ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థలు వాయిదా వేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ కు సంబంధించి, ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్, ఈ రోజు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ కౌంటర్ అఫిడవిట్ లో రాష్ట్ర ప్రభుత్వం, అనేక కీలక అంశాలను పేర్కొంది. క-రో-నా వాక్సిన్ రావటానికి మరో మూడు నుంచి ఆరు నెలలు పట్టే అవకాసం ఉందని, ఈ లోపు వ్యాక్సిన్ వచ్చినా కూడా దాన్ని ప్రాధాన్యతా క్రమంలో వేయాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఆ పిటీషన్ లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు, ఈ వ్యాక్సిన్ ప్రక్రియ ఎట్టి పరిస్థితిలోను అడ్డు రాదని కూడా వారు తమ అఫిడవిట్ లో స్పష్టం చేసారు. స్థానిక సంస్థలకు సంబంధించి, ప్రజారోగ్యం ముఖ్యం అని తామూ అంగీకరిస్తున్నాం అని, అయితే ఇదే సమయంలో వ్యాక్సిన్ పంపిణీకి, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధం లేదు అని కూడా స్పష్టం చేసారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇప్పటికే బీహార్, రాజస్థాన్, హైదరాబాద్ లో ఎన్నికలు విజయవంతంగా నిర్వహించారని ఈ కౌంటర్ అఫిడవిట్ లో, రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తు చేసింది. అలాగే హైకోర్టు ఆదేశాలు తరువాత రాష్ట్రంలో అన్ని పార్టీల అభిప్రాయం తీసుకుంటూ ఒక మీటింగ్ పెట్టమని, అందరి అభిప్రాయాలు తీసుకున్నామని కూడా తెలిపారు,

nimmagadda 17122020 2

ఏపిలో ఈ ఎన్నికల నిర్వహణకు సానుకూల వాతావరణం ఉందని చెప్పటంతో పాటు, అందరినీ సంప్రదించి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నుంచి సమాచారం తీసుకున్న తరువాత మాత్రమే, అన్ని విషయాలను బేరీజు వేసుకుని ఆ తరువాత, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని, రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుందని, చెప్పి ఆ అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఎన్నికలు వాయిదా వేయాలని ప్రభుత్వం, వేసిన పిటీషన్ ను కొట్టి వేయాలని, దీనికి సంబంధించి తగిన ఆదేశాలు ఇవ్వాలని కూడా హైకోర్టుని రాష్ట్ర ఎన్నికల సంఘం అభ్యర్ధించింది. రెండు వారల క్రిందట ప్రభుత్వం ఈ పిటీషన్ దాఖలు చేసింది. ముందుగా ఎన్నికల సంఘం ఫిబ్రవరిలో ఎన్నికలు అంటూ ప్రొసీడింగ్స్ ఇచ్చిన దాని పై కోర్టుకు వెళ్ళిన ప్రభుత్వం, ఆ ఆదేశాలు కొట్టేయాలని సెకండ్ వేవ్ వస్తుంది అంటూ తెలిపింది. అయితే హైకోర్టు ఈ విషయంలో మేము జోక్యం చేసుకొం అని చెప్పటంతో, అడిషనల్ అఫిడవిట్ దాఖలు చేసి, అందులో వ్యాక్సిన్ విషయం ప్రస్తావిస్తూ కోర్టుకు తెలిపారు. దీని పై ఈ రోజు ఎన్నికల సంఘం కౌంటర్ వేసింది. మరి దీని పై హైకోర్టు ఏమి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

అమరావతి జనభేరి సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఉదయమే కనకదుర్గమ్మ ఆశీస్సులు తీసుకున్నాని, అమ్మ ఆశీసులు మనకు ఉన్నాయని, అమ్మవారు మూడొకన్ను తెరిచి రాక్షసుల్ని అంతమోందిస్తుందని చంద్రబాబు అన్నారు. సభకు వచ్చే ముందు, ఉద్దండరాయినిపాలెంలో ఉన్న శంకుస్థాపన స్థలాన్ని పరిశీలిస్తే కడుపు తరుక్కుపోయిందని, గత స్మృతులు అన్నీ గుర్తుకు వచ్చాయని, ఎంతో గొప్పగా నిర్మాణం చేద్దాం అనుకుంటే, ఈ రోజు ఇలా చేసారని అన్నారు. ఉదయం ఉద్దండరాయినిపాలెం వెళ్లకుండా నన్ను అడ్డుకున్నారని, వీళ్ళకు నన్ను అడ్డుకునే హక్కు ఎక్కడుందని అన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ ముఖ్యమంత్రి అంటున్నాడని. 18నెలలు ఏం పీకావ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. అమరావతి లో భూమి కొనలేదు, ఇల్లకట్ట లేదని నన్ను అనే జగన్ ఇక్కడ ఇల్లు కట్టి ఏం పీకడని ప్రశ్నించారు. కులం కులం అంటున్నాడని, ఒక కులంలో పుట్టడం నా తప్పా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కులం కోసం చేయలేదని అన్నారు. అమరావతి ఉద్యమంలో మహిళల పట్ల దుస్యాసునిడి మాదిరి వ్యవహరించారని అన్నారు. ప్రపంచం అంతా అమరావతి గురించి మాట్లాడుకోవాలని కృషి చేయటమే నేను చేసిన తప్పా అని ప్రశ్నించారు. అన్ని పార్టీల మద్దతు అమరావతికి ఉంటే జగన్ ఒక్కడిదే వితండవాదం అని, ఇది ఎంత వరకు సమంజసం అని అన్నారు.

challange 17122020 2

ఈ సందర్భంగా చంద్రబాబు జగన్ కు చాలెంజ్ చేసారు. రాష్ట్రమంతా తనవైపు ఉందంటున్న జగన్ రెఫరెండం కు సిద్ధమా అని సవాల్ విసిరారు. ప్రజలంతా అమరావతి ని రాజధానిగా వద్దనుకుంటే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని, ఎన్నికలకు వెళ్దాం అని చంద్రబాబు అన్నారు. పోరాడకపోతే... భవిష్యత్తు లో బానిసలుగా మిగిలిపోతారని, అమరావతి ఆడబిడ్డలు ఈ ఉద్యమానికి ఒక స్పూర్తి అని అన్నారు. అధికారం నాకు కొత్త కాదు.. ఇప్పుడు అధికారం కోసం ఇలా చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజలకు న్యాయం జరగాలి, రైతుల వ్యధను గుర్తించాలి, 365రోజులలో ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపారు, నేను వెంకన్నను, దుర్గమ్మ ను కోరుకున్నా, అన్యాయం చేస్తే... వెంకన్న ఈ జన్మలోనే వారికి బుద్ధి చెబుతారు అని అన్నారు. నా కోసం కాదు... రాజధాని కోసం, రాష్ట్రం కోసం కోరుకున్నా, భావితరాల భవిష్యత్తు మంచిగా ఉండాలని కోరుకున్నా, రాష్ట్రం లో మనసున్న‌వారంతా ఒక్కసారి ఆలోచించండి అని చంద్రబాబు అన్నారు. ప్రజల్లో కూడా మార్పు రావాలి.. అన్యాయాన్ని ప్రశ్నించాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డి దమ్ముంటే రెఫరెండంకు సిద్దం కావాలి, 45రోజుల్లో ఎవరి ప్రచారం వారు చేసుకుందాం, మీరే గెలిస్తే... నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా, అంటూ చంద్రబాబు ఛాలెంజ్ చేసారు.

మరోసారి చంద్రబాబుని అడ్డుకున్నారు పోలీసులు. ఈ 18 నెలల్లో ఇలా చంద్రబాబుని అడ్డుకోవటం నాలుగో సారి గా చెప్తున్నారు. ఒకసారి ఆత్మకూరు వెళ్ళకుండా, మరోసారి ఇసుక నిరసన, అలాగే మరోసారి వైజాగ్ కి వెళ్ళిన సమయంలో చంద్రబాబుని ఆపేసారు. ముఖ్యంగా వైజాగ్ వెళ్ళిన సమయంలో చంద్రబాబుని ఆపిన విషయం హైకోర్టు వరకు వెళ్ళటం, డీజీపీ కూడా కోర్టుకు వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు అమరావతిలో ఏడాది అవుతున్న సందర్భంగా అమరావతిలో పెద్ద సభ జరుగుతుంది. ఈ సభకు వెళ్ళేందుకు ముందుగా, అమరావతి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెం వెళ్ళటానికి చంద్రబాబు వెళ్ళగా, ఆయన్ను పోలీసులు ఆపేశారు. మల్కాపురం వద్ద చంద్రబాబుని అడ్డుకున్నారు. ఉద్దండరాయునిపాలెం వెళ్లడానికి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. అయితే  పోలీసులతో అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ చర్చలు జరిపారు. చివరకు చంద్రబాబుకి ఒక్కరికే అనుమతి ఇస్తాం అని, ఎవరినీ వదలం అని చెప్పటంతో, సభ జరగకుండా కుట్ర పన్నరేమో అని గమనించి, ఎవరినీ వదలక పోయినా, చంద్రబాబు ఒక్కరే ఉద్దండరాయునిపాలెం వెళ్లారు. అయితే తెలుగుదేశం నేతలు మండి పడుతున్నారు. పర్మిషన్ ఇచ్చి, ఉద్దండరాయునిపాలెం వెళ్ళటానికి ఇబ్బంది ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. ప్రశాంతంగా సాగుతుంటే, ఎందుకు ఇంత రాద్దాంతం అని ప్రశ్నిస్తున్నారు.

