ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, మరోసారి రాష్ట్ర ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఈ సారి ఉద్యోగులకు అక్షింతలు పడ్డాయి. బుధవారం రాష్ట్రంలో ఉన్న అధికారుల పై రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఒక కోర్టు ధిక్కరణ పిటీషన్ విచారణకు వచ్చిన సమయంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 90% అధికారులు తాము చట్టాని కంటే ఎక్కువ అనే భావనలో ఉండి, కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ని అమలు చేయటం లేదని కోర్టు వాపోయింది. ఇక కేసు విషయానికి వస్తే, కందుకూరి రాజ్యలక్ష్మి కాలేజీ ఫర్ ఉమెన్ అనే కాలేజీలో ఆర్వీ పాపారావు అనే వ్యక్తీ అటెండర్ గా పని చేస్తున్నారు. టైం స్కేల్ ప్రకారం తనకు జీతం ఇవ్వాలి అంటూ, సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయాలి అంటూ, ఆయన 2017లో హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో దీనికి సంబందించిన పిటీషన్ వేసారు. దీనికి సంబంధించి 2018లో హైకోర్టు ఈ కేసు విచారణ చేసి, ఆర్వీ పాపారావు వేసిన పిటీషన కు అనుమతి ఇస్తూ, సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలి అంటూ, హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఇప్పటికీ అమలు కాకపోవటంతో, ఆయన కోర్టులో మరో పిటీషన్ వేసారు. ఈ సారి కోర్టు ధిక్కరణ పిటీషన్ వేసారు. అయితే, ఈ పిటీషన్ ను విచారణకు తీసుకున్న హైకోర్టు సంబధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది.

hc 27012021 2

వారు కోర్టుకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చింది. కోర్టు నోటీసులు తీసుకున్న తరువాత కూడా అధికారులు కోర్టుకు హాజరు కాలేదు. ఈ పిటీషన్ బుధవారం విచారణకు వచ్చింది. జస్టిస్ బట్టు దేవానంద్, ఈ పిటీషన్ ను విచారించి, అధికారుల ప్రవర్తన పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ రాష్ట్రంలో అధికారులు చట్టాని కంటే ఎక్కువ అనే భావనలో ఉండి, కోర్టు ఆదేశాలు కూడా పాటించటం లేదని వాపోయారు. సంబంధిత అధికారులు అందరి పై నాన్ బైలబుల్ వారంట్ జారీ చేసారు. వారంట్ తీసుకున్న వారిలో ఎండోమెంట్స్ కమీషనర్ అర్జున్ రావు, స్పెషల్ కమీషనర్ అఫ్ కాలేజీ ఎడ్యుకేషన్ ఎంఎం నాయక్, రీజినల్ జాయింట్ డైరెక్టర్ అఫ్ కాలేజీ ఎడ్యుకేషన్ డేవిడ్ కుమార్, కందుకూరి రాజ్యలక్ష్మి కాలేజీ ఫర్ ఉమెన్ కాలేజీ ఆఫీసర్ కు, కోర్టు ఆదేశాలు పాటించనందుకు, నాన్ బైలబుల్ వారంట్ జారీ చేసారు. గతంలో హైకోర్టు ఇలా అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేయటం అనేక సార్లు జరిగింది. ఏకంగా డీజీపీ, చీఫ్ సెక్రటరీలను పలు మార్లు పిలిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి, రాష్ట్ర ఎన్నికల సంఘం దూకుడు పెంచింది. ఇప్పటికే 13 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి, ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేయాలి, ఇటు ఉద్యోగల సౌకర్యాలు, బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులు, సమస్యాత్మక ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించటం, ఇవన్నీ పనులు ముందుకు తీసుకుని వెళ్తున్నారు. దీనికి సంబంధించి, ఎన్నికలక నిర్వహణకు సంబంధించి, ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ మరో నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల నిర్వహణ సాఫీగా సాగటానికి, ఒక స్పెషల్ ఆఫీసర్ ను నియమించారు. ఐజి స్థాయి అధికారిని, ఎన్నికల నిర్వహణ కోసం నియమించారు. ఐజి గా ఉన్న ఎన్.సంజయ్ ను, ఎన్నికల నిర్వహణ అధికారిగా నిమ్మగడ్డ నియమించారు. చార్జ్ తీసుకున్న ఎన్.సంజయ్, కొద్ది సేపటి క్రిందట, ఎన్నికల కమిషన్ ను కలిసారు. గతంలోనే ఒక ఐజి స్థాయి ప్రత్యెక అధికారిని నియమిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రెస్ మీట్ లో చెప్పిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బలవంతంగా చేస్తున్న ఏకగ్రీవాలు, బలవంతంగా నామినేషన్ వేయనివ్వకుండా చేయటం వంటి వాటి గురించి, ఈ అధికారి దృష్టి సారించే అవకాసం ఉంది.

