ ప్రశ్నించకూడదనే నియంత్రత్వధోరణి తో మాట్లాడుతున్నాడన్నారు. చట్టంపని చట్టంచేస్తుందని చెబుతున్న రమేశ్, చట్టంలోని పోలీస్ యంత్రాంగం ఏంచేస్తుం దో సమాధానం చెప్పాలని టీడీపీనేత డిమాండ్ చేశారు. పోలీసులుఏం చేస్తున్నారో, వారినిభుజానేసుకొని వైసీపీవారు ఎంతలా రెచ్చిపోతున్నారో జోగి రమేశ్ కు తెలియదా అని మర్రెడ్డి ప్రశ్నించారు. అదేపోలీసులను గతంలో వైసీపీనేతలు, ఎమ్మెల్యేలు నానారకాలుగా దుర్భాషలాడినప్పుడు చట్టం తనపని తానెందుకు చేయలేదో రమేశ్ చెప్పాలన్నారు. వైసీ పీ వారివిషయంలో చట్టానికి చేష్టలుడిగిపోతాయా అన్నారు. స్థానికఎన్నికలనేవి రాజకీయపార్టీల మధ్యజరిగలేదని, వాటిని ఎదుర్కొనేశక్తి లేకనేవైసీపీ అధికారులు, పోలీసులను అడ్డుపెట్టుకొని బయటపడిందన్నారు. చంద్రబాబు లేకుండా పోతారని, టీడీపీ కనుమరుగవుతుందంటున్న రమేశ్, ముం తనపరిస్థితేమిటో, తనపార్టీ పరిస్థితేమిటో తెలుసుకోవాల న్నారు. పోలీసులు, రౌడీలను ఏకంచేయగా ఏర్పడిన అక్రమ శక్తితో ఎన్నికల్లో గెలుపుకోసం వైసీపీప్రయత్నించిందన్నారు.

ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలకువచ్చే ధైర్యంలేకనే అధికార పార్టీ అక్రమశక్తులను నమ్ముకుందన్నారు. 2013లో జరిగిన స్థానికఎన్నికల్లో ప్రజలు ఎవరిపక్షాన ఉన్నారో, రమేశ్ మర్చిపోతే ఎలాగన్నారు. ఓటర్ స్లిప్పుల పంపిణీమొదలు, బూత్ లను ఆక్రమించుకోవడం, బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపచేయడం, పోలీసులు-రౌడీలసాయంతో అభ్య ర్థులను బెదిరించడం వంటి ఘటనలకు ఎవరుపాల్పడ్డారో రమేశ్ సమాధానం చెప్పాలన్నారు. టీడీపీ అభ్యర్థుల సంతకా లను ఫోర్జరీ చేసి, నామినేషన్లు విత్ డ్రాచేసిన వైసీపీవారికి అభ్యర్థులు లేరో, టీడీపీకిలేరో ఆయనే తెలుసుకోవాలన్నారు. చీకటిపడినతర్వాత లెక్కాపత్రంతో సంబంధంలేకుండా, గెలు పు ఫలితాలుప్రకటించుకొని సంబరాలు చేసుకున్న దిక్కుమాలినవ్యక్తులెవరో ప్రజలకు అర్థమైనా, రమేశ్ కుఅర్థం కాకపోవడం సిగ్గుచేటని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. పట్టణ, నగరాల్లో జరిగే ఎన్నికలు గుర్తుపై జరుగుతాయని తెలిసే, ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాన్ని నిలువరిం చిందన్నారు. ఫలితాలు వచ్చేవరకుఆగకుండా, చట్టం గురించి వైసీపీఎమ్మెల్యే మాట్లాడటం దారుణమన్నారు. కర్నూలుజిల్లా ఆదోనిలో రంగన్న అనేవ్యక్తి టీడీపీకి పనిచేశా డన్న అక్కసుతో, అతనికిచెందిన పదెకరాల్లోని కొబ్బరి, టేకు చెట్లను తగలబెట్టినప్పుడు రమేశ్ చెప్పిన చట్టం ఎక్కడుంద న్నారు. రంగన్నకు జరిగిన అన్యాయం చట్టానికి కనిపించలే దా అన్నారు. వైసీపీఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తమ్ముడు టీడీపీకి చెందిన రిలీవింగ్ఏజెంట్లను బూత్ లలోకి వెళ్లకుండా అడ్డుకున్నప్పుడు చట్టంతనపని తానుచేయకుండా ఏంచేసిం దో రమేశ్ చెప్పాలన్నారు.

