బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ ట్రస్టు బోర్డుకి కొత్త చైర్మన్, సభ్యులను నేరస్థులను నియమించి భ్రష్టు పట్టించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాల్ మనీ మాఫియాలో ఆరోపణలు ఎదుర్కుంటున్న కీలక వ్యాపారి కర్నాటి రాంబాబుని కనకదుర్గ గుడి ఆలయ పాలక మండలి చైర్మన్‌ని చేసేసింది. దుర్గగుడి ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా కర్నాటి రాంబాబు విజయవాడ చిట్టినగర్ ప్రాంతానికి చెందినవారు. గతంలో కర్నాటి రాంబాబుపై కాల్ మనీ ఆరోపణలు వచ్చాయి. కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో ఉన్న సస్పెక్ట్ షీట్ ని వైసీపీలో చేరి తొలగించుకున్నారని టాక్ వినిపిస్తోంది. నూతన పాలకమండలిలో సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేసిన బచ్చు మాధవి కృష్ణ లేడీ డాన్ అని వైసీపీలోనే ప్రచారం సాగుతోంది. టీడీపీ నేత పట్టాభి ఇంటిపై దా-డి సూత్రధారి ఈ మాధవే. డిజిపి ఆఫీసు పక్కనే ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంపై దా-డి కేసులోనూ బచ్చు మాధవి పాత్రధారి. రాణిగారితోటలో పింఛను కోసం నిలదీసిన మహిళలపై దా-డి చేసిన మాధవిపై విజయవాడ సిటీలోని పలు స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. కాల్ మనీ కింగ్ కర్నాటి రాంబాబు చైర్మన్‌ని చేసింది మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. బచ్చు మాధవీ కృష్ణకి పట్టుబట్టి మరీ పాలకమండలి సభ్యురాలిని చేసింది దేవినేని అవినాశ్. గత పాలకమండలిలోనూ మెంబర్లైన నాగవరలక్ష్మి మద్యం వ్యాపారం చేస్తూ పోలీసులకు చిక్కింది. భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమైన కనకదుర్గమ్మ ఆలయపాలక మండలిలో దొంగలు, నేరస్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిని చైర్మన్, సభ్యులుగా వైసీపీ నియమించడంపై హిందూ ధార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
news
ఆంధ్రప్రదేశ్‌తో ఆటలు ఆడుతోన్న బీజేపీ.. ఏపి ప్రజలంటే లెక్క లేదా ?
బీజేపీ మొదటి నుంచీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఆటలు ఆడుతోంది. అమరావతిపైనా దాగుడుమూతలు కొనసాగిస్తోన్న కేంద్ర బీజేపీ పెద్దల బాటనే రాష్ట్ర బీజేపీ నేతలు పయనిస్తున్నారు. ఒక రోజు అమరావతే రాజధాని అంటారు. మరో రోజు జిల్లాకొక రాజధాని పెట్టుకోవచ్చని అదే నోటితో వ్యాఖ్యానిస్తారు. తాజాగా అమరావతిని రాజధానిగా 2015లోనే నోటిఫై చేశారని కేంద్రం అఫిడవిట్ వేసింది. ఇదే సమయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తనకే సాధ్యమైన కామెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు. చంద్రబాబు హయాంలోనే ప్రత్యేక హోదా ఇచ్చేశామంటున్నాడు. పార్లమెంట్ సాక్షిగా రూ.15 వేల కోట్లు ఇచ్చామని సింపుల్ గా చెప్పేశాడు. రాష్ట్రానికి చెందిన మరో బీజేపీ నేత సత్య కుమార్ మాట్లాడుతూ అమరావతిపై తీర్మానం చేసిన వైసీపీ ఇప్పుడు మాట ఎందుకు మార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో ఆగదని ప్రకటించిన బీజేపీ పెద్దలే విశాఖ స్టీల్ ప్లాంట్‌కు తక్షణ ఆర్థిక సాయం కోరుతూ.. కేంద్ర ఉక్కుశాఖ మంత్రిని కలిశారు. చేసే పనులు, ఆడే మాటలకు ఎక్కడా పొంతన లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో బీజేపీ ఆటలు ఆడుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జగన్ బాదుడే బాదుడుని జనానికి లైవ్ గా చూపిస్తోన్న నారా లోకేష్
