మొన్న హైదరాబాద్ నుంచి, మన రాష్ట్రానికి వచ్చి, మన రాష్ట్రం అవినీతిలో మొదటి ప్లేస్ అని, అందుకే పరిశ్రమలు రావటం లేదని అన్నాడు, ఒక మహానుభావుడు... కాని ఆయన గారికి, దేశంలోనే అతి పెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తో, కియా లాంటి పరిశ్రమ 13 వేల కోట్లతో పనులు మొదలు పెట్టిన సంగతి తెలియదు.. తెలిసినా చెప్పడు... అలాగే ఇప్పుడు, చంద్రబాబు మీద నమ్మకంతో, కియాకి అనుబంధంగా మరో 16 పరిశ్రమలు పెట్టుబడి పెట్టటానికి వచ్చాయి... సోమవారం ఏపీలో కొరియాకు చెందిన 16 ఆటోమొబైల్ అనుబంధ పరిశ్రమల క్లస్టర్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కియా అనుబంధ సంస్థలైన ‘హ్యుండై మొబిస్‌’తో ప్రాథమిక అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ప్రాథమిక అవగాహన ఒప్పంద పత్రం మీద ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ అరోకియా రాజ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, పరిశ్రమల మంత్రి అమరనాథరెడ్డి సమక్షంలో సంతకం చేశారు.

kia 20032018 3

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ తమ విధానాలతో నిబద్ధతతో కూడిన పెట్టుబడిదారులు వచ్చి రూ.24,600 కోట్లు (3.7 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టారన్నారు. అనంతపురము నుంచి నెల్లూరు వరకు చిత్తూరు మీదుగా ఆటో కారిడార్ గా తయారవుతుందన్నారు. రూ.4,790 కోట్ల పెట్టుబడులతో కొరియన్ కంపెనీలు 6.,583 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. అన్నారు. అనంతపురము జిల్లా ఎర్రమంచి దగ్గర తాము దక్షిణ కొరియా క్లస్టర్ కు 534 ఎకరాలు, గుడిపల్లిలో 71 ఎకరాలు, , అమ్మవారిపల్లి గ్రామం దగ్గర 131 ఎకరాలు కేటాయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. తాను గతనెలలోనే కియా మోటార్స్ ఫ్రేమ్ వర్క్ వ్యవస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నానని, ఇప్పుడు ప్రాజెక్టు ప్రాంగణంలో పురోగతిని చూశాక చాలా సంతోషంగా ఉందని చెప్పారు.

kia 20032018 4

ఆటోమొబైల్ అనుబంధ సంస్థలతో కలసి ఏర్పాటు చేస్తున్న ఈ క్లస్టర్ భారత్‌లోనే అతి పెద్ద ఎఫ్.డి.ఐగా అభివర్ణించారు. అనంతపురం జిల్లాకు, తద్వారా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు బాటవేస్తున్నాయన్నారు. భవిష్యత్తులో మరిన్ని కొరియన్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, ఇది శుభపరిణామమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఆటొమొబైల్ రంగ అభివృద్ధి వాతావరణం ఏర్పడుతుందని, ఎం.ఎస్.ఎం.ఈ యూనిట్లు పెరుగుతాయని, ఆంధ్రప్రదేశ్‌కు సకారాత్మక బ్రాండ్ ఇమేజి వస్తుందని అన్నారు. తాము మూడేళ్ల క్రితం దేశంలో అత్యుత్తమమైన ఆటొమొబైల్ విధానాన్ని తీసుకొచ్చామన్నారు. అనంతపురము బెంగళూరు విమానాశ్రయానికి దగ్గరగా ఉందని, త్వరలో ఓర్వకల్లులో ఒక విమానాశ్రయం రానుందని, ఇప్పటికే తిరుపతి, పుట్టపర్తిలో విమానాశ్రయాలున్నాయని తెలిపారు.