తెలుగుదేశంపార్టీ అభ్యర్థి పచ్చచొ క్కా వేసుకుంటే, దాన్నినడిరోడ్డుపై బహిరంగంగా విప్పించడ మే చట్టంచేసే పనా అన్నారు. గుంటూరులో వైసీపీనేతలు లేళ్ల అప్పిరెడ్డి, మోదుగుల వేణుగోపాలరెడ్డి బ్యాలెట్ బాక్సు లు బద్దలు కొట్టే ప్రయత్నంచేసినప్పుడు, వారిని అడ్డుకోకుం డా, టీడీపీ మేయర్ అభ్యర్థి కోవెలమూడి నానీని నిలువరించ డమేనా చట్టంచేయాల్సిన పని అని మర్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచే శారు. విజయవాడలో మేయర్ అభ్యర్థిని కేశినేని శ్వేతను పో లీసులు ఎందుకు అడ్డుకున్నారన్నారు. ఆ విధంగా అడుగడు గునా పోలీసులను అరాచకాలకు వాడుకున్న వైసీపీ, ఆపార్టీ ఎమ్మెల్యే చట్టాల గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. అధికారపార్టీ ఎప్పుడూ అరాచకాల గురించే మాట్లాడాలి తప్ప, చట్టాలు, న్యాయాలు అనేపదాలను ఉపయోగించకూ దని మర్రెడ్డి ఎద్దేవాచేశారు. వైసీపీనేతల నరనరాల్లోనే అరాచ కం ఇమిడిఉందన్నారు. చట్టాలు అమలుచేసేవారైతే వందసా ర్లు కోర్టులతో మొట్టికాయలు తినరన్నారు. న్యాయమూర్తుల ను దూషించడం, వ్యతిరేకంగా తీర్పులిచ్చారని వారిపై బురద చల్లడం చేసినవారు, చట్టాలకు అనుగుణంగానే ఆపనిచేశారా అని మర్రెడ్డి నిలదీశారు. కొల్లురవీంద్ర అరెస్ట్, ఆయనపై పెట్టిన కేసులు ముమ్మాటికీ క్షమించరాని అంశాలేనన్న శ్రీనివాస రెడ్డి, ప్రజలను ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిని అక్రమఅరెస్ట్ లతో అడ్డుకోవాలనిచూస్తే, అది పాలకులకే చేటుచేస్తుందన్నా రు. ఎన్నో అక్రమనిర్బంధాలను ప్రజలు ఇప్పటికే చూశారని, ప్రజాస్వామ్యంలో ప్రజలను గౌరవించకుండా, అధికారంలో ఉన్నాంకదా అని ఆగడాలను కొనసాగిస్తే, ప్రజలే తగినవిధం గా బుద్ధి చెబుతారన్నారు. ప్రజస్వామ్యమని, చట్టమని చెప్పే వ్యక్తులు ముందువాటికి లోబడి పనిచేస్తే మంచిదన్నారు. ప్రజలముందు జింకవేషాలేస్తూ, పక్కకొచ్చాక తోడేలు వేషాలే సేవారిని ఎవరూ ఆమోదించరని, కళ్లకు గంతలుకట్టుకొని బ తుకుతున్న వైసీపీనేతలు, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహ రించడం నేర్చుకుంటే వారికే మంచిదని శ్రీనివాసరెడ్డి హితవు పలికారు.

