వాలంటీర్ వ్యవస్థ పై సంచలన నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ఎలక్షన్ కమిషన్. వాలంటీర్ వ్యవస్థ మొత్తం వైసీపీ కార్యకర్తలతో నిమపేసాం అంటూ గతంలో విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు, వాలంటీర్లు తరుచూ వివాదాల్లో ఇరుకున్న వార్తలు, ఒక పార్టీకి కొమ్ము కాస్తూ వాలంటీర్లు చేస్తున్న అరాచకాల పై గతంలో అనేక సార్లు ప్రతిపక్ష పార్టీలు, ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత కూడా, పార్టీలు అన్నీ వాలంటీర్ వ్యవస్థ పై పని చేసాయి. రాష్ట్రంలో వాలంటీర్లు 90 శాతం మంది మన పార్టీ వాళ్ళే అంటూ, విజయసాయి రెడ్డి మాట్లాడిన వీడియో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. అయితే విపక్ష పార్టీలు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసిన నేపధ్యంలో, వాలంటీర్ల పై, సంచలన నిర్ణయం తీసుకుని ఎన్నికల కమిషన్. పంచాయతీ ఎన్నికల్లో, ఎన్నికలకు సంబందించిన విధుల్లో ఎక్కడా వాలంటీర్లు పల్గునకూడదని, ప్రాచారం చేయకూడదని, అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. అలాగే అభ్యర్ధులకు కావలసిన సర్టిఫికేట్లు ఇవ్వటంలో, తహసీల్దార్లు అలసత్వం వహిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. బుధవారం అన్నికాల జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ హెచ్చరికలు పంపించింది.

voolunteers 28012021 2

ఉద్యోగ సంఘాలు, మా పై తీవ్ర పద జాలంతో విరుచుకు పడినా, వాటిని పట్టించుకోవటం లేదని, అందరం కలిసి పని చేద్దాం అంటూ, రాష్ట్ర ఎన్నికల కమీషనర్, చీఫ్ సెక్రటరీని కోరారు. అందరం కలిసి ఎన్నికలు సజావుగా జరిగేలా చూద్దామని అన్నారు. అలాగే వీలైనంత ఎక్కువగా టెక్నాలజీని ఉపయోగించుకుందామని, ఎన్నికల కోసం ఒక ప్రత్యెక యాప్ ని కూడా తెస్తున్నట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది. అలాగే ఎక్కడా వ్యాక్సిన్ కు కూడా ఇబ్బంది లేకుండా చూడాలని, ఆదేశాలు ఇచ్చారు. మొన్నటి వరకు ఎన్నికలకు సహకరించం, సమీక్షలకు రాము అని చెప్పిన చీఫ్ సెక్రటరీ, అలాగే డీజీపీ, పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, అన్ని జిల్లాల కలెక్టర్లు సమావేశానికి హాజరు అయ్యారు. ప్రభుత్వం తరుపున తీసుకున్న చర్యలు అన్నీ, ఎలక్షన్ కమిషన్ కు వివరించారు. పోలీస్ వ్యవస్థ ప్రణాళికను కూడా డీజీపీ , ఎన్నికల కమీషనర్ కు వివరించారు. మొత్తంగా అందరూ కలిసి ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదని, ఉత్తర్వులు పట్టించుకోవలసిన అవసరం లేదని, రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఏమైనా అనధికారికంగా ఉత్తర్వులు ఇచ్చారా అని, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు ఇచ్చిన ఆదేశాలు, ఎలా అమలు చేయకూడదు అని ఇక్కడ ఎవరైనా ట్రైనింగ్ ఇస్తున్నారేమో అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఐఏఎస్ ట్రైనింగ్ లో భాగంగా, మీరు ముస్సోరి వెళ్లి శిక్షణ తీసుకుని వచ్చారని, అక్కడ ఏమి నేర్చుకున్నారు అంటూ, హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 90 శాతం మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, తాము చట్టాలకు అతీతం అయినట్టు ప్రవర్తిస్తున్నారు అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒక కాలీజీకి సంబంధించి, అటెండర్‌కు సంబంధించి మినిమం పే స్కేల్ అమలు చేయాలని కోర్టు చెప్పిన చేయకపోవటం పై, హైకోర్టుకు కోర్టు ధిక్కరణ పిటీషన్ లో, ఉన్న అధికారులు కోర్టుకు గైర్హాజరైవటం పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అధికారుల పై, పై విధంగా స్పందించింది.

రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికల హడావిడి వచ్చిన దగ్గర నుంచి, ఉద్యోగు సంఘాలను ముందుకు పెట్టి, రాష్ట్ర ప్రభుత్వం చేసిన హడావిడి ఇంతా అంతా కాదు. ముఖ్యంగా వెంకట్రామి రెడ్డి అనే ఉద్యోగ సంఘం నాయకుడు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఒక రాజకీయ నాయకుడి లాగా మాట్లాడుతూ, ప్రతిపక్ష పార్టీల పైన, నేతల పైన రాజకీయ విమర్శలు చేసే దాకా వెళ్లారు. అంతే కాదు, రాజ్యంగ పదవిలో ఉన్న ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైన కూడా ఘాటుగా వ్యాఖ్యలు చేసారు. అంతే కాదు, ఏకంగా మాకు ప్రాణ హాని ఉంటే, ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వెంకట్రామి రెడ్డి చేసిన ఓవర్ ఆక్షన్ కి, ఆయన చరిత్ర తవ్వని తెలుగుదేశం పార్టీ, ఆయన భార్య ముషీరాబాద్ లో 2014లో ఎన్నికల్లో ఎమ్మెల్యే గా పోటీ చేద్దామని అనుకుని, ప్రచారం చేసిన ఫోటోలు, వీడియోలు బయట పెట్టి, వెంకట్రామి రెడ్డి వైసీపీ కార్యకర్త అనే వ్యాఖ్యలు చేసారు. వెంకట్రామి రెడ్డి, ఎన్నికల కమీషనర్ పై చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం అయ్యాయి. ఏకంగా సుప్రీం కోర్టు కూడా, ఎన్నికల పిటీషన్ గురించి విచారణ సమయంలో, ఉద్యోగులు వేసిన పిటీషన్ గురించి, న్యాయవాది కలుగ చేసుకోగా, జడ్జి తీవ్రంగా స్పందించారు. మీ ఉద్యోగుల ఓవర్ ఆక్షన్ చూస్తున్నాం, మీరు ఏకంగా ఎన్నికల కమీషనర్ పైనే వ్యాఖ్యలు చేస్తారా, మాట్లాడకండి అంటూ ఘాటుగా స్పందించింది సుప్రీం కోర్టు.

