జస్టిస్ రాకేశ్‌కుమార్.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక సంచలనం. జస్టిస్ రాకేశ్‌కుమార్ అంటే తెలియని ఆంధ్రప్రదేశ్ వాసులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా అమరావతి ప్రజలకు ఆయన దేవుడు. అక్కడ రైతన్నలు ఇంకా ఆశతో ఉన్నారు అంటే, ఈయన కూడా కారణమే. ఇక ఆంధ్రప్రదేశ్ లో న్యాయం కోసం చూసే వారికి ఆయన ఒక నావలాగా కనిపించారు. ప్రభుత్వం చేస్తున్న చట్ట వ్యక్తిరేక పనులు గురించి తన వద్ద ఏ పిటీషన్ వచ్చినా, ఘాటుగా స్పందించే వారు. పదే పదే ప్రభుత్వం చట్ట విరుద్ధమైన చర్యలు చేయటం, జడ్జిల పై బూతులు తిట్టిన సోషల్ మీడియా వైసీపీ వారి పై ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోక పోవటం, ఇలా అనేక అంశాలతో ఆయన ప్రభుత్వం పై, ఒకింత అసంతృప్తిలో ఉండేవారు. చివరకు ఆయన అంటేనే ప్రభుత్వానికి భయం మొదలైంది. చివరకు, ఆయన అసలు మా కేసులు వాదించటానికి లేదు అంటూ, రెండు పిటీషన్లలో ఏకంగా ప్రభుత్వమే, అఫిడవిట్ వేయటం మరో హైలైట్. ఇలాగే మిషన్ బిల్డ్ ఏపి కేసులో జస్టిస్ రాకేశ్ కుమార్ తప్పుకోవాలని ప్రభుత్వం తరుపున మిషన్ బిల్డ్ ఎపి అధికారి ఐఏఎస్ ప్రవీణ్ కుమార్ వేసిన ఒక పితీషన్, సంచలనికి దారి తీసింది. ఇలా ఒక జడ్జి తమ కేసు వినకూడదు అంటూ, ఏకంగా ప్రభుత్వమే ఇలా పిటీషన్ వేయటంతో అందరూ ఆశ్చర్య పోయారు. అయితే చివరకు వాదనల సమయంలో, అసలు రాకేశ్ కుమార్ అనని మాటలు, ప్రభుత్వం అఫిడవిట్ లో పెట్టారని తేలింది.
దీంతో కోర్టు సీరియస్ అయ్యింది. ఐఏఎస్ ప్రవీణ్ కుమార్ పై క్రిమినల్ చర్యలకు ఆదేశాలు జరీ చేసి, కంటెంప్ట్ అఫ్ కోర్టు కింద కేసు బుక్ చేయమని చెప్పింది. అయితే ఈ తీర్పు కాపీలో జస్టిస్ రాకేశ్ కుమార్ కొన్ని సంచలన విషయాలు రాసారు. అసలు హైకోర్టు పై ఎందుకు ఇలా చేస్తున్నారో అని చెప్పుకుని వస్తూ, జగన్ , చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖ దగ్గర నుంచి మొదలు పెట్టి, ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు, జగన్ మోహన్ రెడ్డి కేసులు, తరువాత ఒకే రోజు ఏడు కేసులు పోలీసులు ఎత్తేయటం, జగన్ గురించి తెలుసుకోవటానికి గూగుల్ లో వెతకటం, ఇలా అనేక అంశాలు ఆ తీర్పులో పెట్టారు. అయితే ప్రభుత్వం ఇప్పుడు ఈ తీర్పు పై అభ్యంతరం చెప్తూ, అందులో రాసిన పదాల పై సీరియస్ అయ్యింది. జస్టిస్ రాకేశ్ కుమార్ రిటైర్డ్ అయినా సరే, ఆయన ఇచ్చిన తీర్పు పై, రాకేశ్ కుమార్ తీర్పు పై అభ్యంతరం చెప్తూ, సుప్రీం కోర్టు లో పిటీషన్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, జస్టిస్ రాకేశ్ కుమార్ తీర్పు పై అభ్యంతరం చెప్తూ , సుప్రీం కోర్టులో ప్రభుత్వం తరుపున పిటీషన్ దాఖలు చేసారు. మరి సుప్రీం కోర్టు, ఏమి చెప్తుందో చూడాలి.