విశాఖ ఉక్కు పరిశ్రమను, వంద శాతం ప్రైవేటీకరణ చేయాలని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై, విశాఖలో మొదటి నుంచి ఆందోళనలు జరుగుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు కలిసి వ్యతిరేకిస్తూ, ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా బయట నుంచి కూడా మద్దతు లభిస్తుంది. నిన్న తెలంగాణా నుంచి కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మల్యే సీతక్క కూడా, విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. అలాగే సినీ ఇండస్ట్రీ నుంచి నారా రోహిత్, ఆర్పీ పట్నాయక్, చిరంజీవి కూడా మద్దతు పలికారు. నిన్న బీజేపీ ఎంపీ సుభ్రమణ్య స్వామి కూడా, విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు పలుకుతామని చెప్పటం జరిగింది. క్రమంగా, రోజు రోజుకీ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు లభిస్తుంది. ఇక మరో వైపు, ఈ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేయటానికి, కార్మికలు, కార్మిక సంఘాలు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే ఉద్యమానికి బలం చేకూరుస్తూ, ఆందోళనలు, నిరసనలు, రాస్తారోకోలు నిర్వహించిన స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, ఇప్పుడు కీలకా నిర్ణయం తీసుకున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సమ్మె బాట పట్టాలని నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం ఇప్పటికే స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి సమ్మె నోటీస్ కూడా సర్వ్ చేసి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నట్టు చెప్పారు.

vizag 11032021 2

ముందుగా నిబంధనలు ప్రకారం 14 రోజులు ముందు సమ్మె నోటీస్ ఇచ్చాం అని, ఈ నెల 25 తరువాత ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్ళవచ్చ అని కార్మికులు చెప్పారు. ఇండస్ట్రియల్ డిస్ప్యుట్ ఆక్ట్ 1947 సెక్షన్ 22 ప్రకారంగా, ఈ నోటీస్ ని సర్వ్ చేస్తున్నామని వాళ్ళు చెప్పటం జరిగింది. ఇందులో ప్రధానంగా, వాళ్ళు అయుదు అంశాలకు ఇందులో పేర్కొనటం జరిగింది. ఇందులో ప్రధానంగా వంద శాతం ప్రైవేటీకరణకు ఆమోదిస్తూ క్యాబినెట్ సబ్ కమిటీ ఏదైతే నిర్ణయం తీసుకొందో, దీన్ని వ్యతిరేకిస్తున్నాం, అలాగే, స్టీల్ ప్లాంట్ అమ్మకం పై వేసిన కమిటీ పైన, అలాగే పోస్కోతో చేసుకున్న ఒప్పందం పైన, స్టీల్ ప్లాంట్ భూములుకు సంబంధించి అమ్మకం పై, అలాగే ఇక్కడ భూములు ఇచ్చిన 8 వేల మంది రైతులకు ఉద్యోగులు ఇవ్వాలని, ఇలా ఈ డిమాండ్లు ముందు పెట్టారు. దీని పై యాజమాన్యం సరిగ్గా స్పందించకపోతే, 25 తరువాత ఏ క్షణంలో అయినా సమ్మెకు వెళ్తాం అని చెప్పి, కార్మికులు చెప్తున్నారు. దీంతో ఈ ఉద్యమానికి, రానున్న రోజుల్లో మరింత సపోర్ట్ లభించటంతో పాటుగా, ఉద్యమం మరింతగా ముందుకు వెళ్లనుంది.

