వైసీపీ బ‌రితెగింపు ఏ రేంజులో ఉంటుందో చెప్ప‌క్క‌ర్లేదు. 35 మంది క‌మ్మ డిఎస్పీలుగా తెలుగుదేశం ప్ర‌మోష‌న్ ఇచ్చింద‌ని ప్ర‌చారంచేసిన వైసీపీ అందులో ఐదుగురే క‌మ్మ అని తెలిసినా, ఇప్ప‌టికీ అదే ప్ర‌చారంచేస్తూనే ఉంటుంది. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే వెయ్యిమంది త‌న సొంత సామాజిక‌వ‌ర్గం వారికి ఉన్న‌త ప‌ద‌వులు క‌ట్టబెట్టిన జ‌గ‌న్ రెడ్డి సామాజిక న్యాయం అంటే త‌న సొంత సామాజిక‌వ‌ర్గానికి న్యాయం అని కొత్త సూత్రం క‌నిపెట్టారని టిడిపి ఆరోపిస్తూ వచ్చింది. ఎవ‌రేమ‌న్నా ఆరోపించుకోండి, తానైతే పేరు చివ‌ర రెడ్డి ఉంటే చాలు అన్నంత‌గా నియామ‌కాలు, ప‌ద‌వుల పందేరాలు సాగాయని టిడిపి నేతలు అనెక్ సార్లు ఆరోపించారు. తాజాగా త‌న కుల‌పిచ్చ‌ని దాచుకోకుండా అభ్య‌ర్థుల్ని ఎంపిక చేసిన జ‌గ‌న్ కులాభిమానం చూసి ఇత‌ర రాజ‌కీయ పార్టీల నేత‌లు అసూయ‌తో కుళ్లిపోతున్నారు.  పశ్చిమ రాయలసీమ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎం.వి.రామచంద్రారెడ్డి, తూర్పు రాయలసీమ జిల్లాల పట్టభద్రుల అభ్యర్థిగా పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, పశ్చిమ రాయలసీమ జిల్లాల పట్టభద్రుల అభ్యర్థిగా వెన్నపూస రవీంద్రనాథ్ రెడ్డి, తూర్పు రాయలసీమ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిల‌ను ప్ర‌క‌టించి త‌నకి త‌న సామాజిక‌వ‌ర్గ‌మే ముఖ్య‌మ‌ని చాటారు. ఉత్త‌రాంధ్ర‌లో అక్క‌డ త‌ప్ప‌నిస‌రై ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీతంరాజు సుధాకర్ ని ప్ర‌క‌టించారు. ఇక్క‌డా అన్యాయ‌మే. బీసీల‌కు న్యాయం చేయ‌డంలో తాను అభిన‌వ పూలేన‌ని ప్ర‌చారంచేసుకునే జ‌గ‌న్ బీసీల అడ్డా ఉత్త‌రాంధ్ర స్థానానికి బ్రాహ్మ‌ణుడైన సీతంరాజు సుధాక‌ర్‌ని ప్ర‌క‌టించి త‌మ‌కి అన్యాయం చేశార‌ని వైసీపీలో బీసీ నేత‌లు ఆవేద‌న‌తో ఉన్నారు.

మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్య‌ల‌తో వైసీపీ ఇరుకున ప‌డింది. వివేకానంద‌రెడ్డి హ‌-త్య‌కేసులో ఇప్ప‌టికే సీబీఐ జ‌గ‌న్ రెడ్డి ఓఎస్డీ, భార‌తి పీఏల‌ను విచారించింది. దీంతో అంద‌రి చూపు తాడేప‌ల్లి ప్యాలెస్ పై ప‌డింది. ఇదే సంద‌ర్భంగా టిడిపి జ‌గ‌నాసుర ర‌క్త‌చ‌రిత్ర అంటూ వివేకా హ‌-త్య‌కేసులో జ‌గ‌న్ రెడ్డి పాత్ర‌పై అనుమానాలు, ఆధారాల‌తో ఓ పుస్త‌కం వేసింది. దీనిపై స్పందిస్తూ, కౌంట‌ర్ ఎటాక్ చేయాల‌నుకున్న మాజీ మంత్రి కొడాలి నాని వైసీపీని పూర్తిగా బుక్ చేసేలా వ్యాఖ్య‌లు చేశారు. జగన్ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినా వివేకా కాంగ్రెస్ లోనే ఉండి వైఎస్ కుటుంబాన్ని దెబ్బతీసేందుకు  ప్రయత్నించార‌ని ఆరోపించారు. ఉప ఎన్నికల్లో పోటీచేసిన వైఎస్ విజయమ్మను ఓడించేందుకు వివేకానంద‌రెడ్డి ప‌నిచేశార‌ని ప్ర‌క‌టించారు. అంటే వైఎస్ వివేకానంద‌రెడ్డికి జ‌గ‌న్ రెడ్డి కుటుంబానికి విభేదాలున్నాయ‌ని త‌న మాట‌ల ద్వారా చెప్ప‌క‌నే చెప్పారు. వివేకా చనిపోతే జగన్ కు ఆస్తి వచ్చిందా? అని ప్ర‌శ్నించారు. వివేకా భార్య, కూతురు, అల్లుడి పేర్లపైనే ఆస్తులు బ‌దిలీ అయ్యాయ‌ని చెప్ప‌డం ద్వారా వివేకానంద‌రెడ్డిని చంపింది ఆయ‌న కూతురు, అల్లుడు, భార్యేన‌నే అర్థం వ‌చ్చేలా కొడాలి నాని చేసిన వ్యాఖ్య‌లు జ‌గ‌న్ రెడ్డిని ఈ హ‌-త్య‌కేసులో ఇరికించేలా ఉన్నాయ‌ని వైసీపీ నేత‌లే వ్యాఖ్యానిస్తున్నారు.  వివేకానంద‌రెడ్డి బతికున్నా ఆ సీటును అవినాష్ రెడ్డికే జగన్ ఇచ్చేవార‌ని చెప్ప‌డంతో వివేకానంద‌రెడ్డి క‌డ‌ప ఎంపీ సీటు అవినాశ్ రెడ్డికి ఇవ్వొద్ద‌నే అంశ‌మే ఈ హ‌-త్య‌లో కీల‌క ఆధార‌మ‌ని కొడాలి మాట‌లు వెల్ల‌డిస్తున్నాయి. క‌డ‌ప ఎంపీ సీటు విష‌యంలో వివేకానంద‌రెడ్డి త‌న‌కైనా, ష‌ర్మిల‌కైనా సీటు ఇవ్వాల‌ని కోర‌డంతోనే ఆయ‌న‌ను చంపేశార‌నే ఆరోప‌ణ‌ల‌కు కొడాలి నాని బ‌లం చేకూర్చిన‌ట్ట‌య్యింది.

ఉరుము ఉరిమి మంగ‌ళం మీద ప‌డ్డ‌ట్టు...వైసీపీ నేత‌ల పోరు టిడిపి జంపింగ్ ఎమ్మెల్యేల మీద ప‌డుతోంది. వైసీపీపై ఆరోప‌ణ‌లు చేస్తున్న నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పౌరుషం ఉంటే వెంటనే రాజీనామా చేయాలని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. దీనికి స్పందిస్తూ టీడీపీలో గెలిచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని, ఆ తర్వాత నా రాజీనామా అడగాలని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్‌కి ఎమ్మెల్యే కోటం రెడ్డి స‌వాల్ విసిరారు. తనకు అధికారం అనుభవించి బయటకి వెళ్లడం ఇష్టం లేదన్నారాయన అందుకే ముందుగానే అధికార పక్షానికి దూరంగా నిలబడ్డాని చెప్పుకొచ్చారు. తనకు అండగా నిలిస్తే కష్టాలు తెచ్చుకున్నట్లేనని, అయినా తన వెంట అనేక మంది నిలుస్తున్నారని కోటం రెడ్డి అన్నారు. సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జెడ్పీ కో ఆప్షన్ సభ్యులు అండగా నిలిచారన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి వైసీపీకి దూరం కావ‌డంతోనే వైసీపీ మిత్రులంతా శ‌త్రువులా మాదిరి ఆయ‌న‌పై విమ‌ర్శ‌ల దాడికి దిగుతున్నారు. కోటంరెడ్డి కూడా ఎక్క‌డా త‌గ్గ‌డంలేదు. రాజీనామా డిమాండ్‌ని త‌న మాట చాతుర్యంతో తిప్పికొట్టారు. టిడిపి టికెట్ పై గెలిచి వైసీపీలో చేరిన వ‌ల్ల‌భ‌నేని వంశీ, మ‌ద్దాలి గిరి, క‌ర‌ణం బ‌లరాం,వాసుప‌ల్లి గ‌ణేష్‌కుమార్ వంటి వారు ఎట్టి ప‌రిస్థితుల్లో రాజీనామా చేయ‌రు. వారు రిజైన్ చేస్తే తాను వెంట‌నే చేస్తానంటూ మెలిక పెట్ట‌డం ద్వారా రాజీనామా డిమాండ్ ని వైసీపీ నేత‌లు చేయ‌కుండా కోటంరెడ్డి అడ్డుక‌ట్ట వేశారు.