కియా మోటార్స్ సహా ఆంధ్రప్రదేశ్‌లో దిగ్గజ కంపెనీలైన ఇసుజు మోటార్స్-అనుబంధ సంస్థలు, హీరో మోటార్స్, అశోక్ లేల్యాండ్, అపోలో టైర్స్, భారత్ ఫోర్జ్ కంపెనీలు తమ ఉత్పాదక యూనిట్లు ఏర్పాటు చేయనున్నాయని, వీటిలో సుజుకి ఇప్పటికే శ్రీసిటీలో వాహన ఉత్పత్తి పరిశ్రమ ఏర్పాటు చేసిందన్నారు. కియామోటార్స్ కు ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కావని, తాము నిబద్ధతతో ఉన్నామని, ముందుగానే అన్ని మౌలిక సదుపాయాలు సమకూర్చామన్నారు. ఈ ప్రాంతం ఒక ఆటోమొబైల్ క్లస్టర్ గా అభివృద్ధి కావాలన్నది తమ అభిమతమని అన్నారు. తాను ఇటీవల బుసాన్‌లో పర్యటించానని చెప్పారు. అనంతపురాన్ని రెండవ స్వగృహంగా భావించాలని ముఖ్యమంత్రి కోరారు. ఓవైపు పారిశ్రామికీకరణను పెద్ద ఎత్తున చేపడుతూనే మరోవైపు భారీ స్థాయిలో ఉద్యాన పంటల సాగును ప్రోత్సహిస్తున్నామని, హార్టీకల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నట్లు చంద్రబాబు తెలిపారు.

పోలవరం పై ఇంటా, బయటా ఏడుస్తూ, విషం చిమ్ముతున్నా, చంద్రబాబు మాత్రం పోలవరం పనులు పరిగెత్తిస్తున్నారు... కేంద్రం నిధులు లేట్ చేస్తుందని తెలిసి, ఈ సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ లోనే, 9 వేల కోట్లు కేటాయించారు... పనులు కూడా అదే స్థాయిలో కొనసాగుతున్నాయి... పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు 54 వ వర్చువల్ రివ్యూ చేసారు... పోలవరం, ప్రాధాన్యతా ప్రాజెక్టులపై 54 వ వర్చువల్ సమీక్ష నిర్వహించారు... అందరి దృష్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం మీదనే ఉందని, ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రాజెక్టు నిర్మాణంలో చిన్న పొరపాటుకు కూడా అవకాశం లేకుండా నిర్మించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్మాణ సంస్థలకు విజ్ఞప్తి చేశారు.

polavaram 20032018 2

పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు కేంద్రం నియమించిన కమిటీ గత శుక్రవారం సందర్శించి పనులపై సంతృప్తి వ్యక్తం చేసిందని, డీపీఆర్ లో మిగిలిన నిధులు ఒకటి రెండు రోజుల్లో విడుదల కావచ్చని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇదిలా ఉంటే గత వారం 5.53 లక్షల క్యూ.మీ లక్ష్యానికి గాను 4.01 లక్షల క్యూ.మీ మేర మట్టి తవ్వకం పనులు పూర్తయ్యాయి. నెలకు లక్ష క్యూ.మీ కాంక్రీటు పనుల పూర్తి లక్ష్యం కాగా 21,283 క్యూ.మీ కాంక్రీట్ పనులను పూర్తి చేశారు. 20 మీ. డయాఫ్రం వాల్ పనులకు గాను 19.2 మీ. పనులు పూర్తయ్యాయి.