అమరావతి జనభేరి సభలో, వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేసారు. కులం కులం కులం అంటూ, అమరావతి పై కుల ముద్ర వేస్తున్నారు, నేను నీ దగ్గర ఉన్నప్పుడు, ఏ కులమో , ఇప్పుడు అదే కులం, వంగవీటి రంగా కుమారడిగా చెప్తున్నా, రికార్డులు చూసుకో నా కులం ఏమిటో, ఇక్కడ స్టేజి పై ఉన్న వాళ్ళు, నిరాహార దీక్ష చేస్తున్న వాళ్ళు ఏ కులం అంటూ, రాధా ఆవేశంగా మాట్లాడుతూ, కులం ముద్ర వేస్తున్న వారికి ఘాటుగా సమాధానం చెప్పారు. ఆయన ఏమి చెప్పారో, ఆయన మాటల్లోనే,... "ఈ రోజు మన రాష్ట్రాన్ని ప్రాంతాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా విడగొడదాం అని పాలకులు చూస్తున్నారు. ఒకే ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మిగతా వెనుకబడుతున్నాయి అంటున్నారు. కానీ ఇంతకు ముందు, గత ప్రభుత్వంలో చూసుకుంటే, ఒక పక్క చిత్తూరులో శ్రీ సిటీలో అనేక పెట్టుబడులు వచ్చాయి, తరువాత సీమ వైపు సోలార్ ప్లాంటులు, ఇటు గుంటూరు, కృష్ణాలో రాజధాని, గోదావరి జిల్లాలు ఆక్వా పెట్టబడులు, వైజాగ్ ఐటి హబ్ గా మారింది. ఇక కేవలం ఒక కులం వాళ్ళే అమరావతిలో బాగు పడుతున్నారని అంటున్నారు, ఇలాంటి వాగుడు వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న, ఎవరెవరు ఏ కులమో ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి, మీకు ఏదైనా పొరపాటు ఉంటే నా కులం కూడా ఒకసారి చూసుకోండి, మరోసారి చెక్ చేసుకోండి, నేను రంగా గారి అబ్బాయిని, మీకు అనుమానం ఉంటే ఒకసారి రికార్డులు చూసుకోండి. మీతో పాటు ఉన్నప్పుడు ఏ కులంలో ఉన్నానో, ఇప్పుడు కూడా అదే కులంలో ఉన్నాను,"

radha 17122020 2

"నా రాష్ట్రము కోసం పోరాడతాను అని చెప్పి చెప్తున్నాను. చేసిన తప్పుని కప్పి పుచ్చుకోవటానికి, బురద జల్లుతూ రైతులని వెటకారం చేస్తూ, ప్రజలని వెటకారం చేస్తూ, రాష్ట్రాన్ని మూడు ముక్కల కింద విభజించి ఆడుకుందాం అని, ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండ ప్రజలందరూ ప్రాంతాలు, కులాలు, మతాలు ఇవన్నీ పక్కన పెట్టి, కలిసికట్టుగా పోరాడి మన రాష్ట్రాన్ని, మన రాజధాని అమరావతిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిదీ అని కూడా అందరికీ చెప్తున్నాను. ఇక్కడ ఒక పక్కన నిరాహార దీక్ష చేస్తున్నారు. వాళ్ళు ఏ కులం వాళ్ళో, ఏ ప్రాంతం వాళ్ళో చూడామని, ఈ ప్రాంతం వాళ్ళని కోరుతున్నా. మా అందరి ఆశ, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశ, శ్వాస ఒకటే, అది అమరావతి ఒక్కటే అని తెలియ చేస్తూ, ముగిస్తున్నాను. అందరం కలిసి కట్టుగా పోరాడుతున్నాం. మా అందరికీ బాధ్యత ఉందని భావించాం కాబట్టే, రోడ్డు ఎక్కాం. రైతుల కోసం అండగా నుంచుంటాం. ఎప్పటికీ వారికి అండగా ఉంటాం. మన అమరావతి పోరాటం తప్పకుండా ఫలిస్తుంది, తప్పకుండా అది సాధించే వరకు అందరం కలిసి కట్టుగా ఉందాం అని కోరుతున్నాను. రైతులకు మద్దతు తెలియచేసిన అన్ని రాజకీయ పార్టీలకు ధన్యవాదాలు " అని రాధా అన్నారు.

Advertisements

Latest Articles

Most Read