sanjay 26012021 2

ముఖ్యంగా ఎన్నికలు నామినేషన్ లు దగ్గర నుంచి, ఎన్నికల కౌంటింగ్ అయ్యే వరకు, ఎక్కడా ఎలాంటి ఘటనలు జరగకుండా, ఐజి సంజయ్ వ్యవహరించాల్సి ఉంటుంది. సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి, కావాల్సిన బలగాలు దింపి, ప్రజలు స్వేచ్చగా ఎన్నికల్లో పాల్గునేలా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంది. గత ఎన్నికల సమయంలో, నామినేషన్ ల సమయంలో, జరిగిన ఘటనలు దృష్టిలో పెట్టుకుని, ప్రత్యెక అధికారిని నియమించారు. కొద్దిసేపటి క్రితమే ఐజి సంజయ్ విజయవాడలో , ఎలక్షన్ కమిషన్ తో చర్చించారు. నాలుగు విడతల ఎన్నికల్లో బద్రత, ఎంత మంది సిబ్బంది కావాలి, ఏ జిల్లాలో ఎంత మందిని నియమించారు, ఎన్నికల విధుల్లో పాల్గునే పోలీసులకు మౌలిక సదుపాయాలు ఇలా అన్ని విషయాల పై చర్చించారు. ఇక మరో పక్క, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చిత్తూరు కలెక్టర్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో ఇంఛార్జ్ కలెక్టర్‌గా, జాయింట్ కలెక్టర్ మార్కండేయులుకు బాధ్యతలు అప్పగించారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్‍ వ్యవహారం పై నిన్న సాయంత్రం నుంచి, అటు ప్రభుత్వానికి, ఇటు ఎలక్షన్ కమిషన్ కు మధ్య, వివాదం కొనసాగుతుంది. పంచాయతీ ఎన్నికల షెడ్యుల్ ప్రకటించిన తరువాత, రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వెళ్ళటం, మొదట అనుకూలంగా, తరువాత డివిజన్ బెంచ్ లో వ్యతిరేకంగా ప్రభుత్వానికి తీర్పు రావటం తెలిసిందే. అయితే ఈ సమయంలో ఎన్నికలకు సంబంధించి, 2021 ఓటర్ల జాబితాను, ఈ నెల 21న ప్రచురిస్తాం అని, ప్రభుత్వం తరుపున కోర్టుకు తెలిపారు. అఫిడవిట్ కూడా దాఖలు చేసారు. అయితే ఓటర్ల జాబితా మాత్రం బయటకు రాలేదు. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్‍ ఈ వ్యవహారంలో విఫలం చెందారని, ఎలక్షన్ కమీషనర్ ప్రకటించారు. అయితే ఈసి అనుమతి లేకుండా, నిన్న రాత్రి ప్రభుత్వం ఆ ఇద్దరినీ సస్పెండ్ చేసింది. అయితే, ఈ రోజు ఉదయం స్పందించిన ఎలక్షన్ కమిషన్, ఎన్నికలు జరుగుతున్న దశలో, ఏదైనా ఈసీకి చెప్పి చేయాలని, ప్రొసీజర్ ప్రకారం చేయాలనీ, ప్రభుత్వ ఉత్తర్వులు తిరస్కరించింది.

