ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలక దేవాలయాల పై జరుగుతున్న ఘటనల పై స్పందించింది. మొన్నటి దాకా జరిగిన ఘటనల పై పోలీసులు విచారణలు జరుగుతున్నా పెద్దగా మార్పు రాకపోవటం, ఘటనలు రోజు రోజుకీ పెరుగుతూ ఉండటం, ప్రతిపక్షాలు, ప్రజలు నుంచి ఒత్తిడి రావటంతో, ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది. నిన్న ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది. ఈ జీవో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్‌ జారీ చేసారు. అయితే ప్రభుత్వం చేస్తున్న పని మంచిదే అయినా, అందులో వాడిన భాష చూసి అందరూ అవాకయ్యారు. రాష్ట్రంలో వస్తున్నకొత్త సాంప్రదాయాలకు, ఇది ఒక మచ్చు తునకగా చెప్తున్నారు. సహజంగా రాజకీయ విమర్శల్లో వచ్చే వ్యాఖ్యలు, ఏకంగా ప్రభుత్వ అధికారులు విడుదల చేసే జీవో ల్లో కూడా వస్తున్నాయి అంటే, రాష్ట్రంలో ఉన్న పరిస్థితి రోజు రోజుకీ ఎటు వెళ్తుందో అర్ధం అవుతుంది. వచ్చే ఎన్నికల్లో వేరే పార్టీ అధికారంలోకి వస్తే, ఇదే సాంప్రదాయం వాళ్ళు కూడా కొనసాగించి, ఇప్పుడు చేస్తున్న దానికి తిరిగి ఇస్తే, పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచిస్తేనే భయం వేస్తుంది. ఇక ఈ జీవో విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాల పై జరుగుతున్న ఘటనల నేపధ్యంలో, రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, కమితీలు వేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితిలో, ఇది నిజంగా మంచి నిర్ణయమే. మత సామరస్యాన్ని కాపాడటానికి, ఈ చర్య ఎంతో కొంత ఉపయోగ పడుతుంది. ఇది ఎలా పని చేస్తుంది, ఇందులో సభ్యులను ఎలా తీసుకుంటారు అనేది పక్కన పెడితే, ఉద్దేశం మంచిదే.

