ఇలాగే  వదిలేస్తే రేపు ఎమ్మార్వోలకు కూడా సలహాదార్లను నియమించేలా ఉన్నార‌ని ఏపీ స‌ర్కారు తీరుపై  హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.  ఐఏఎస్ అధికారులు ఉండగా, వివిధ శాఖలకు సలహాదారుల‌ని ఎందుకు నియ‌మిస్తున్నార‌ని ప్ర‌శ్నించింది. సలహాదారుల నియామక రాజ్యాంగబద్ధతను తేలుస్తామన్న హైకోర్టు వ్యాఖ్యానించింది. సలహాదారుల పూర్తి వివరాలు కోర్టు ముందుంచాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశం జారీ చేసింది. దేవాదాయశాఖకు సలహాదారుగా నియమితులైన శ్రీకాంత్‍పై గతంలో విధించిన స్టే ఉత్తర్వులు సవరిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. వైసీపీ స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత త‌మ అనుయాయులు, సాక్షి సిబ్బంది, ఇత‌ర‌త్రా ఆబ్లిగేషన్ ఉన్న‌వాళ్లంద‌రినీ స‌ల‌హాదారులుగా నియ‌మించేశారు. కొంద‌రు స‌ల‌హాదారులైతే నియామ‌క‌మైన శాఖ‌తో ఎటువంటి సంబంధంలేని వారు కూడా వున్నారు. ఈ నేప‌థ్యంలో హైకోర్టు వ్యాఖ్య‌లు తీవ్ర క‌ల‌క‌లం రేపాయి.

తాను ఏమి చెప్తే అది వినే, వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏపీ ముఖ్య‌మంత్రిగా వుండ‌టం తెలంగాణ‌లో కేసీఆర్ కి చాలా ముఖ్యం. ఏపీ ప్ర‌యోజ‌నాలు కాల‌ద‌న్నీ మ‌రీ తెలంగాణ‌కి మేలుచేసే సీఎం జ‌గ‌న్ మ‌ళ్లీ సీఎం కావాల‌న్న‌దే కేసీఆర్ ఆశ‌యం. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌రిస్థితులు అంత ఆశాజ‌న‌కంగా లేవు. జ‌గ‌న్ పాల‌న‌పై జ‌నం వ్య‌తిరేక‌త తీవ్రం అవుతోంది. త‌న కీలుబొమ్మ జ‌గ‌న్ రెడ్డిని కాపాడాలంటే ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటుని చీల్చాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కేసీఆర్ త‌ల‌పోశారు. ఆంధ్ర‌వాళ్ల‌ను రాక్ష‌సులు అంటూ ఆడిపోసుకున్న కేసీఆర్ టీఆర్ఎస్ పేరుతో ఆంధ్ర‌లో ఓట్లు చీల్చ‌డం కాదు క‌దా అభ్య‌ర్థుల్ని కూడా పెట్ట‌లేడు. అందుకే తెలంగాణ రాష్ట్ర స‌మితి కాస్తా, భార‌త రాష్ట్ర స‌మితిగా మార్చేశారు. ఈ దుకాణం తెలంగాణ దాట‌దు అని అంద‌రికీ తెలుసు. కానీ తాము చెప్పిన‌ట్ట‌ల్లా ఆడే జ‌గ‌న్ ఏపీలో ఓడిపోకూడ‌దంటే ఇక్క‌డి ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఓటు ఎంతో కొంత  చీల్చాలి. టిడిపిది సాలిడ్ ఓటింగ్‌. అది పెర‌గ‌డ‌మే త‌ప్పించి త‌ర‌గ‌దు. టిడిపితో జ‌న‌సేన అల‌యెన్స్ కుదిరితే, ఏపీలో ఎదురులేని విజ‌యం త‌థ్యం. జ‌న‌సేన‌కి ఎక్కువ‌శాతం కాపు ఓట్లు ప‌డ‌తాయి. ఆ ఓట్ల‌ని చీల్చాలంటే కాపు నేత‌ల‌కే గాలం వేయాల‌నేది వైసీపీ బీఆర్ఎస్ కి ఇచ్చిన రోడ్ మ్యాప్‌. అందుకే బీఆర్ఎస్ ఏపీ శాఖ‌లో ఇప్పుడు చేరింది, ఇక‌పై చేరేది కూడా ఎక్కువ‌గా కాపునేత‌లేన‌ని తెలుస్తోంది.

