అజ‌య్ అమృత్. ఈ పేరు పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌దు. గౌత‌మి కె పేరు మాత్రం సోష‌ల్మీడియాలో బాగా ఫేమ‌స్. వైసీపీ కోసం సోష‌ల్మీడియాలో ప‌నిచేసిన అజ‌య్ అమృత్ అలియాస్ గౌత‌మి కె పై కోర్టుల‌ను తూల‌నాడుతూ పెట్టిన సీబీఐ కేసు కూడా ఉంది. కోర్టుల్ని దూషిస్తూ పోస్టులు పెట్ట‌మ‌న్న‌వాళ్లు చేతులు ఎత్తేస్తే, అజ‌య్ అమృత్ ఆక్రోశంతో టిడిపి పంచ‌న చేరాడు. త‌న‌కు వైసీపీ చేసిన అన్యాయం, ఏపీలో ప్ర‌జ‌ల‌కు జ‌రుగుతున్న న‌ష్టంపై సోష‌ల్మీడియాలో పోస్టులు పెట్ట‌నారంభించాడు. అంతే స‌డెన్గా అజ‌య్ అమృత్ ద‌గ్గ‌ర గంజాయి దొరికేసింది. సినీ ప‌రిశ్ర‌మ‌లో అవ‌కాశాల కోసం తిరుగుతూ, వైసీపీకి వ్య‌తిరేకంగా ప‌నిచేస్తున్నార‌నే క‌క్ష‌తో గంజాయి కేసు పెట్టార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. త‌న‌ను అరెస్ట్ చేస్తార‌ని కొద్దిరోజులుగా ఆందోళ‌న‌గా ఉన్న అజ‌య్ అమృత్ త‌న ఆవేద‌న సోష‌ల్మీడియాలో వెళ్ల‌గ‌క్కాడు. అజ‌య్ ని ప‌ట్టుకునేందుకు ఆయ‌న భార్య గ‌ర్భిణిని కూడా పోలీసులు టార్చ‌ర్ చేశార‌ని ఆరోపించాడు. చివ‌ర‌కు అజయ్ అమృత్ ని అరెస్టు చేసి గంజాయి కేసు నమోదు చేశారు నరసరావుపేట పోలీసులు. అజయ్‍ని కోర్టులో హాజరుపర్చ‌గా 14 రోజుల రిమాండ్ విధించారు. వైసీపీ కోసం ప‌నిచేసినంత‌కాల‌మూ అజ‌య్ గంజాయి వ్యాపారి కాదు. వైసీపీ నుంచి బ‌య‌ట‌కొస్తే అదే అజ‌య్ గంజాయి వ్యాపారి అయిపోతాడు. మ‌హాసేన రాజేష్ విష‌యంలో వ్య‌వ‌హ‌రించిన‌ట్టే ద‌ళితుడైన అజ‌య్ ప‌ట్లా వైసీపీ క‌క్ష‌తో వ్య‌వ‌హ‌రించింద‌ని సోష‌ల్మీడియాలో చ‌ర్చ న‌డుస్తోంది.

