వైసీపీకి ఇది నిజంగా షాకింగ్ న్యూస్. వైసీపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు టిడిపిలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. వీరిలో చాలా మందికి టిడిపి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సమాచారం. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి కుటుంబాలతో సహా టిడిపిలో చేరబోతున్నారు. బాపట్ల జిల్లాకి చెందిన, మాజీ మంత్రిగా చేసిన వైసీపీ నేత ఒకరు టిడిపి గూటికి తిరిగి చేరాలనే ప్రయత్నాలు విజయవంతం అయ్యాయని తెలుస్తోంది. బీజేపీలోచేరే అవకాశం దొరకకపోతే వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి టిడిపి గూటికి రావాలని చూస్తున్నారట. టిడిపిలో ఎప్పుడెప్పుడు చేరుదామా అని మాజీ మంత్రి వైసీపీ నేత డీఎల్ రవీంద్రారెడ్డి ఎదురుచూస్తున్నారు. మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత తన భర్తతో కలిసి టిడిపి తీర్థం పుచ్చుకోవాలని చూస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆ మాత్రం ఈ ప్రచారాన్ని ఖండించారు. మొత్తానికి నిన్నటి పవన్-బాబు భేటీతో వైసీపీలో ప్రకపంనలు ఆరంభం అయ్యాయి. వైసీపీ నేతలు టిడిపిలో చేరిక వార్తలతో వైసీపీలో వణుకు మొదలు కావడం ఖాయమంటున్నారు రాజకీయ పరిశీలకులు.
news
జగన్ ప్రభుత్వానికి హైకోర్ట్ భారీ షాక్... ఒకే రోజు మూడు మొట్టికాయలు...
ఒకే రోజు మన రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం మూడు కేసుల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయినా దున్నపోతు మీద వాన కురిసినట్టు వైసీపీ సర్కారు నుంచి స్పందన శూన్యం. దీనిపై ట్విట్టర్ వేదికగా ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా ఘాటుగా ట్విట్టర్ ద్వారా స్పందించారు. హైకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని అభిశంసించినట్టే. సిగ్గు ఉన్న ప్రభుత్వం అయితే ఉరేసుకుని చచ్చేది అంటూ సీబీఎన్ ట్వీట్ చేశారు. కాంట్రాక్టర్లు బిల్లులు అందక దొంగలుగా మారారు. బిల్లులు చెల్లించడంలేదని దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా కాంట్రాక్టర్లను దొంగలు చేశారని, పెన్షనర్లకు పింఛను సొమ్ములు చెల్లించక పిక్ పాకెట్ గాళ్లను చేస్తారా అంటూ హైకోర్టు సర్కారుపై మండిపడింది. గ్రానైట్ పరిశ్రమకి పవర్ కట్ చేసిన కేసులోనూ హైకోర్టు తీవ్రంగానే స్పందించింది. బిల్లు కట్టలేదని పరిశ్రమ పవర్ కట్ చేసిన సర్కారు ఎవ్వరికీ బిల్లులు చెల్లించడంలేదని, వీరి పవర్ ఎవరు కట్ చేయాలని ప్రశ్నించింది. ఎస్సీల నిధులు మళ్లింపుని తీవ్రంగా పరిగణిస్తూ అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఒకే రోజు మూడు వ్యాజ్యాలపైనా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు సర్కారు నిర్లక్ష్య తీరుకి అద్దం పడుతున్నాయని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.
పోలీసులు వచ్చినా, పేటీయం బ్యాచులు వచ్చినా.. జీవో 1 తెచ్చినా.. చంద్రబాబు అన్ స్టాపబుల్..
టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబుకి ప్రజలకి దూరం చేయాలని వైసీపీ వేయని ఎత్తుగడ లేదు. పర్యటనలు అడ్డుకోవాలని చేయని ప్రయత్నంలేదు. కందుకూరు సభలో విషాదాన్ని సాకుగా చూపాలనుకున్నారు. అయితే జనం మరింత ఉత్సాహంతో కావలి, కోవూరు సభలకు పోటెత్తారు. గుంటూరు బహిరంగ సభలో చంద్రబాబు వెళ్లిపోయాక జరిగిన ఘటనతో ఆయనని కట్టడి చేయాలని చూశారు. సభల నిర్వాహకులను అక్రమకేసుల్లో అరెస్ట్ చేయించారు. సిపాయిల తిరుగుబాటు నాటి బ్రిటిష్ చట్టం తీసుకొచ్చి జీవో నెంబర్ 1 పేరుతో మరో కుట్రకి తెరతీశారు. ప్రతిపక్షనేత చంద్రబాబు హక్కులు హరించేలా అప్రజాస్వామిక పద్ధతులతో వైసీపీ సర్కారు, పోలీసులు కుతంత్రాలు పన్నారు. అర్ధరాత్రి జీవో తెచ్చి తరువాతి రోజు చంద్రబాబు కుప్పం పర్యటనలో అమలుకి విశ్వప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ప్రతిపక్షనేతని రాష్ట్రంలో అడ్డుకోవాలనుకున్నారు సాధ్యంకాలేదు. సొంత కుప్పం నియోజకవర్గంలో అడుగుపెట్టకుండా చూడాలనుకున్నారు. అది వైసీపీ దుస్సాహసమే అయ్యింది. అడుగడుగునా జననీరాజనంతో చంద్రబాబు మూడురోజుల పర్యటన అన్‌స్టాపబుల్ గా విజయవంతమైంది. ప్రచారరథాన్ని సీజ్ చేశారు. తాను ప్రయాణిస్తున్న వాహనాన్నే ప్రచార రథం చేసుకున్నారు. టూరు జరగడానికి వీల్లేదని వైసీపీ పోలీసులు అడ్డుపడ్డారు. అయితే నడిచి వెళ్లడానికి మీకేం అభ్యంతరమంటూ పాదయాత్ర ప్రారంభించారు. ఎక్కడ అడ్డగిస్తే అక్కడే బైఠాయించి ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపారు. మైక్ అండ్ సౌండ్ సిస్టమ్ పోలీసులు ఎత్తుకెళ్లారు. తన మాటనే మైకుగా, తన గళాన్నే నినాదంగా బాబు ప్రకటించారు. సీబీఎన్ ఎటూ కదలకుండా ఖాకీలు వలయంగా మారారు. నారా సింహంలా బస్సు ఎక్కి తన ప్రసంగాన్ని కంటిన్యూ చేశారు. రాష్ట్ర ప్రజలని, నా అభిమానులను, తెలుగుదేశం కేడర్ని, నా నియోజకవర్గ జనాన్ని కలవకుండా జగన్ లాంటి వందమంది నియంతలు వచ్చినా ఆపలేరని తన టూరుతో స్పష్టం చేశారు చంద్రబాబు. టిడిపి అధినేత ఎనర్జీకి ఎదురులేదు. పట్టుదలలో విక్రమార్కుడు. అలసట అనేద ఎరుగని అతిరథమహారధుడు చంద్రబాబు అన్ స్టాపబుల్.
