ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి సొంత మీడియా ఉన్న సంగతి తెలిసిందే. స్వయానా జగన్ మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులే, ఈ మీడియాను నడుపుతున్నారు. ఛానల్, పత్రికలో జగన్ మోహన్ రెడ్డి గురించి, ఆకాశానికి ఎత్తేస్తూ, కధనాలు రాస్తూ ఉంటారు. సరే అక్కడ వరకు పరవలేదు కానీ, ప్రత్యర్ధుల పై కట్టు కధలు అల్లటంలో కూడా ముందు ఉంటారు. గతంలో ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ఆ బులుగు మీడియా ఎన్ని అబద్ధాలు రాసినా, చూస్తూ ఊరుకోవటంతో, ఆ అబద్ధాలే నిజాలు అని ప్రజలు నమ్మి, చివరకు అధికారం వదులు కోవాల్సి వచ్చింది. అయితే ఈ తప్పు చంద్రబాబు తెలుసుకున్నారో ఏమో, ఈ మధ్య ఫేక్ మీడియా, ఫేక్ వార్తలు, ఫేక్ ఫెలోస్ అంటూ, తరుచూ,వీళ్ళు చేస్తున్న ఫేక్ ని మీడియాలో ప్రెస్ మీట్ లు పెట్టి, సోషల్ మీడియాలో చెప్తూ, ఏది నిజం , ఏది అబద్ధం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎన్ని చేసినా, అవతల వైపు నుంచి ఫేక్ చేయటం మాత్రం ఆపటం లేదు. తాజాగా ఆ మీడియాలో చంద్రబాబు పోలీసులను తిడుతున్నారు అంటూ ఒక వీడియో ప్రసారం చేస్తూ కధనాలు వేసారు. చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు, కుతంత్రాలు చేస్తున్నారు అంటూ, అందుకున్నారు. ఇంకేముంది, తమ ఆస్థాన ఛానల్ చెప్పటంతో, వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఈ అంశం ఎత్తుకుంది. చంద్రబాబు పోలీసులని కించ పరిచారు అంటూ, గోల గోల చేస్తున్నారు.
చంద్రబాబు ఈ రోజు తెలుగుదేశం నాయకులతో మాట్లాడుతూ, టిడిపి శ్రేణుల పై తప్పుడు కేసులు పెడుతున్న వైనం పై స్పందిస్తూ, తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులను వదిలి పెట్టొద్దు అని, వారి పై తిరిగి ప్రైవేటు కేసులు పెట్టండి, వాళ్ళు ఒకటి పెడితే మీరు నాలుగు పెట్టండి, అప్పుడే దిగి వస్తారు, అంటూ చేసిన వ్యాఖ్యలను, "తప్పుడు కేసులు" అనేది తీసేసి, పోలీసులు పై కేసులు పెట్టండి, వేధించండి అనేది మాత్రమే చూపిస్తూ వైసీపీ తప్పుడు ప్రచారం చేయటంతో, వెంటనే తెలుగుదేశం పార్టీ అలెర్ట్ అయ్యింది. దీనికి సంబంధించి పూర్తి వీడియోని తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. అందులో స్పష్టంగా, "ఆ రోజులు అయిపోయాయి, తప్పుడు కేసులు పెట్టే రోజులు. మీరు కూడా ఎదురు కేసులు పెడితే, తప్పుడు కేసులు పెట్టటం మానేసి మీ కాళ్ళ దగ్గరకు వస్తారు. ఆ మెసేజ్ కూడా ఇవ్వండి. మీ మీద కేసు పెడుతున్నాం. (తప్పుడు కేసులు పెడుతున్న వారిని ఉద్దేశించి)" అని చంద్రబాబు చెప్పిన మాటలు చూపించకుండా, ఫేక్ చేసారని, అసలు వీడియో తెలుగుదేశం విడుదల చేసింది.