అప్పుచేసి ప‌ప్పు కూడు తింటారంటారు సామాన్య జ‌నం. జ‌గ‌న్ రెడ్డి మాత్రం అప్పుచేసి ఖరీదైన కార్లు కొంటున్నారు. ఉద్యోగుల‌కి స‌కాలంలో జీతాలు ఇవ్వ‌లేదు. కాంట్రాక్ట‌ర్ల‌కి బిల్లులు చెల్లించ‌లేరు. అభివృద్ధి ప‌నుల‌పై వెచ్చించేందుకు రూపాయి కూడా లేద‌ని చెబుతోన్న ప్ర‌భుత్వం జ‌నం సొమ్ము 16 కోట్ల‌తో 19 కొత్త కార్లు కొనుగోలు చేసింది. ఇవి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కోసం అని వేరే  చెప్ప‌క్క‌ర్లేదు. టయోటా ఫార్చ్యూనర్ కంపెనీకి చెందిన‌ 19 హైఎండ్ కార్లు కొనుగోలు చేసిన స‌ర్కారు వాటిని బుల్లెట్ ప్రూఫ్‌గా తీర్చిదిద్దుతోంది. నిరంత‌రం తాడేప‌ల్లి ప్యాలెస్లోనే ఉంటూ, పెళ్లిళ్లు, పేరంటాల‌కు హెలికాప్ట‌ర్లో వెళ్లే జ‌గ‌న్ రెడ్డికి ఈ కొత్త కార్లు ఎందుకో అనేది అంతు చిక్క‌ని ప్ర‌శ్న‌. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన వెంట‌నే కొత్త కాన్వాయ్ కోసం కోట్లు వెచ్చించారు. జిల్లాల ప‌ర్య‌ట‌న కోసం అత్యంత ఖ‌రీదైన బ‌స్సు కొనుగోలు చేశారు. జ‌నం సొమ్ముతో జ‌గ‌న్ విలాస ప్ర‌యాణాల అవ‌స‌రం ఏంట‌ని మేధావులు ప్ర‌శ్నిస్తున్నారు. అయితే విశాఖ నుంచి ప‌రిపాల‌న ఆరంభించాల‌ని, రుషికొండ‌పై క‌ట్టే సీఎం క్యాంప్ ఆఫీసు అడ్డంకులు అధిగ‌మించి పూర్త‌యితే..ఈ కొత్త కాన్వాయ్‌తో కొత్త రాజ‌ధాని విశాఖ‌లో సీఎం ప్రయాణాలు సాగించేందుకు వినియోగిస్తార‌ని స‌మాచారం. మ‌రోవైపు ప‌వ‌న్ క‌ల్యాణ్ కాన్వాయ్ కోసం న‌లుపు రంగు వాహ‌నాలు తెప్పించ‌డం, పోటీగా జ‌గ‌న్ జ‌నం సొమ్ముతో ఇవి తెప్పించారని మ‌రో వాద‌నా వినిపిస్తోంది.

ఏపీలో కేసీఆర్ బీఆర్ఎస్ విస్త‌ర‌ణ జాతీయ పార్టీగా నిల‌దొక్కుకోవ‌డానికి కాద‌ట‌. కేవ‌లం త‌న ర‌హ‌స్య స్నేహితుడు జ‌గ‌న్ రెడ్డి మేలు కోస‌మేన‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశానికి తిరుగులేద‌ని, జ‌న‌సేన జ‌త‌క‌డితే క్లీన్ స్వీప్ అయినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని ఈ మిత్రుల స‌ర్వేలో తేలింది. టిడిపిని ఈ ప‌రిస్థితుల్లో దెబ్బ‌కొట్ట‌లేమ‌ని, ఎన్నో కుతంత్రాలు ప‌న్నితే 2019లో 40 శాతం ఓటింగ్ ఉంద‌ని ఇది పెరుగుడే కానీ, త‌రిగే అవ‌కాశం లేద‌ని నిర్ణ‌యించుకున్నారు. టిడిపితో జ‌న‌సేన క‌లిస్తే 65 శాతం ఓటింగ్ కొల్ల‌గొట్టే చాన్స్ ఉంద‌ని వీరి లెక్క‌లు. జ‌న‌సేన‌ని టార్గెట్ చేయ‌డం, కాపుల ఓటుబ్యాంకు చీలితే వైసీపీకి క‌లిసొస్తుంద‌ని వీరి వ్యూహం. దీని కోస‌మే బీఆర్ఎస్ ఏపీ కార్య‌క‌లాపాలు ఆరంబిస్తున్నారు. కేవ‌లం కాపుల‌ని, జ‌న‌సేన‌కి ద‌గ్గ‌ర‌య్యేవారినే బీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారు. వైసీపీ నుంచి ఎవ‌రైనా చేరుతామ‌న్నా కేసీఆర్ తిర‌స్క‌రిస్తున్నార‌ని స‌మాచారం. ఈ విష‌యాన్ని ఏపీ బీజేపీ మాజీ అద్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఇదే అంశంపై మాట్లాడారు. జగన్-కేసీఆర్ కుట్రలో భాగంగానే భారాసలోకి ఏపీ నేతలు వెళ్తున్నార‌ని పేర్కొన్నారు. ఏపీలో పవన్, తెలంగాణలో బండి సంజయ్ ను బలహీనం చేసే కుట్ర ఇద‌ని తెలిపారు. జ‌గ‌న్ కోసం ప‌వ‌న్ క‌ళ్యాన్‌ని దెబ్బ‌కొట్టేందుకు కేసీఆర్ భారాస కాపు నేతలపై దృష్టి పెట్టింద‌ని సంచ‌ల‌న విష‌యాల‌ను బ‌య‌ట పెట్టారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి తాము అండ‌గా వుంటామ‌ని ప్ర‌క‌టించారు.

Advertisements

Latest Articles

Most Read