ఒరేయ్ అంటూ జ‌గ‌న్ ని సంభోదించిన నారా లోకేష్‌ని కొన్ని మేక‌వ‌న్నెపులులు విమ‌ర్శిస్తున్నాయి. ఒక యువ‌కుడు త‌న త‌ల్లిని గేలి చేసిన వారితో పోరాడుతున్నాడు. త‌న తండ్రిపై దాడిచేసిన వారిని ఎదుర్కొంటున్నాడు. త‌న పార్టీలో వేలాది మందిని టార్గెట్ చేసుకుని బ‌రితెగించి మ‌రీ హింసిస్తోన్న పార్టీతో త‌ల‌ప‌డుతున్నాడు. ఈ పోరాటంలో నారా లోకేష్ ని ఎంత‌గా గాయ‌ప‌రిచారో, ఎంత‌గా న‌ష్ట‌ప‌రిచారో తెలుగురాష్ట్రాల‌లో అంద‌రికీ తెలుసు. వైసీపీ పేటీఎం బ్యాచుతోపాటు ముఖ్య‌మంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంపీలు లోకేష్‌కి ఎన్ని పేర్లు పెట్టారో సోష‌ల్మీడియానే సాక్షి. ఎంత‌గా దుర్భాష‌లాడారో మీడియా క‌ళ్ల‌కు క‌ట్టింది. అన్నీ భ‌రించాడు. చివ‌రికి తాను శాంతియుతంగా చేప‌ట్టిన పాద‌యాత్ర‌ని అడుగ‌డుగునా అడ్డుకుంటున్నా స‌హించాడు. నిర్బంధం తీవ్రం అయి నివురుగ‌ప్పిన నిప్పు ఆగ్ర‌హ‌జ్వాలై ఎగిసింది. ఆ ధ‌ర్మాగ్ర‌హం నుంచి వ‌చ్చిందే ఒరేయ్ అనే పిలుపు. ఈ పిలుపుని త‌ప్పుప‌డుతున్న వారంతా చంద్ర‌బాబుని ముస‌లాడు అని జ‌గ‌న్ హేళ‌న చేసిన‌ప్పుడు ఏమ‌య్యారు? ఎన్టీఆర్ కుమార్తె భువ‌నేశ్వ‌రిని అసెంబ్లీలో దూషించిన‌ప్పుడు ఎందుకు ఈ కుహ‌నా మేధావులు ప్ర‌శ్నించ‌లేదు అంటూ టిడిపి కేడ‌ర్ మండిప‌డుతోంది.  యువ‌గ‌ళం పాద‌యాత్రలో నారా లోకేష్ రూటు మార్చారు. ఇప్ప‌టివ‌ర‌కూ పోలీసుల్ని బ‌తిమాలుతూ, రాజ్యాంగాన్ని చూపిస్తూ..త‌న హ‌క్కుల్ని హ‌రించొద్దంటూ శాంతియుతంగా పోలీసులతో సంభాష‌ణ‌లు కొన‌సాగించారు. ప్ర‌సంగాల‌లో కూడా ఎక్క‌డా ఎవ్వ‌రినీ దూషించ‌కుండా లెక్క‌లు, త‌ప్పులు ఎత్తిచూపుతూ మాట్లాడుకుంటూ వ‌స్తున్నారు.  జిడి నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం మండలం కత్తెరపల్లి జంక్షన్ లో యువనేత పాదయాత్ర 200 కిలోమీటర్లు చేరుకుంది. బ‌హిరంగ స‌భ లేద‌ని చెప్పినా పోలీసులు విన‌రు. మైకులు లాగేశారు. నిల‌బ‌డ్డ స్టూలు ఎత్తుకుపోయారు. త‌న‌ను ఏ న‌డిరోడ్డుపై నిలిపారో, వారంద‌రినీ అదే రోడ్డుపై నిల‌బెడ‌తాన‌న్నాడు. 40 ఏళ్ల‌కి పైగా హుందాగా క్లీన్ పాలిటిక్స్ చేసిన చంద్ర‌బాబుని ప‌ట్టుకుని వాడు, వీడు, ముస‌లాడు అంటోన్న జ‌గ‌న్ రెడ్డిని ఒరేయ్ అని పిలిచిన‌ నారా లోకేష్‌ని శెహ‌భాష్ నాయ‌కా అంటూ టిడిపి కేడ‌ర్ ప్ర‌శంసిస్తోంది.

Advertisements

Latest Articles

Most Read