ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వానికి, సినిమా ఇండస్ట్రీకి మధ్య నెలకొన్న వివాదం మళ్ళీ రేగింది. ఇటీవిల సినీ ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోలు, చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు , రాజమౌళి, కొరటాల శివ లాంటి వారు వచ్చి, జగన్ మోహన్ రెడ్డిని బ్రతిమిలాడినా కూడా, ఇప్పటికీ టికెట్ల అంశం పై జీవో రాలేదు. సినిమా టికెట్ల అంశం పై హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం నియమించిన కమిటీ, ఇప్పటి వరకు కూడా నాలుగు సమావేశాలు నిర్వహించింది. మొన్న జరిగిన సమావేశంలో, జీవో విడుదల చేస్తామని చెప్పారు. అయితే రెండు రోజుల్లో భీమ్లా నాయక్ సినిమా విడుదలకు సిద్దంగా ఉండటంతో, అక్కడ నుంచి సినీ పెద్దలు, మంత్రుల పై ఒత్తిడి తెస్తున్నారు. మంత్రులు మాత్రం,జగన్ కోసం ప్రయత్నం చేయగా, అటు వైపు నుంచి అపాయింట్మెంట్ లేదు. మేకపాటి మరణంతో, మొత్తం అటు వైపే ఉన్నారు. ఈ తరుణంలో ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమా విడుదల కావటంతో, అప్పటి వరకు కూడా టికెట్ల అంశం పై జీవో వచ్చే అవకాసం లేదని చెప్తున్నారు. అయితే ఇప్పుడు జరిగే విషయాలు కూడా, ప్రభుత్వ వైఖరిని తెలియ చేస్తున్నాయి. ఈ నెల 25వ తేదీన భీమ్లా నాయక్ సినిమా విడుదల అవుతుంది. ఈ భీమ్లా నాయక్ సినిమా కోసం, ఏవైతే టికెట్ ధరలు అమలులో ఉన్నాయో అవి ఫైనల్ అని ప్రభుత్వం చెప్తుంది.
ధరల ప్రకారమే సినిమీ టికెట్ల ధరలు ఉండాలని, భీమ్లా నాయక్ ప్రదర్శించే సినిమా థియేటర్లకు ఫోన్లు చేసి చెప్పారు. అయితే సాయంత్రానికి, డైరెక్ట్ గా రిటెన్ గా కూడా రాసి నోటీసులు ఇస్తున్నారు. బెనిఫిట్ షోలు కానీ, అదనపు షోలు కానీ, వేయరాదని ఆదేశాలు జారీ చేసారు. టికెట్ ధరలు ఇప్పుడు ఎంత ఉన్నాయో అంతే ఉండాలని, పెంచటానికి వీలు లేదని తేల్చి చెప్పారు. డైరెక్ట్ గా నోటీసులు ఇచ్చి, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని థియేటర్లను హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు కూడా పెడతాం అంటూ నోటీసుల్లో తెలిపారు. రెవిన్యూ అధికారులతో పాటు, తాహసిల్దార్లు ఈ ఆదేశాలు ఇస్తున్నారు. అయితే ఇదంతా పవన్ కళ్యాణ్ మీద కక్షతోనే ప్రభుత్వం చేస్తుందని, అఖండ, పుష్ప సినిమాలకు కూడా ఇలాగే చేసారని, ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమాకు మళ్ళీ మొదలు పెట్టారని, ఇండస్ట్రీ పెద్దలు వచ్చి, బ్రతిమిలాడినా, జగన్ ఇగో satisfy చేసినా, జగన్ మనసు మాత్రం కరగలేదని వాపోతున్నారు.