వైసీపీ అప్రతిహత గెలుపు తరువాత వైఎస్ జగన్ రెడ్డి మాటే శాసనంగా ప్రభుత్వం, పార్టీలోనూ కొన్నాళ్లు హవా సాగింది. ప్రభుత్వంలో నియంతృత్వ వైఖరి చెల్లుబాటు అవుతున్నా, పార్టీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. వారిని ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో జగన్ ఉన్నారు. ఎవరిపైనైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే పార్టీ మారుతారనే భయం ఉంది. పాలన తీరు బాగా లేదని రోజుకొక ఎమ్మెల్యే బాహాటంగానే ఆరోపిస్తున్నారు. వీరిపై చర్యలు తీసుకునేందుకు జగన్ వెనకాడుతున్నారు. ఒక్కరిపై చర్యలు తీసుకున్నా ప్రభుత్వంలోనూ పాల్పడిన అవినీతి, అక్రమాలు, అరాచకాలు వారు బయటపెడతారనే భయంతో జగన్ వెనకడుగు వేస్తున్నారని సమాచారం. ఎంపీ రఘురామకృష్ణంరాజుతో అసమ్మతిస్వరాలు మొదలయ్యాయి. ఆర్ఆర్ఆర్ పై సీఐడీ ప్రయోగించి థర్డ్ డిగ్రీ ప్రయోగించగలిగారే కానీ పార్టీ పరంగా ఏం చర్యలూ తీసుకోలేకపోయారు. తాజాగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, డీఎల్ రవీంద్రారెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డిలు ప్రభుత్వ తీరుపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు జగన్ జంకుతున్నారు. అయితే వైఎస్ జగన్ రెడ్డి తన పార్టీ మీద పూర్తిగా పట్టు కోల్పోయారని, అందుకే తన పాలనను ఘోరంగా విమర్శిస్తున్నా ఎవరిపైనా చర్యలు తీసుకోలేకపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకరిపై చర్యలు ఆరంభిస్తే, వీరంతా కలిసి పార్టీ మారే అవకాశం ఉందనే భయమూ జగన్ రెడ్డి భయానికి మరో కారణమని విశ్లేషణలున్నాయి.
news
జగన్ పదే పదే చెప్పే జడ్జీ కథ కాదు.. ఆయన సొంత కధ అంటున్న టిడిపి...
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షనేతగా వున్నప్పుడు బహిరంగసభలలో ఓ జడ్జీ కథ చెప్పేవాడు. వాస్తవంగా ఇది ఓ హంతకుడి కథ. కానీ జడ్జి కథగా చెబుతారు. సీఎం అయ్యాక కూడా ఆరు నెలలకోసారి ఈ కథ చెబుతాడు. కథ ఏంటంటే జడ్జీకి బోనులో ముద్దాయి ఇలా మొరపెట్టుకుంటాడు. ``తల్లిదండ్రిలేని ఈ అభాగ్యుడిని కరుణించండి జడ్జీ గారూ`` అని. ఈ ముద్దాయికి తల్లిదండ్రి లేరా? అని ప్రాసిక్యూషన్ వారిని జడ్జి ప్రశ్నిస్తారు. ``మిలార్డ్ ఈ ముద్దాయి అమ్మానాన్నలను అతి కిరాతకంగా చంపేశాడు, ఆ కేసు మీరు విచారిస్తున్నారు`` అని వివరిస్తారు. అంటే తన తల్లితండ్రులను చంపేసినవాడు ఆ విషయాన్ని దాచి పెట్టి అమ్మానాన్నలు లేని అనాథని కరుణించాలని న్యాయమూర్తిని తప్పుదారి పట్టించి శిక్ష తప్పించుకోవాలని చూస్తాడు. జగన్ ఈ కథ ఎంచుకోవడానికి కారణం..అది ఆయన జీవిత కథ. తాను చేసేవాటిని ఎదుటివాళ్లపై రుద్దడంలో జగన్ నాటకాలు ఏ రేంజులో వుంటాయో తెలుగునేలకు సుపరిచితం. తండ్రి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే రిలయన్స్ వాళ్లు చంపేశారని వారి ఆస్తులన్నీ తగలబెట్టించేశారు. తన తండ్రిని చంద్రబాబు, సోనియా రిలయన్స్ వాళ్లతో కలిసి చంపేశారని ఆరోపించారు. తండ్రి శవంతో సింపతీ కొట్టేసి సీఎం కావాలని సంతకాలు సేకరించారు. తండ్రి మరణవార్త తట్టుకోలేక వేలాది మంది చనిపోయారు. జగన్ ఇంట్లో వాళ్లలో ఒక్కరికి జలుబు కూడా చేయలేదు. కట్ చేస్తే అదే రిలయన్స్ వాళ్లకు జగన్ రాజ్యసభ సీటు కానుకగా ఇచ్చాడు. తన తండ్రిని రిలయన్స్ వాళ్లు చంపారని చెప్పిన జగన్, వారికి రాజ్యసభ సీటు గిఫ్ట్ ఇచ్చారంటే..తండ్రిని చంపించింది తనయుడే అని అందరికీ డౌట్ వచ్చింది. తండ్రి చనిపోయాక తల్లి విజయలక్ష్మి ``తండ్రిలేని బిడ్డని మీకు అప్పగిస్తున్నాను`` అంటూ కన్నీటితో ఓటర్లను వేడుకుంది. ఇక్కడ జడ్జి పాత్రలో జనం ఉంటే.. బోనులో ముద్దాయి పాత్ర జగన్ ఉన్నారు. బాబాయ్ ని అత్యంత ఘోరంగా చంపేసి, చంద్రబాబు చంపేశారని నారాసుర రక్తచరిత్ర అంటూ తనది కాని సాక్షి పేపరులో రాయించారు. మా బాబాయ్ ని ఘోరంగా చంపేశారంటూ ఓట్లు అడుక్కున్న ముద్దాయి జీవితమే జగన్ చెప్పే ఈ కథ అని జనాలకి ఇప్పటికి అర్థమైంది.
ఈ రోజు చంద్రబాబు అరెస్ట్ ? కారణం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి నేతల గృహనిర్బంధం...
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన హీట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు మూడు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా, నిన్న మొదటి రోజు కుప్పం అట్టుడుకింది. పోలీసులు సృష్టించిన హడావిడితో, లేని సమస్యలు తలెత్తాయి. అయితే ఈ రోజు రెండో రోజు చంద్రబాబు కుప్పంలో తెలుగుదేశం నేతలతో అనేక సమీక్షలు చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారు పోలీసులు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ముఖ్యమైన నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. ఈ రోజు టిడిపి ఎలాంటి నిరసనకు పిలుపు ఇవ్వలేదు. కేవలం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే, తెలుగుదేశం పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే, పోలీసులు చర్యల పై తెలుగుదేశం పార్టీ నేతలకు అనుమానం కలుగుతుంది. చంద్రబాబుని ఈ రోజు ఏమైనా అరెస్ట్ చేస్తారా ? లేదా ఇంకా ఏమైనా ప్రభుత్వం తరుపున ప్లాన్ చేసారా ? అందుకే ముందు జాగ్రత్తగా టిడిపి నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారా అనే అనుమానాలను టిడిపి శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. కేవలం ముందస్తు చర్యల్లో భాగంగానే టిడిపి నేతలను అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు చెప్తున్నా, అసలు సందర్భం లేకుండా ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఏపిలో బయట పడ్డ ఓట్ల తొలగింపు స్కాం... ఉరవకొండలో టిడిపి ఓట్లు 6 వేలు గల్లంతు.. 174 నియోజకవర్గాల్లో ఇంకెన్నో
పక్కా తెలుగుదేశం అభ్యర్థులకు పడతాయనుకునే ఓట్లని లక్ష్యంగా చేసుకుని తప్పుడు పత్రాలతో ఓట్లు తొలగించారనే ఆరోపణలున్నాయి. అయితే ఒక్క ఉరవకొండ నియోజకవర్గంలోనే ఆరువేలకు పైగా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగించారంటే, 174 నియోజకవర్గాల్లో ఇంకెన్ని తొలగించి ఉంటారో అనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఓట్ల తొలగింపుపై ఉరవకొండ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ సీఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి నేరుగా క్షేత్రస్థాయి దర్యాప్తునకు బృందాన్ని పంపించింది. తన నియోజకవర్గంలో మొత్తం 6 వేల ఓట్లు తొలగించారని పయ్యావుల ఆరోపిస్తున్నారు. కొందరి సంతకాలు ఫోర్జరితో ఓట్లు తొలగించారని, కొందరికి బోగస్ నోటీసులు ఇచ్చినట్టు సృష్టించారని మండిపడ్డారు. బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల తొలగింపుపై టీడీపీ తరపున కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని పయ్యావుల కేశవ్ హెచ్చరించారు. నియోజకవర్గంలో గత ఎన్నికల్లో గెలుపు ఓటములు శాసించిన మార్జిన్ కంటే ఎక్కువ టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగించారని చాలా రోజులుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పయ్యావుల కేశవ్ ఫిర్యాదుతో ఈ ఓట్ల తొలగింపు స్కాం డొంక కదులుతోంది.