చంద్రబాబు చాణక్యుడు నుంచి చండశాసనుడిగా మారాడు
చంద్రబాబు రాజనీతిజ్ఞతకు పెట్టింది పేరు. చట్టాలను గౌరవించడంలో ఎదురులేని వ్యక్తిత్వం. ప్రజాస్వామ్యయుత ప్రవర్తనకు నిలువుటద్దం. రాజ్యాంగబద్ధ వ్యవహారశైలికి ఓ నిదర్శనం. నలభై ఐదు సంవత్సరాలుగా క్రమశిక్షణాయుతమైన రాజకీయాలకు పెట్టింది పేరైన చంద్రబాబుని అపరచాణక్యుడు అంటారు. అటువంటి చంద్రబాబు చండశాసనుడిగా మారాల్సిన పరిస్థితులు కల్పించాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తన నియంత పాలనతో చంద్రబాబులో పెనుమార్పులు తేవడానికి జగన్ దోహదపడ్డాడు. నాన్చుడు ధోరణి, పోనీలే వారి పాపాన వారే పోతారనుకునే చంద్రబాబుకి దూకుడు నేర్పాడు. మాటకు మాట. చర్యకు ప్రతిచర్య వుంటుందని హెచ్చరించే స్థాయి మొండిఘటంగా బాబుని తయారు చేశాడు. ఉద్యమమైనా, పోరాటమైనా ఒక దశలో ఆపేయడమో, తీవ్రత తగ్గించడమో చేసే చంద్రబాబుని పట్టువదలని విక్రమార్కుడిలా తయారయ్యేలా జగన్ రెడ్డి మూర్ఖ పాలనలో వేధింపులు తీర్చిదిద్దాయి. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా టిడిపి అధినేత పర్యటనలు పరిశీలిస్తే చంద్రబాబు చాణక్యుడే కాదు..చండశాసనుడు, పట్టువదలని విక్రమార్కుడు అని తేటతెల్లం చేస్తున్నాయి. మూడు రోజుల కుప్పం పర్యటనలో ఎస్వీ యూనివర్సిటీలో విద్యార్థి సంఘ నాయకుడు మళ్లీ చంద్రబాబులో కనిపించాడు. కుప్పం పర్యటనకు పార్టీ ప్రచార రథం, సౌండ్ వెహికిల్ ఉపయోగించడానికి అనుమతి లేదని స్వాధీనం చేసుకున్న పోలీసులు గుడిపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వాహన డ్రైవర్ లు, సహాయక సిబ్బంది ని అదుపులోకి తీసుకున్నారు. కుప్పం నియోజకవర్గం వేలాది మంది పోలీసుల మొహరించారు. కెనామాకులపల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన స్టేజి ని తొలగించారు.
మైకు తీసుకుంటే నోటినే మైకు చేసుకున్నారు. వాహనాలు సీజ్ చేస్తే పాదాలనే వాహనాలుగా చేసుకుని నడకతో ప్రజల మధ్యకొచ్చారు. తన కుప్పం కుటుంబసభ్యులైన పార్టీ కార్యకర్తలపై లాఠీచార్జిని నిరసిస్తూ నడిరోడ్డుపైనే బైఠాయించారు. గాయపడిన కార్యకర్తలను ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. వేలాది మంది పోలీసులు, ఎక్కడికక్కడ ఆంక్షలు, బారికేడ్లతో అడ్డుకున్నా ఆగేది లేదు, తగ్గేది లేదంటూ మూడు రోజుల పర్యటనని దూకుడుగా కొనసాగించారు. తన ప్రచారవాహనాన్ని పోలీసులు తిరిగి ఇవ్వకపోవడంతో స్వయంగా బస్సుపైకి ఎక్కి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తన నియోజకవర్గ ప్రజలని కలిసే హక్కు తనకి లేదా అంటూ తన వాయిస్‌గా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. సర్కారు ప్రాయోజిత పోలీసు నిర్బంధాలను రాష్ట్రమంతటికీ అర్థమయ్యేలా వివరించారు. మూడు రోజుల పర్యటనలో పోలీసులపై తిరగబడాలని పిలుపునివ్వలేదు. ప్రతిపక్షనేతగా తన హక్కుల గురించి ప్రశ్నించారు. తనను అడ్డుకోవడానికి, తన పర్యటనలకు వస్తున్న జనాదరణను చూసి ఓర్వలేని జగన్ చీకటి జీవో తెచ్చారనేది రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేలా వివరించడంలో చంద్రబాబు విజయవంతమయ్యారు.