ec 260120321 2

అయితే ఇప్పుడు ఎన్నికల కమిషన్ వీరి పై సంచలన ఆదేశాలు ఇచ్చింది. వీరి పై అభిశంసన జారీ చేస్తూ, ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. "Guilty of serious offence" కింద ఈ ఆదేశాలు ఇచ్చినట్టు అర్ధం అవుతుంది. నిబంధనల ఉల్లంఘనలను సర్వీసు రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అభిశంసన ఉత్తర్వులు జారీ చేస్తూ, ఈ ఉత్తర్వులను తమ వెబ్సైటులో ఉంచింది ఎన్నికల కమిషన్. అయితే ఈ ప్రొసీడింగ్స్ లో, వీళ్ళు ఇరువురు, ఆయా స్థానంలో ఉండటానికి అనర్హులని ప్రకటిస్తూ, వీరిని వేరే డిపార్టుమెంటు కు బాదిలీ చేయాలని, ఆదేశించింది. ఈ ఉత్తర్వుల్లో ఎందుకు వీరి పై ఈ చర్యలు తీసుకుంది, పూర్తి వివరాలు ఇచ్చారు. ముఖ్యంగా ఓటర్ లిస్టు రెడీ చేయలేదని, వీరు తగిన ఆదేశాలు ఇవ్వాలని ఈసి చెప్పినా, వీరు విఫలం అయ్యారని పేర్కొన్నారు. దీని వల్ల ఇప్పుడు 3.60 లక్షల మంది ఓటు హక్కు కోల్పోయారని, దీనికి వీరే బాధ్యులని ఈసి గతంలోనే తెలిపింది. ఒక పక్క ఓటర్ల జాబితా రెడీ చేయకపోవటం, ఈసి ఆదేశాలు పాటించకపోవటం, అలాగే కోర్టులో తాము 21న ప్రచురిస్తాం అని చెప్పి ఉల్లంఘించటం వల్ల, ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ రోజు పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్‍ పై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ 3.61లక్షల మంది యువ ఓటర్లు ఓటు హక్కు కోల్పోవటానికి కారణం అనేది అభియోగం. ఇక ఈ అభిశంసనకు సంబంధించి, నిన్నే ప్రభుత్వానికి లీకులు వచ్చిన నేపధ్యంలో, నిన్నే ప్రభుత్వం వారిని సస్పెండ్ చేసింది. అయితే సర్వీస్ రూల్స్ కు వ్యతిరేకంగా రిమార్క్ రాసే అవకాసం లేకుండా చేసారు. ఇది గమనించిన ఈసి , ప్రభుత్వ ఉత్తర్వులు అంగీకరించకుండా, ఈసినే సర్వీస్ రూల్స్ లో రిమార్క్ రాసి, ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంది. దీంతో, ప్రభుత్వ ఉద్యోగి సర్వీస్ రికార్డ్ లో రిమార్క్ పడితే, ప్రమోషన్లు సమయంలో చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం, అధినేతలు బాగానే ఉంటారు కానీ, అధికారులు బలి అయిపోతారు. అయితే ఇక్కడే ఇప్పుడు ఇంకో విషయం చెప్పుకోవాలి. ఈ చర్యలతో ద్వివేది, గిరిజాశంకర్‍ పని అయిపోలేదు. ఇప్పుడు ఈ అంశం కోర్టులో కూడా ఉంది. సుప్రీం కోర్టు తీర్పు రాకముందు, ఎన్నికలు ఆపే ఉద్దేశంతో, హైకోర్టులో మరో పిటీషన్ దాఖలు అయ్యింది. ఇది ఏ రాజకీయ పార్టీ కానీ, ప్రభుత్వం కానీ దాఖలు చేయలేదు కానీ, వెనుక ఎవరైనా ఉన్నారో లేదో తెలియాల్సి ఉంది.

hc 26012021 2

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరపకూడదు అంటూ, హైకోర్టులో పోయిన వారం హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి, 2019 ఓటర్ల జాబితా పై జరుగుతున్నాయని, అలా కాకుండా 2021 ఎన్నికల జాబితా ప్రకారం జరగాలని పిటీషన్ లో పేర్కొన్నారు. 2019 ఓటర్ల జాబితాతో ఎన్నికలకు వెళ్ళటం వల్ల, 3.60 లక్షల మంది ఓటు హక్కు కోల్పోయారు అనేది పిటీషన్ లో తెలిపారు. అయితే ఈ పిటీషన్ ను అత్యవసరంగా విచారణ చేయాలి అంటూ పిటీషనర్ కోరగా, ఇందులో అత్యవసరం ఏమి లేదని హైకోర్టు రెగ్యులర్ గా తీసుకుంది. అయితే తరువాత రోజు విచారణకు రాగా, ఇది సుప్రీం కోర్టులో ఉంది కాబట్టి, బుధవారం విచారణ చేస్తామని హైకోర్టు వాయిదా వేసింది. అయితే, సుప్రీం కోర్టులో ఎన్నికలు జరపుకోవచ్చని ఆదేశాలు రావటంతో, రేపు ఈ పిటీషన్ పై హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. ఎన్నికలు ఆపే పరిస్థితి ఉండదు కానీ, ఈ పరిస్థితి కారణం అయిన అధికారుల పై చర్యలు తీసుకునే అవకాసం ఉంది. ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా రెడీ చేయమన్నా, ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేయలేదు, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్‍ పై ఈసి చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. రేపు ఇదే కోర్టుకు చెప్తే, కోర్టు కూడా వీరి పై చర్యలు తీసుకునే అవకాసం ఉంది.

Advertisements

Latest Articles

Most Read