స్థానికఎన్నికల నిర్వహణతీరుచూస్తే, ఓటింగ్ శాతం గణనీ యంగా తగ్గిందని, 2013నాటి ఎన్నికలతో పోల్చితే దాదాపు 11శాతంవరకు ఓటింగ్ తగ్గిందని, అందుకు కారణం ప్రభు త్వంపై ప్రజల్లోఉన్న అసంతృప్తి, అభద్రతా భావమేనని టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ స్పష్టంచేశారు. గురువారం ఆయన మంగళగిరిలోనిపార్టీ జాతీయకార్యాలయంలో విలేక రులతో మాట్లాడారు. ప్రభుత్వ పనితీరుతోవిసిగిపోయిన ప్రజ లంతా ఓటింగ్ కురాకుండా నిరాసక్తత చూపారన్నారు. టీడీపీ వారిపై, ప్రజలపై ప్రభుత్వం దాడిచేస్తోందని, బయటి పరిస్థితి సరిగాలేనప్పడు ఓటింగ్ కు వెళ్లడంఎందుకులే అనేభావన ప్రజల్లో ఉండబట్టే, వారు బయటకురాలేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్ స్లిప్పులపంపిణీ బాధ్యత తీసుకున్న ప్రభు త్వం, టీడీపీకి ఓటేస్తారుకున్నవారికి స్లిప్పులుపంచలేదన్నా రు. స్లిప్పులు లేకుండా ఓట్లువేయడానికి వెళ్లినవారిని పోలీ సులు వెనక్కుపంపారని, దాంతో చాలామంది ఇళ్లకే పరిమిత మయ్యారన్నారు. అదేవిధంగా కుటుంబంలో నలుగురుంటే, ఒక్కొక్కరికీ ఒక్కోచోట ఓటుకేటాయించారన్నారు. దానితో పాటుసెల్ ఫోన్లను నిషేధిచండం కూడా ఓటింగ్ తగ్గడానికి ప్రధానకారణమని రఫీ వెల్లడించారు. ఓటర్ స్లిప్పుల్లో తప్పులు రాసిచ్చారని, దాంతో చాలాచోట్ల గుర్తింపుకార్డు ఉం టేనే ఓటింగ్ కు అనుమతించారన్నారు. నామినేషన్ల ఉపసం హరణ ప్రక్రియ బలవంతంగా చేపట్టడంతో పాటు, దాడులు, దౌర్జన్యాలు, పోలీసులతో అక్రమకేసులు పెట్టించడం వంటి ఘటనలుకూడా ఓటింగ్ పైప్రభావం చూపాయన్నారు. నెల్లూ రు జిల్లా నాయుడుపేటలోఎన్నికల బరిలో నిలిచిన దళిత అభ్యర్థి పసుపురంగు చొక్కావేసుకున్నాడని, స్థానిక ఎస్సై దాన్నిబహిరంగంగానే విప్పించాడన్నారు. సదరు ఘటనకు కారకుడైన ఎస్ఐ చర్యలు తీసుకోవాలని టీడీపీఅధినేత ఎన్ని కల సంఘాన్ని కోరినా ఇంతవరకుచర్యలు లేవన్నారు. మచి లీపట్నంలో దాడికి పాల్పడినవారిని వదిలేసి, మాజీమంత్రి కొల్లురవీంద్రను అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు. శివరాత్రి పర్వదినాన టీడీపీవారికి పండగసంతోషాన్ని దూరం చేయాలనే ఫ్యాక్షన్ మనస్తత్వంతోనే, జగన్ ప్రభుత్వం రవీంద్ర ను అరెస్ట్ చేయించిందని రఫీ మండిపడ్డారు.

