భవానీ ఐలాండ్ సరి కొత్త అందాలు అందుకోబోతుంది. భవానీ ఐలాండ్ లో ఏర్పాటు చేసిన డ్యాన్సింగ్ మ్యూజికల్ ఫౌంటైన్ అండ్ లేజర్ షో ఆన్ వాటర్ స్కీన్స్ పర్యాటకులకు కనువిందు చేయనుంది. దీనికి సంబంధించి నిర్మాణ పనులు అన్నీ పూర్తయ్యాయి. ప్రస్తుతం ట్రయిల్ రన్ నడుస్తుంది... ఈ నెలలోనే దీన్ని అధికారికంగా ప్రారంభించే అవకాసం ఉంది. ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇటీవల నూతనంగా భవానీ ఐలాండ్ టూరిజం కార్పొరేషన్ (బీఐటీసీ)ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భవానీ ద్వీపం అభివృద్ధి పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
ఈ డ్యాన్సింగ్ మ్యూజికల్ ఫౌంటైన్ అండ్ లేజర్ షో ఆన్ వాటర్ స్క్రీన్ దేశంలోనే అతి పెద్దదని బీఐటీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉమామహేశ్వరరావు తెలిపారు. నది మధ్యలో, మూడు వాటర్ స్కీన్స్ పై మూడు ప్రాజెక్టర్లతో లేజర్ షో ప్రదర్శితమవుతుందని చెప్పారు. ప్రకాశం బ్యారేజి కంటే ఎత్తులో లేజర్ షో ఉంటుందని వివరించారు. ఇది అత్యంత ఖర్చు కూడుకున్న భారీ ప్రాజెక్టు అయినప్పటికీ ద్వీపం అభివృద్ధిలో భాగంగా చేపటామన్నారు. కోల్‌కత్తాకు చెందిన ప్రీమియం వరల్డ్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ టెండర్ ద్వారా దక్కించుకుని పనులు ప్రారంభించిందని వివరించారు.
ఈ ప్రాజెక్ట్ మొత్తానికి రూ.16 కోట్లు ఖర్చు అయ్యింది... దుర్గమ్మ వైభవం, అమరావతి చరిత్ర, మన రాష్ట్రానికి చెందిన ఘనమైన చరిత్రను లేజర్ షో రూపంలో పర్యాటకులకు చూపించనున్నారు... ఇప్పటికే బోటింగ్, వాటర్ స్పోర్ట్స్ తో భవానీ ఐలాండ్ సందడిగా మారింది... ఇటీవల జరిగిన బోటు ప్రమాదంతో పర్యాటకులు కొంచెం వెనక్కి తగ్గినా, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మళ్ళీ పర్యాటకం ఊపు అందుకుంది... ఇప్పుడు ఈ డ్యాన్సింగ్ మ్యూజికల్ ఫౌంటైన్ అండ్ లేజర్ షో ఆన్ వాటర్ స్క్రీన్స తో పర్యాటకులను మరింతగా ఆకర్షించే అవకాసం ఉంది.. ప్రస్తుతం జరుగతున్న ట్రయిల్ రన్ సక్సెస్ అవ్వగానే, దీన్ని సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు....