ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి నేతలు అమ్మా అన్నా, నీ *మ్మా అన్నట్టు వినిపిస్తుంది. వెంటనే కేసులు, అరెస్ట్ లు, హంగామా, హడావిడి. అదే వైసిపీ నేతలు ఎగెరి ఎగిరి తన్నినా, మసాజ్ అని చెప్పేంత గొప్ప మనసు మన ఏపి పోలీసులకు ఉంది. అయితే గతంలో డీజీపీ సవాంగ్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి కాబట్టి, అప్పటి పోలీసులు తీరు అది అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు కొత్త డీజీపీ రావటం,మొదటి ప్రెస్ మీట్ లోనే, పోలీసులు జోలికి ఎవరైనా వస్తే తాట తీస్తాను అని వార్నింగ్ ఇవ్వటం అందరం చూసాం. అయితే ఇప్పుడు కొత్త డీజీపీ గారికి పరీక్ష పెడుతూ, వైసీపీ ఎమ్మెల్యే పోలీసుల పై రెచ్చిపోయాడు. మరి కొత్త డీజీపీ గారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారా అని ప్రజలు, ఎదురు చూస్తున్నారు. ఇక విషయానికి వస్తే, ఉదయం నుంచి, సోషల్ మీడియాలో, మీడియాలో కూడా ఒక వీడియో వైరల్ అవుతుంది. అందులో కృష్ణా జిల్లా పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధి, పోలీసులను దుషిస్తూ ఉన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో పార్ధసారధి, పోలీసులను మీ గు* అంతా పగల దెం** అంటూ, బూతులు మాట్లాడటమే కాక, ఈ పోలీసులు బ్రోకర్లు అంటూ, ఇష్టం వచ్చినట్టు చేసిన వ్యాఖ్యలు, ఆ వీడియో, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

pardhasaradhi 24022022 2

రెండు రోజుల క్రితం ఉయ్యూరులో, టిడిపి కార్యకర్తలను, వైసీపీ నేతలు కొట్టారు. హాస్పిటల్ లో జాయిన్ అయ్యేలా దెబ్బలు తగిలాయి. ఈ వార్త హైలైట్ అవ్వటంతో, రంగంలోకి దిగిన పోలీసులు వైసీపీ నేతలకు అరెస్ట్ చేసారు. అయితే విషయం తెలుసుకున్న వైసీపీ ఎమ్మెల్యే పార్ధసారధి రెచ్చిపోయాడు. మా వాళ్ళనే అరెస్ట్ చేస్తారా అంటూ చెలరేగిపోయారు. తమ పార్టీ నేతల పైన పోలీసులు చేయి కూడా చేసుకున్నారని, తమాషాలు చేస్తున్నారా అంటూ, ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా పోలీసులు పైన కేసులు పెట్టాలని, ఇప్పటికీ తమను కొడుతున్నారు అంటూ కోర్టులో కేసు వేయాలని, ఈ పోలీసులు సంగతి నేను చూస్తాను అంటూ, బూతులు అందుకున్నారు. మేము అధికారంలో ఉన్నాం, మమ్మల్ని రెచ్చగొడితే మేము రేచ్చిపోతాం, మీ గు* అంతా పగల దెం**, పోలీసులు పోలీసులు లాగ ఉండండి, బ్రోకర్లు లాగా తాయారు అయ్యారు అంటూ రెచ్చిపోయారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవ్వటం, పోలీసులను పిచ్చి తిట్లు తిడుతూ ఉండటంతో, మరి కొత్త డీజీపీ ఎలాంటి ఆక్షన్ తీసుకుంటారో చూడాలి మరి.

ఒక పక్క భీమ్లా నాయక్ సినిమాకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వార్ జరుగుతున్న సందర్భంలో, ఇప్పుడు పూనం కోర్ ఎంట్రీతో, ఈ సినిమా ఇప్పుడు మళ్ళీ వార్తల్లో మరో టాపిక్ అయ్యింది. నిన్న పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలేజ్ ఫంక్షన్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫంక్షన్ అయిన దగ్గర నుంచి, పూనం కౌర్ వేస్తున్న ట్వీట్లు సంచలనంగా మారాయి. ఎవరి పేరు ప్రస్తావించక పోయినా, అందులో అర్ధాలు తెలిసిపోతున్నాయి. అయితే కొన్ని ట్వీట్స్ ను ఆమె ఎందుకో కానీ ఆమె డిలీట్ చేస్తున్నారు. రాజకీయాలు ఎంటర్టైన్మెంట్ అయ్యాయి, ఎంటర్టైన్మెంట్ రాజకీయంగా మారిపోయింది అంటూ ఆమె ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ వైరల్ అవుతున్న నేపధ్యంలో, ఆమె ఆ ట్వీట్ ను డిలీట్ చేసారు. అయినా ఆ స్క్రీన్ షాట్ అప్పటికీ వైరల్ అయ్యింది. అది ఎవరిని ఉద్దేశించి చేసారో కానీ, ఆమె టార్గెట్ పవన్ కళ్యాణ్ అని, ఆమె తరువాత వేసిన ట్వీట్స్ చూస్తే అర్ధం అవుతుంది. నేను ఎంతో ఇష్టంగా ప్రేమించిన వ్యక్తులు, రాజకీయ నాయకులు ముందు, వాళ్ళను తక్కువ చేసుకుని, చేతులు జోడించి, చేతులు కట్టుకుని ఉండటం చూసి బాధ వేసిందని, ఎంతో కష్టపడి పైకి వచ్చిన వారు, అవసరాల కోసం వ్యక్తిత్వాలు చంపుకుని బ్రతకనవసరం లేదని, ఆమె ట్వీట్ చేసారు. అయితే కొద్ది సేపటికి ఆ ట్వీట్ కూడా డిలీట్ చేసారు.