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన పెంచిన పన్నులు, సర్ చార్జీలతో దేశంలోనే అతి ఎక్కువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే డీజిల్, పెట్రోల్ ధరలు ఎక్కువయ్యాయి. దీంతో పక్క రాష్ట్రాలు తమ సరిహద్దులో బోర్డులు కూడా పెట్టాయి. ఏపీ కంటే పెట్రోల్ మా వద్ద 11 రూపాయలు తక్కువ, డీజిల్ 15 తక్కువ అంటూ ఊరిస్తూ..తమిళనాడు, కర్ణాటక సరిహద్దు బంకుల్లో బోర్డులు దర్శనమిస్తున్నాయి. యువగళం పాదయాత్ర ప్రారంభించిన నారా లోకేష్ కర్ణాటక సరిహద్దు గ్రామాల మీదుగా వెళ్లేటప్పుడు అక్కడి బంకుల్లో తమ కాన్వాయ్ వాహనాలకు పెట్రోల్ , డీజిల్ కొట్టించి ఏపీ కంటే కర్ణాటకలో ఎంత తక్కువో ధరలని చూపించాడు. మరోసారి ఏపీలో పెట్రోల్ డీజిల్ ధరలు ఎంత ఎక్కువో, జగన్ బాదుడే బాదుడు ఏ రేంజులో ఉందో లైవ్ లో చూపించారు నారా లోకేష్. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఏపీలోనే పెట్రోల్, డీజిల్ అత్యధిక ధరలున్నాయని విష ప్రచారం చేశారు జగన్. 2019లో అధికారం చేజిక్కించుకున్న జగన్ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్, డీజీల్ ధరలు హయ్యస్ట్ చేసి రికార్డు సృష్టించారు. ఈ విషయాన్ని నారా లోకేష్ తన పాదయాత్రలో ఎండగడుతున్నారు. మొన్న కర్ణాటకలో తన వాహనానికి డీజిల్ నింపుకుని ధరల వ్యత్యాసాన్ని ప్రజలకు చూపించారు. ఈ రోజు చిత్తూరు పట్టణంలో పాదయాత్ర కొనసాగిస్తున్న లోకేష్ రోడ్డు పక్కన ఉన్న పెట్రోల్ బంకు దగ్గర ఆగారు. అక్కడ ఉన్న ధరల పట్టికను చూపిస్తూ మరోసారి డీజిల్, పెట్రోల్ ధరల రూపంలో జగన్ రెడ్డి దోపిడీని ప్రజలకు తెలియజెప్పారు.
జగన్ కు చావు దెబ్బ కొట్టిన కేంద్రం.. విజయసాయి రెడ్డి బలే బుక్ చేసాడు..
పడుకున్న గాడిదని లేపి తన్నించుకోవడంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి వెరీ వెరీ స్పెషల్. ఏపీ రాజధాని కేసులు కోర్టులో ఉన్నాయి. విచారణకి వస్తున్నాయి. అయినా ఆత్రం ఆగని వైసీపీ నేతలు విశాఖే రాజధాని ఒకరు ప్రకటిస్తారు. రేపు వెళ్లిపోతామంటారు మరొకరు. ఎల్లుండే సామాన్లు సర్దేస్తున్నామని మరొకరి స్టేట్మెంట్. ఇంత గందరగోళ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఏపీ రాజధాని విశాఖ అని తీర్పు ఇచ్చేసిందని టీవీ3*3 తప్పుడు తీర్పు ప్రకటించేస్తోంది. కోర్టు విచారణ వరకూ ఆగలేని విజయసాయిరెడ్డి రాజ్యసభలో ఏపీ రాజధాని గురించి ప్రశ్న అడిగాడు. దీనికి సమాధానం ఇచ్చిన కేంద్రం ఏపీ రాజధానిగా అమరావతి విభజన చట్టం ప్రకారమే ఏర్పాటైందని తెలియజేసింది. సెక్షన్ 5, 6 ప్రకారమే రాజధానిగా అమరావతి ఏర్పాటైందని కేంద్రం తరఫున హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. అమరావతే రాజధాని అని 2015 లో నిర్ణయించారని, ఏపీ రాజధాని అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, దీనిపై మాట్లాడడం సబ్ జ్యుడిస్ అవుతుందని సమాధానం ఇచ్చారు. 2020లో ఏపీ ప్రభుత్వం 3 రాజధానుల బిల్లు తెచ్చే ముందు తమను సంప్రదించలేదని కేంద్రం స్పష్టం చేసింది. రాజధానిపై హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారని, ప్రస్తుతం అమరావతి అంశం కోర్టు పరిధిలో ఉండడంతో మాట్లాడకూడదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది.