ఈ రోజు, చిత్తూరు జిల్లాలో ఉన్న నాకు, ఎక్కడో బాంబేలో ఉన్నటు వంటి మహానుభావుడు నా పేదరికాన్ని గుర్తించి, ఒక ట్రాక్టర్ పంపించాడని, సోనూ సూద్ కు కృతజ్ఞత తెలిపారు. ట్రాక్టర్ వచ్చిన తరువాత, తన కుటుంబం, భార్యా, పిల్లలు ఎంతో సంతోషంగా ఉంటే, తన పై, తన కుటుంబం పై కొంత మంది మీడియాలో, సోషల్ మీడియాలో హేళన చేస్తున్నారని అన్నారు. నేను పేదవాడిని కాదని, ఏకంగా తన ఇంటికి ఆఫీసర్లను పంపించారని ఆవేదన వ్యక్తం చేసారు. అలాగే ఇదేదో సరదా కోసం చేసామని చెప్తున్నారని, ఆడ పిల్లలు వీడియో తీస్తుంటే సిగ్గు పడుతూ నవ్వారని, దానికి కూడా పెడ అర్ధాలు తీశారని ఆవేదన వ్యక్తం చేసారు. లావుగా ఉన్నారని, అంటున్నారని, మా శరీరం రంగులు, కొలతలు చూసి, మమ్మల్ని అర్ధం చేసుకుంటారా అని ఆవేదన వ్యక్తం చేసారు. ఎక్కడో టీ కొట్టు పెట్టుకునే బ్రతికే తానూ, కరోనా వల్ల సొంత ఊరు రావాల్సి వచ్చిందని, ఇక్కడే ఒకే గదిలో ఆరుగురం ఉంటున్నామని, మా తల్లిదండ్రులకు వచ్చే పెన్షన్ మీద బ్రతుకుతున్నామని అన్నారు.

వ్యవసాయం మొదలు పెట్టే సమయంలో కాడెద్దులు, ట్రాక్టర్ కోసం వెళ్తే 1500, రెండు వేలు అడిగారని, అంట స్తోమత తన దగ్గర లేదని, అప్పుడు తన కూతుళ్ళు ముందుకు వచ్చారని అన్నారు. మా పరిస్థతి చెప్పాలంటేనే సిగ్గు వేస్తుంది, కానీ ప్రభుత్వాన్ని నేను ఏమైనా నిందించానా ? నేను ఏ పార్టీకి చెందిన నాయకుడుని కాదు, ప్రజా సంఘంలో ఒక నేతను, 2009లో డమ్మీ అభ్యర్ధిగా ఎవరో ఒక వ్యక్తీ పోటీ చెయ్యమంటే చేసానని చెప్పుకొచ్చారు. మా పరిస్థితికి దేవుడిలా సోనూ సూద్ వచ్చారని, తరువాత చంద్రబాబు గారు కూడా ఒక ప్రతిపక్ష నేతగా, ఈ జిల్లా వాడిగా, తన కూతుళ్ళ చదువు కోసం సాయం చేస్తామని చెప్పారని, అప్పటి నుంచి తన పై దాడి మొదలు పెట్టారని అన్నారు. ఎవరైనా సరే తన ఇంటికి వచ్చి, తన పరిస్థితి చూసి, మాట్లాడాలని వేడుకుంటున్నా అని, మా బ్రతుకు ఇట్టా బ్రతకనివ్వండి అని, మా మీద ప్రచారాలు మానండి అని వేడుకున్నారు. మళ్ళీ మమ్మల్ని రోడ్డు పాలు చెయ్యవద్దు అని చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాని అన్నారు.

దేశ ర‌క్ష‌ణ కోసం త‌న ప్రాణాలు ప‌ణంగా పెట్టిన వీర‌జ‌వాన్ లావేటి ఉమామ‌హేశ్వ‌ర‌రావు త్యాగం చూసి సిక్కోలు గ‌డ్డ గ‌ర్విస్తోంద‌ని శ్రీకాకుళం ఎంపీ కింజ‌రాపు రామ‌మోహ‌న్‌నాయుడు పేర్కొన్నారు. బాంబు స్క్వాడ్లో ప‌నిచేస్తున్న శ్రీకాకుళానికి చెందిన ఉమామ‌హేశ్వ‌ర‌రావు గ‌ల్వాన్ లోయ‌కి 100 కిలోమీట‌ర్ల దూరంలో వున్న ప్రాంతంలో బాంబుల‌ను నిర్వీర్యం చేస్తుండ‌గా, ఒక బాంబు పేలి మృతి చెంద‌టం త‌న‌ను తీవ్రంగా క‌లిచివేసింద‌న్నారు. మ‌న‌కోసం త‌మ ప్రాణాలు సైతం ప‌ణంగా పెడుతున్న జ‌వాన్ల త్యాగం వెల‌క‌ట్ట‌లేనిద‌న్నారు. అమ‌ర‌జ‌వాన్ పిల్ల‌లిద్ద‌రి చ‌దువు కోసం చెరో 25 వేలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తాన‌‌ని తెలిపారు. యుద్ధంలో అమరులైన జ‌వాన్ల కుటుంబాల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వాలు, స్థానిక పెద్ద‌లు, మీడియా పెద్ద ఎత్తున ముందుకొచ్చేవ‌నీ, దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఉమామ‌హేశ్వ‌రావు విష‌యంలో ఎవ‌రూ దృష్టి సారించ‌క‌పోవ‌డం బాధ‌గా వుంద‌న్నారు. ఆర్మీలో 17 సంవ‌త్స‌రాల‌కు పైగా స‌ర్వీసు పూర్తిచేసి, మ‌రికొద్ది సంవ‌త్స‌రాల‌లో రిటైర్ కానున్న ఉమామ‌హేశ్వ‌ర‌రావు స‌రిహ‌ద్దుల్లో శ‌త్రువుతో పోరాటం కంటే భ‌యంక‌ర‌మైన బాంబుల్ని నిర్వీర్యం చేస్తూ చ‌నిపోవ‌డం అత్యంత విషాద‌క‌ర‌మ‌న్నారు.

అమ‌ర‌జ‌వాన్ కుటుంబాన్ని ఆదుకోవాల్సి బాధ్య‌త మ‌నంద‌రిపైనా వుంద‌న్నారు. ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌ల భ‌విష్య‌త్ ఇప్పుడు అగ‌మ్య‌గోచ‌రంగా మారింద‌ని, వీరి భ‌విష్య‌త్‌కు భ‌రోసా ఇవ్వాల్సి వుంద‌న్నారు. సైనికుడి త్యాగాలు మ‌న‌లో స్ఫూర్తి నింపాల‌నే ఉద్దేశంతో యువ‌త ఎక్కువ‌గా వ‌చ్చే ప్ర‌దేశంలో మన సిక్కోలు సింహం లావేటి ఉమామ‌హేశ్వ‌ర‌రావు విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాన‌న్నారు. పుల్వామా, గ‌ల్వాన్ లోయ‌లో శ‌త్రువుల‌తో పోరాడి అమ‌రులైన సైనికులను కుటుంబాల‌ను ఆదుకున్న‌ మాదిరిగానే అమ‌రుడైన లావేటి ఉమామ‌హేశ్వ‌రావు కుటుంబాన్నీ ఆదుకోవాల్సిన అవ‌స‌రం వుంద‌న్నారు.‌ రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టివ‌ర‌కూ ఎందుకు స్పందించ‌లేదో అర్థంకావ‌డంలేద‌ని ఎంపీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

పరిటాల రవి హత్య కేసు నిందితుడు, మొద్దు శీనుని జైల్లోనే చంపేసిన, ఓం ప్రకాష్ అనే నిందితుడు, ఈ రోజు చనిపోయాడు. గత కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఓం ప్రకాష్, విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు అయిన మొద్దు శీనుని, జైల్లోనే చంపాడు ఓం ప్రకాష్. 2016 నుంచి విశాఖ సెంట్రల్ జైల్లో, ఓం ప్రకాష్ శిక్ష అనుభవిస్తున్నాడు. శనివారం రాత్రి ఓం ప్రకాష్ కు శ్వాస సమస్య వచ్చిందని, కేజీహెచ్ హాస్పిటల్ కు తరలించగా, చికిత్స పొందుతూ, ఆదివారం మరించారని, జైలు సూపరింటెండెంట్ తెలిపారు. ఓం ప్రకాష్ కు గత కొన్ని రోజులుగా కిడ్నీలు ఫెయిల్ అవ్వటంతో, ఆయనకు గత కొంత కాలంగా డయాలసిస్ చేస్తున్నామని చెప్పారు. శుక్రవారం కూడా డయాలసిస్ జరిగిందని తెలిపారు. శనివారం మళ్ళీ సమస్య రావటంతో, మళ్ళీ హాస్పిటల్ కు తరలించామని, ఆయన చికిత్స పొందుతూ మరణించారని అన్నారు.

దీనికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సి ఉందని, జైలు సూపరింటెండెంట్ తెలిపారు. ఓం ప్రకాష్ సొంత ఊరు చిత్తూరు జిల్లా మదనపల్లె. 2008 నవంబర్ 9న, పరిటాల రవి హంతకుడు మొద్దు శీనును ఓం ప్రకాష్, జైలులోనే హత్య చెయ్యటం, అప్పట్లో సంచలనం సృష్టించింది. అనంతపురం జైలులో, మొద్దు శీనును బండరాయితో కొట్టి చంపాడు. ఒక లారీ చోరీ కేసులో శిక్ష అనుభివస్తున్న టైములో, ఓం ప్రకాష్, మొద్దు శీనును చంపేసాడు. ఆ కేసులోనే, విశాఖ సెంట్రల్ జైలులో, శిక్ష అనుభవిస్తున్నాడు. పరిటాల రవి హత్య కేసులో, గతంలో వరుస పెట్టి నిందితులు చనిపోవటం అప్పట్లో సంచలనం కలిగించింది. పరిటాల రవి హత్యలో ప్రధాన నిందితులు అందరూ చనిపోవటం, ఒక వింత. ఇప్పుడు పరిటాల రవిని చంపిన ప్రాధాన నిందితుడు మొద్దు శీనును చంపిన, ఓం ప్రకాష్ కూడా చనిపోయాడు.

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు, బెయిల్ పిటీషన్ పై, ఈ రోజు హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈఎస్ఐ కుంభకోణం చేసారు అంటూ, ఏసిబీ అధికారులు, అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసి, ఆపరేషన్ జరిగిందని తెలిసినా, ఆయన్ను 600 కిమీ తీసుకు రావటం పై, ప్రభుత్వ వైఖరి పై తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అయితే, మరో పక్క అచ్చెన్నాయుడు ఇప్పటికే ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఆయనకు రెండు ఆపరేషన్ లు అవ్వటంతో, ఆయనకు ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స ఇవ్వటానికి కోర్టు ఒప్పుకుంది. మరో పక్క అచ్చెన్నాయుడు బెయిల్ పిటీషన్ పై కూడా వాదనలు జరిగాయి. ఆయనకు బెయిల్ ఇవ్వాలి అంటూ, ఆయన తరుపు న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు. దీని పై గత రెండు వారాలుగా కేసు వాయిదా పడుతూ వస్తుంది. దీని పై, ఈ రోజు రెండు వైపుల నుంచి, అటు అచ్చెన్నాయుడు వైపు నుంచి, ఇటు ప్రభుత్వం వైపు నుంచి కూడా వాదనలు కోర్టుకు వినిపించారు.

అచ్చెన్నాయుడు తరుపున సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ వాదనలు వినిపించగా, ప్రభుత్వం తరుపున, ప్రభుత్వ లాయర్లు వినిపించారు. అచ్చెన్నాయుడు కేసులో విజిలిన్స్ ఎంక్వయిరీ రిపోర్ట్ లో, అసలు అచ్చెన్నాయుడు పేరు లేదని, ఆ తరువాత కూడా ఆయన పై అనవసర ఆరోపణలు చేసారని, ఏసిబి చేసిన ఆరోపణల్లో కూడా, అయన పై ఎక్కడా నేరుగా, ఆరోపణలు లేవని, అటువంటప్పుడు ఆయనకు ఆ కేసులో సంబంధం లేదని చెప్పారు. మంత్రిగా ఉన్నప్పుడు ఆయన వద్దకు వచ్చిన కొన్ని ప్రాతిపాదనకు, పరిశీలించాల్సిందిగా, విజ్ఞాపన పత్రాలు ఫార్వర్డ్ చెయ్యటం, ఎప్పటి నుంచో సాంప్రదాయంగా వస్తూ ఉందని, అది ఏ మంత్రిత్వ శాఖలో అయినా, సహజంగా జరుగుతూ ఉంటుందని, ఈ కేసులో అచ్చెన్నాయుడు పాత్రే లేనప్పుడు ఆయనకు వెంటనే బెయిల్ ఇవ్వాలని, ఆయన తరుపు న్యాయవాది అభ్యర్ధించారు. అయితే ఈ కేసులో ఇంకా దర్యాప్తు చెయ్యాలని, ఇంకా అరెస్ట్ లు చెయ్యాలని, ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని, ప్రభుత్వం తరుపు వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు, తీర్పుని రిజర్వ్ చేస్తూ, కేసును బుధవారానికి వాయిదా వేసింది. దీంతో బుధవారం తీర్పు వచ్చే అవకాసం ఉంది.

Advertisements

Latest Articles

Most Read