శివరాత్రి పండుగనాడు టీడీపీనేతలను అరెస్ట్ చేయడం, మహిళాదినోత్సవం రోజున మహిళలను జుట్టుపట్టి రోడ్డుపై ఈ డ్చుకెళ్లడం, బూటుకాళ్లతో తన్నడం వంటిఘటనలు ఈ ప్రభుత్వంపై ప్రజలకు విరక్తి కలిగించాయన్నారు. ఈ విధమై న అరాచకాలుకూడా ఓటింగ్ తగ్గడానికి కారణాలుగా నిలిచా యని రఫీ తెలిపారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఆళ్లనానికే ఓటు లేకుండా చేశారని, ఓటర్ల లిస్ట్ తయారీలో అధికారులు ఎంత సమర్థంగా పనిచేశారో ఇటువంటి ఘటనలే నిదర్శనమన్నా రు. ప్రజలకు ఓటింగ్ పై నిరాసక్తత కలిగేలా ఆటవిక పాలన సాగించిన ప్రభుత్వచర్యలను టీడీపీతరుపున తీవ్రంగా ఖండి స్తున్నామన్నారు. ఆదోనిలో టీడీపీనేత రంగన్నకు చెందిన రూ.40లక్షలవిలువైన కొబ్బరితోటను కాల్చివేశారని, ఆ ఘటనలో వైసీపీనేత ప్రమేయముందన్నారు. ఈ విధంగా ఎక్కడికక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తేనే తాము గెలవగలమనే అభిప్రాయానికి వైసీపీనేతలు వచ్చారని, అం దుకోసమే రాష్ట్రవ్యాప్తంగా దారుణాలకు తెగబడ్డారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఏకగ్రీవాలు చేయాల్సిందేనని ముఖ్య మంత్రి స్థాయివ్యక్తే చెబితే, ఎన్నికలలో ఇటువంటి అరాచకా జరగక, ప్రశాంతవాతావరణం ఎక్కడినుంచి వస్తుందని రఫీ వాపోయారు. ప్రజలకు మెరుగైన, ఉత్తమమైన పాలన అందిస్తున్నానని చెప్పుకుంటున్నజగన్, ఎన్నికలు స్వేఛ్చగా, శాంతియుతంగా ఎందుకు నిర్వహించలేకపోయాడ న్నారు. రాష్ట్రవ్యాప్తంగా 39ప్రాంతాల్లో 5, 6 రకాల చట్టవ్యతి రక, రాజ్యాంగవ్యతిరేక చర్యలకు ప్రభుత్వం పాల్పడిందన్నారు.

ఆయా ఘటనలకు సంబంధించి వందలకొద్దీ ఫిర్యాదులు తమదృష్టికి వచ్చాయని, వాటన్నింటినీ ఎస్ఈసీకి ఫిర్యాదు చేశామని రఫీ చెప్పారు. పోలింగ్ ఏజెంట్లపై, టీడీపీవారిపై దాడులు చేయడం, డబ్బు ప్రలోభాలకు పాల్పడటం, అధికారులు, పోలీసులను అడ్డుపెట్టుకొని దౌర్జన్యాలకు పాల్పడటంవంటి అనేకఘటనలకు వైసీపీనేతలు, కార్యకర్తలు పాల్పడ్డారన్నారు. తాను అమలుచేస్తున్న పథకాలు ప్రజల కు నచ్చి, వారిఆమోదం నిజంగా జగన్ కు ఉంటే, ఆయన ఈ విధంగా అరాచకవాతావరణంలో ఎన్నికలుజరపాల్సిన అవస రమేంటని రఫీ ప్రశ్నించారు. ఎన్నికలు సజావుగా, సాఫీగా జరిగితే తమకుఓట్లుపడవని అర్థమవబట్టే, ముఖ్యమంత్రి మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఏకగ్రీవాలను లక్ష్యంగా నిర్ధేశించా డన్నారు. ప్రభుత్వదాష్టీకాలకు, దౌర్జన్యాలకు బలై,ఎందరు ఆసుపత్రుల్లోచేరారో ముఖ్యమంత్రికి తెలియదా అన్నారు. స్థానిక ఎన్నికల్లో అధికారులు, పోలీసుల సాయంతో, బెదరిం పులతో, దాడులతో గెలుపును దక్కించుకున్న ముఖ్యమంత్రి ఆటలు, సాధారణఎన్నికల్లో ఇదేవిధంగా ప్రవర్తించాలని చూస్తే, అప్పుడు సాగవన్నారు. వాలంటీర్ వ్యవస్థసహా, స్థాని క పోలీసులను, అధికారులను పక్కనపెట్టి, మరీ కేంద్రం సాధారణ ఎన్నికలు నిర్వహిస్తుందన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకివచ్చాక, ఇప్పుడున్న ప్రభుత్వానికి సహకరిం చిన అధికారులంతా బాధితులుగా మిగలకతప్పదని రఫీ తీవ్రస్వరంతో హెచ్చరించారు. తప్పుచేసిన ప్రతి అధికారి శిక్ష అనుభవించక తప్పదన్నారు.

Advertisements

Latest Articles

Most Read