bopparaju 27012021 2

అయితే ఇప్పుడు వెంకట్రామి రెడ్డి తీరు పై ఉద్యోగులు రెండుగా చీలి పోయారు. ఏపీ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి పై, అమరావతి ఉద్యోగుల జేఏసీ ఈ రోజు సమావేశం అయ్యి, తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వెంకట్రామి రెడ్డి వైఖరితో, ఉద్యోగులు పలుచన అయిపోయారని, అమరావతి ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వెంకట్రామిరెడ్డి అనే వ్యక్తిని కింద స్థాయి ఉద్యోగులతో సంబంధాలు లేవని, వెంకట్రామిరెడ్డి వైఖరి పై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాం అని బొప్పరాజు అన్నారు. వెంకట్రామిరెడ్డి వైఖరితో ఉద్యోగులకు భరించలేని స్థితిలోకి వేల్లిపోయారని, అందుకే వెంకట్రామిరెడ్డి పై, వివిధ ఉద్యోగుల సంఘాలు ఆవేదన చెందుతున్నాయని అన్నారు. సచివాలయంలో, ఇంత మందే రావాలి, అంత మందే రావాలి అంటూ వెంకట్రామి రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అయితే దీని పై స్పందించిన వెంకట్రామిరెడ్డి, నా పైన అందరూ కలిసి కుట్ర పన్నారని, ఇన్ని రోజులు జరిగిన దానికి, ప్రజల్లో ఉద్యోగుల పై వచ్చిన వ్యతిరేకత మొత్తం నా పైన మళ్ళించే కుట్ర చేస్తున్నారని వెంకట్రామిరెడ్డి అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ, నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా అయన ఒక ఆసక్తికర విషయం చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, తనకు ఎదురైన అనుభవం గురించి నవ్వుతూ చెప్తారు. ఆయన మాట్లాడుతూ, తనకు గతంలో హైదరాబాద్ లో ఓటు ఉందని, అది అక్కడ సరెండర్ చేసి, గుంటూరు జిల్లా దుగ్గిరాలలో తన ఓటు నమోదు చేయమని స్థానిక తాసిల్దార్ ను అడిగినట్టు చెప్పారు. తన సొంత ఊరు దుగ్గిరాల అని, తనకు అక్కడ ఇల్లు, పొలం ఇతర ఆస్తులు అన్నీ ఉన్నాయని, కేవలం హైదరాబాద్ లో ఉద్యోగ రిత్యా, అక్కడ క్యాంప్ ఆఫీస్ లో ఉంటూ, ఇక్కడ అక్కడ విధులు నిర్వహిస్తున్నా అని అన్నారు. అయితే, రేపు రిటైర్డ్ అయిన తరువాత, తాను ఎలాగూ దుగ్గిరాలలోనే ఉంటానని, అందుకే ఇక్కడ ఓటు హక్కు నమోదు చేసి, రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు కూడా వేద్దామని అనుకున్నానని నిమ్మగడ్డ తెలిపారు. అయితే స్థానిక తాసిల్దార్ తనను, తన ముందు హాజరుకామన్నారని, అయితే ఆ రోజు చీఫ్ సెక్రటరీతో మీటింగ్ ఉందని, తరువాత ఎప్పుడు డేట్ ఇచ్చిన, మీ ముందు హాజరు అవుతానని తాసిల్దార్ కు చెప్పానని నిమ్మగడ్డ తెలిపారు. అయితే తాసిల్దార్ మాత్రం, మీరు హైదరాబాద్ లోనే ఎక్కువ ఉంటున్నారు అంటూ, తన ఓటు దరఖాస్తుని రిజక్ట్ చేసారని తెలిపారు.

nimmagadda 28012021 2

అయితే తాను ఎన్నికల అధికారానిని అని చెప్పి, తాసిల్దార్ పై కక్ష సాధించలేదని అన్నారు. తాసిల్దార్ కు ఉన్న అధికారాలని గౌరవించానని, రూల్ అఫ్ లా అనేది అందరికీ ఒకటే ఉంటుందని, అందరూ దాన్ని ఫాలో అవ్వాల్సిందే అని తెలిపారు. ఆ ఉద్దేశంతోనే తాసిల్దార్ పై నేనేమి, కక్ష తీర్చుకోలేదని, అయితే ఇలా జరిగింది, నా దరఖాస్తు మరోసారి పరిశీలించమని, జిల్లా కలెక్టర్ ని కోరానని తెలిపారు. రేపు కలెక్టర్ కనుక ఒప్పుకోక పొతే, కోర్టుకు వెళ్తానని అన్నారు. నాకు ఉన్న హక్కులు నేను వాడుకుని ముందుకు వెళ్తాను కానీ, ఎవరి మీద కక్ష సాధింపు ధోరణితో వెళ్లలేదని అన్నారు. రూల్ అఫ్ లా అనేది అందరూ ఫాలో అవ్వాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చెప్పను అంటూ, తనకు ఎదురైన అనుభవం గురించి నిమ్మగడ్డ చెప్పుకొచ్చారు. అలాగే మంత్రులు తన పై చేస్తున్న వ్యాఖ్యల పై స్పందిస్తూ, మంత్రులు అలా మాట్లాడటం సరి కాదని అన్నారు. ఇదే విషయం గవర్నర్ తో చెప్పినట్టు చెప్పారు. వ్యక్తిగతంగా నిందించటం తగదని, తన మాటగా మంత్రులు చెప్పమని, గవర్నర్ కు చెప్పమని చెప్పినట్టు నిమ్మగడ్డ చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read