ఎన్నికల్లో గెలవడం కంటే పోల్ మేనేజ్మెంట్ పేరుతో కోట్లకు ఓట్లు కొనడం వైసీపీ కనిపెట్టిన కొత్తమార్గం. ప్రజాస్వామ్యానికే పెనుప్రమాదంగా పరిణమించిన ఈ అడ్డదారి వైసీపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మొదలు పెట్టింది. వైసీపీ సర్కారుపై ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఫెయిర్ ఎలక్షన్ జరిగితే ఈ సీట్లలో ఓటమి ఖాయమని వైసీపీ అభ్యర్థులు అడ్డదారులు తొక్కుతున్నారు. మార్చి 13న జరగనున్న ఉపాధ్యాయ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు వైసీపీ చేయని అరాచకం లేదని ఉపాధ్యాయసంఘాలు ఆరోపిస్తున్నాయి. అనర్హులను ఉపాధ్యాయులుగా ఓటర్ల జాబితాలో చేర్పించడం, దీనికి అడ్డుపడే నిజాయితీ అధికారులను బదిలీ చేయించడం, వైసీపీ నేతలు చెప్పినట్టు వినే అధికారులను ఆయా స్థానాల్లో నియమించడంతో ఎలాగైనా గెలవాలనే వైసీపీ బరితెగింపు కనిపిస్తోంది. కడప, అనంతపురం, కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి వైసీపీ ఆశీస్సులతో పోటీ చేస్తున్న రామచంద్రారెడ్డి గిఫ్ట్ బాక్సులతో మాస్టార్లని బుట్టలో వేసుకోవాలనుకున్నారు. అనంతపురంలో లంచ్ బాక్సులు పంపిణీ చేస్తూ పట్టుబడ్డారు. కడపలో గిఫ్ట్ ల పంపిణీని ప్రజాసంఘాలు అడ్డుకుని ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి, ఓటర్లకు తాయిలాలు పంచుతోన్న రామచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు అందాయి. చివరికి గిఫ్ట్ బాక్సులు నిల్వ ఉంచిన స్కూలు యజమాని శివశంకరరెడ్డిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు కేసు నమోదు చేశారు. అంటే వైసీపీ రామచంద్రారెడ్డి ఈ కేసు నుంచి తప్పించి నీరుగార్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
news
లోకేష్ పాదయాత్రకి 20 మందితో భద్రత..అడ్డుకోవడానికి 1000 మంది పోలీసులు
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై మరో కేసు నమోదు చేశారు పోలీసులు. పాదయాత్ర రెండో వారంలోకి ప్రవేశించేసరికి ఐదు కేసులు బనాయించారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. పాదయాత్ర జరగకూడదనేది పోలీసులు ఇంటెన్షన్ అని ఈ కేసుల ద్వారా తేటతెల్లం అవుతోందని టిడిపి చెబుతోంది. బుధవారం పాదయాత్రలో అనుమతి లేకుండా సమావేశం నిర్వహించడం, పాదయాత్ర అనుమతులను ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఐపీసీ సెక్షన్ 188, 341, 290 రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశామంటోన్న పోలీసులు పాదయాత్రని వెంటాడుతున్నారని, పోలీసులు గొలుసు దొంగల్లా లోకేశ్ పాదయాత్రలో మైకులు లాక్కెళ్తున్నారు మాజీ మంత్రి అమర్‍నాథ్ రెడ్డి ఆరోపిస్తున్నారు. పాదయాత్రకు ఆటంకాలు కలిగిస్తూ పోలీసులే విధ్వంసరచన చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యువగళం పాదయాత్రకు 20 నుంచి 30 మంది పోలీసులు భద్రత కల్పిస్తుంటే.. పాదయాత్రను అడ్డుకోవడానికి మాత్రం 500 నుంచి 1000 మంది పోలీసులు వస్తున్నారని టీడీపీ నేత పులివర్తి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలుగుదేశం తీరు మారింది..నేతల జోరు పెరిగింది