velagapudi 08012021 2

అయితే ఇక్కడ వాడిన పదం మాత్రం అభ్యంతరం అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో పాలసీ పెరాలసిస్ వచ్చింది అంటూ, ఆ జీవోలో రాసారు. అంటే అప్పటి ప్రభుత్వం, అసమర్ధత, అసహాయత అనే విధంగా పాలన చేసింది అని అర్ధం. విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాలు కుంటుపడ్డాయని, మేము వచ్చిన తరువాత అద్భుతాలు చేస్తున్నాం అని రాసుకున్నారు. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్‌ జారీ చేసిన జీవోలో, "పాలసీ పెరాలసిస్" అంటూ గత ప్రభుత్వాన్ని నిందిస్తూ రాజకీయ వ్యాఖ్యలు చేయటం పై సీనియర్ బ్యూరోక్రాట్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ధోరణి మంచిది కాదని హితువు పలుకుతున్నారు. తమ నిర్ణయం గొప్పది అని చెప్పటానికి, గతంలో పరిస్థితి ఇలా ఉంది అని చెప్పటం తప్పు లేదు కానీ, రాజకీయ పదాలు వాడటం అభ్యంతరం అని అంటున్నారు. గత ప్రభుత్వం చేతకానిది అని చెప్పేది, రాజకీయ నాయకులు అని, ఎమ్మెల్యే, మంత్రులు, ఎంపీలు అవి చూసుకుంటారని, రాజకీయ విమర్శలు చేసే స్థాయిలో సీనియర్ అధికారులు ఉంటే, ఈ సాంప్రదాయం మరింత పెచ్చుమీరితే, మంచిది కాదని అంటున్నారు. అయితే దీని పై తెలుగుదేశం పార్టీ స్పందిస్తూ, అధికారులు తీరు మార్చుకోవాలని, రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అనే విషయం గుర్తు పెట్టుకోవాలని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాల పై జరుగుతున్న వరుస ఘటనలతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఒత్తిడికి గురి అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా పోలీసులు కూడా, తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. దీనికి ప్రధాన కారణం జరుగుతున్న వరుస ఘటనలు. ఈ ఘటనల్లో దోషులను ఇప్పటి వరకు పట్టుకోక పోవటం ఒక ఎట్టు అయితే, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అని చెప్తున్నా, ఎన్నో చేసాం అని చెప్తున్నా, ఈ ఘటనలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఇన్నాళ్ళు వేచి చూసిన ప్రతిపక్షాలు కూడా ఆక్టివేట్ అయ్యాయి. ముఖ్యంగా 20 నెలలు ఇన్ని ఘటనలు జరిగినా ప్రభుత్వాన్ని వీటిని అరికట్ట మని చెప్పి చెప్పి విసుగు చెంది, చివరకు రామోలోరి తల తీసేసే దాకా వెళ్తే, ఇక తట్టుకోలేక చంద్రబాబు కూడా రంగంలోకి దిగారు. సహజంగా ఇలా మతాలూ, కులాలు జోలికి చంద్రబాబు రారు. కానీ జరుగుతున్న పరిణామాలు చూసి, ఆవేదన చెంది, 80 శాతం పైగా ఉన్న హిందువులు మనోభావాలు దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు కూడా రామతీర్ధం పర్యటనకు వెళ్లారు. అయితే అప్పటి ఘటన జరిగి నాలుగు రోజులు పైన అయ్యింది. అప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎవరూ అటు వెళ్ళలేదు. ఇది ఒక్కటే కాదు, 140 ఘటనలు జరిగినా, ఎవరూ అటు వెళ్ళలేదు. అయితే చంద్రబాబు వస్తున్నారని తెలుసుకుని, ఆ కార్యక్రమాన్ని హైజాక్ చేసి, రచ్చ రచ్చ చేయటానికి విజయసాయి రెడ్డి ప్లాన్ చేసి, చంద్రబాబు కంటే ముందే అక్కడకు వచ్చారు. అసలు చంద్రబాబు ముందే సమచారం ఇచ్చి, పర్మిషన్ తెసుకుని వచ్చిన తరువాత కూడా, విజయసాయి రెడ్డికి పోలీసులు ఎలా పర్మిషన్ ఇచ్చారో అర్ధం కాలేదు.

amit 08012021 2

ఇక ఆ రోజు జరిగిన ఘటన అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి రాష్ట్రంలో దేవాలయాల పై జరుగుతున్న దాడుల అంశం దేశ వ్యాప్త చర్చ అయ్యింది. అయితే ఆ తరువాత రోజు బీజేపీ నేతలు, రెండు సార్లు రామతీర్ధం వెళ్తాం అని చెప్పినా, ప్రభుత్వం ఒప్పుకోలేదు. దీంతో రెండు సార్లు రచ్చ రచ్చ అయ్యింది. నిన్న బీజేపీ నేతలు సోమ్మసిల్లి పడిపోయే దాకా పరిస్థితి వచ్చింది. అయితే బీజేపీ నేతలు ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నారు, కేంద్రంలో తమ ప్రభుత్వమే ఉండటంతో ఫిర్యాదు చేసారు. రాజ్యసభ ఎంపీ జీవీఎల్ స్వయంగా ఈ విషయం చెప్పారు. తాను జరిగిన విషయం పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఫోన్ చేసి చెప్పానని, ఆయన తగు చర్యలు తీసుకుంటారని చెప్పారు. అలాగే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నాయకులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. అయితే, కేంద్ర హోం శాఖ నుంచి, రాష్ట్ర పోలీసులకు ఫోన్ వచ్చిందని, ఈ విషయం పై పూర్తి నివేదిక సమర్పించాలని కోరినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే రాష్ట్ర పోలీసు అధికారులు మాత్రం, తమకు కేంద్రం నుంచి ఎలాంటి ఫోన్ రాలేదని చెప్తున్నారు.

డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు నిన్న కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారని, అదేవిధంగా ఆయన డీజీపీగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారని, అందుకు ఆయన్ని అభినందిస్తున్నానని, ఉన్నపళంగా సవాంగ్ గారికి వేంకటేశ్వరుడి పై భక్తి ఎందుకుపుట్టుకొచ్చిందో రాష్ట్ర ప్రజలే అర్థం చేసుకోవాలని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అభిప్రాయపడ్డారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే "చంద్రబాబుపై కేసుపెట్టే అంశాన్ని న్యాయనిపుణులతో చర్చిస్తున్నామని డీజీపీగారు చెప్పారు. చంద్రబాబు మతవిద్వేషాలు రెచ్చగొడుతూ, ప్రజలను రెచ్చగొడుతున్నారని కూడా డీజీపీగారు చెప్పారు. రాష్ట్రంలో మొత్తంగా చూస్తే, హిందూ మతంపై 140కు పైగా ఘటనలు జరిగాయనే విషయం డీజీపీగారికి తెలియదా? ఇన్ని జరుగుతుంటే ఒక్కరోజైనా డీజీపీగారు, ఘటనలకు కారకులైన వారిని అరెస్ట్ చేసి, మీడియా ముందుకొచ్చి మాట్లాడారా? అలా చేయలేక పోవడం ఆయన అసమర్థత కాదా?. ఒక మతంపై పనిగట్టుకొని దాడిచేస్తున్నారు.. రాష్ట్రంలో మతసామరస్యాన్ని కాపాడండి అని చంద్రబాబు కోరితే, ఆయనపై మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నాడంటారా? మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా, విగ్రహధ్వంసాలను అవహేళన చేసేలా కొడాలి నానీ మాట్లాడినప్పుడు డీజీపీగారు ఏమయ్యారు? విగ్రహ ధ్వంసాలు జరిగినప్పుడు రాయేకదా ఏమైంది అన్నప్పుడు మంత్రిపై ఎందుకు కేసులు పెట్టలేదు?"

kodali 07012021 2

"దుర్గగుడిలో వెండిసింహాలు మాయమైతే పోలీసులు ఎవరిపై కేసులుపెట్టారు? రాములవారి శిరస్సు ఖండించడంతో ప్రజల్లో మొదలైన ఆందోళనలు గమనించి, ప్రతిపక్షనేతహోదాలో చంద్రబాబునాయుడు రామతీర్థం వెళితే ఆయనపై కేసులు పెడతామంటారా? నోటికొచ్చినట్లు మాట్లాడిన కొడాలినానీ మాత్రం దర్జాగా పేకాట ఆడిస్తూ చెరువు గట్లపై తిరుగుతున్నాడు. జగన్ సారథ్యంలోని ప్రభుత్వానికి చెందిన మంత్రి కదా? రాష్ట్రంలోవైసీపీ సెక్షన్లు నడుస్తున్నాయి కదా? నిజంగా డీజీపీగారికి రాష్ట్రంలో మతసామరస్యం నెలకొల్పాలన్న ఆలోచనే ఉంటే, ముందుచర్యలు తీసుకోవాల్సింది కొడాలినానీపైనే. డీజీపీగారి మాటలే చాలు. ఆయన తాడేపల్లి ప్యాలెస్ కి సరెండర్ అయి మాట్లాడుతున్నాడని. ముందు కొడాలినానీని అరెస్ట్ చేశాకే, డీజీపీగారు చంద్రబాబు గురించి, ఆయన వ్యాఖ్యల గురించి మాట్లాడాలి. అప్పటివరకు ఆయనకు మాట్లాడే హక్కనేది లేదు. ఆ హక్కుని ఆయన ఎప్పుడో కోల్పోయాడు. విజయవాడ బస్టాండ్ లో సీతమ్మ తల్లి విగ్రహాన్ని ఎలుకలుధ్వంసం చేశాయన్న పోలీసులపై డీజీపీగారు ఏంచర్యలు తీసుకున్నారు. విజయవాడ డీసీపీ విక్రాంత్ పాటిల్, అలా మాట్లాడిన సీఐపై చర్యలు తీసుకుంటానంటే , తాము ఆరోజున ఆందోళన విరమించాం. కానీ ఇంతవరకు ఎలుకలు విగ్రహాన్ని ధ్వంసం చేశాయన్నసీఐపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. డీజీపీగారు అటువంటి చర్యలు తీసుకోనంతవరకు ఆయనకు మాట్లాడే అర్హత లేనేలేదు." అని పట్టాభి అన్నారు.