polavaram 20032018 3

పోలవరం పునరావాసానికి సంబంధించి అన్ని పనులను ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరుకు పూర్తి చేసి తీరాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. చీఫ్ ఇంజనీర్ డిజైన్లను అత్యధిక ప్రాధాన్యంతో పూర్తిచేయాలని సీఎం కోరారు. పోలవరం ప్రాజెక్టు సైట్ లో ఉన్న 25 కెమేరాలను ఏపీ ఫైబర్ గ్రిడ్ కు అనుసంధానం చేయాలని ఆర్టీజీ సీఈఓ అహ్మద్ బాబును ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మూడు రోజుల్లో ఈ పనులను పూర్తిచేస్తామని అహ్మద్ బాబు తెలిపారు. ముఖ్యంత్రి రాష్ట్రంలోని 29 ప్రాధాన్యతా ప్రాజెక్టులకు సంబంధించి జరుగుతున్న 52 పనులను సవివరంగా సమీక్షించారు. నిర్దేశించిన కాలపరిమితిలోగానే ప్రాజెక్టులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రాజెక్టుల మౌలిక సదుపాయాలకు, పునరావాసానికి 4,500 ఎకరాల భూమి అవసరమవుతుందని అంచనా వేశామని అన్నారు. గతంలో నిర్దేశించిన 116 రోజులలో జలసంరక్షణ కార్యక్రమాన్ని ఆయన సమీక్షించి కొన్ని సూచనలు చేశారు.

polavaram 20032018 4

ప్రాధాన్య క్రమంలో 29 ప్రాజెక్టులు-52 పనులపై సమీక్ష.. ప్రాధాన్యక్రమంలో ఇప్పటికే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం, శారదా నదిపై శారదా నది ఆనకట్ట, పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం చింతల గూడెం వద్ద పగొండ రిజర్వాయర్, ఎర్ర కాల్వ ఆధునీకీకరణ , నందమూరు ఆక్విడక్టు వద్ద అంతాపల్లి బ్రిడ్జి, కండలేరు లెఫ్ట్ కెనాల్-లిఫ్టు స్కీమ్, గండికోట సీబీఆర్ లిఫ్ట్స్, మచ్చుమర్రి లిఫ్ట్ స్కీమ్,సిద్దాపురం లిఫ్టు ఇరిగేషన్ స్కీమ్ పూర్తి కాగా
గోరుకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (శ్రీ నరసింహరాయ సాగర్), ఔకు టన్నెల్, పులికనుమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, కృష్ణానదిపై పెదపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, వీఎల్ ఎంసీ మీద చినసన లిఫ్టు ఇరిగేషన్ స్కీమ్ పనులు పూర్తయ్యాయి.

polavaram 20032018 5

త్వరలో సీఎం ప్రారంభించనున్న ప్రాజెక్టులు... వంశధార-నాగావళి నదుల అనుసంధానం (హిరమండలం రిజర్వాయర్ నుంచి హైలెవెల్ కెనాల్ కు నీటి విడుదల), పులిచింతల ప్రాజెక్టు, కొండవీటి వాగు పంపింగ్ స్కీమ్, కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్టు, యర్రం చిన్నపోలిరెడ్డి కొరిశపాడు లిఫ్టు ఇరిగేషన్ స్కీమ్, హంద్రీ-నీవా సుజల స్రవంతి ఫేజ్ -2 కింద అడవిపల్లి రిజర్వాయర్, నెల్లూరు బ్యారేజ్, సంగం బ్యారేజి, హంద్రీ-నీవా సుజల స్రవంతి ఫేజ్-2 కింద కుప్పం బ్రాంచ్ కెనాల్, (ఎస్ హెచ్-31 రోడ్ వర్క్), గండికోట రిజర్వాయర్, మరల రిజర్వాయర్ (ప్యాకేజీ నెం.12), చెర్లోపల్లి రిజర్వాయర్ (ప్యాకేజీ నెం 25), మడకశిర బ్రాంచి కెనాల్ (బియాండ్ గొల్లపల్ల రిజర్వాయర్), పులకుర్తి లిఫ్టు ఇరిగేషన్ స్కీమ్, బి.ఆర్.ఆర్. వంశధార ప్రాజెక్టు రెండో దశలో ఫేజ్ -2 (హిరమండలం రిజర్వాయర్) లకు ముఖ్యమంత్రి త్వరలో ప్రారంభోత్సవం చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎప్పుడూ పర్యావరణం గురించి మాట్లాడుతూ ఉంటారు... అందరిలా మాటల్లో కాదు, చేతల్లో కూడా చేసి చూపిస్తున్నారు... ఇప్పటికే అమరావతిలో ప్రణాళికలు రచిస్తూ ఉండగా, తిరుమలలో మాత్రం ఆచరణలోకి తెచ్చేసారు... కాలుష్య రహిత తిరుమలకు తొలి అడుగు పడనుంది... తిరుమలకు వచ్చే ఆర్టీసీ బస్సులన్నీ విడతల వారీగా బ్యాటరీ బస్సులు కానున్నాయి... తిరుమలతో పాటు రాష్ట్రంలోని కీలకమైన రెండు నగరాలకు నడపాలని భావించింది. అయితే ముందుగా తిరుమలలో ఇవి ట్రయిల్ రన్ చేస్తున్నారు... శనివారం నుంచి ఈ బస్సులు ప్రారంభం అయ్యాయి.. ఇవి సక్సెస్ అయితే, ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నారు..