టిడిపి రాజకీయాలు వ్యూహాలు మిగతా పార్టీలకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాస్వామ్య రీతికి ప్రాధాన్యత ఇవ్వడం, ఆరోపణలు-విమర్శలకు సభ్యతగా స్పందించడం ఒక ఆనవాయితీగా చాలా కాలం కొనసాగించింది టిడిపి. ప్రత్యర్థులు బూతులు, దాడులకు దిగుతున్నా అదే తీరు. టిడిపి అధికారంలో వున్నప్పుడు అప్పటి ప్రతిపక్షనేత వైఎస్ జగన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా చంపేసి గుండెపోటు అని ముందు ప్రచారం చేశారు. ఆ తరువాత చంద్రబాబే చంపించారని, నారాసుర రక్తచరిత్ర అని అచ్చేయించారు. దీనిపై నాటి సీఎం చంద్రబాబు చట్టం తన పని తాను చేసుకుపోతుందనే రీతిలో మౌనంగా ఉన్నారు. దీంతో ఎన్నికల్లో లబ్ధి పొందిన వైసీపీ అధికారం చేపట్టింది. తన మెతక వైఖరి, టిడిపి ప్రజాస్వామ్య ధోరణి, నిర్ణయాలు తీసుకోవడంలో నాన్చడం వంటివి ఎంత నష్టమో టిడిపికి అర్థమైంది. వైసీపీ దాడులతో టిడిపి గుణపాఠం నేర్చింది. తెలుగుదేశం కూడా తమ తీరు మార్చుకుంది. నేతలు జోరు పెంచారు. వైఎస్ వివేకానందరెడ్డి హ-త్యకేసుని విచారిస్తున్న సీబీఐ చూపు అంతా జగన్ రెడ్డి ఇంటి మనుషుల చుట్టూ తిరగడంతో నారాసుర రక్తచరిత్రకి కౌంటర్ ఇప్పుడు ఇచ్చింది. వివేకా హత్యపై ‘జగనాసుర రక్త చరిత్ర’ పేరిట పుస్తకం విడుదల చేసింది. వివేకా హత్యలో వేళ్లన్నీ జగన్, భారతి కుటుంబంవైపే చూపిస్తున్నాయని పుస్తకంలో ఆధారాలతో సహా పొందుపరిచారు. వివేకా హత్య కేసులో కీలక వైసీపీ నేతల పనేనని, 2019ఎన్నికల్లో వివేకా హత్యపై జగన్మోహన్ రెడ్డి అసత్య ఆరోపణలు చేసి రాజకీయ లబ్ది పొందారని ఎన్నికల కమిషన్‌కి వివరించి వైసీపీ గుర్తింపు రద్దు చేయాలని కోరుతామని ఏపీ టీడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ పరిణామలు చూస్తోన్న టిడిపి కేడర్ ఇన్నాళ్లకు టిట్ ఫర్ టాట్ తెలుగుదేశం మొదలు పెట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీకి దెబ్బ మీద దెబ్బ..కేంద్రంలో బీజేపీ హ్యాండ్ ఇస్తోందా?
వైసీపీకి వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. రోజూ ఉండే కోర్టు మొట్టికాయలకు తోడు షాకింగ్ నిర్ణయాలు వెలువరిస్తూ కేంద్రం బంతాట ఆరంభించింది. 2015లోనే అమరావతిని రాజధానిగా నోటిఫై చేశామంటూ సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసింది. మూడు రాజధానులని ఊదరగొడుతున్న వైసీపీ ఆ విషయమే కేంద్రానికి తెలియజేయలేదని మరో బాంబు పేల్చింది. త్వరలోనే విశాఖ నుంచి పాలన ఆరంభిస్తారని, సీఎం జగన్ ఇల్లు కోసం వెతుకుతున్నారని రోజుకొక వార్త మోసుకొస్తున్న వైసీపీకి కేంద్రం అఫిడవిట్లో అంశాలు శరాఘాతంలా తగిలాయి. ఈ షాక్ నుంచి తేరుకోక ముందే వైసీపీ సర్కారు కోసం సర్వీస్ రూల్స్‌నే పక్కనబెట్టిన డిజి సునీల్ కుమార్ పై క్రమశిక్షణాచర్యలు తీసుకోవాలని ఆంధ్ర రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. అంబేద్కర్ ఇండియా మిషన్ వేదికపై పీవీ సునీల్‍కుమార్ విద్వేషపూరిత ప్రసంగం చేశారని కేంద్రానికి ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదుపై ఈ చర్యలకి దిగింది కేంద్రం. ఎంపీ రఘురామ ఫిర్యాదుతో పాటు డీవోపీటీ లేఖను ఏపీ సీఎస్‍కు పంపిన కేంద్రహోంశాఖ పంపడంతో తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఇటీవలే వివేకానందరెడ్డి కేసుని పక్కరాష్ట్రాలకు బదిలీ చేయడం ద్వారా జగన్ సర్కారుకి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వానికి అన్ని విధాలా అండదండలు అందిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం వరస చర్యలతో సంథింగ్ ఫిషీ అని పొలిటికల్ సర్కిళ్లలో చర్చలు సాగుతున్నాయి. వైసీపీ పని అయిపోయిందని సర్వేలే తేల్చేస్తుండడంతో కేంద్రంలో బీజేపీ స్ట్రాటజీ మార్చినట్టు కనపడుతోంది