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, పోలీస్ అధికారుల సంఘం తీరు పై విరుచుకు పడ్డారు... ఆయన మాట్లాడుతూ.. "పోలీస్ అధికారుల సంఘం విడుదలచేసిన లేఖలో, రాజకీయ స్వలాభంకోసం పోలీసులకు మతాలు ఆపాదించొద్దన్నారు. ఎవరు ఎవరికి మతాలు ఆపాదించారో తెలిసే లేఖరాశారా? ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీ ముగ్గురూ క్రిస్టియన్లేనని, వారంతా ఒకేమతానికి చెందినవారయినప్పుడు, హిందూమతంపై జరుగుతున్న ఘటనలకు సంబంధించి ఇంకా ఎక్కువబాధ్యతతో వ్యవహరించా లని చంద్రబాబు సూచిస్తే అది తప్పెలా అవుతుంది? ఆయన చెప్పినదాన్ని తప్పుపడుతూ, లేఖలో ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన నాయకుడని సంబోధిస్తారా? జనకుల శ్రీనివాసరావు, మస్తాన్ ఖాన్, సోమశేఖర్ రెడ్డి వంటివారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది. 14ఏళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి గురించి ఇష్టానుసారం మాట్లాడతారా? తన రాజకీయ జీవితంలో 40ఏళ్లపాటు ప్రజలకుసేవ చేసిన మచ్చలేని వ్యక్తి చంద్రబాబునాయుడు. ఆయన పనితనం, వ్యక్తిత్వం, గొప్పతనం తప్పుడుసమాచారంతో లేఖలు రాసిన పోలీస్ అధికారులసంఘం నేతలకు ఎలా తెలుస్తాయిలే. వైసీపీఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి “బొంగులో పోలీసులు, నాకాళ్ల దగ్గర పడుంటారు” అన్నప్పుడు పోలీస్ అధికారుల సంఘం నేతలు ఏమైపోయారు? అధికార పార్టీ వారు పోలీసులను నోటికొచ్చినట్లు దూషించినప్పుడు ఈ అసోసి యేషన్ నేతలంతా తాడేపల్లి ప్యాలెస్ లో అంట్లు తోముతున్నారా? "

police 07012021 1 2

"ఉండవల్లి శ్రీదేవి ఒకసీఐని పట్టుకొని “అరేయ్ మెంటల్, నాకాళ్లు పట్టుకుంటే నీకు పోస్టింగ్ ఇచ్చానురా” అన్నప్పుడు జనకుల శ్రీనివాసరావు ఏమయ్యాడు. కాసు మహేశ్ రెడ్డిపై, ఉండవల్లిశ్రీదేవి పైచర్యలు తీసుకోవడానికి, లేఖలురాయడానికి పోలీస్ అసోసియేష న్ అధికారులకు ధైర్యం సరిపోలేదా? చంద్రబాబునాయుడు హాయాంలో ఏపీ పోలీస్ వ్యవస్థ దేశంలోనే నెం-1స్థానంలోఉంది. జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగే పోలీసులను మాత్రమే తాము తప్పుపడుతున్నాము. నిజాయితీగా పనిచేసేవారికి ఇప్పటికీ సెల్యూ ట్ చేస్తున్నాము. జంగారెడ్డి గూడెంలో ఎస్ ఐ దుర్గారావు చనిపోయినప్పుడు పోలీస్ అసోసియేషన్ ఏమైపోయింది? దుర్గారావు మరణానికి ఎవరు కారకులో జనకుల శ్రీనివాసరావుకి తెలియదా? పోలీస్ అసోసియేష న్ నాయకులమంటూ ఇష్టానుసారం ప్రవర్తిస్తే, చట్టపరంగా గట్టిగానే సమాధానం చెబుతామని హెచ్చరిస్తున్నాము. నిజంగా పోలీస్ అసోసియేషన్ కు ధైర్యముంటే, పోలీసులను బూతులుతిట్టిన వైసీపీఎమ్మెల్యేలకు లేఖలురాస్తే మంచిది. కొంతమంది పోలీస్ అధికారుల అత్యుత్సాహం వల్ల నిజాయితీగా పనిచేసే అధికారులు మానసికక్షోభ అనుభవిస్తున్నారు. కాబట్టి పోలీస్ అసోసియేషన్ సంఘం పద్ధతిగా ఉంటే మంచిది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శాశ్వతం కాదని పోలీస్ అధికారుల సంఘం గుర్తిస్తే మంచిది." అంటూ తన ప్రసంగం ముగించారు.

 

Advertisements

Latest Articles

Most Read