ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాల పై అనేక సంఘటనలు జరుగుతున్నాయి. చిన్న చిన్న దేవాలయాలతో పాటు, అంతర్వేది, కనకదుర్గమ్మ గుడిలో కూడా కొనసాగాయి. అయితే ఏవో చిన్న సంఘటనలు తప్ప, పెద్దగా ఎవరినీ పట్టుకుంది లేదు. ఇక నాలుగు రోజులు క్రిందట రామతీర్ధంలో, రాములోరి తలని దుండగులు పెకిలించి, దగ్గరలోనే ఉన్న సరస్సులో ఆ తల పడేసారు. అయితే ఆ తల దొరకటానికి కూడా రెండు రోజులు పట్టింది. ఎవరు చేసారో ఇప్పటికీ తెలియదు. అయితే ఈ ఘటన జరిగిన తరువాత కూడా, మళ్ళీ నిన్న రెండు సంఘటనలు జరిగాయి. ప్రభుత్వం సీరియస్ గా తెసుకోకపోవటం, పోలీసులు దుండగులని పట్టుకోకపోవటంతో, చంద్రబాబు రంగంలోకి దిగారు. రామతీర్ధం ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. నేరుగా రంగంలోకి దిగితే ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తుందని, అటు పోలీసులు మీద కూడా ఒత్తిడి పెరిగి, ఇలాంటి ఘటనలు జరగకుండా చూడవచ్చు అని అనుకున్నారు. ఈ రోజు చంద్రబాబు విజయనగరం పర్యటనకు వెళ్లనున్నారు. ఇప్పటికే ఆయన అమరావతి నుంచి బయలు దేరి వైజాగ్ వెళ్లారు. వైజాగ్ నుంచి బై రోడ్డు ఆయన వెళ్లనున్నారు. అయితే చంద్రబాబు పర్యటనకు వస్తున్నారని తెలుసుకుని, ఎందుకో కానీ విజయసాయి రెడ్డి బుజాలు తడుముకోవటం మొదలు పెట్టారు. ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు.
నిన్న చంద్రబాబు పర్యటన ఖరారు అవ్వగానే, విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, రామతీర్ధం ఘటన చంద్రబాబు, లోకేష్ చేపించారని అన్నారు. అయితే ఇదేదో రాజకీయ ఆరోపణలే, చంద్రబాబు వస్తున్నారని ఇలా చేసి ఉంటారని అందరూ అనుకున్నారు. అయితే ఈ రోజు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు కంటే ముందే రామతీర్ధం వెళ్ళటానికి విజయసాయి రెడ్డి ప్లాన్ చేసుకోవటం అందరినీ ఆశ్చర్య పరిచింది. చంద్రబాబు వస్తున్నారని తెలిసి, ఇప్పటికిప్పుడు ఇలా రావటం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఇంత దారుణంగా రాజకీయాలు ఉంటాయా అనే విధంగా విజయసాయి రెడ్డి ప్రవర్తన ఉందని టిడిపి నేతలు అంటున్నారు. ఇప్పటి వరకు అనేక చోట్ల దేవాలయాల పై ఘటనలు జరిగితే, ఈ రోజు మాత్రమే విజయసాయి రెడ్డి ఎందుకు వస్తున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు. అసలు ఈ ఘటన మొత్తంలో విజయసాయి రెడ్డి ఎందుకు ఇంత ఓవర్ రియాక్ట్ అవుతున్నారు అనేది కూడా ప్రజల్లో చర్చకు దారి తీసింది. మరి చంద్రబాబు పర్యటన సవ్యంగా సాగుతుందో లేదో చూడాలి.