tirumala 19032018 2

మొదట 31 సీట్లు కెపాసిటీతో రూపొందించిన ఎలక్ట్రిక్ బస్సును నెలపాటు ఎలాంటి చార్జీ లేకుండా నడపనున్నారు... తరువాత డిమాండ్ ను బట్టి, 40 సీట్లతో రూపొందించిన బస్సులును పూర్తి స్థాయిలో నడపుతారు.. ఈ బస్సుల్లో సెన్సార్లే కీలకం.. డ్రైవర్ తో పాటు 32 మంది కూర్చునే ఈ బస్సు ప్రయాణం ఎంతో సురక్షితం. డ్రైవర్ సీటుతో పాటు ప్రయాణికులు కూర్చునేందుకు మెత్తని అనువైన సీట్లు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అలారం వలన ముందుగానే ప్రమాదాన్ని సెన్సార్లు హెచ్చరిస్తాయి, ఎయిర్ బెలూన్లు, వైఫై, ఎల్ఈడీ లైట్లతో పాటు ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఎల్ఈడీ టీవి, ఫైర్ సేఫ్టీ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వీటన్నంటిని సీసీ కెమెరాల ద్వారా బస్ లోపల పరిస్థితిని డ్రైవర్ పర్యవేక్షిస్తుంటాడు. ఇన్నీ అత్యాధునిక సౌకర్యాలు ఉన్నప్పటికీ వీటిలో ఏ ఒక్క పరికరం పనిచేయకపోయినా బస్సు ముందుకు కదలదు. అందుకుగల కారణాలను కంప్యూటర్ సెన్సార్ల ద్వారా డ్రైవర్ను ఆలెర్ట్ చేస్తుంది. హైదరాబాద్ కేంద్రంగా గోల్డ్ స్టోన్ కంపెనీ అతి తక్కువ ఖర్చుతో, ఎక్కువ మైలేజీ ఇచ్చేలా ఎలక్ట్రికల్ బస్సులు తయారు చేశారు. ఇప్పటికే ఇలాంటి తరహా బస్సులను హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో నడుపుతున్నారు. దక్షిణ భారత దేశంలో మన రాష్ట్రంలో ఇదే మొదటిసారి కావడం విశేషం.

tirumala 19032018 3

ఎలక్ట్రికల్ బస్సు ప్రత్యేకత... కేవలం మూడు గంటల పాటు విద్యుత తో చార్జ్ చేస్తే 300 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. బరువైన ఇంజన్లు ఉండవు. గేర్ బాక్స్ ఉండదు. కేవలం వెనుక చక్రాలకు సెన్సార్లతో రూపొందించిన మోటారు అమర్చి ఉంటుంది. ఇక డ్రైవర్ సీటుకు ముందు మూడు బటన్లు ఉంటాయి... 'బి' బటన్ ను ప్రెస్ చేస్తే బస్సు ముందుకు కదులుతుంది.. "ఎన్"ను ప్రెస్ చేస్తే న్యూట్రల్ కు చేరుకుంటుది. 'ఆర్'ను ప్రెస్ చేస్తే బస్సు వెనక్కి కదు లుతుంది. ఈ మూడు బటన్లను కంట్రోల్ చేసేందుకు బ్రేక్, క్లచ్లు పనిచేస్తాయి. ఈ బస్సుల వాడకంతో కాలుష్య తీవ్రత తగ్గుతుంది. తిరుపతి ఆర్టీసీ డిపో ఆవరణలో ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించిన రీచార్జ్ స్టేషన్ ఏర్పాటు చేసారు.

