ఈ రోజు ఢిల్లీలో, దేశవ్యాప్తంగా నదుల అనుసంధానంపై నేడు జాతీయ జల అభివృద్ధి సంస్థ సమావేశం నిర్వహించింది. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అధ్యక్షతన జరగిన సమావేశంలో గోదావరి-కావేరి నదుల అనుసంధానం పై ప్రధానంగా చర్చించారు. ఈ భేటీకి ఏపీ మంత్రి దేవినేని ఉమా కూడా హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో, దేశంలోనే మొట్టమొదటి సారి, నదుల అనుసంధానం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, చంద్రబాబుని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఉమా విలేకరులతో మాట్లాడుతూ, గోదావరి-కావేరి అనుసంధానానికి ముందు నీటి లభ్యత లెక్కించాలని, పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని కోరామన్నారు. పోలవరానికి కేంద్రం రూ.2700 కోట్లు రీయింబర్స్ మెంట్ చేయాలని డిమాండ్ చేశారు. నదుల అనుసంధానం కలను మొదటి సారిగా సాకారం చేసిన చంద్రబాబు విధానాలని మేచ్చుకున్నట్టు చెప్పారు.

pattiseema 20082018 2

గోదారమ్మ, కృష్ణమ్మ ను అనుసంధానం చేసి, పోలవరం కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణా నీటిని మళ్ళించి, డెల్టా రైతులకు; అటు శ్రీశైలం నుంచి హంద్రీనీవా ద్వారా రాయలసీమకు నీరు ఇవ్వాలి అన్న చంద్రబాబు ఆశయం నెరవేరి, దేశంలోనే మొదటి నదుల అనుసంధాన ప్రాజెక్ట్ గా పట్టిసీమ మొదటి స్థానంలో నిలిచింది. ఈ దేశంలో ఎందరో నదులు అనుసంధానం చెయ్యాలి అని కలలు కన్నారు, కాని చంద్రబాబు నిజం చేసి చూపించారు. చంద్రబాబు ముందు చూపుతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్ట్, గత మూడు సంవత్సరాలు నుంచి మంచి ఫలితాన్నే ఇచ్చింది. రాష్ట్ర రైతులని ఆదుకోవటానికి, ఎన్ని విమర్శలు వచ్చినా చంద్రబాబు ముందుకు వెళ్లారు. ఒక పక్క కృష్ణా నదికి వచ్చే నీరు తగ్గిపోవటం, ఎగువ రాష్ట్రాల పేచిలతో, కృష్ణా నది నీటి కేటాయింపులు బాగా తగ్గిపోయిన నేపధ్యంలో, పట్టిసీమ ఒక సంజీవినిలా వచ్చి రైతులని ఆదుకుంది.

pattiseema 20082018 3

అయితే, ఇప్పుడు నదుల అనుసంధానాన్ని కేంద్ర జల సంఘం ప్రత్యేకంగా కసరత్తు చేస్తోంది. ఇందుకు పట్టిసీమ ఎత్తిపోతలను నమూనాగా ఎంచుకుంది. రాష్ట్రాల మధ్య నదులను అనుసంధానం చెయ్యటానికి, ఆయా రాష్ట్రాలు అభ్యంతరం చెప్తున్న పరిస్థితుల్లో, ఆంధ్రప్రదేశ్ లోని పట్టిసీమ తరహాలో, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అంతర్గత అనుసంధానంపై తొలుత దృష్టి సారిస్తే కొంత ఫలితం వస్తుందని కేంద్ర జలసంఘం, కేంద్ర జలవనరులశాఖ భావిస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర జల సంఘానికి చెందిన ఒక ఒక బృందం ఈ కసరత్తులో భాగంగా పట్టిసీమ ఎత్తిపోతలను సందర్శించింది.

పిఠాపురం ఎమ్మెల్యే ఎస్ వి ఎస్ ఏన్ వర్మ, నిన్న తన నియోజకవరంగలో గ్రామదర్శిని కార్యక్రమంలో ఉండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి వచ్చిన ఫోన్ కాల్ తో, అక్కడ అందరూ అలెర్ట్ అయ్యారు. ఎమ్మెల్యే ఎస్ వి ఎస్ ఏన్ వర్మ నిన్న, గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా, బి.ప్రత్తిపాడు గ్రామంలో పర్యటించి, ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండగా, తన సెల్ ఫోన్ కి, ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఫోన్ వచ్చింది. గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా, బి.ప్రత్తిపాడు గ్రామంలో పర్యటన చేస్తున్నాను అని ఎమ్మెల్యే చంద్రబాబుకి చెప్పగా, చంద్రబాబు స్పీకర్ ఆన్ చెయ్యమని చెప్పారు. నేను అక్కడ ఉన్న గ్రామస్తులతో మాట్లాడాలి, స్పీకర్ ఆన్ చెయ్యండి అని కోరారు.

