ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరికీ లేని వింత పరిస్థితి ఉంది. ఒక్క రాజధానికే రాష్ట్రాలు నానా ఇబ్బందులు పడుతుంటే, మన రాష్ట్రంలో మూడు రాజధానులు అంటూ ఒక నిర్ణయం తీసుకుంది జగన్ ప్రభుత్వం. మూడు చోట్లో, మూడు రకాలు అని చెప్పుకొచ్చారు. అయితే గతంలో అమరావతి రాజధాని కోసం, జగన్ రెడ్డితో సహా అందరూ ఒప్పుకోవటంతోనే, అమరావతిలో రాజధాని ఏర్పాటుకు, అక్కడ భూములు ఇవ్వటానికి రైతులు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి నిర్ణయంతో రైతులు మునిగిపోయారు. అటు రాజధాని లేక, ఇటు తమ భూములు పోయి, ఎటూ పాలుపోని పరిస్థితిలో అమరావతి ఉద్యమం మొదులు పెట్టారు. మొదట్లో వారికి పెద్దగా మద్దతు లేకపోయినా, ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి మద్దతు ఉంది. ఇది పక్కన పెడితే, ఈ మొత్తం ప్రక్రియలో చంద్రబాబుని ఉత్తరాంధ్ర, రాయలసీమలో దెబ్బ కొట్టాలని, జగన్ మోహన్ రెడ్డి ఈ ఎత్తుగడ వేసారనే అభిప్రాయం కూడా ఉంది. ఇందు కోసమే, అమరావతిని మూడు ముక్కలు చేసిన దగ్గర నుంచి , చంద్రబాబుని ఉత్తరాంధ్ర ద్రోహిగా చేసే ప్రయత్నం చేసారు. చంద్రబాబు వైజాగ్ వెళ్ళటానికి ప్రయత్నం చేసిన ప్రతి సారి అడ్డుకున్నారు. చంద్రబాబుని వైజాగ్ ఎయిర్ పోర్ట్ కూడా దాటనివ్వకుండా అడ్డుకున్నారు.
ప్రజలు అడ్డుకున్నారని, వైసీపీ నేతలు చెప్పుకుని వచ్చారు. తరువాత క-రో-నా రావటంతో, రాజకీయ నాయకులు పర్యటనలు ఆగిపోయాయి. దీంతో చంద్రబాబు వైజాగ్ లో అడుగుపెట్టే వీలు లేకుండా పోయింది. అయితే ఎక్కడైతే తనని ఆపారో, అక్కడ నుంచే చంద్రబాబు నిన్న వైజాగ్ నుంచి వెళ్లారు. ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖ, విజయనగరంలో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. విజయనగరం సభలో రామతీర్ధం గురించి చెప్పిన తరువాత, అమరావతి ప్రస్తావన తెచ్చారు చంద్రబాబు. అమరావతి రైతులను ముంచేసారని, ప్రశాంతంగా ఉండే ఉత్తరాంధ్రను నాశనం చేస్తున్నారని, అమరావతి రైతుల క్షోభ మనకు అవసరమా, మీరు మూడు రాజధానులకు సమ్మతమా అంటూ, ఉత్తరాంధ్రలో నుంచుని, ఉత్తరాంధ్ర ప్రజలనే చంద్రబాబు అడగటం నిన్నటి ఘటనలో హైలైట్ గా చెప్పవచ్చు. అక్కడ ప్రజలు కూడా మమ్మల్ని ఇలా వదిలేయండి, మూడు రాజధానులకు మేము వ్యతిరేకం అని నినాదాలు చేసారు. దీంతో చంద్రబాబు ఉత్తరాంధ్ర మంత్రులను ఉద్దేశిస్తూ, ఇది ఇక్కడ ప్రజల అభిప్రాయం, మీ ముఖ్యమంత్రికి చెప్పండి అంటూ, అమరావతి పై ఉత్తరాంధ్ర ప్రజల చేత మద్దతు పలికించారు.