వైకాపా, జనసేన తనమీద విమర్శలు చేస్తూ.. మోదీపై ఈగ వాలనివ్వడం లేదని దుయ్యబట్టారు. ఎవరేం చేస్తున్నారు.. ఏ పార్టీ ఏం చేస్తోంది.. నిన్న ఏం మాట్లాడారు.. ఈ రోజు ఏం చెబుతున్నారనేది ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని అన్నారు. ఈ రోజు పరిణామాలపై ఎంపీలు, అసెంబ్లీ వ్యూహ కమిటి సభ్యులతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు... భాజాపా, వైకాపా, జనసేన మూడు పార్టీల అజెండా ఒక్కటేనని.. తెదేపాపై బురద జల్లడమే సింగిల్ పాయింట్ అజెండాగా పెట్టుకున్నాయన్నారు... ఇందుకు సంబంధించి, జగన్ బహిరంగగానే మోడీతో కలిసిపోయింది కనిపిస్తుంది అని, పవన్ నాలుగు రోజులు నుంచి చేస్తున్న పనులే కనిపిస్తున్నాయి అని అన్నారు...

cbn 20032018 2

పోలవరం పై, గతంలో జగన్‌ మీడియాలో వచ్చిన అవాస్తవాలే పవన్‌ చెబుతున్నారని విమర్శించారు... పోలవరం పై ఇన్నాళ్ళు జగనే విషం చిమ్మారని, ఇప్పుడు పవన్ కూడా తోడయ్యరని అన్నారు... పూర్తి పారదర్శకతతో సాగుతున్న పోలవరం పనుల్లో అవినీతి అంటూ చెప్తున్న పవన్, దమ్ము ఉంటే అవి బయట పెట్టి మాట్లాడాలని సవాల్ విసిరారు... బీజేపీ నేతల ప్రోద్బలంతోనే పవన్ రెచ్చిపోతున్నారని, పోలవరం, అమరావతి పై బురద జల్లి, అవి ఆలస్యం అవ్వాలని చూస్తే, ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పారు...

cbn 20032018 3

తనకు, ప్రధాని నరేంద్ర మోదీకి మధ్య విభేదాలు ఉన్నాయని, అందువల్లే తనకు మోదీ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల పై కూడా చంద్రబాబు సీరియస్ గా స్పందించారు... తనకు, ప్రధానికి మధ్య విభేదాలపై పవన్ ఆధారాలు చూపాలని అన్నారు. ఎప్పుడో ఏళ్ల క్రితం గోద్రా ఘటనలు జరిగినప్పటి సంగతి, ఇప్పుడు చెప్తున్నారని, ఒక పార్టీ అధినేత ఇలాంటి చౌకబారు విమర్శలు చెయ్యటం ఏంటని అన్నారు... తెలుగులో టాప్ నటుల్లో ఒకరైన పవన్ ఇటువంటి విమర్శలు చేస్తే, నమ్మేవారు కొందరైనా ఉంటారని, అది ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేస్తుందని, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను, సరైన ఆధారాలు చుప్పించి తిప్పికొట్టాలని, మనం ఏ తప్పు చెయ్యనప్పుడు మాటలు పడటం ఎందుకని, అదే స్థాయిలో పవన్ కు తిప్పి కొట్టండి అంటూ నేతలకు సూచించారు.

Advertisements

Latest Articles

Most Read