మూడు రాజధానులకు సుప్రీంకోర్టు లైన్ క్లియర్ చేసిందంటూ టీవీ9లో వేసిన ఫేక్‌ బ్రేకింగ్స్ పై సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి హైకోర్టు న్యాయ‌వాది గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. ఎటువంటి తీర్పులు ఇవ్వ‌క‌పోయినా సుప్రీం కోర్టు స్టే ఇచ్చిందంటూ బ్రేకింగ్స్ వేశారని న్యాయవాది లేఖ‌లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ తో పాటు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకూ ఫిర్యాదు చేశారు. ప్రజలకు తప్పుదోవ పట్టించేలా ఉద్దేశపూర్వకంగా బ్రేకింగ్స్ వేశారని ఫిర్యాదు. దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం ఎటువంటి తీర్పులు ఇవ్వ‌క‌పోయినా, మూడు రాజ‌ధానుల‌కు లైన్ క్లియ‌ర్ చేస్తూ తీర్పులు ఇచ్చిన‌ట్టు కోర్టుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేలా చేసిన‌ ప్ర‌సారాల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. 2023 ఫిబ్రవరి 1వ తేదీన మధ్యాహ్నం 12.40 గంటలకు సుప్రీం కోర్టు పేరుతో  ప్రజల‌ని త‌ప్పుదోవ ప‌ట్టించాల‌నే ఉద్దేశంతో టీవీ9 న్యూస్ ఛానెల్ అబద్ధాలను వార్తగా ప్రసారం చేసిందని లేఖ‌లో పేర్కొన్నారు. ఇలాంటి అసత్యాలను ప్రసారం చేయడంలో నేరపూరిత కుట్ర కనిపిస్తోందని అనుమానించారు. సుప్రీంకోర్టు పేరుతో త‌ప్పుడు వార్త‌లు ప్ర‌సారం చేసిన టీవీ9 ఎడిటర్,  మేనేజ్‌మెంట్ పై సుమోటో చర్యలు తీసుకోవాలని లేఖ‌లో కోరారు. వేసిన బ్రేకింగ్స్ కి సంబంధించిన ఆధారాల‌ను లేఖ‌లో జ‌త చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపు పనులు రాష్ట్ర ప్రతిష్టను దిగజారుస్తున్నాయి. ఏకంగా ఐఏఎస్ లు కూడా తప్పించుకుని తిరగాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న డబ్బులు ఏమైపోతున్నాయో అర్ధం కావటం లేదు కానీ, అవి మాత్రం మన మెడకు చుట్టుకుంటున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులకు, ఐఏఎస్ అధికారులు బలి అయ్యారు. నిన్న సీఆర్డీఏ కార్యాలయం వద్ద పెద్ద హైడ్రామా చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులకు వడ్డీ కట్టటం లేదు అంటూ, ఆ డబ్బులు వసూలు చేయటానికి కార్యాలయానికి వచ్చారు బ్యాంకర్లు. మూడేళ్ళ క్రితం అప్పు తీసుకున్నారని, దానికి వడ్డీ కట్టటం లేదని, మూడు నెలలకోసారి రూ.52 కోట్లు వడ్డీ చెల్లించాల్సి ఉండగా, జనవరిలో వడ్డీ కట్టలేదని, ఎన్ని సార్లు లేఖలు రాసినా, ఫోన్ లు చేసినా స్పందన లేకపోవటంతో, బ్యాంకర్లు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయానికి వచ్చేసారు. మూడు బ్యాంకులకు సంబంధించిన అధికారులు వచ్చారు. అయితే సీఆర్డీఏ కమీషనర్ తాను వస్తున్నా అని చెప్పి రాకుండా, వేరే అధికారిని పంపించారు. అయితే తాము కమీషనర్ వచ్చే దాకా ఉంటామని చెప్పి, మూడు గంటలు ఎదురు చూసినా రాకపోవటంతో, అక్కడ నుంచి వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ, CRDAను డిఫాల్టర్‍గా ప్రకటిస్తామని హెచ్చరించి వెళ్లారు. ఇది మన రాష్ట్ర దౌర్భాగ్యం.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ఎన్నికల కోడ్ బ్రేక్ వేయనుందా అనే అనుమానాలు వస్తున్నాయి. దీంతో లోకేశ్ పాదయాత్ర కొనసాగింపుపై ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. చిత్తూరు జిల్లా అంతటా ఎన్నికల కోడ్ పరిధిలోనికి వస్తుంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలోని జీడీ నెల్లూరు నియోజకవర్గంలో లోకేశ్ పర్యటన సాగుతోంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో లోకేశ్ పాదయాత్ర విషయంలో స్పష్టత ఇవ్వాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి చిత్తూరు జిల్లా కలెక్టర్ లేఖ రాశారు. పాదయాత్ర ఎన్నికల ప్రవర్తనా నియమావళి పరిధిలోకి వస్తుందో లేదో చెప్పాలని కోరారు. గడప గడపకు వైసీపీ కార్యక్రమంకు అనుమతి విషయంలోనూ స్పష్టత ఇవ్వాలని ఈసీని కలెక్టర్ కోరారు.

Advertisements

Latest Articles

Most Read