ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, సినిమా వర్గాలకు మధ్య చాలా గ్యాప్ వచ్చింది. కొంత మంది హీరోలను తన వద్దకు పిలిపించుకుని, జగన్ చూపించిన దర్పం చూసి, అందరూ షాక్ తిన్నారు. స్టార్ హీరోలను అవమానించి పంపించారు అనే మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళింది. సినిమా టికెట్లు విషయం, ఆలాగే ధియేటర్ యాజమాన్యాలను టార్గెట్ చేయటం, ఇవన్నీ సినీ వర్గానికి, ఏపి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ తెచ్చాయి. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని, బాలకృష్ణను టార్గెట్ చేయటానికి మాత్రమే జగన్ ఇలా చేస్తున్నారని అందురూ భావిస్తున్నారు. ఇప్పటికే బాలయ్య ఇవేమీ పట్టించుకోకుండా అఖండ సినిమారిలీజ్ చేసి సూపర్ హిట్ సాధించారు. ఏపిలో తక్కువ రేట్ల వల్ల కొంత, కలక్షన్ తగ్గినా, సినిమా సూపర్ హిట్ అయ్యింది. డబ్బులు కూడా బాగానే వచ్చాయి. ఇక అలాగే పవన్ కళ్యాణ్ కూడా, జగన్ ని ఏ మాత్రం లెక్క చేయటం లేదు. సినిమా అవసరం అయితే ఫ్రీ గా రిలీజ్ చేస్తాను కానీ, జగన్ వద్దకు మాత్రం వెళ్ళేది లేదని తెగేసి చెప్పారు. అయితే చిరంజీవి మాత్రం, సినిమా పెద్దగా, ఈ సమస్య పరిష్కారం కోసం తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలోనే, త్వరలో సినిమాలు రిలీజ్ అయ్యే మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి లాంటి వాళ్ళు జగన్ వద్దకు వెళ్లి, జగన్ ఇగో కొంచెం తగ్గించి వచ్చారు.
అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు వచ్చే వారం పవన్ కళ్యాణ్ సినిమా విడుదల కాబోతుంది. అయితే ఇప్పటికీ ఏపిలో టికెట్ ధరల సమస్య ఒక కొలిక్కి రాలేదు. ఈ సందర్భంగా భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ సోమవారం హైదరాబాద్ లో జరగనుంది. అనూహ్యంగా ఈ ఈవెంట్ కు, కేటీఆర్ ముఖ్య అతిధిగా వస్తున్నారు. సామాన్యంగా పవన్ కళ్యాణ్ సినిమాల ఫంక్షన్లకు చీఫ్ గెస్ట్ ఉండరు. అయితే పవన్ సినిమాకు, కేటీఆర్ చీఫ్ గెస్ట్ రావటం, ఇప్పుడు రాజకీయంగా కూడా చర్చనీయంసం అయ్యింది. ఏపిలో జగన్ చూపిస్తున్న తిక్కకు, ఇది నా లెక్క అంటూ, తెలంగాణా ప్రభుత్వం తనతో ఉంది అనే సంకేతం పవన్ ఇస్తున్నారు. అదే సందర్భంగా, కేటీఆర్ కూడా, సినిమా ఇండస్ట్రీకి, తమ ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం అనే సంకేతం ఇవ్వనున్నారు. పవన్ కళ్యాణ్ వేసిన ఈ ఎత్తుతో వైసీపీకి రాజకీయంగా కొంత ఇబ్బంది అయినా, వైసీపీ దీన్ని ఎలా తిప్పి కొడుతుందో చూడాలి. సినిమా ఇండస్ట్రీ పై, జగన్ మరింత కక్ష పెంచుకునే అవకాసం ఉంది. ఈ ఫంక్షన్ లో, పవన్ కళ్యాణ్ కనుక, జగన్ ను టార్గెట్ చేస్తే, ఈ అంశం మళ్ళీ ముందుకు వస్తుంది. ఏమి జరుగుతుందో చూడాలి.