ఈడీ అటాచ్ చేసిన రూ.150 కోట్ల‌ను రూ.30 కోట్లు బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చి తీసుకున్నార‌నే అంశం క‌ల‌క‌లం రేపుతోంది. భారతీ సిమెంట్స్ ఆస్తుల అటాచ్‌మెంట్ వ్యవహారంపై సుప్రీం కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిష‌న్ పై విచారణ చేపట్టిన జస్టిస్‌ రామసుబ్రహ్మణ్యం, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌ నేతృత్వంలోని ధర్మాసనం అఫిడవిట్ దాఖలు చేయాలని భారతీ సిమెంట్స్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాతే తదుపరి విచారణ చేపడతామని తేల్చి చెప్పింది. భారతీ సిమెంట్స్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదిస్తూ ``బ్యాంకు గ్యారెంటీ తీసుకొని ఆస్తులు, ఎఫ్‌డీలను విడుదల చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. బ్యాంకు హామీ తీసుకున్న తర్వాత కూడా రూ. 150 కోట్ల విలువైన ఎఫ్‌డీలను ఈడీ జప్తు చేసుకుందని కోర్టుకు వివరించారు. ఈడీ తరఫున వాదించిన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ సంజయ్‌ జైన్‌  ఎఫ్‌డీలను జప్తు చేసుకోలేదని కోర్టుకు తెలిపారు. ఎఫ్‌డీలను జప్తు చేశారో? లేదో? అన్న వివరాలతో వారం రోజుల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని భారతీ సిమెంట్స్‌ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆ అఫిడవిట్‌ను తాము కూడా పరిశీలించి తగిన సమాధానం ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని ఈడీ తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. దీనికి సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది. ప్రతివాదిగా ఉన్న భారతీ సిమెంట్స్‌ అఫిడవిట్‌ దాఖలు చేసిన తర్వాతే తదుపరి విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది.

వైసీపీకి రెండు చేతుల‌తో ఉద్యోగులంతా క‌లిసి ఓట్లేయించామ‌ని ఘ‌నంగా ప్ర‌క‌టించుకున్నారు. ఇప్పుడు అవే రెండు చేతులతో జీతం ఇవ్వండి మ‌హాప్ర‌భో అని స‌ర్కారుని వేడుకుంటున్నారు. టిడిపి ప్ర‌భుత్వ హ‌యాంలో ప్ర‌తీ నెలా ఒక‌టో తేదీనే జీతాలు ప‌డేవి. వైసీపీ వ‌చ్చాక జీతం నెల‌లో ఏ రోజు ప‌డుతుందో చెప్ప‌లేని దుస్థితి. ఫిబ్ర‌వ‌రి రెండో వారంలోకి అడుగు పెట్టినా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో అర‌వై శాతం మందికి జనవరి నెల జీతం, పెన్ష‌నూ ఇప్ప‌టికీ అందలేదు. ప్రతి నెల జీతభత్యాలకు కలిపి దాదాపు రూ.6 వేల కోట్ల వరకు అవసరం అవుతాయని ఇప్పటివరకు రూ. 2 వేల కోట్లు మాత్రమే ప్రభుత్వం నుంచి వ‌చ్చాయి. తొలివారం గడిచిపోయినా ఎక్కువమంది ఉద్యోగులకు ఇంకా జీతాలు పడలేదు. హౌసింగ్ లోన్లు, ఈఎమ్ ఐలు ప్ర‌తీ నెల 1వ తేదీ నుంచి 10వ తేదీలోగా ప‌డుతుంటాయి. జీతాలు ఎప్పుడు ప‌డ‌తాయో తెలియ‌ని ప‌రిస్థితిలో చెక్ లు బౌన్స్ అవుతాయ‌నే భ‌యంతో  వడ్డీలకు అప్పులు తెచ్చి అక్కౌంటులో వేస్తున్నారు. జీతాలు గురించి గ‌ట్టిగా అడిగితే కేసులు బ‌నాయిస్తార‌ని వారి సంఘ నాయ‌కులే భ‌య‌పెడుతున్నారు.  సుమారు 6లక్షల మంది ఉద్యోగులు, 4 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. నెల నెలా జీతం వ‌చ్చే తేదీ అలా అలా మారిపోతుండ‌డంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్నారు. ఇటీవ‌ల గ‌వ‌ర్న‌ర్ని క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నందుకు ఉద్యోగుల సంఘ నేత‌ల‌కు నోటీసులు పంపింది ప్ర‌భుత్వం. అలాగే కొన్ని ఉద్యోగ సంఘాల పెద్ద‌లైతే జీతాలు, ప్ర‌యోజ‌నాల కోసం ఎవ‌రైనా నోరెత్తితే వారిపై మాట‌ల‌తో ఎదురుదాడికి దిగుతున్నారు. ఓట్లేసిన చేతులు, గ‌ట్టిగా జీతాలు అడిగితే కేసులు..ఏం చేయాలో తెలియ‌ని గంద‌ర‌గోళంలో జీతాలు ఇవ్వండి మ‌హాప్ర‌భో అంటూ రెండు చేతులెత్తి ప్రార్థిస్తున్నారు.

ఏపీలో చాలా విచిత్ర‌మైన లా అండ్ ఆర్డ‌ర్ ప‌రిస్థితులున్నాయి. వైసీపీ వాళ్లు దాడిచేసినా కేసులు ఉండ‌వు, గాయ‌ప‌డిన విప‌క్షాలు కేసు పెట్టినా న‌మోదు చేయ‌ర‌నే ఆరోప‌ణ‌లున్నాయి. అలాగే వైసీపీ నేత‌లు సీఎంతో స‌హా రోడ్ల‌పై ర్యాలీలు, స‌భ‌లు, ఊరేగింపులు పెడుతుంటే అడ్డురాని నిబంధ‌న‌లు నారా లోకేష్ పాద‌యాత్ర‌లో అడుగ‌డుగునా పోలీసుల‌కు గుర్తొస్తున్నాయి. యువగళం పాదయాత్ర ప్రారంభించిన  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప‌ది రోజులు మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌లో న‌డిచేస‌రికి  ఇప్ప‌టివ‌ర‌కూ నాలుగు కేసులు న‌మోదు చేశారు. ఇవి కూడా వేర్వేరు పోలీసుస్టేష‌న్ల‌లో న‌మోదు చేయ‌డం మ‌రో విచిత్రం. ఈ నాలుగు కేసుల్లోనూ పోలీసులే ఫిర్యాదుదారులు కావ‌డంతో, పోలీసుల వెన‌క ఉండి ఎవ‌రో న‌మోదు చేయిస్తున్నార‌ని అర్థం అవుతోంది. నారా లోకేశ్ తోపాటు ఏపీ టిడిపి అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు, టిడిపినేత‌లు అమర్‍నాథ్ రెడ్డి, పులివర్తినాని, దీపక్‍రెడ్డి, జయప్రకాష్, జగదీష్, కోదండయాదవ్‍లపై క్రిమినల్ కేసులు న‌మోదు చేశారు. యువగళం పాద‌యాత్ర అస్స‌లు ముందుకు సాగ‌కూడ‌ద‌నే ఆదేశాలు అందుకున్నారేమో పోలీసులు ఆంక్షలు విధిస్తూనే ఉన్నారు. పాద‌యాత్ర‌ని అడుగ‌డుగునా అడ్డుకుంటూనే వ‌స్తున్నారు.  టీడీపీ నేతలు, యువగళం వాలంటీర్లపై వేధింపులు తీవ్రం చేశారు ఖాకీలు. అక్ర‌మ‌కేసులు, దాడుల‌తో పాదయాత్రలో పాల్గొన‌కుండా చేయ‌డ‌మే పోలీసుల లక్ష్యంగా క‌నిపిస్తోంది.

నిన్న‌టివ‌ర‌కూ అధికార పార్టీ వైసీపీ కోసం అంద‌రినీ చంపుతా, న‌రుకుతా, చంద్ర‌బాబుని లేపేస్తా, కోటంరెడ్డిని బండికి క‌ట్టి ఈడ్చుకెళ‌తానంటూ చెల‌రేగిపోయిన బోరుగ‌డ్డ అనిల్ భోరున ఏడుస్తున్నాడు. వైసీపీ క‌న్నింగ్, న‌టోరియ‌స్ ప్లాన్ల‌న్నీ అమ‌లు చేసే తురుపుముక్క బోరుగ‌డ్డ అనిల్ త‌న ఆఫీసు తానే త‌గ‌ల‌బెట్టుకుని దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడ‌ని ఆరోప‌ణ‌లు, సోషల్ మీడియాని ముంచెత్తాయి. బోరుగ‌డ్డ అనిల్ కుమార్. రిప‌బ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అనే పార్టీకి హోల్ సేల్ రైట్స్ ఉన్న ఏకైక వ్య‌క్తిని అని ప్ర‌చారం చేసుకుంటాడు. కానీ వాస్త‌వంలో వైసీపీ కోసం ప‌నిచేసే మ‌నిషి అని అంద‌రికీ తెలిసిపోయింది. వైసీపీపై విమ‌ర్శ‌లు చేసే వారిని, జ‌గ‌న్ పై ఆరోప‌ణ‌లు చేసేవారు ఎవ‌రైనా వారికి వార్నింగ్ ఇచ్చేందుకు వైసీపీ వాడే ఆయుధం ఈ బోరుగ‌డ్డే. అందరినీ తగలబెడతా అనే బోరుగడ్డ, నాది తగలబెట్టారని బోరుమన‌డం ఏంటో ఎవ్వ‌రికీ అర్థం కావ‌డంలేదు. వైసీపీ అధినేత జ‌గ‌న్ రెడ్డి, ఆయ‌న స‌తీమ‌ణి కూడా వివేకానంద‌రెడ్డి హ‌-త్య‌ కేసులో ఉన్నార‌ని వారి పీఏ, ఓఎస్డీల‌ను సీబీఐ విచారించ‌డంతో క‌ల‌క‌లం రేగింది. చిన్న‌గీత ప‌క్క‌న పెద్ద గీత గీసి డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేయ‌డంలో ఆరితేరిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తంత్రం బోరుగ‌డ్డ‌ని మ‌ళ్లీ లాంఛ్ చేసింది. వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డికి ఫోన్ చేసి, బండికి క‌ట్టుకుని ఈడ్చుకు పోతానంటూ హెచ్చ‌రించారు బోరుగ‌డ్డ అనిల్. ఈ బోరుగ‌డ్డ క్రిమిన‌ల్ అడ్డా అని తెలిసిన చాలా మంది లైట్ తీసుకున్నారు. వాస్త‌వంగా ఒక ప్రజాప్ర‌తినిధిని చంపుతాన‌ని బెదిరించిన బోరుగ‌డ్డ అనిల్ పై కేసులు పెట్టాలి. కానీ ఆయ‌న స‌ర్కారు ప్రాయోజిత మ‌నిషి కావ‌డంతో పోలీసులు ప‌ట్టించుకోలేద‌ని విమ‌ర్శ‌లున్నాయి. వివేకా హ‌-త్య‌కేసు తాడేప‌ల్లి ప్యాలెస్ ని తాక‌కుండా బోరుగ‌డ్డ సీను క్రియేట్ చేసినా వ‌ర్క‌వుట్ కాలేదు.

Advertisements

Latest Articles

Most Read