ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రతిపక్ష నేత, 14 ఏళ్ళు సియంగా చేసిన వ్యక్తి ఏమి జరిగిందో తేల్చండి అని డీజీపీకి ఉత్తరాలు రాస్తుంటే, మీరు ఆధారాలు ఇవ్వండి అంటూ ఎదురు చంద్రబాబుకే సమాధానం చెప్పటం కొత్త పరిణామం. తాజాగా చంద్రబాబుకి పోలీసులు నోటీసులు జారీ చేసారు. వారం రోజులు క్రితం, చిత్తూరు జిల్లాలో, ఓం ప్రాతాప్ అనే ఆటో డ్రైవర్, లిక్కర్ మాఫియాని ప్రశ్నిస్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో పెట్టారు. అయితే ఆ వీడియోలో కొన్ని పరుష పదాలు కూడా వాడారు. ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది. అయితే మరుసటి రోజే, ఓం ప్రతాప్ చనిపోయారు. ముందుగా ఆయన ఆ-త్మ-హ-త్య చేసుకుని చనిపోయారని చెప్పారు. అయితే తరువా కొద్ది సేపటికి అనారోగ్యం మృతి చెందారని అన్నారు. అయితే స్థానికంగా మాత్రం, కొంత మంది వ్యక్తులు అంతకు ముందు రోజు సాయంత్రం, తన ఇంటికి వచ్చి బెదిరించారని, భయపడి ఆ-త్మ-హ-త్య చేసుకున్నారు అంటూ కధనాలు వచ్చాయి. అయితే ఇందులో మంత్రి పెద్ది రెడ్డి హస్తం ఉంది అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. అలాగే స్థానిక ఎంపీ రెడ్డప్ప హస్తం కూడా ఇందులో ఉంది అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపించింది.

cbn 201092020 2

మంత్రి పెద్దిరెడ్డి దీని వెనుక ఉన్నారని, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు డీజీపీకి లేఖ రాసారు. అలాగే ఓం ప్రతాప్ ఫోన్ చూస్తే ఎవరు ఫోనులు చేసి బెదిరించింది తెలిసిపోతుందని లేఖలో రాసారు. అంతే కాదు, మృతదేహంకి పో-స్ట్ మా-ర్టం చెయ్యాలని కోరారు. అయితే అనుమానాస్పద మృ-తి అయినా, పోలీసులు పో-స్ట్ మా-ర్టం చెయ్యకపోవటంతో తెలుగుదేశం పార్టీ గట్టిగా పోరాడటంతో, పూడ్చి పెట్టిన శ-వా-న్ని తీసి పో-స్ట్ మా-ర్టం చేసారు. ఇదంతా జరుగుతూ ఉండగా, ఇప్పుడు చంద్రబాబుకి చిత్తూరు జిల్లా మదనపల్లి పోలీసులు నోటీసులు జారీ చేసారు. మదనపల్లి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి, చంద్రబాబుకు సీఆర్​పీసీ 91 నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు డీజీపీకి రాసిన లేఖ ప్రస్తావిస్తూ, సాక్ష్యాలు అన్నీ తమకు ఇవ్వాలని కోరారు. నోటీసులు అందిన వారం లోపు తమ కార్యాలయానికి హాజరు అయ్యి, ఈ కేసు విషయం పై మీ దగ్గర ఉన్న సమాచారం, సాక్ష్యాలు ఇవ్వాలని నోటీసుల్లో తెలిపారు. అయితే ఈ నోటీసులు పై టిడిపి ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి పీపీఏల విషయంలో వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. అటు కోర్టుల్లోనూ, ఇటు కేంద్రం వద్ద, మరో పక్క వివిధ దేశాలు కూడా జగన్ సర్కార్ తీరు పై అభ్యంతరం చెప్తున్నాయి. సహజంగా విద్యుత్ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వాలతో 20-25 ఏళ్ళు ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. అయితే ఇలాంటి ఒప్పందాలను సమీక్షిస్తే, కంపెనీలు ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోతాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారు వెనకడుగు వేస్తారు. అలా అని రాష్ట్రం నష్టపోకూడదు. అయితే పెట్టుబడుల వాతావరణాన్ని దెబ్బ తియ్యకూడదు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో కుదుర్చుకున్న ఒప్పందలాను, కొత్తగా వచ్చిన జగన్ ప్రభుత్వం సమీక్ష చేస్తాను అని చెప్పటంతో, ఇండస్ట్రీలో కలకలం రేగింది. దాదాపుగా 40కి పైగా కంపెనీలు హైకోర్టుకు వెళ్ళాయి. కోర్టు కూడా వీరికి అనుకూలంగానే తీర్పు ఇచ్చింది. ఇక కేంద్రం కూడా ఈ చర్య పై ఆగ్రహం వ్యక్తం చేసింది. జపాన్ లాంటి దేశాలు, ఏపి ప్రభుత్వం పై కేంద్రానికి ఫిర్యాదు చెయ్యటంతో, కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని వారించింది. అయితే ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత వెనక్కు తగ్గింది. అన్ని ఒప్పందాలను సమీక్ష చెయ్యం అని, ఎక్కడైతే అవినీతి జరిగిందనే సమాచారం ఉందో అక్కడే చేస్తాం అని చెప్పింది.