poonam 24022022 2

అయితే ఈ ట్వీట్ మాత్రం చిరంజీవిని ఉద్దేశించి అని అర్ధం అవుతుంది. ఇక్కడ జగన్ ను టార్గెట్ చేసినట్టు ఉండటంతో, ఆమె అది డిలీట్ చేసారు. ఇక రాం గోపాల్ వర్మ, పవన్ కళ్యాణ్ స్పీచ్ ని షేర్ చేసిన ట్వీట్ ని కోట్ చేస్తూ ఆమె మరో ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ అయతే డిలీట్ చేయలేదు. ఒక డైరెక్టర్ అతని వ్యక్తిగత జీవతం పైన దారుణంగా వ్యాఖ్యానించి, అతని పక్కన నుంచుని నవ్వుతున్నాడు. మరో డైరెక్టర్, రాజకీయంగా ఆడుకుంటూ, ట్విట్టర్ లో నవ్వుతున్నాడు. ఇద్దరూ అమ్మాయిని ఆయుధంగా పెట్టుకుని, డబ్బుకు అద్దెకు తీసుకున్న ఏజెంట్లు అంటూ, ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. రాం గోపాల్ వర్మ వైసీపీ అజేంట్ అని అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆమె త్రివిక్రమ్ ని కూడా ఇందులోకి లాగటం సెన్సేషన్ అయ్యింది. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అతి పెద్ద క్రైమ్ ఏంటి ? మనం దాని గురించి మాట్లాడటం మానేసి, పెళ్ళిళ్ళ పై మాట్లాడుతున్నాం అంటూ, పరోక్షంగా జగన్ పరిపాలను కూడా టార్గెట్ చేస్తూ ట్వీట్ లు వేసారు. ఇప్పుడు ఇవన్నీ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

నారా లోకేష్ మొదటి సారి కోర్టు ముందు హాజరు అవుతున్నారు. లక్షల కోట్ల నేరాలు చేసి, లేదా బాబాయ్ ని వేసేసి కాదు, తన పైన చేసిన అబద్ధపు ప్రచారానికి, పరువు నష్టం దావా కేసులో. విశాఖ జిల్లాలో ఉన్న 12వ అదనపు కోర్టుకు లోకేష్ హాజరు అవుతున్నారు. గతంలో 2019లో సాక్షి దినపత్రికలో ఒక కధనం వచ్చింది. చినబాబు చిరు తిళ్ళు అంటూ రూ.25 లక్షల రూపాయలు నారా లోకేష్ ఖర్చు చేసారని, కేవలం చిరు తిళ్ళు కోసం ఖర్చు పెట్టారు అంటూ సాక్షిలో కధనం వచ్చింది. అయితే సాక్షి ఇక్కడే ఫేక్ చేస్తూ దొరికిపోయింది. లోకేష్ చిరు తిళ్ళు తిన్నారని, తేదీలు, లెక్కలతో సహా సాక్షి చూపించింది. అయితే ఆ తేదీల్లో, లోకేష్ అసలు అక్కడ లేరు. అక్కడ లేకుండానే, లోకేష్ పలానా చోట ఉన్నారని, అక్కడే చిరు తిళ్ళు కోసం ఖర్చు పెట్టారు అంటూ సాక్షి వేసింది. అయితే దీని పైన లోకేష్ టీం మొత్తం కసరత్తు చేసింది. సాక్షి వేసిన తేదీల్లో అసలు లోకేష్ ఎక్కడ ఉన్నారు, ఏమి చేస్తున్నారు, ఇలా మొత్తం డీటెయిల్స్ బయటకు వదిలారు. ఆధారాలతో సహా లోకేష్ టీం బయటకు ఇచ్చింది. సాక్షి చేసిన ఫేక్ మొత్తం బయట పడింది. దీంతో లోకేష్ సాక్షికి లీగల్ నోటీస్ పంపించారు. దీని పైన తనకు వివరణ ఇవ్వాలని, సాక్షి దినపత్రికకు లోకేష్ లీగల్ నోటీసులు పంపించారు.