varma 200082018 2

ఈ సందర్భంగా, చంద్రబాబు అక్కడ ఉన్న గ్రామస్తులతో మాట్లాడతూ, అన్ని పధకాలు సకాలంలో అందుతున్నాయా లేదా అని ఆరా తీసారు. మిగతా సమస్యలు కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఎమ్మల్యేతో మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న పధకాల గురించి, ప్రజలకు వివరించాలని, వాళ్లకు ఏ సమస్య ఉన్నా పరిష్కరించాలని కోరారు. తెలుగుదేశం సానుభూతి పరులే కాకుండా, అన్ని వర్గాల వారిని ఆకట్టుకోవాలని, అర్హులకు ప్రభుత్వం అందించే అన్ని పధకాలు అందేలా చూడాలని అని అన్నారు. అలాగే మహిళా సంఘాలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, వారిని బలోపేతం చెయ్యాలని కోరారు.

varma 200082018 3

దీనికి ఎమ్మల్యే స్పందిస్తూ, అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే మహిళా సంఘాలతో సమావేశం అయినట్టు, ముఖ్యమంత్రితో చెపారు. బి.ప్రత్తిపాడు గ్రామంలో పోయిన ఎన్నికల్లో 1800 ఓట్లు వచ్చాయని, ఈ సారి వచ్చే ఎన్నికల్లో 2300 దాకా తెలుగుదేశం పార్టీకి వస్తాయని, ముఖ్యమంత్రికి చెప్పారు. సాధికార మిత్ర, మహిళా సంఘాలు, బూత్ కమిటీలతో సమన్వయం చేసుకుంటూ, ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. అయితే, ముఖ్యమంత్రి అనుకోకుండా ఫోన్ చెయ్యటం, స్వయంగా తమతో మాట్లాడటంతో, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రికి మాకు ఉన్న సమస్యలు చెప్పమని, ఎమ్మల్యే చొరవతో, అవి పుర్తవుతాయనే నమ్మకం ఉందని అన్నారు.

ప్రార్థించే పెద‌వుల‌క‌న్నా.. సాయం చేసే చేతులు మిన్న అనే నినాదాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉద్యోగస్తులు నిజం చేసి చూపించారు. ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల‌తో జీవ‌నం చిధ్ర‌మై..బ్ర‌తుకు భార‌మై క‌న్నీటి క‌డ‌లిలో దేవుడా నీవే దిక్కు అంటూ స‌ర్వం కోల్పోయి రోడ్డున ప‌డ్డ కేర‌ళ వ‌ర‌ద బాధితుల ద‌య‌నీయ దుస్తితి చూసి ఉద్యోగస్తులంద‌రూ చ‌లించిపోయారు. త‌మ‌వంతుగా కేర‌ళ ప్ర‌జ‌ల‌కు సాయం చేయాల‌ని త‌లంచారు. ఆలోచ‌న వ‌చ్చిందే త‌డ‌వుగా పెద్ద మ‌న‌సుతో త‌మ సేవా త‌త్ప‌ర‌త‌ను చాటుకున్నారు. కేరళ వరద బాధితులకు ఏపీ ఎన్జీవో జేఏసీ రూ. 20 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. ఉండవల్లిలో ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసిన ఎన్జీవో నేతలు ఆ మేరకు అంగీకార పత్రం అందజేశారు. ఎన్జీవో జేఏసీ నేతలు అశోక్ బాబు, జోసఫ్ సుధీర్ ల నేతృత్వంలో ఎన్జీవో నేతలు సీఎంను కలిసారు.

kerala 20082018 2

విజయవాడలో ఏపీ ఎన్జీవో హోం లో సమావేశమై కేరళ వరద బాధితులకు ఏపీ ఎన్జీవో జేఏసీ తరఫున రూ. 20 కోట్లు విరాళం ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. కేరళ లో భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలం అవడంపట్ల సానుభూతితో విరాళాలు ఇవ్వడానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, పించనుదార్లు ఏకపక్షంగా ముందుకు వచ్చారని తెలిపారు. రాష్ట్రంలో 4.1లక్షల ఉద్యోగులు,మరో 4 లక్షల పించనుదార్లు విరాళాలు ఇవ్వటానికి సుముఖత తెలిపారన్నారు. ఎన్జీవో జేఏసీ సభ్యుల ఆగస్టు నెల జీతంలో ఈమేరకు మినహాయించాలని ముఖ్యమంత్రికి అందజేసిన అంగీకార పత్రంలో పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి జమ చేసి అక్కడి నుంచి కేరళ వరద బాధితుల సహాయార్థం పంపించాలని కోరారు.

kerala 20082018 3

మరో పక్క, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఐఏఎస్ అధికారులు కూడా స్పందించారు. కేరళ వరద బాధితులకు ఒకరోజు వేతనం విరాళంగా ఇస్తున్న‌ట్లు ఏపి ఐఏఎస్ అధికారుల సంఘం ప్ర‌క‌టించింది. ఈ మేరకు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. కేరళలో జరిగిన వరద బీభత్సానికి ఐఏఎస్‌లు అంద‌రూ త‌మ ప్రగాఢ సానుభూతి వ్య‌క్తం చేశారు. కేరళ ప్రజలకు సంఘీభావం ప్రకటించారు. వ‌రద బాధితులకు అండగా ఆపన్న హస్తం అందించేందుకు తాము ముందుంటామ‌ని ఏపి ఐఏఎస్‌లు ధీమా వ్య‌క్తం చేశారు. స‌హాయ పునరావాస చర్యలలో తమవంతుగా సహాయ సహకారాలు అందిస్తామని వెల్ల‌డించారు. మ‌రోవైపున కేరళ వరద బాధితుల సహయార్ధం కేరళ ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికి కృష్ణాజిల్లా అధికారులు వారి ఒకరోజు వేతనాన్ని స్వచ్ఛందంగా అందించాలని జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం విజ్ఞప్తి చేశారు. ఆయ‌న విజ్ఞ‌ప్తి మేర‌కు స్వచ్ఛందంగా ఒక రోజు వేతనాన్ని ఇవ్వడానికి జిల్లా అధికారులంతా ముందుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్ బి.ల‌క్ష్మీకాంతం త‌మ వంతు విరాళంగా రూ.25 వేలు ఆర్థిక సాయాన్ని శ‌నివారం ప్ర‌క‌టించారు.

వామపక్ష పార్టీలు అసలు ఉన్నాయో లేవో తెలియని పరిస్థితి.. మన రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే అత్యంత దయనీయ పరిస్థితిలో ఉన్నారు. మన రాష్ట్రంలో అయితే, 2009 తరువాత దాదాపుగా కనుమరుగు అయిపోయారు. ఇంకా కోలుకునే అవకాసం కూడా ఎక్కడ కనిపించటం లేదు. ఇలాంటి ప్రజలు తిరస్కరించిన పార్టీతో, కలిసి వెళ్తున్నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వీరు అందరూ కలిసి, ముఖ్యమంత్రి అయిపోతాం అని చెప్తున్నారు. ఇది పక్కన పెడితే, పవన్ కి ఫ్యాన్స్ ఇమేజ్ వాడుకుని, మళ్ళీ బలపడాలని ఆరాట పడుతున్నాయి కమ్యూనిస్ట్ పార్టీలు. జనసేన పార్టీతో వచ్చే ఎన్నికల్లో పొత్తుకు సిద్ధమయ్యాయి. ఈ నేపధ్యంలోనే, వచ్చే ఎన్నికల్లో సీట్లు కోసం ఇప్పటి నుంచే స్కెచ్ వేస్తున్నారు.

pk 20082018 2

క్షేత్ర స్థాయిలో ఎలాంటి విధా నాలు అవలంభించాలి...?ఎన్ని సీట్లు కోరాలి..? ఏ విధంగా ఒత్తిడి పెంచాలి అనే అంశంపై రాష్ట్ర నాయకత్వాలు కసరత్తు చేస్తున్నాయి. ఒక వేళ పవన్ ముఖ్యమంత్రి అయితే, మంత్రి పదవుల పై కూడా, ఇప్పటి నుంచే అవగాహన చేసుకోవాలని అనుకుంటున్నారు. 2014 నాటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి సీట్లు కోరుకుని, సాధించి పోటీ చేయాలనే తపన కింద స్థాయి కేడర్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. ‘జనసేనతో మనమేం చేయబోతున్నాం. ఎన్ని సీట్లు కేటాయిస్తామంటున్నారు. మనం కోరు కున్నది ఇస్తారా, ఇవ్వరా..? పరిస్థితి ఎలా ఉండ బోతుంది’ అంటూ నాయకత్వానికి ప్రశ్నల పరంపర ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కేడర్‌ ఈ మేరకు అత్యంత ఉత్సాహంతో ఇలాంటి వాదనలకు పదునుపెట్టారు.

pk 20082018 3

అయితే జనసేన వైఖరి ఎలా ఉండబోతుంది..జిల్లాకు ఇన్ని చొప్పున కేటాయింపులు ఉంటాయా, లేక రాష్ట్రం మొత్తం మీద కలిపి ఇన్ని సీట్లతో సరిపెట్టుకోవాలని తమ వైఖరిని త్వరలోనే ప్రకటించబోతున్నారా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. కానీ సీపీఐ, సీపీఎంల వైఖరిలో మాత్రం ఒక స్పష్టత ఉంది. అదీ అసెంబ్లీ స్థానాల నుంచి జనసేన పొత్తుతో ముందుకు వెళ్ళాలనే స్థిర నిర్ణయానికి వచ్చారు. మరి పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు ఇస్తాడో, వీళ్ళు ఎన్ని అడుగుతారో చూడాలి. అసలు పవన్ కళ్యాణ్ కే సీట్లు రావు అని సర్వేలు చెప్తుంటే, మధ్యలో వీళ్ళ హడావిడి ఏంటో మరి. చూద్దాం, ఏమి జరుగుతుందో, ప్రజలు ఏమని తీర్పు ఇస్తారో..

Advertisements

Latest Articles

Most Read