ntpc 01092020 2

ఇది ఇలా జరుగుతూ ఉండగానే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర సంస్థ అయిన ఎన్టీపీసీ కూడా షాక్ ఇచ్చింది. ఎన్టీపీసీతో 2008లో, 2010లో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇప్పుడు విద్యుత్ చాలా చౌక అయిపోయిందని, ఆ రేటుకు మేము ఇవ్వలేమని, ఎన్టీపీసీతో చేసుకున్న ఒప్పందం రద్దు చేసుకుంటాం అంటూ, రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీపీసీకి లేఖ రాసింది. అయితే ఎన్టీపీసీ తాజగా దీనికి నో అని చెప్పేసింది ఇప్పటికే గతంలో కేంద్ర ప్రభుత్వం, విద్యుత్ ఒప్పందాలను గౌరవించాల్సిందే అని చెప్పటంతో, కేంద్రానికి చెందిన ఎన్టీపీసీ కూడా, రాష్ట్ర ప్రభుత్వానికి అదే సమాధానం చెప్పింది. దీంతో ఎన్టీపీసీతో ఒప్పందం రద్దు చేసుకుందాం అనుకున్న ఏపికి ఎదురు దెబ్బ తగిలింది. కొన్ని రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్టు విద్యుత్ ఒప్పందాల పై వైఖరి ప్రదర్శిస్తూ ఉండటంతో, కేంద్రం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఒక బిల్లుని తీసుకువచ్చే ప్రయత్నాలలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఒక రకంగా చూసుకుంటే ఇలాంటి చర్యలు పెట్టుబడి వాతావరణం దెబ్బ తీసెదే అయినా, రాష్ట్ర ప్రభుత్వాల పై పడే భారం కూడా చూసుకోవాలి.

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ అయిపోయాయి. ఇసుక లేక ఆగిపోయిన నిర్మాణలతో మొదలైన ఆదాయం తరుగుదల, కరోనాతో తారా స్థాయికి చేరుకుంది. ఇక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారు లేక, ఆదాయం లేకుండా పోయింది. ఇలా అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు తగ్గిపోయాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదాయం పెంచుకునే మార్గాలు కాకుండా, డబ్బులు పంచి పెట్టే సంక్షేమ పధకాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో ఆదాయ మార్గాలు లేకుండా పోయాయి. ఇక మరో పక్క కేంద్రం కూడా జీఎస్టీ పరిహారం ఇవ్వం అంటూ చేతులు ఎత్తేసింది. ప్రతి నెల మొదటి వారంలో, జీతాలు ఇవ్వటానికి కూడా ప్రభుత్వం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోయిన నెలలో జీతాలు లేట్ అయ్యాయి. అప్పు పుట్టిన తరువాత జీతం ఇచ్చారని, కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ నెల కూడా ఇలాగే ఉండే పరిస్థితి ఉంది. ఇక ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అప్పులతో నెట్టుకుని వస్తుంది. ఇప్పటికే ఈ 15 నెలల్లో లక్ష కోట్లు అప్పు చేసారని, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆర్ధిక సంవత్సరం మూడు నెలలు కాలానికే 30 వేల కోట్లు పైగా అప్పు చేసారని కాగ్ రిపోర్ట్ చెప్తుంది. ప్రతి ఒక్కరి తల పై ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత, ఏడాదికి 20 వేల రూపాయల అదనపు భారం పడిందని తెలుగుదేశం లెక్కలతో ఆరోపిస్తుంది.

jagan 01092020 2

ఈ నేపధ్యంలో, జగన్ మోహన్ రెడ్డికి బిగ్ రిలీఫ్ ఇచ్చే న్యూస్ ఇది అనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచుకునే అవకాసం ఇవ్వటంతో, రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ ఖుషీగా ఉంది. అయితే వీటి కోసం కేంద్రం కొన్ని షరతులు విధించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, ఎన్ని షరతులకైనా ఒప్పుకునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు రాష్ట్ర జీఎస్‌డీపీలో 3.5 శాతం మాత్రమే అప్పు తీసుకునే వీలు ఉంది. అయితే కేంద్రం పెట్టిన కొత్త పరిమితి ప్రకారం, ఇప్పుడు ఇది 5 శాతానికి పెరగనుంది. అంటే దాదపుగా 20 వేల కోట్లు అదనపు అప్పు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే వీలు ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, వెంటనే దీనికి సంబందించిన ఆర్డినెన్స్ ను తయారు చేసి, గవర్నర్ వద్దకు పంపినట్టు, అలాగే గవర్నర్ కూడా దీన్ని ఆమోదించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఆర్దినెన్స్ ను కేంద్రం కూడా ఆమోదించాల్సి ఉంటుంది. ఇది కచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి భారీగా ఊరటను ఇచ్చే అంశం అయినా, రాష్ట్రానికి , రాష్ట్ర ప్రజలకు మాత్రం ఇది అదనపు భారమే. ఎందుకంటే ఈ తీసుకునే అప్పుతో ఆదాయం పెంచే మార్గాలు, ప్రభుత్వాలు చేస్తాయా అంటే, సందేహమే.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖపట్నంలోని నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్ కేసు పై, హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. మాస్కులు అడిగినందుకు ఆయన్ను సస్పెండ్ చెయ్యటం, తరువాత జరిగిన పరిణామాలు, రోడ్డు మీద పడేసి కొట్టటం, పిచ్చోడు అని చెప్పటం, ఇలా అనేక మలుపులు తిరిగిన ఈ కేసు పై హైకోర్టు సుమోటోగా తీసుకుని, సిబిఐకి ఇచ్చింది. ఈ కేసు పై సిబిఐ ఇప్పటికే విచారణ ప్రారంభించింది. డాక్టర్ సుధాకర్, ఆయన బంధువులు, పని చేసిన హాస్పిటల్, ట్రీట్మెంట్ తీసుకున్న హాస్పిటల్, పోలీస్ స్టేషన్, ఇలా అనేక చోట్ల విచారణ చేసింది. ఈ విచారణ ఇంకా జరుగుతూనే ఉంది. అయితే హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం, ఈ కేసు పై నివేదిక హైకోర్టుకు నవంబర్ 11 నే సమర్పించాల్సి ఉంది. అయితే దీని పై ఈ రోజు సిబిఐ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. డాక్టర్ సుధాకర్ కేసులో కుట్ర కోణం ఉంది అంటూ, హైకోర్టుకు సంచలన విషయం చెప్పింది సిబిఐ. ఈ కేసు పై ఇంకా లోతుగా దర్యాప్తు చెయ్యాల్సి ఉంది అంటూ, సిబిఐ హైకోర్టుకు తెలిపింది. దీని పై దర్యాప్తుకు మరింత సమయం కావాలని హైకోర్టుకు తెలిపింది. ఈ రోజు డాక్టర్ సుధాకర్ కేసు పై విచారణ సందర్భంగా, సిబిఐ ఈ విషయాన్ని కోర్టుకు తెలిపింది.

doctor sudhakar 01092020 2

అలాగే ప్రభుత్వం నియమించిన న్యాయవాది, సిబిఐ న్యాయవాది అభిప్రాయాలు కూడా హైకోర్టు అడిగి తెలుసుకుంది. అయితే ఈ కేసులో కుట్ర కోణం ఉందని సిబిఐ చెప్పటం, ఆ కుట్ర కోణం ఏమిటో వెలికి తియ్యాలి అని సిబిఐ చెప్పి, దానికి కొంచెం సమయం అడగటంతో, సిబిఐ చేసిన విజ్ఞప్తిని హైకోర్టు ఒప్పుకుంది. ఈ కేసులో సిబిఐ చెప్తున్న కుట్ర కోణం ఏమిటో వెలికి తియ్యాలని హైకోర్టు, సిబిఐ ని ఆదేశిస్తూ మరింత గడువు ఇచ్చింది. అలాగే ఈ కేసులో పూర్వాపరాలు, ఇప్పటి వరకు చేసిన దర్యాప్తు, తదితర వివరాలు అన్నీ, తమకు నవంబర్ 11 వ తేదీ లోపు నివేదించాలని, హైకోర్టు సిబిఐని ఆదేశించింది. అదే విధంగా ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 16 వ తేదీకి వాయిదా వేసింది. సిబిఐ మరింత గడువు అడగటంతో, హైకోర్టు ఈ కేసు పై, మరో రెండు నెలల గడువుని సిబిఐకి అప్పచెప్పింది. అయితే సిబిఐ చెప్పిన కుట్ర కోణం ఏమిటి అనేది ఇప్పుడు చర్చకు దారి తీసింది. గతంలోని ఈ కేసు పై అనేక అనుమానాలు ఉన్నాయి. అధికార పార్టీలోని కొంత మంది వ్యక్తులు దీని వెనుక ఉన్నారని, డాక్టర్ సుధాకర్ తల్లి, ఆరోపించిన సంగతి తెలిసిందే.

Advertisements

Latest Articles

Most Read