vizag 24022022 2

అయితే, లోకేష్, సాక్షి ఇచ్చిన వివరణతో సంతృప్తి చెంద లేదు. సాక్షి పైన పరువు నష్టం దావా వేసారు. విశాఖలో తిన్నట్టు ఆరోపణలు చేయటంతో, సాక్షి పైన విశాఖ కోర్టులోనే పరువు నష్టం దావా వేసారు. అయితే ఈ కేసు ఇప్పుడు దాదపుగా మూడేళ్ళకు విచారణకు వచ్చింది. కరోనా వల్ల ఈ కేసు విచారణ లేట్ అయినట్టు చెప్తున్నారు. దాదాపుగా మూడేళ్ళ తరువాత ఈ కేసు విచారణకు వచ్చింది. సాక్షి పైన రూ.75 కోట్ల పరువు నష్టం దావా వేసారు. ఈ కేసు విషయంలోనే నారా లోకేష్ స్వయంగా కోర్టుకు హాజరు అవుతున్నారు. మొదటి సారి లోకేష్ కోర్ట్ ముందుకు హాజరు అవుతున్నారు. ఈ రోజు విజయవాడ నుంచి బయలుదేరి, లోకేష్ విశాఖ చేరుకుంటారు. అక్కడ కోర్టు పని ముగిసిన తరువాత, నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్లనున్నారు. సాక్షి చేస్తున్న విష ప్రచారం పైన, లోకేష్ తీసుకున్న అడుగులతో, టిడిపి శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాగే సాక్షి చేస్తున్న ప్రతి ఫేక్ పైన, పరువు నష్టం కేసులు వేయాలని కోరుతున్నారు.

24 గంటలుగా నర్సీపట్నంలో జరుగుతున్న హైడ్రామాకు తెర పడింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. నిన్నటి నుంచి అయ్యన్నపాత్రుడుని అరెస్ట్ చేయటానికి, నర్సీపట్నం మొత్తం పోలీసులతో నింపేసారు. అయితే అయ్యన్న అభిమానులు, తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకొని 24 గంటల నుంచి అక్కడే ఉండటంతో, పోలీసులు, అయ్యన్న ఇంటి లోపలకు వెళ్ళే సాహసం చేయలేదు. నిన్నటి నుంచి టిడిపి శ్రేణులు అయ్యన్నను కాపాడుతూనే ఉన్నాయి. నిన్న ఉదయం నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడు ఇంటికి, నల్లజెర్ల పోలీసులు వచ్చారు. అయ్యన్నపాత్రుడు జగన్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసారని, ఆయన పైన కేసు నమోదు అయ్యిందని, ఆయనకు నోటీసులు ఇవ్వాలని చెప్పారు. అయితే అయ్యన్న పాత్రుడు ఇంట్లో లేరని, అక్కడి వారు చెప్పటంతో, ఆయన వచ్చిన తరువాతే ఇక్కడ నుంచి వెళ్తామని కూర్చున్నారు. అయితే అయ్యన్న రాకపోవటంతో, ఆయన ఇంటికి 41ఏ నోటీసు అంటించిన పోలీసులు, అక్కడ నుంచి వెళ్ళినట్టే వెళ్లి, మళ్ళీ అదనపు బలగాలను రప్పించి, నర్సీపట్నం మొత్తం మొహరించారు. నిన్న సాయంత్రం నుంచి నర్సీపట్నంలో హైడ్రామా నేలోంది.

ayyanna 24022022 2

ఏ క్షణమైనా అయ్యన్న ఇంట్లోకి పోలీసులు వస్తారని, అయ్యన్నని అరెస్ట్ చేస్తారని ప్రచారం చేసారు. అయితే పెద్ద ఎత్తున తెలుగుదేశం శ్రేణులు అయ్యన్న ఇంటికి వచ్చాయి. నిన్నటి నుంచి అందరూ అక్కడే ఉన్నారు. అక్కడే భోజనాలు చేసారు. రాత్రంతా అక్కడే రక్షణగా నిలిచారు. తెలుగుదేశం శ్రేణులు ఎక్కువగా ఉండటంతో, పోలీసులు అయ్యన్న ఇంటి మీదకు వెళ్ళే సాహసం చేయలేదు. సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ తరుణంలో అయ్యన్నపాత్రుడు తన పైన పెట్టిన కేసు పైన, హైకోర్ట్ లో క్వాష్ పిటీషన్ దాఖలు చేసారు. తన కేసు కొట్టేయాలని, అది రాజకీయ ప్రేరేపిత కేసు అని, కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. అయితే దీని పైన విచారణ చేసిన హైకోర్టు, ఈ కేసు విషయంలో తదుపరి చర్యలు అన్నీ నిలిపివేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో టిడిపి కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది సేపట్లో నారా లోకేష్, అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్లనున్నారు. అయ్యన్నపాత్రుడుని పరామర్శించనున్నారు.

Advertisements

Latest Articles

Most Read